"ఏమయింది?" అన్నాడు శేషారావు కంగారుగా.
పేర్రాజు జరిగింది చెప్పి -- "మింగలేక కక్కలేక ఏడుస్తున్నాం. మగపిల్లాడయితే బాధ లేదు-- ఏ పోలీసు రిపోర్ట్ యిచ్చే వాళ్ళం , ఆడపిల్ల కావడంతో వచ్చింది అవస్థ" అన్నాడు.
శేషారావు వుద్రేకంగా లేచి నిలబడి --"జయరాజు సంగతి నాకు తెలుసు. వాడి అంతు చూస్తాను. మీరేం భయపడకండి. ఒకటి రెండు రోజుల్లో మేమిద్దరం కలిసి వచ్చేస్తాం" అన్నాడు. ఆ తర్వాత అతనొక్క మాట కూడా వినిపించుకోకుండా పరుగెత్తాడు అక్కణ్ణించి.
5
అతను గదిలో అడుగుపెట్టి తలుపు వేశాడు.
మంచం మీద పడుకున్న రాధ కంగారుగా లేచి నిలబడింది.
"బెదురూ చూపుల రాధ -- అందమంటే నీదే!' అన్నాడతను.
ఆమె నోరు విప్పలేదు. ఆమె చూపుల్లోని బెదురూ పోలేదు.
అతను నెమ్మదిగా నడచి వచ్చి మంచంమీద కూర్చుని "ఇదేమిటో చూశావా?" అనడిగాడు.
ఆమె చూసింది. ఏదో ప్యాకెట్ అది! కానీ ఆమె మాట్లాడలేదు.
"ఇందులో నీకు చక్కగా అమిరే బట్టలున్నాయి. చీరకు మ్యాచింగ్ లంగా, బ్లౌజ్ కుమ్యాచింగ్ బ్రా...." అన్నాడతను.
ఆమె మాట్లాడలేదు.
"నేను ప్రేమతో తీసుకువచ్చిన ఈ బట్టలు దరించవా?" అన్నాడతను.
"ఆ ప్యాకెట్ అక్కడ పెట్టి మీరు బయటకు వెళ్ళండి" అంది రాధ.
"నువ్వు బట్టలు నా ఎదురుగా మార్చు కుంటావనీ , ఆ దృశ్యం నేను చూడాలని సరదాపడే కదా -- మొత్తం దుస్తులన్నీ కొత్తవి తెచ్చాను" అన్నాడతను.
"నీసరదా తీరదు"అంది రాధ.
"ఇదేమాట చాలా రోజుల్నించి చెబుతున్నావు" అన్నాడతను.
"ఎన్ని రోజులైనా , సంవత్సరాలైనా , యుగాలైనా ఇదే మాట చెబుతాను" అంది రాధ.
"సరే - అయితే నిన్నో ప్రశ్న వేస్తాను, సూటిగా జవాబులివ్వు" అన్నాడతను.
ఆమె ఇస్తానని ఇవ్వననీ అనలేదు.
ఆ గదిలో చాలా రోజుల్నించి బందీగా వున్నదామే. రోజూ వేళకు భోజనం అందుతోంది. చదువుకుందుకు పుస్తకాలున్నాయి. ఒక్కటీ మంచిది కాదు, అన్నీ బూతు , సాహిత్యమే కాక వాటిల్లో బొమ్మలు కూడాను.
ఇంటిలో తలిదండ్రులు చాటున, నాలుగు గోడల మధ్య ఉండే రాధ సరదాపడి ఆ పుస్తకాలు చదివి వుండేది. బొమ్మలు చూసి వుండేది. కానీ ఇక్కడ ఈ విపత్కర పరిస్థితుల్లో ఆమె తప్పించుకు పోవడం గురించి తప్ప వేరే ఆలోచించడం లేదు. మగ, ఆడకు- సంబంధించిన ఆలోచనలే ఆమెకు జుగుప్సాకరంగా వున్నాయి.
రోజూ అతను వస్తున్నాడు. అడిగి వెడుతున్నాడు. రకరకాల కబుర్లు చెబుతున్నాడు. అసభ్యంగా మాట్లాడుతున్నాడు. తనను తాకకుండానే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తను లొంగడం లేదు.
అదృష్ట మేమిటంటే ఇంతవరకూ అతడు తనను బలవంతం చేయలేదు. రాత్రిళ్ళు తనకేవిధమైన ఇబ్బంది కలిగించలేదు. కానీ ఎన్నాళ్ళీ చెర! ఎంతకాలం మిలా కొనసాగుతుంది?
తనిప్పుడేక్కడుంది? జయరాజు తనను టాక్సీ లో ఎక్కిన్చుకున్నాక మళ్ళీ అతన్ని చూడలేదు. ఇక్కడి కేలా వచ్చిందో, అతనే మయ్యాడో రాధకు తెలియలేదు.
"నీకు మానభంగ,మంటే తెలుసా?" అనడిగాడతను.
ఆమె మాట్లాడలేదు. కానీ గుండె ఝల్లుమంది.
"తెలియకపోతే విను, ఆడదానికి ఇష్టం లేకపోయినా మగాడామే ను బలవంతంగా అనుభవిస్తే ఆ అమ్మాయి మానభంగం జరిగిందని అర్ధం - ఉదాహరణకు నేను నిన్ను...."
"ఉదాహరణ వద్దు, అర్ధమైంది" అంది రాధ.
"ఇప్పుడీ గదిలోంచి నువ్వు బయటకు వేళదామన్నా వెళ్ళలేవు. తెలుసా?" అన్నాడతను.
"తెలుసు"
"నీకంటే అన్ని విధాలా బలవంతుణ్ణి , తెలుసా?"
"తెలుసు"
"ఈ పరిస్థితుల్లో నేను నిన్ను బలవంతం చేస్తే తప్పుకోవడం నీకు అసాధ్యమని తెలుసా?'
రాధ కళ్ళల్లో భయం కనబడింది. అతనిదంతా ఎందుకు చెబుతున్నాడో నని ఆమె కలవరపడసాగింది.
"మానభంగం తప్పనిసరి అయితే ఏం చేయాలో తెలుసా?"
రాధ మాట్లాడలేదు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది.
"ఈ గదిలో పరుగులు పెట్టినా లాభం లేదు. ఒక్కసారి నా చేతిలో నీ చేయి పట్టాణా నువ్వింక తప్పించుకోలేవు. నీకు మానభంగం తప్పదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ?"
"ఆమె గుండె వేగం పెరిగింది. మనసులో ఆరాటం హెచ్చింది.
"మనసు తేలిక చేసుకుని హాయిగా అనుభవించడమే" అన్నాడతను పకపకా నవ్వుతూ.
ఆమెకు నవ్వు రావడం లేదు.
'మనసు తేలిక చేసుకో -- సరిగ్గా అయిదు నిమిషాలు టైమిస్తున్నాను " అన్నాడతను.
అతను వాచీ వంక చూస్తున్నాడు. ఆమె అతని వంక చూస్తోంది.
6
పేర్రాజు స్కూలు నుంచి ఇంటికి వచ్చి కాఫీ తగి పడక కుర్చీలో కూర్చున్నాక -- "అసలు మనం మళ్ళీ అమ్మాయిని జన్మకు చూస్తామాండీ?" అంది వర్ధనమ్మ.
"నాకూ దిగులుగానే వుందే - అ శేషారావు నిన్న వచ్చి వెళ్ళాడు. అతను చెప్పిన కధ విన్నప్పటి నుంచీ నాకు మరీ బెంగగా వుంది. పెద్దవాళ్ళ వ్యవహారంలో అనుకోకుండా, మనకు తెలీయకుండా తల దూర్చడం జరిగింది. ఇదంతా ఆ భగవంతుడి లీల. దాని కాయనే ఏదో దారి చూపించాలి" అన్నాడు పేర్రాజు.
సరిగ్గా అదే సమయానికి ఎవరో వీధి గుమ్మంలో నిలబడి "లోపలకు రావచ్చా?'అనడిగారు.
"రండి"అన్నాడు పేర్రాజు కుర్చీలోంచి లేస్తూ.
వచ్చినాయన మనిషి మంచి రాజసంగా వున్నాడు. కానీ ముఖం మాత్రం అంత ప్రసన్నంగా లేదు. "నీవేనా పేర్రాజు?" అన్నాడాయన.
"అవునండి-- మీరెవరు?" అనడిగాడు పేర్రాజు.
"నాపేరు కొండల్రావు " అన్నాడాయన. నన్నేపెరడుగుతావా అన్న దర్పం అయన కళ్ళల్లో కనబడింది.
పేరు చెప్పగానే పేర్రాజు యన్ను గుర్తు పట్టగాలిగాడు. సభల్లోనూ, పేపర్ల లోనూ మాత్రమే కాక అప్పడప్పుడు బంధువుల ఇండ్లలో శుభకార్యాలకు దూరాన్నుంచి ఆయన్ను చూశాడు పేర్రాజు . ఎప్పుడూ పలకరించే ధైర్యం కలగలేదు. ఈరోలా అవకాశం వచ్చింది. తడబడిపోతూ "రండి - కూర్చోండి" అన్నాడు.
"మర్యాదలు తర్వాత , మీ అమ్మాయి రాధ నో సారి పిలవండి" అన్నాడు కొండలరావు.
'అది ఉళ్ళో లేదు" అన్నాడు పేర్రాజు.
"ఎక్కడికి వెళ్ళింది?"
"మీరు పంపిన జయరాజామెను కిడ్నాప్ చేశాడు" అన్నాడు పేర్రాజు నిబ్బరంగా.
జయరాజు పేరు వింటూనే కొండల్రావులిక్కి పడి - "ఏమన్నారు? జయరాజిక్కడికి వచ్చాడా--ఎప్పుడు?' అన్నాడు.
జయరాజు పేరు వింటూనే వీధిలోంచి ఓ యువకుడు లోపలకు వచ్చి "ఏమిటి నాన్నా-- జయరాజిక్కడికి వచ్చాడా? నువ్వు గానీ పంపావా నాన్నా!" అన్నాడు .
కొండల్రావు మాట్లాడలేదు.
పేర్రాజు కుర్రాడి వంక చూసి "నువ్వెవరు బాబూ!" అన్నాడు.
"నా పేరు శేషారావు . కొండల్రావు గారబ్బాయిని. మీ అమ్మాయి రాధను ప్రేమించాను నేను. మీతో మాట్లాడటానికని మా నాన్నగారిని తీసుకొచ్చాను నేను" అన్నాడా యువకుడు.
"నువ్వు శేషారావా? మరి నిన్న వచ్చిందేవరు?" అన్నాడు పేర్రాజు కంగారుగా.
"నిన్నేవరోచ్చారిక్కడికి?"
"మీ అబ్బాయి శేషారావని చెప్పి ఓ కుర్రాడిక్కడికి వచ్చాడు. ఏమిటో అంతా అయోమయంగా వుంది నాకు" అన్నాడు పేర్రాజు.
అంతా అక్కడ చతికిల బడ్డారు. పేర్రాజు మొదట్నించీ జరిగిందంతా చెప్పాడు.
"అంతా అయోమయంగా వుంది" అన్నాడు కొండల్రావు.
"నాన్నా! మోసమంతా నీలోనే వుంది. నా రాధను నువ్వేదో చేశావు" అన్నాడు శేషారావు.
"రాధను కిడ్నాప్ చేయించాలని నేననుకున్న మాట నిజం. ఆ విషయం జయరాజు క్కూడా చెప్పాను. కానీ రెండ్రోజుల క్రితం వరకూ జయరాజు నాదగ్గరే వుంటూ నా పనులూ చూస్తున్నాడు. నిన్న ఉదయమే అతను రాధను కిడ్నాప్ చేయటానికి బయల్దేరాడు -- ఇందులో అణుమాత్రం అసత్యం లేదు " అన్నాడు కొండల్రావు.
శేషారావు తండ్రి వంక అసహ్యంగా చూసి -- "నువ్వు నిజంగా మారేవనుకున్నాను. కానీ ఇంత నీచానికి పాల్పడతావనుకోలేదు. అసలు నువ్వు రాధ నెందుకు కిడ్నాప్ చేయించాలి? పురాణ కాలంలో రాక్షసులిలాంటి పనులు చేసేవారు. ఇప్పుడు నువ్వు వాళ్ళు లేని లోటు తీరుస్తున్నావు" అన్నాడు.
