స్వాతి చిత్రంగా రాము వంక చూసి "మా నాన్నా హత్య చేయబడ్డారని ఎవరు చెప్పారు మీకు? ఆయనది సహజ మరణం" అంది.
"హటాత్తుగా ఏ రోగం లేకుండా చనిపోతే హత్య యేమో అనుకున్నాను."
"ఏ రోగం లేని మాట నిజమే. కాని ఎందుకో ఆయన హార్ట్ ఫెయిలయింది. అంతే!" అంది స్వాతి.
రాము ఓసారి గొంతు సవరించుకొని "మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ విషయంలో మీకు సాయపడగలను. ఇప్పుడున్న ఇబ్బంది నుండి బయట పడడానికి మీరు ప్రభాకర్ నించి దూరం కావాలనుకుంటున్నారా. అమ్మ, అన్నల నించి దూరం కావాలనుకుంటున్నారా?" అన్నాడు.
"అది చెప్పడం వల్ల ప్రయోజనం?"
"నాకు మనుషుల ముఖాలు చూసి మృత్యు కళ వుంటే చెప్పగల శక్తి వుంది. ప్రభాకర్ చావు త్వరలో వున్నదో లేదో అతని ముఖం చూసి చెప్పగలను . అలాగే మీ ..."
'ఆగండి ' అంది స్వాతి. "అంటే మీరు ప్రభాకర్నీ హత్య చేస్తారా ?"
"అలా ఎందుకనుకున్నారు ?"
"ఎందుకంటె " అని ఆగింది స్వాతి. "మృత్యుకళ ముఖంలో ఉందో లేదో చెప్పడానికీ, నా యిష్టానికి లంకె పట్టారు మీరు. నేను అమ్మ, అన్న అక్కర్లేదనుకొంటె మృత్యు కళ ను వారి ముఖాల్లో కి మార్చే శక్తి మీకు వుందా?"
"మృత్యుకళను చదవగల శక్తి మాత్రమే నాకుంది" అన్నాడు రాము. 'అయితే మిమ్మల్ని నేనా ప్రశ్న అడగటానికి వేరే కారణముంది. మీ జవాబుని బట్టి నిజాన్ని దాచి పెట్టాడం కానీ చెప్పడం కాని చేయాలనుకున్నాను."
స్వాతి నిట్టూర్చి "ప్రభాకర్ బారి నుంచి నన్ను రక్షిస్తే నేను మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభించినా ఆశ్చర్యం లేదు" అంది.
6
"అరే బాప్ రే -- " అన్నాడు రాము.
"ఎవరు మీరు ?" అన్నాడు ప్రభాకర్.
"నా పేరు రాము. మనుషులకు మాములుగా తెలియని కొన్ని రహస్యాలు చెప్పగలను" అన్నాడు.
"రహస్యాలంటే నాకు ఆసక్తి లేదు కానీ మీరు నన్ను చూసి అరే బాప్ రే అన్నారు. ఎందుకో చెప్పాలి !"
'అది రహస్యం! రహస్యాలంటే మీకు ఆసక్తి లేదు కదా!"
ప్రభాకర్ చిరాగ్గా అతని వంక చూసి అక్కణ్ణించి కదలబోయాడు.
"మీకు స్వాతీ అనే అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి మిమ్మల్ని ఇంతవరకూ ప్రేమించలేదు. అయితే ఇదే సమయం మీరు బలవంతంగానయినా వెళ్ళి అ అమ్మాయిని అనుభవించాలి. గత్యంతరం లేదు" అన్నాడు రాము.
ప్రభాకర్ చటుక్కున వెనక్కు తిరిగి "ఇవన్నీ మీకెలా తెలుసు ?" అన్నాడు.
"రహస్యాలు చాలా తెలుసు నాకు."
"అదిసరే - నాకిష్టమయిన అమ్మాయిని బలవంతంగా అనుభవించడం మినహా గత్యంతరం లేని సమయం ఇదే అన్నారు. ఎందుకు ?"
"ఎందుకా?" అని నవ్వాడు రాము. "చెబితే విని భరించగలవా?"
ప్రభాకర్ కంగారుగా -- "త్వరగా చెప్పండి " అని అన్నాడు.
"మీ ముఖంలో మృత్యు కళ కొట్టవచ్చినట్లు కనబడుతోంది. బహుశా ఇంకొక్క రోజు బ్రతుకుతారేమో " అన్నాడు రాము.
ప్రభాకర్ ముఖంలో చెమటలు పోశాయి -- "ఏమిటన్నారు?" అన్నాడు.
రాము నవ్వి . "ఇదే జోస్యం నేను సుదర్శనరావు గారికి కూడా చనిపోయేముందు చెప్పాను. అయన నమ్మలేదు...." అన్నాడు.
"ఎవర్నువ్వు ?" అన్నాడు ప్రభాకర్.
"నీ శ్రేయోభిలషిని. నీది అదృష్ట జాతకం. అన్నింటికీ పెట్టి పుట్టినవాడివి. నీకున్న లోటల్లా ఒక్కటే. స్వాతిని అనుభవించడం. ఆ కోరిక తీరకుండా నువ్వు చావకూడదు. ముందుగా చావు తెలియడం ఎంతో అదృష్టం" వెంటనే బయల్దేరు " అన్నాడు రాము.
"నీ మాటలు నమ్మలంటావా?"
"ఓ సలహా ఇస్తాను. ఇద్దరం కలిసి ఇక్కడికి దగ్గరలో వున్న శివుడి గుడికి వెడదాం. నువ్వు లోపలికి వెళ్ళి ఓ కొబ్బరికాయ కొట్టు. ప్రసాదం నాక్కాస్త పెట్టి నువ్వు కాస్త తిను. అదృష్టం బాగుంటే ప్రాణాలు దక్కుతాయి."
'అలాగెందుకు చేయడం ?'
"యమధర్మరాజు బారి నుంచి మార్కండేయుడిని శివుడే గదా రక్షించాడు/ నీ ప్రయత్నం నువ్వు చేసుకో " గుడి నుంచి తిన్నగా స్వాతి ఇంటికి వెళ్ళు. ఆ ఇంట్లో నీకు అడ్డు లేదుగా. స్వాతిని బలవంతంగా నయినా నీదాన్ని చేసుకో" అన్నాడు రాము.
ప్రభాకర్ కు రాము సలహా నచ్చింది. ఇద్దరూ కలిసి శివుని గుడికి వెళ్ళారు.
ప్రభాకర్ ఓ కొబ్బరికాయ కొనుక్కుని గుళ్ళోకి వెళ్ళి ఓ చెక్కతో తిరిగి వచ్చాడు. అక్కడి కక్కడ ముక్క కొట్టి కొద్దిగా రాము కిచ్చి తను కాస్త తిన్నాడు. రాము కొబ్బరి ముక్క తినకుండా జేబులో వేసుకుని " నాకు కావలసిన ప్రియురాలుంది. దేవుడి ప్రసాదాన్ని మేమిద్దరమూ కలిసి తింటాము" అన్నాడు.
ప్రభాకర్ రాము వంక చూసి నవ్వి "నువ్వు చెప్పిన మృత్యుకళ సంగతి నేను నమ్మినా నమ్మకపోయినా స్వాతి విషయంలో నువ్విచ్చిన సలహా మాత్రం చాలా బాగుంది. నాలో నిద్రాణమైన కోర్కెను ఇన్నాళ్ళ కు తట్టి లేపావు . థాంక్స్ " అన్నాడు.
ప్రభాకర్ వెళ్ళిపోయాక రాము తన జేబులోంచి ఓ సిగరెట్ పెట్టె తీశాడు. అందులోంచి ఓ సిగరెట్ తీశాడు. తన జేబులోని కొబ్బరి ముక్కలను చిన్న చిన్న తుంపులుగా చేసి ఆ సిగరెట్లో వేశాడు.
అందులో ఏమాత్రం ఖాళీ వుందో గానీ ఆ తుంపులు అందులో పట్టాయి. తర్వాత సిగరెట్ ని మళ్ళీ పెట్టెలో పెట్టి -- సిగరెట్ పెట్టి జేబులో పెట్టేసుకున్నాడు.
"ఈ యింట్లో నాకు ఎదురుందా?' అన్నాడు ప్రభాకర్.
సుదర్శనరావు భార్య మాలతి ఏమీ మాట్లాడలేదు.
"అత్తయ్య -- నేను చేసిన తప్పేమిటి? స్వాతీ నన్నెందుకు పెళ్ళి చేసుకోదు - నువ్వే చెప్పాలి !" అన్నాడు ప్రభాకర్.
"మేమిచ్చిన స్వేచ్చ దాన్ని పాడు చేసింది. మా మాటే వినడం లేదు ఇప్పుడది" అంది మాలతి.
"స్వాతి ఇప్పుడెం చేస్తోంది?" అన్నాడు ప్రభాకర్.
"మేడ మీద గదిలో చదువుకుంటోంది " అంది మాలతి బాధగా.
కూతురి పద్దతి ఆవిడకే మాత్రమూ నచ్చలేదు. మాలతి డబ్బు కోసం గడ్డి తినమన్నా సందేహించదు. ఆవిడ కారణంగానే సుదర్శనరావు డబ్బు కోసం తప్పుదార్లు తొక్కాడు.
మాలతి యిప్పుడు విలాస జీవితానికి చాలా అలవాటు పడింది. మాలతి కొడుకు చెంగాల్రావు క్కూడా అన్నీ తల్లి పోలికలే వచ్చాయి. ఎటొచ్చీ స్వాతి మాత్రామే అ యింట్లో తప్పు బుట్టినట్లు కనబడుతోంది.
ఇప్పుడు భర్త పోయాక గోవిందరావు మాలతిని బెదిరిస్తున్నాడు. తన కొడుకు ప్రభాకరాన్ని స్వాతి చేసుకొని పక్షంలో ఆ కుటుంబాన్ని కట్టు గుడ్డలతో నడి వీధిలో నిలబెడతానని అయన మాలతిని హెచ్చరించాడు. మాలతి స్వాతికి ఎన్నో విధాల చెప్పి చూసింది.
'అత్తయ్య నువ్వేమీ అనుకోనంటే నాకు ఒక్కటే దారి కనబడుతోంది. నేను స్వాతిని బలవంతంగా లొంగదీసుకుంటాను. ఆ తర్వాత ఎలాగూ ఆమె నాకు భార్య అవుతుంది."
మాలతి కంగారుగా ప్రభాకర్ వంక చూసింది. ఆమె కళ్ళలో కూతురి భవిష్యత్తు గురించిన ఆవేదన కనబడలేదు. కూతురు తన గురించి ఎమనుకుంటుందో నాన్న బెదురూ కనిపించింది. డబ్బు గురించిన ఆశ ఆమె గుండెల చుట్టూ కట్టిన బలమైన గోడలు ప్రభాకర్ మాటలు చేదించుకుని వెళ్ళ లేకపోయాయి. అర్ధాంగీకారంగా ఆవిడ తల ఆడించింది.
ప్రభాకర్ గబగబా మేడ మెట్లు ఎక్కాడు. అతని శరీరంలో ఉద్రిక్తత ప్రారంభమైంది. మెట్లన్నీ ఎక్కాక అతని నడకలో వేగం తగ్గింది. నెమ్మదిగా నడుచుకుంటూ స్వాతి గది దగ్గరకు వెళ్ళి ఆగాడు. ఓ క్షణం తటపటా యించి రహస్యంగా గదిలోకి చూశాడు.
మంచం మీద బోర్లా పడుకుని ఏదో పుస్తకం చదువుతోంది స్వాతి. ఆమె కళ్ళు పుస్తకం వైపే కేంద్రీకరించ బడి వున్నాయి. పాదాలు పైకెత్తి అటూ ఇటూ ఆడిస్తోంది. నోట్లో లాకెట్ గొలుసు పెట్టుకుంది. పైట జారి వుంది.
ఆ పోజులో ఆమెను చూస్తుంటే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా అనిపించింది ప్రభాకర్ కి. క్షణం పాటు వూపిరైనా పీల్చు కోకుండా ఆమె వంక చూసి చటుక్కున గదిలో అడుగుపెట్టి క్షణంలో తలుపు మూసి గడియ వేసేశాడు.
చటుక్కున తలెత్తి చూసింది స్వాతి. ప్రభాకర్ ని చూసి నిర్లక్ష్యంగా -- "నువ్వా?' అంది.
'అవును నేనే ఎలా కనబడుతున్నాను ?'
"మాములుగానే వున్నావు? ఏం?"
"ఒకతను నాకు బజార్లో నా ముఖంలో మృత్యు కళ వుందనీ-- ఇంక ఒక్కరోజుకు మించి బ్రతుకననీ -- తీరని కోరిక లేమైనా వుంటే వెంటనే వెళ్ళి తీర్చుకోమనీ చెప్పాడు. అందుకని వెంటనే ఇక్కడకు వచ్చాను --"
"ఇక్కడి కెందుకు వచ్చావ్ ? తీరాని కోరికలు తీరే చోటు ఇది కాదు కదా -' అంది స్వాతి వెటకారంగా.
"నాకు తీరని కోరిక ఇంకేమీ లేవు. నిన్ను అనుభవించాలన్న దొక్కటే నాకింత వరకూ తీరని కోరిక" అన్నాడు ప్రభాకర్.
"అది ఇప్పటికీ ఎప్పటికీ తీరని కోరిక" అంది స్వాతి.
"చావుకు తెగించిన వాణ్ని. ఏమైనా చేయగలను!' అన్నాడు ప్రభాకర్.
"ఏమైనా అంటే?" అంది స్వాతి.
"ఇప్పుడే తెలుస్తుంది...." అన్నాడు ప్రభాకర్.
"ఈలోగా నేను నవల చదువుకుంటాను...." అంటూ స్వాతి నిర్లక్ష్యంగా పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకుంది.
"స్వాతీ!" అన్నాడు ప్రభాకర్.
స్వాతి పుస్తకం వైపే చూస్తోంది కానీ ఆమె శరీరం కంపిస్తోంది. మనసు తప్పించుకోవడం గురించి ఆలోచిస్తోంది. నవలలో పేజీ తిరగడం లేదు. ప్రభాకర్ ఆమెను ఇంకా సమీపించ లేదు. అలా అయిదు నిమిషాలు గడిచాక వుండబట్టలేక స్వాతి ప్రభాకర్ వైపు చూసింది.
అతనింకా అలాగే గుమ్మం వద్ద నిలబడి వున్నతడు. ఓ చెయ్యి గోడకు అని వుంది. రెప్ప వెయ్యకుండా అతను స్వాతి వంక చూస్తున్నాడు.
"ఊ చెప్పు, ఏం చేస్తావో చెప్పు" అంది స్వాతి.
