Previous Page Next Page 
డాళింగ్ పేజి 24

 

    "ఎక్కడకు వెళ్ళిపోతున్నారు......ఆగండి........డిన్నర్ చేద్దాం......."
    "నో....డిన్నర్ ప్లీజ్......ఇమ్మిడియట్ ఫ్లయిట్ కెళ్ళిపోవాలి." కారు లైట్లు వెలిగాయి.
    మాధురి మొహంలోకి చూస్తూ.
    "ఎప్పుడొస్తున్నావ్" అడిగాడు విమల్.
    వెంటనే జవాబు చెప్పలేకపోయింది మాధురి.
    "ఓ.కే. నీ యిష్టం. " సర్రున కారు ముందు కెళ్ళిపోయింది.
    వెంటనే అలా వెళ్ళిపోతాడని ఊహించని మాధురి , ఏం చెయ్యాలో తోచక అలా పోర్టికోలో నిలబడిపోయింది.
    కారు కనుమరుగయ్యేంతవరకూ చూసి, హొటల్లోపలికి అడుగేసింది.
    రిసెప్షన్ దాటి, లిప్ట్ వేపు వెళ్తూ, ఏదో జ్ఞాపకం వచ్చి, మళ్ళీ వెనక్కొచ్చింది.
    "ఎస్.....మేడమ్" మేల్ రిసెప్షనిస్ట్ వినయంగా అడిగాడు.
    "ఇప్పుడు మద్రాస్ వెళ్ళడానికి ఫ్లయిట్ ఏదైనా వుందా?"
    అతను గోడ గడియారం వేపు చూసాడు.
    "ఈ టైములో ఫ్లయిట్ వుండదు గదా మేడమ్." అని 'ఒన్ మినిట్ అంటూ వెంటనే ఎయిర్ పోర్టుకి డయల్ చేసాడు. రెండు నిమిషాల తర్వాత-
    "ఎస్ మేడమ్ మద్రాస్ లో పార్టీ మీటింగ్స్ సందర్భంగా రెండు స్పెషల్ ఫ్లయిట్స్ వేసార్ట మేడమ్. 2.15 ఒకటి, 4.15 కి ఒకటి.
    చెప్పాడు రిసెప్షనిస్ట్.
    చేతి వాచీ వేపు చూసింది మాధురి.
    అప్పుడు టైం సరిగ్గా పన్నెండు పది నిమిషాలైంది.
    "థాంక్యూ" లిప్ట్ వేపు నడిచింది.
    మరో మూడు నిమిషాల తర్వాత , తన రూమ్ లో కొస్తున్న మాధురి గణగణమని ఫోన్ మోగడంతో గబుక్కున రిసీవర్ తీసింది.
    "వాట్ మేడమ్ .....ఎంటిలా చేసారు. మీరు కూడా ఇబ్బంది పెడితే ఎలా. ఉయ్యార్ వెయిటింగ్ ఫర్ యూ."
    యాడ్ ఫిల్మ్ కంపెనీ మానేజర్ నిష్టురంగా అన్నాడు ఫోన్ లో.
    ఏం చెప్పాలో అర్ధం కాలేదు మాధురికి.
    "సారీ సార్. ఆ యాడ్ ఫిల్మ్ ని ఇంకెవరితోనైనా తీసుకోండి."
    "ఇప్పటికి ఎంత ఖర్చయిందో మీకు తెలుసా మేడమ్. లాస్ట్ పేజ్ లో మీరిలా మాట్లాడితే."
    "నో మోర్. ఆర్గుమెంట్స్ సర్. ఇంతవరకూ మీకెంత ఖర్చయిందో చెప్పండి. సీరియస్ గా అడిగింది మాధురి.
    ఆ మాటకు అవతలి వ్యక్తీ కంగుతిన్నాడు.
    "మేడమ్"
    "ఎస్. ఐ వాంట్ టోటల్ ఎమౌంట్ డిటైల్స్.'
    అవతలి వ్యక్తిలో పౌరుషం పెరిగినట్టుగా వుంది.
    నోటికి వచ్చిన అంకె చెప్పాడు.
    ఆ మేరకు చెక్ ను కౌంటర్లో ఇస్తున్నాను తీసికేళ్ళండి, ఒకే........." టక్కున. ఫోన్ పెట్టేసింది మాధురి.
    మరో పావుగంటకు ఆ హోటల్ రూంలోంచి బయటపడింది మాధురి.
    మాధురికి ఇక్కడెక్కడా వుండాలని లేదు.
    అర్జంటుగా విమల్ ను కలవాలని ఉంది.
    విమల్, నడకలో , చూపులో, వేగంలో, కోపంలో, రోషంలో, అలసటలో , అంతటా -
    విమల్ ........
    ఏయిరో డ్రోం కి ఎంత వేగంగా వచ్చిందో తెలీదు.
    అప్పటికి ఒక స్పెషల్ ఫ్లయిట్ మద్రాసు వెళ్ళిపోయింది.
    రెండో ఫ్లయిట్ కి ఇంకో రెండు గంటల టైముంది.
    ఎయిర్ పోర్టు డీలక్స్ లాంజ్ లో ఒంటరిగా కూర్చుంది మాధురి.

                                                      *    *    *    *

    అదే సమయంలో మద్రాసు లో షూటింగ్ లో వున్నాడు విమల్.
    హీరో, విలన్ మనుషులతో పోరాడే దృశ్యం అది.
    ఎక్కడా రూప్ లేకుండా నటిస్తున్నాడు విమల్.
    తెల్లవారుఝాము అయిదు గంటలైంది.
    విమల్ బాగా అలిసిపోయాడు. ఆ పైటింగ్ సీన్లు ఎఫెక్టివ్ గా వచ్చినందుకు డైరెక్టర్ చాలా హాపీగా వున్నాడు.
    ఇంకో సీను మాత్రమే వుంది. అంతవరకూ మాస్క్ లో వున్న విలన్, భయంకరంగా బయటపడతాడు.
    మూల విలన్ తో, హీరో తలపడటం , చంపడం ప్రతీకారం తీర్చుకోవడం ఆ భయంకర యుద్దంలో హీరోయిన్ చనిపోవడం చివరి దృశ్యం మర్నాడు తీయాల్సిన సీన్లు అవి.
    "రేపు విలన్ ఎంట్రన్స్ సార్.........ఫైటింగ్ సీన్లు, యాక్షన్ పార్టు అంతే.'
    కారెక్కే ముందు, అసోసియేట్ డైరెక్టర్ విమల్ తో చెప్పాడు.
    ఆ మాటల్ని విన్పించుకోకుండానే కారు స్టార్టు చేసాడు విమల్.


                                                *    *    *    *

    మద్రాసు కే.కే. నగర్ ఎక్స్ టెన్షన్ ప్రాంతంలో---
    రెండెకరాల ప్రదేశంలో అత్యాధునికంగా నిర్మించిన భవనం , చుట్టూ అందమైన తోట.
    తను ఒంటరిగా వుండాలనుకున్నప్పుడు , ఏకాంతం కోరుకున్నప్పుడు, ఈ బిల్డింగ్ కి వస్తాడు విమల్.
    ఆ బిల్డింగ్ కి విమల్ రావడం చాలా ఆరదు ఆ బిల్డింగ్ మద్రాస్ లో ఉంటున్న సమయంలో తన ఇంపార్టెంట్ పొలిటికల్ డిస్కషన్స్ కి ఉపయోగిస్తాడు విమల్ తండ్రి ఏమ్.పి జయేంద్రదత్.
    ఆ బిల్డింగ్ మానేజర్ లాంటి కేర్ టేకర్ , ఒక వాచ్ మెన్ ఉన్నారు అంతే-
    ఆ బిల్డింగ్ కి ఫోన్ లేదు.
    కావాలనే ఆ బిల్డింగ్ కి ఫోన్ పెట్టించలేదు జయేంద్ర దత్ . ఫోన్ డిస్టబెన్స్ కూడా అక్కడ ఉండకూడదని.
    అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్ అది!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS