Previous Page Next Page 
పధ విహీన పేజి 24


    వెల్లువ లో గడ్డి పరకలా కొట్టుకుపోతూ పరిస్థితులకు అనుగుణంగా రంగులు మార్చేవారు వీళ్ళను ఏనాటికీ అర్ధం చేసుకోలేరు.
    నిట్టుర్చారు స్వామి.
    హిమనీ నదాలా తాకిడి కి తట్టుకుని బ్రతికిన శిలా యుగపు మానవుని లో అజ్ఞానపు పొర, ఇరవయ్యవ శతాబ్దంలో అతి నాగరక మానవుడిని ఇంకా అవహించే ఉంది. అర్ధం కానిది ఇంకా ఎంతో మిగిలిపోయే ఉంది.
    నియాండర్తాల్ మానవుని తరం దాటి క్రోమాగ్నాన్ మానవుడి తరంలో ప్రవేశించి, తన కళా జిజ్ఞాసను గుహ కుడ్యాల మీద ప్రతిఫలింప చేసిన మానవుడి మెదడు లో అర్ధం కాని పొరలు ఇంకా మిగిలిపోయే ఉన్నాయి.
    ఆలోచించ గల హోమోసెపియను ,మానవుడు ,. నాగరికతా పధంలో తన పురోగమన గాధకు చిహ్నంగా మలిచిన శిల్పాలలాగానే అతని మెదడు కూడా అయోమయం గానే ఉంది. ఇంకా ఇది తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నది. మానవ వంశ వృక్షం తాలూకు మొదలు వెతికితే బృహన్నరులు , వరవావరులు -- ఎందరో కనిపిస్తారు. ఆ అందరి రక్తం నేటి మానవుడి లో ఇంకా ప్రవహిస్తూనే ఉంది. సుదీర్ఘ హేమంతాలనూ భయంకరమైన హిమ పాతాలనూ తట్టుకుని, ఆహార సమస్యను పరిష్కరించుకుని నేటి ఈ స్థితికి వచ్చిన మనిషికి భూభాగం సరిపోవటం లేదు. ఇంకా ఏదో కావాలని ఆశిస్తున్నాడు.
    నీతి, ధర్మం , పవిత్రత అంటే ఏమిటో ఆనాటి మనిషికి ఎంతవరకు తెలుసా? అనిపిస్తుంది. మతం అని వింటే బహుశా నవ్వే వాడేమో?
    స్వామి తనలో తనే నవ్వుకున్నారు. నాలుగు లక్షల సంవత్సరాల నాటి మనిషి ఆయనకు గుర్తు వచ్చారు. ఆంధ్తోపాలజీ లో స్వామి పండితులు.
    ఈ భూమి పైన మానవుడు జన్మించి కాలు నిలదొక్కుకునేసరికి, మండిపోతున్న భూభాగం చల్లబడటం జరిగింది. మానవోదయానికి పూర్వం ఉన్న మహా ఉష్టం కాలక్రమేణా హిమనీ నిబిడ హేమంతంగా మారిపోయింది. మంచు తప్ప మరేమీ  కనిపించటం లేదు. దృవ ప్రాంతంలోనూ , మహోన్నత శిఖరాల పైనా కురిసిన రాతి మంచు ఏనాడూ కరిగేది కాదు. దీనికి తోడు ఏటేటా సుదీర్ఘ హేమంత నిశీదాలు ఎక్కువయి మంచు మేటలతో లోకం నిండిపోయింది.
    మానవుడికి అది మహా కష్ట దశ. ఎముకలు చిట్లే చలి. తలదాచుకునే చోటు కోసం అన్వేషణ. తీరని ఆకలి బాధ. నలువేపులా తనలానే ఆహార న్వేషణ చేస్తున్న క్రూర మృగాలు. అలిసి ఏ గుహలోనో నిద్రపోదామని ప్రయత్నిస్తే అంతకు ముందే ఆగుహలో దూరి కూర్చున్న తోడేలు తో యుద్ధం.
    అప్పుడు వేట అతని ప్రధాన వృత్తి.
    ప్రాచీన శిలా యుగాన్ని అధిగమించి , నవీన శిలా యుగంలో ప్రవేశించిన మానవుడు వేటలో ఆయుధాలను ఉపయోగించటం నేర్చుకున్నాడు. ఋతు వెరిగి వ్యవసాయం చేయటం నేర్చుకున్నాడు.
    లయ శ్రుతి క్రమము అనేది అప్పుడే అతనికి అలవాటయినయి. శాకాహారం తినటం అలవాటయింది. స్త్రీ పురుషులు జుట్టు కట్టటం బహుశా అప్పుడే ప్రారంభమయి ఉంటుంది.
    పిల్లలను కని పెంచాల్సిన బాధ్యత ఉన్న స్త్రీ వేటాడి నంతకాలం వేటాడి ప్రసవ సమయంలో వేట మాంసాన్ని నమ్మకంగా కొంప కు తెచ్చే మగవాడిని కట్టుకోటం అవసర మనుకుంది.
    మతం అనేది ఎప్పుడు ప్రారంభమయిందో ఎవరికీ తెలియదు. తనకంటే అధిక బలమైనది మరేదో ఉందనీ, దాన్ని తెలుసుకోవాలనీ ఆవేదన ప్రారంభమైనది. తన గుహ ముందు చలిమంట వేసుకుని తనకు అర్ధం కాని ఏదో విషయాన్ని గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉండే వాడేమో!
    సుఖమయ విలస జీవితానికి అలవాటు పడిన తరువాత మానవుడు కాలక్షేపానికి మతాన్నీ నీతినీ స్వార్దాన్నీ పెంచుకొటంతప్పనిసరి అయింది. చివరికి ఈ కాలక్షేపాలు ఉరి త్రాళ్ళుగా తయారయినయి. తీరిక సమయాల్లో కళాకారుడుగా శిల్పి గా బ్రతికిన క్రోమాగ్నాన్ మానవుడి కీ, నగరాలు నిర్మించుకుని నాగరకుడైన ఆరువేల సంవత్సరాల క్రిందటి మానవుడికి ఎంతో అంతరం ఏర్పడిపోయింది.
    రాజు, సామాన్యుడు అనే వర్గం భేదం కూడా అప్పటికే ప్రారంభ మయింది.
    లోహాన్ని మొదట కనిపెట్టిన మేధావిని స్త్రీ. అలంకరణ కోసం రాగి తాలూకు ఖనిజపు రాయిని మెత్తగా నూరి మకరికా పత్రాలు దిద్దుకునేది నాటి స్త్రీ. ఆ రాళ్ళతో నగలు తయారు చేసుకునేది.
    బహుశా ఏ దుప్పినో కాలుస్తున్నప్పుడు చెవు జూకా తెగి నిప్పులో పడి కరిగి ఉంటుంది. ఇదేదో ఇంద్రజాలం అని ఆ స్త్రీ నాట్యం చేసి ఉండవచ్చును బహుశా.
    అప్పుడే వృత్తి ప్రారంభమయి ఉంటుంది. ఆస్తి హక్కులు కూడా అప్పుడే ఆరంభమయి ఉండవచ్చును. బొమ్మల రూపంలో ఉన్న లిపి కూడా అప్పుడే మొదలయి ఉంటుంది.
    అయిదు వేల సంవత్సరాల క్రిందటనే ఈజిప్టు ఆధునిక నాగరికతా ప్రాంగణం లోకి జొరబడింది.
    నైలునదీ తీరంలో ప్రారంభమైన ఈ నాగరకత చాలాకాలం నదీ తీరాల్లోనే సాగింది. అప్పుడే వ్యాపారం ప్రారంభమయింది.
    అప్పుడే రాజు మామూలు మనిషి మీద అధికారం చేయటం ప్రారంభ'మయింది. తన అధికారం సుస్థిరం చేసుకోవాలంటే మతాన్ని అడ్డు పెట్టుకోవాల్సి వచ్చింది ఆ రాజుకు.
    అందుకే ఆనాడు మతాధికారి, రాజు ఒకరే. సారవంతమైన సింధు నదీ లోయలో కూడా మనిషి తన నాగరికత ను శతధా విస్తీర్ణం చేసుకున్నాడు.
    వివాహం మరింత బలవత్తరమై, స్వార్ధం పెరిగి, డానికి ఏకాగ్రత అనీ, పాతివ్రత్యం అనీ పేరు పెట్టడం కూడా అప్పుడే జరిగి ఉంటుంది. వివాహం తాలుకూ ఈ పరిణామం సమగ్రంగా అర్ధం చేసుకోలేని స్త్రీ, దాని కోసం తన సర్వస్వాన్నీ బలి పెడుతుంది.
    స్వార్ధం కోసం ఆమె పవిత్రతా గర్వాన్ని హెచ్చవేస్తున్న వాడి మాట నమ్మి తనను తాను, హింసించు కుంటుంది. మళ్ళీ అదే పవిత్రతను గడ్డి పరకలా వదిలి వేస్తున్నది. రెండు వైపులా పదును ఉన్న సమాజం ఆమె స్థితిని ఎలా అయినా తరిగి ముక్కలు చేస్తున్నది. వీటన్నిటికీ తోడు ఆర్ధిక సమస్య స్త్రీని చితగగొట్టి వేస్తున్నది. అధునాతన సమాజ నిబంధనల ప్రకారం విజయ కూడా ఉద్యోగిని అయితే, ఇలా భిక్షుకి గా గడపాల్సిన అవసరం నేడు ఉండేది కాదు.
    "స్వామీ, ఏమిటి ఆలోచిస్తున్నారు?" అన్నది విజ్జమ్మ. స్వామి తన ఆలోచనా వాగురులను బలవంతాన విదిలించుకొని --
    "అది కాదమ్మా, మానవ జాతి పురోగమన గాధ పూర్తిగా తెలిసి వుంటే.....కనీసం విని వుంటే! నువ్వు దేనికోసమైతే యీ స్థితికి వచ్చానో ఆ స్థితి కేవలం ......సరే పోనీలే, నీవు నూజివీడు వెళ్లు. నీ భర్త హృదయ మంతటి తోనూ తిరిగి నిన్ను స్వీకరిస్తాడు. శాపవిముక్త అహల్యవుకా" అన్నారు.
    'అహల్య చేసిన తప్పు నేను చేయలేదు స్వామీ"
    స్వామి చిరునవ్వు నవ్వి --
    "అహల్య తప్పు చేసిందనే అభిప్రాయం నీకు గర్వాన్ని ఇచ్చినంత కాలమూ పవిత్రతకు విలువ అనేది లేదు తల్లీ. తన పవిత్రతను నిలుపుకుంటూ పతితుని కి సానుభూతి ఇవ్వాలి. అచేనీలో లోపించింది. అందుకే సర్వేశ్వరుడు ఈ శిక్ష వేశాడు. కానీ, ఇది విచారించవలసిన శిక్ష కాదు. మరో లోకం అంటూ ఉండటం సంభవిస్తే అక్కడ నీకు మహా ఫలితం దొరుకుతుంది."
    "స్వామీ."
    "అవును తల్లీ. మతం మానవుడి మనుగడను అయోమయం చేస్తే నిబంధన మానవుడి అంతర్యాన్ని రాయిలా మార్చి వేసింది. ఇక వెళ్ళు" స్వామీ తిరిగి ధ్యానించటం ప్రారంభించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS