
14
గాలివాటుకు ఎగిరే తాటాకు లాగా ఆమె తెలిపోతున్నది . అనుభూతులూ, అనుభవాలూ లేని కపాలం లాగా కాలికి అడ్డు వస్తున్నది కాలం. స్వామి నిన్నటి చోటే కూర్చుని ఉన్నారు.
"ఎవరు?' తిరిగి వచ్చిన భిక్షుకిని అదే ప్రశ్న వేశారు స్వామి.
"తెలియదు." అదే సమాధానం.
"ఏం తెలుసుకోవాలని తిరిగి వచ్చావు మరి?"
"తెలియదు."
"అలా కూర్చో అయితే."
బుద్ది మంతురాల్లా కూర్చుంది విజ్జమ్మ. ఇందాకటి నుంచీ మండి పోతున్న హృదయానికి ఏదో శాంతి లభిస్తున్నట్లుంది. ఆవేదనలో అగ్ని పర్వతం లాగా ఉడికి పోతున్న అంతర్యం ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నది.
"భిక్షుకీ , నీవెవరు? సరి అయిన సమాధానం ఇయ్యి."
"తెలుసుకుని ఏం చేస్తారు?"
"శాంతి పధంలో నడవాలని లేదా నీకు?"
"ఉన్నది స్వామీ, దానికోసమే ఈ తపన" అని నిట్టూర్చింది విజ్జమ్మ.
"ఏ పరిస్థితిలో ఉన్న ప్రాణి కయినా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పధవిహీనత తప్పదు. నడుస్తున్న దారి వదలటం అనివార్యమూ అవుతుంది.
"మోహం ఊహలను కలచి వేస్తుంది. క్రోధం ఇండియాలను పట్టు తప్పిస్తుంది. కలిసి రాని కాంక్షలు పిశాచాల్లాగా వేధిస్తాయి. యవ్వనం జారిపోయి దాని మీద ప్రలోభం జస్టీ అవుతుంది. మృత్యు భయం ఫాక్టరీ పొగలా అంతర్యాన్ని ఆవహిస్తుంది.
"అప్పుడే శాంతి పధం కోసం అన్వేషిస్తాడు మనిషి" అన్నారు స్వామి.
వారి నుదుట వెలిగే అలౌకిక తేజస్సు చూసి వినమ్రురాలై పోయింది విజ్జమ్మ.
"స్వామీ, నా జీవితం నా నమ్మకాలు కూడా పవిత్రమయినవి లోకం చేత అనిపించు కునేవి. కానీ నా నుదుట దుఃఖాన్ని దేనికి రాశాడు దేముడు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలి నాకు.
"ఈ లోకంలో ప్రాణి కర్మ ఫలితాన్ని ఎంత వరకు పొందట మనే ప్రశ్న వస్తే డానికి సమాధానం లేదు భిక్షుకీ. ఒక విత్తనం లాగే ఒక నమ్మకం కూడా భూమి లోనూ మనస్సు లోనూ పడి మొలకెత్తి నప్పుడు ఎంత ఫలం ఇస్తుందో ఎవరు మాత్రం చెప్పగలరు?" నిట్టుర్చారు స్వామి.
విజ్జమ్మ తిరిగి ఇంకే ప్రశ్న వేయకుండా చాలాసేపు అలాగే ఉండిపోయింది. స్వామి నిశ్శబ్దంగా కృష్ణా నది వేపు చూస్తున్నారు.
"కర్మ సిద్దికి ప్రధానమైనది భయరాహిత్యం భిక్షుకీ. ఈ ప్రపంచంలో దేనికీ భయపడనవసరం లేదు" అన్నారు కొంచెం సేపయినాక.
"స్వామీ?"
"ఏం భిక్షుకీ?"
"మీరెవరో నాకు తెలియదు. కాని ఆత్మార్పణ చేసుకోవాలని పిస్తున్నది. నేను ధర్మానికి అంతర్యానికి భయపడ్డాను స్వామి. ఆ రెండింటి ముందూ మానవత్వాన్ని క్షమా గుణాన్ని చులకన చేశాను. అందుకే భగవంతుడు నా కీ శిక్ష విధించి ఉంటాడు. మనసుకన్న అంతర్యం గొప్పదనీ, మమత కన్న మానవత్వం గొప్పదనీ, శిక్షించటం కన్న క్షమించటం గొప్పతనమనీ తెలుసుకోలేక పోయాను స్వామీ. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను."
రెండు చేతులతో మొగం కప్పుకుని అవురుమంది విజ్జమ్మ.
"అమ్మా."
"స్వామీ ....నేను భిక్షుకిని."
"కాదు. నీవు విజయ లక్ష్మీవి."
విజ్జమ్మ ఉలికి పడింది. తన ప్రస్తుత నామం విజ్జమ్మ. తను ఇప్పుడు గుడ్డి బిచ్చగత్తె. తనను విజయలక్ష్మీ అని గుర్తు పడుతున్న ఈ స్వామి ఎవరు? ఇంకా తను లోకం చేత గుర్తించబడుతున్నదా?"
"స్వామీ, నేను విజ్జమ్మను."
"తల్లీ, నీలో ఇంకా విజయలక్ష్మీ మిగిలే ఉంది."
కొంచెం సేపు విజయలక్ష్మీ మాట్లాడలేదు. స్వామి పాదాల వైపు చూస్తూ నిశ్చలంగా ఉండిపోయింది. స్వామి కూడా ధ్యాన మగ్నులయినారు కొన్ని నిమిషాలు.
"అమ్మా."
"ఏం స్వామీ."
"తిరిగి నీ భర్త దగ్గరికి వెళ్ళు. తప్పు చేశానని భయపడకు. నీవే తప్పూ చెయ్యలేదు."
"నన్ను విజ్జమ్మ గానే రాలి పోనివ్వండి స్వామీ" అన్నది విజయ-- దుఃఖాన్ని అపుకోవాలని వ్యర్ధ ప్రయత్నం చేస్తూ.
"అది అర్ధరహితం తల్లీ. నీ కధ జగన్నాధం వలన విన్నాను. అందుకే నీ మాటలను బట్టి గుర్తు పట్టగలిగాను. నీవేమయిందీ తెలియక నీ భర్త, నీ మరిది, జగన్నాధం ముగ్గురూ ఆందోళన పడుతున్నారు."
"ఒకప్పుడు వారు నా అందాన్ని ప్రేమించే వారు. ఇప్పటి ఈ విజయ లక్ష్మీ పదవిహీన మాత్రమె కాదు. సౌందర్య హీన కూడా. ఏ ముఖంతో వారి దగ్గరకు వెళ్ళమంటారు? ఇప్పుడు నా కన్ను పువ్వు వేసింది. నా చెయ్యి చచ్చు పడిపోయింది. నీతినీ, ధర్మాన్నీ గురించి గర్వించి కబుర్లు చెప్పే విజయలక్ష్మీ ఇల్లు వదిలి ఇన్నాళ్ళు ఎక్కడెక్కడ ఎలా బ్రతికిందో ఎవరు నమ్ముతారు స్వామీ? నా మార్గం మూసుకుని పోయింది' అని చిరుగుల కొంగుతో కళ్ళు తుడుచుకుంది విజయ.
"జీవ ప్రపంచం చిత్రమైంది తల్లీ. ఒక జీవిని ఉద్దరిస్తే, అందరూ అదే మార్గంలో నడుస్తారు. ఒకడిని నాశనం చేస్తే మరి కొంతమంది నాశనం అవటం ఎలానూ తప్పదు. నీవు నీదారిని మూసేసుకోవటం చేస్తున్నావు. అది అసహజమైన ఆలోచన. తప్పులు చేస్తూ దిద్దుకుంటూనే మనిషి ఈస్తితికి వచ్చాడు. తప్పు చేసినందుకు జీవితాంతం శిక్ష అనుభవించి నందు వల్ల ఆ తప్పు యొక్క పరిమితి పెంచటం అవుతుంది. నా మాట విని నూజీవీడు వెళ్ళు" అన్నారు స్వామి.
"తప్పు చేసి క్షమ నర్ధించినవారికి కఠినంగా కాదన్నాను నేను. ఇప్పుడు అదే క్షమను వారి నుంచి కోరాలంటే సిగ్గుగా ఉంది."
"ఎందుకు డానికి అంతటి ప్రాధాన్యం?"
"నాకు తెలియదు స్వామీ. విరాజ్ బహూ ను నేను క్షమించలేకపోయాను. ఈ విషయం లో ఆయనకూ నాకూ వాగ్వివాదం కూడా జరిగింది. 'నేనయితే ఆ పరిస్థితుల్లోనే కాదు , ఏ పరిస్థితుల్లో కూడా భర్తను వదిలి పెట్టను-- అంతమాత్రాని కెనా' అన్నాను.
"వారు నవ్వి 'అలా కాదు విజయా! పరిస్థితులనేవి మనిషి చేత ఎన్ని వెధవ పనులు చేయిస్తాయో నీకు తెలియదు. ఎటువంటి వారయినా పరిస్థితులను బట్టి కొన్ని పొరపాట్లు చేయటం సహజం. వాటికి సానుభూతి ఇవ్వటం నేర్చుకోవాలి గాని విమర్శించకూడదు. గడిచి బ్రతకటం మాటలు కాదు' అని మందలించారు. ఆరోజు అయన మాటలు నేను అర్ధం చేసుకోలేక పోయాను. ప్రాణం పోయినా విరాజ్ ను క్షమించలేనని తెగేసి చెప్పాను. కేవలం అందుకే ఈ శిక్ష విధించాడా భగవంతుడు అనిపిస్తున్నది." కళ్ళు తుడుచుకుని తిరిగి చెప్పటం ఆరంభించింది విజయ--
"నా అంతటికి నేను ఇల్లు విడిచి రాలేదు. జ్వరంలో మా మరిది విజయవాడ తీసుకుని వచ్చాడు. స్పృహ రాగానే వారు ఇంటికి వచ్చి నన్ను వెతుక్కుంటారేమో అనే భయంతో నర్సింగ్ హోం లోంచి బయటకు వచ్చాను. అది నూజివీడని నా ఉద్దేశ్యం. ఆ జ్వర తీవ్రతలో దారి తప్పి రైలు స్టేషను ప్రాంతాల్లో పడి ఉన్న నన్ను ఒక బిచ్చగాడు సత్రానికి చేర్చాడు. మందు లేదు. చికిత్స లేదు. మశూచికం వచ్చి కన్ను పోయింది. చెయ్యి పోయింది. అయినా బ్రతికే ఉన్నాను స్వామి. ఎందుకు బ్రతికానో నాకు తెలుసు. అయన ఒడిలోనే నా ప్రాణాలు పోవాలనే కోరికతో బ్రతికాను. మీకు తెలిస్తే ఒక్క విషయం చెప్పండి -- నాకు మృత్యువు ఎప్పుడో! అప్పుడు వారి దగ్గరకు వెడతాను" అన్నది విజయ.
కరుణాళువు అయిన స్వామి రెండు కన్నుల లోనో నీరు నిండి పోయింది. లోకంలో విజయ లాటి స్త్రీలు ఎక్కడయినా ఉంటారా? ఉత్త మూర్ఖత అని విదిలించి వేసే ఈ యీ ఏకాగ్రత లో ఎంత ఔన్నత్యం ఉన్నది? స్త్రీ విలువ అంతా ఆ ఏకాగ్రత లోనే నిండి ఉన్నదా అనిపించింది స్వామికి.
ఈ స్త్రీ కోసం సముద్రానికి వంతెన కట్టాడు మగవాడు. ఇదే స్త్రీ కోసం రక్త వాహినులు ప్రవహించినయ్. బహుశా వారంతా ఈ ఏకాగ్రత కే ముగ్ధులయి తమ సర్వస్వాన్నీ ఆ స్త్రీ పాదాల ముందు నివేదించటం జరిగి ఉంటుంది. ఈ శతాబ్దంలో స్త్రీ విలువ ఏకాగ్రత లో లేదు. పొరపాటున విజయ ఈ శతాబ్దంలో జన్మించటం జరిగింది. అందుకే ఆమెకు సరి అయిన ప్రతిఫలం లభించటం లేదు.
ఇక జగన్నాధం లాటి మగవాళ్ళు కొందరు ఉన్నారు. వారు సేవ చేయడానికీ, త్యాగం చేయటానికీ నిర్ణయింపబడి జన్మిస్తారు. వారు తమను గురించి తామెప్పుడూ ఆలోచించు కోరు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళను గురించే ఆలోచిస్తారు. వారి ఏదీ పొందాలని గానీ, ఏదయినా తమకే ఉండి పోవాలని గాని ఎన్ఊ[నడూ అనుకోరు. ఇతరుల కోసం ఊపిరి పీల్చి జీవిస్తారు.
