Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 24

 

                           అప్పు చేసి చూడు!

                                                                     వసుంధర
    "ప్రపంచంలో దేన్నైనా భరించ వచ్చును కానీ ఆకలిని భరించలేం -- ఏమంటావ్?" అన్నాడు శాస్త్రి. అతను వెల్లకితలా చాప మీద పడుకుని గది పైభాగాన్ని చూస్తున్నాడు.
    "ఈ మాట ఎన్ని సార్లు చెబుతావ్? ఆకలి నేనా భరించవచ్చును కానీ ఒకే మాట పదే పదే వినడం మరీ కష్టమనిపిస్తోంది నాకు. ఇంకోసారి ఇదేమాట చెప్పానంటే మనిద్దరం ఫైటింగ్ ప్రారంభించాల్సి వుంటుంది" అన్నాడు శర్మ.
    "అందుకు మాత్రం ఓపిక కేక్కడేసిందీ -- ఆకలితో చస్తుంటే! అనగా అనగా నీకు పౌరుషం వచ్చి ఏదో ఉపాయం చేబుతావేమోనని ప్రయత్నిస్తున్నాను. నీక్కోపం వస్తోంది తప్పితే ఉపాయం తట్టలేదు-" అన్నాడు శాస్త్రి.
    "నీకు తట్టని ఉపాయాలు నాకు మాత్రం తడతాయా? ఇప్పటికి భోం చేసి మూడు పూటలైంది. ఇంకా ఇలా ఎన్నాళ్ళు మాడిపోతాం? జేబులో ఒక్క పైసా కూడా లేదు. గదిదాటి బైటకు వెడదామంటే అప్పులు...." అన్నాడు శర్మ.
    శాస్త్రి ఉన్నట్లుండి లేచి కూర్చుని -- "విన్నారా.... అడుగుల చప్పుడు..." అన్నాడు.
    "అప్పుల వాళ్ళనగానే నీకలాగే అనిపిస్తుంది. నాకే అడుగుల చప్పుడూ వినిపించడం లేదు--"
    "నాకు అంతా స్పష్టంగా వినబడుతుంటే నీకెందుకు వినబడదు? బహుశా నీరసంతో నీకు చెవులు గళ్ళడి వుంటాయి. అదిగో - అడుగుల చప్పుడు తలుపును సమీపించింది ...." అని శాస్త్రి ఇంకా ఏదో  అనబోతుండగా తలుపు తట్టిన చప్పుడైంది. శర్మ ఉలిక్కిపడి లేచి నిలబడి "నువ్వు చెప్పింది నిజమే!" అన్నాడు.
    "మనింటికి అప్పులవాళ్ళు తప్ప రారు. ఇప్పుడెం చేయాలి? అసలే ఆకలితో చచ్చిపోతుంటే ఈ అప్పులవాళ్ళ బెడద ఒకటి! ఈ గదికి వున్నదోక్కటే తలుపు. ఆ తలుపు దగ్గర అప్పులాడు.... ఏమిటి చేయడం?" అని శాస్త్రి వాపోతుంటే అతడితో పాటు శర్మ కూడా వాపోసాగాడు. ఈలోగా మరోసారి తలుపు చప్పుడయింది.
    "నాతొ పాటు నువ్వూ గోలేట్టేబదులు -- వెళ్ళి తలుపు తీసి సమాధాన పర్చరదూ!" అన్నాడు శాస్త్రి.
    "నీకైతే దూరం నుంచి అడుగుల చప్పుళ్ళు కూడా వినబడుతున్నాయి. నాకంటే నీ పరిస్థితే మెరుగ్గా వుంది. కాబట్టి ఆ నచ్చిన వాడిని నువ్వే సమాధాన పర్చాలి...." అంటూ చతికిలబడిపోయాడు శర్మ. ఈలోగా తలుపు మళ్ళీ తట్టిన చప్పుడయింది. శాస్త్రి విసుక్కుంటూ లేచి నిలబడి శర్మను పడుకోమని కనుసైగ చేసి --" అబ్బబ్బ- వస్తున్నా ముండండయ్యా -- ఏమిటీ -- ఆదే పనిగా బాదుతారు...." అంటూ వెళ్ళి తలుపు తీసాడు.
    ఎదురుగా నవ్వుతూ ఇంటాయన కనిపించాడు.
    "మిమ్మల్ని నవ్వుతుండగా చూసి చాలా కాలమయింది సార్ -- రండి - రండి -- లోపలికి --" అంటూ ఆయన్ను సాదరంగా ఆహ్వానించాడు శాస్త్రి లోపలకు. అయన ఇంకా నవ్వుతూనే లోపలకు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
    "మీరింకా నవ్వుతూనే వున్నారు. నాకెంతో సంతోషంగా వుంది సార్. మీరెప్పుడూ ఇలా నవ్వుతూనే వుండాలని నా కోరిక. అవును కానీ -- నవ్వేదాకా తెలియలేదు -- మీరెంత అందంగా వుంటారని...." అంటూ శర్మ పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు. శాస్త్రి మాత్రం అయన లోపలకు ప్రవేశించగానే వీధి తలుపు వేసి "హమ్మయ్య!" అనుకున్నాడు.
    ఇంటాయన వాళ్ళిద్దరి వంక ఆప్యాయంగా చూసి -- "చాకుల్లాంటి కుర్రాళ్ళయ్యా మీరు!" అలా హడలిపోయారేమిటి? మీ దగ్గర డబ్బుల్లేవా?" అన్నాడు.
    శాస్త్రి శర్మ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఇంటాయనకి అద్దె ఇచ్చి మూడు నెలలైంది. వచ్చినప్పుడల్లా మొహం చెండుకొని వెడుతున్నాడు. తమనేప్పుడూ అయన ఆప్యాయంగా పలకరించిన పాపాన పోలేదు.
    "ఏం - బాబూ - మీ దగ్గర డబ్బుల్లేవా?" అన్నాడు ఇంటాయన.
    "లేవండి . ఆఖరికి చేతీవాచీలు కూడా అమ్మేశాం! భోం చేసి మూడు పూటలైంది !" అన్నారు మిత్రులిద్దరూ ఏక కంఠంలో, అప్పులవాళ్ళ దగ్గర మానాభిమానాల సంగతి మార్చిపోవాలని వాళ్ళు ఎప్పుడో తెలుసుకున్నారు.
    'అయ్యో -- ఎంతమాట ....ముందు వెళ్ళి భోంచేసి రండి ...." అన్నాడు ఇంటాయన జేబులోకి చెయ్యి పెడుతూ, శాస్త్రి,శర్మ అయన జేబువంకే చూస్తున్నారు. ఆత్రుతగా. అందులోంచి పదిరూపాయల నోటొకటి బైటకు వచ్చింది. అయితే మిత్రులిద్దరూ ఆయన్ను సమీపించలేదు.
    "డబ్బు తీసుకోరా?" అన్నాడాయన ఆశ్చర్యంగా.
    "మాకో ఇబ్బంది ఉండండి. చుట్టుపక్కల చాలా అప్పులు చేసేశామండి. ఈ పదిరూపాయలతో వీధిలో కనబడ్డామంటే ఎవడో ఒకడు మా దగ్గర్నుంచి లాగేసుకుంటాడు. ఇదీ మా యిబ్బంది. దయతో మీరే మాకు అన్నం తెచ్చి పెట్టాలి. ఇలా అంటున్నామని ఏమీ అనుకోవద్దు--...." అన్నాడు శాస్త్రి.
    "భలే వాళ్ళయ్యా మీరు.... బోలెడు సంపాదిస్తారు కదా -- అంతా ఏం చేసేస్తారు?" అన్నాడు ఇంటాయన.
    "మా సంగతి మీకు తెలియనిది ఏముంది సార్! రేపు గురించి ఆలోచించం. వున్నప్పుడు అడిగిన వాడికి లేదనకుండా దానాలిచ్చేస్తాం. అలాగే లేనప్పుడు ఉన్నవాళ్ళ నడిగి తీసుకుంటాం. దురదృష్టమేమిటంటే మేమిచ్చిందల్లా దానమైపోతోంది. పుచ్చుకొన్నదల్లా అప్పయిపోతోంది" అన్నాడు శర్మ.
    "అయినా మీరు దానాలు మానేసి -- అప్పులేందుకు తీర్చరూ?' అన్నాడు ఇంటాయన.
    'సమాధానం చెప్పాలంటే ఆకలి ..... ఆకలి తీరితే కాని ఏమీ చెప్పలేం...." అన్నాడు శాస్త్రి.
    "లేవండి. ఆఖరికి చేతి వాచీలు కూడా అమ్మేశాం! భోం చేసి మూడు పూటలైంది !" అన్నారు మిత్రులిద్దరూ ఏక కంఠంలో, అప్పుల వాళ్ళ దగ్గర మానాభిమానాల సంగతి మరచిపోవాలని వాళ్ళు ఎప్పుడో తెలుసుకున్నారు.
    'అయ్యో -- ఎంతమాట ....ముందు వెళ్ళి భోంచేసి రండి...." అన్నాడు. ఇంటాయన జేబులోకి చెయ్యి పెడుతూ. శాస్త్రి , శర్మ అయన జేబు వంకే చూస్తున్నారు ఆత్రుతగా. అందులోంచి పదిరూపాయల నోటొకటి బైటకు వచ్చింది. అయితే మిత్రులిద్దరూ ఆయన్ను సమీపించలేదు.
    "డబ్బు తీసుకోరా?" అన్నాడాయన ఆశ్చర్యంగా.
    "మాకో ఇబ్బంది ఉందండి. చుట్టుపక్కల చాలా అప్పులు చెసేశామండి. ఈ పది రూపాయలతో వీధిలో కనపడ్దామంటే ఎవడో ఒకడు మా దగ్గర్నుంచి లాగేసుకుంటాడు . ఇదీ మా యిబ్బంది . దయతో మీరే మాకు అన్నం తెచ్చి పెట్టాలి. ఇలా అంటున్నామని ఏమీ అనుకోవద్దు-...." అన్నాడు శాస్త్రి.
    "భాలేవాళ్ళయ్యా మీరు.... బోలెడు సంపాదిస్తారు కదా -- అంతా ఏం చేసేస్తారు?" అన్నాడు ఇంటాయన.
    "మా సంగతి మీకు తెలియనిది ఏముంది సార్౧ రేపు గురించి ఆలోచించం. వున్నప్పుడు అడిగినవాడికి లేదనకుండా దానాలిచ్చేస్తాం. అలాగే లేనప్పుడు వున్నవాళ్ళ నడిగి తీసుకుంటాం. దురదృష్ట మేమిటంటే మేమిచ్చిందల్లా దానమై పోతోంది. పుచ్చుకోన్నదల్లా అప్పయిపోతోంది" అన్నాడు శర్మ.
    "అయినా మీరు దానాలు మానేసి -- అప్పులేందుకు తీర్చరూ?' అన్నాడు ఇంటాయన.
    "సమాధానం చెప్పాలంటే ఆకలి .... ఆకలి తీరితే కానీ ఏమీ చెప్పలేం ...." అన్నాడు శాస్త్రి.
    ఇంటాయన మారుమాట్లాడకుండా బైటకు వెళ్ళి -- కాసేపటికి ఓ క్యారియరు తీసుకుని వచ్చాడు. మిత్రులిద్దరూ ఆవురావురుమంటూ భోంచేసి -- "అన్నదాతా-- సుఖీభవ!" అన్నారు.
    "కడుపు నిండిందా?' అన్నాడు ఇంటాయన.
    'ఆహాహా ... గృహ యజమానులంటే మీకు లాగా వుండాలి. మూణ్ణెల్ల నుంచి అద్దె అడగడం లేదు. పైగా ఈరోజు కడుపు నిండా భోజనం పెట్టారు...' అంటూ శర్మ ఆయన్ను మెచ్చుకున్నాడు.
    "అవును సార్ -- రోజూ మీరు మాకిలాగే క్యారియర్ ఎందుకు పంపకూడదు?" అన్నాడు శాస్త్రి.
    "నేనడిగిన ప్రశ్న కింకా జవాబు చెప్పలేదు! మీరు అప్పులు తీర్చక దానాలేందుకు చేస్తారు?"
    శాస్త్రి నవ్వి -- "జవాబడక్కండి సార్ -- అది మీకు నచ్చదు. అందుకే భోజనానికి ముందు మీరడిగితే భోంచేసి గానీ చెప్పలేమన్నాను. ఎందుకంటె జవాబు వింటే మీరు భోజనం పెట్టరు...." అన్నాడు.
    "ఫరవాలేదు , ఈరోజు నేను చాలా శాంతంగా వున్నాను. అదీకాక మీరు భోం చేయడం కూడా అయిపొయింది-"
    'అదికాదు సార్ -- అన్నం పెట్టిన వారి మనసు కష్టపెట్టడం నాకిష్టం లేదు..." అన్నాడు శాస్త్రి.
    "ఫరవాలేదు-- చెప్పు!" అన్నాడు ఇంటాయన.
    'అవసరంలో ఉన్నవాళ్ళనీ, లేనివాళ్ళనీ అనుకోవడం మా అలవాటు సార్! వళ్ళు వాచిన వాళ్ళంటే మాకు ఉపేక్షా భారం. అప్పులు తీర్చొచ్చులే అనుకునే లోగా డబ్బు మరో రకంగా అయిపొయింది. అయినా ఈ లోకంలో వళ్ళు వాచిన వాళ్ళకంటే -- అవసరాలతో బాధపడే వాళ్ళే ఎక్కువ సార్! అలాంటప్పుడు కనీసం మాబోటి కొందరైనా వాళ్ళకి సపోర్టివ్వక పొతే ఎలా చెప్పండి!" అన్నాడు శాస్త్రి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS