Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 23

 

    "అవసరం లేదు. స్నానం చేసే ఉద్దేశ్యం పోయింది. ఏం చెబుతావో చెప్పు' అందామె.
    'అయితే ఎక్కడ మాట్లాడుకుందాం? క్రింద హల్లో అయితే మరీ బట్టబయలుగా వుంటుంది. ఇక్కడే అయితే ఇబ్బందిగా వుంటుంది. నీ పడగ్గదికి పోదాం. నేనేం చేయన్లె" అన్నాడు రవి.
    ఇద్దరూ ఆమె పడక గదిలోకి వెళ్ళారు. ఆమె మంచం మీద కూర్చుంటే - డ్రస్సింగ్ టేబిల్ ముందుండే బల్ల లాక్కుని అతనామే కెదురుగా కూర్చుని, "నువ్వు చాలా అందంగా వున్నావు" అన్నాడు.
    "ఇదేనా నువ్వు చెప్పదలచుకున్న విషయం?' అందామె.
    "కాదు. అందం ఆడదానికి వరం. అయితే నాలాంటి మగవాళ్ళున్నప్పుడది శాపంగా కూడా పరిణమిస్తుంది. నేను చెప్పదలచుకున్న విషయం అదే!" అన్నాడు రవి.
    "అంటే?"
    "ఈ ఫోటో చూడు" అంటూ రవి ఆమెకో ఫోటో అందించాడు. ఆ ఫోటోలో వున్న భయంకరమైన వస్తాదుని చూసి ఆమె త్రుళ్ళి పడింది.
    "అందమైన ఆడది బంగారు గుడ్లు పెట్టె బాతు లాంటిది. దాని అందంతో ఎంతైనా డబ్బు సంపాదించవచ్చు. కానీ తన అందం తో వ్యాపారం చేయడానికి ఆడది ఓ పట్టానఒప్పుకోదు. నాలాంటి వాడు రోజుల తరబడి చెప్పినా వినని ఆడదాన్ని క్షణాల మీద దేనికైనా ఒప్పించగల సమర్ధత ఈ ఫోటోలోని మనిషి కుంది. ఈ మనిషి పూర్తిగా నా చెప్పు చేతల్లో వున్నవాడు.  అయితే అందమైన ఆడవాళ్ళ మీద మాత్రమే ఇతన్ని ప్రయోగిస్తాను . అదీ అ ఆడది నా మాట విననప్పుడు ! అన్నట్లు .... నువ్వు అందంగా వున్నావు. చాలా చాలా అందంగా ఉన్నావు.
    రవి మాటలు విని ఆమె బాగా కలవరపడింది. ఎమిటితని ఉద్దేశ్యం? తన్ను వ్యభిచారిణి చేస్తాడా?" తలచుకుంటూనే ఒళ్ళు గగుర్పొడిచిందామెకు. రవి మళ్ళీ మొదలు పెట్టాడు.
    "నీకంటే అందమైన ఆడదాన్ని నేను రెండు నెలల క్రితం వృత్తిలోకి దింపాను. అందుకీ ఫోటో మనిషి అవసరమయ్యాడు. ఇప్పుడామె నాకు లక్షలు సంపాదించి పెడుతోంది. ఇంతకూ ఆమెను నీకంటే అందమైనదని ఎందుకన్నానో ఈ ఫోటో చూస్తె తెలుస్తుంది" అంటూ ఆమె కింకో ఫోటో అందించాడతను.
    ఆ ఫోటో అందుకుని చూసిన అమెముఖంలో మొట్ట మొదట సిగ్గు కనబడింది. తర్వాత అసహ్యం ఆపైన ఆశ్చర్యం. ఆమీదట కోపం కనబడ్డాయి. రవి అమెముఖ భావాలను చూస్తూ కూర్చున్నాడు. ఫోటోను పరిశీలించాక ఆమె రవి ముఖంలో కి ఒకసారి చూసి తలదించుకుంది. ఆ ఫోటో చూసేక అతని ముఖంలోకి చూడడానికి కష్టం గా వుందామేకు.
    అందులో శ్యామసుందర్ , స్నేహ అత్యంత అసహ్యకరమైన విధంగా వున్నారు. ఇద్దరి ముఖాలూ స్పష్టంగా  కనబడుతున్నాయి. స్నేహ ఎవరో ఆమెకు తెలియదు. కానీ శ్యామసుందర్ మాత్రం....
    "నువ్వుండగా భర్త ఇంకో యువతి పొందు కోరుతున్నాడంటే ఆమె నీకంటే అందమైనదే అయుండాలి అన్నాడు రవి. "అయినా వెరైటీ కోరే మగవాడికి అందంతో పనేమిటి?"
    "ఈ ఫోటో నాకెందుకు చూపించినట్లు?" అందామె చివరకు.
    "ఒకటి -- నిన్ను కూడా ఈ ఫోటోలోని ఆడదానిగా మార్చగలనని చెప్పడానికి, రెండు - నీ భర్త నిజస్వరూపం కళ్ళారా చూసే అవకాశం నీకివ్వడాని కి" అన్నాడు రవి తాపీగా.
    "తర్వాత...." అందామె.
    "నీ భర్తను బెదిరించడానిక్కవాలంటే ఈ ఫోటో నీకు వదిలేస్తాను ఒకేఒక్క షరతు మీద" అన్నాడు రవి.
    "ఏమిటా షరతు ?"
    "బంగారం పూత యంత్రం కావాలి. ఎలాగో అలా అది నువ్వు నీ భర్త దగ్గర్నుంచి సంపాదించి తెచ్చి నాకివ్వాలి" అన్నాడు రవి.
    "లేకపోతె?"
    "నీ కొడుక్కు స్వర్గ లోకం.నువ్వు ఇహ లోకంలో రంభవు."
    ఆమె ఆలోచనలో పడింది. రవి గురించి ఆమెకు చాలా భయంగా వుంది. భర్త ప్రవర్తన తెలిసేక అతని మీద విపరీతమైన కోపంగా వుందామేకు. ఈ రెండూ కలిసి ఆమె ఆలోచనలను రవికి అనుకూలంగా మారుస్తున్నాయి.
    నిజానికి బంగారం పూత యంత్రం గురించి ఆమెకు తెలిసును. అది ఈ ఇంట్లోనే వుంది. చాలా వరకూ పూత పనులు రహస్యంగా తనే చూస్తుంటుంది. కానీ తన మామగారు , భర్త కూడా అది వేరే ఎక్కడో ఉందన్న భ్రమ చాలామందికి కలిగించారు.
    ఎంత మంది ఆ యంత్రం కోసం ప్రయత్నించి ఎలా భంగపడ్డది తన భర్త తన దగ్గర సగర్వంగా చెప్పుతుంటాడు. మూడో కంటి వాడికి దాని ఉనికి గురించి తెలియడం ఇష్టం లేకనో - దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇంట్లో వాళ్ళే చూసుకోవడం జరుగుతోంది.
    దాని కారణంగా లక్షలార్జించే అవకాశముంది. అదిలేకపోతే తమ వ్యాపారమే ఆగిపోతుంది. కానీ అదుంటే తన భర్తకు లక్షలు మిగలవచ్చు. కానీ తన జీవితం సర్వనాశన మవుతుంది.
    క్రమంగా ఆమె ఆలోచనల్లో స్వార్ధం చోటు చేసుకోసాగింది. డబ్బుకు తమకేమీ లోటు లేదు. తన పేరునే బ్యాంకులో ఆరేడు లక్షలకు పైగా ఉన్నాయి.
    గిల్టు నగల వ్యాపారం ఆగిపోతే తనకేం? కొనసాగితే తనకేం? అవన్నీ తన భర్త చూసుకుంటాడు. ప్రవర్తన విషయంలో తనేలాగూ అతన్నదుపుచేయలేదు. అతని వ్యాపారం గురించి ఆలోచిస్తే బంగారం లాంటి తన బ్రతుకు సర్వనాశన మవుతుంది. తను పొతే అతనికింకో వివాహం చేసుకుని విచ్చలి విడిగా ఉంటాడు.
    ఆమె ఆ యంత్రాన్న తని స్వాధీనం చేయాలని నిర్ణయించుకుంది.

                                                           12
    శంకరం ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. "అద్భుతం!జీవితంలో ఇంత ఆనందం నాకెన్నడూ కలగలేదు" అన్నాడాయన.
    నీరజ నిర్లిప్తంగా కూర్చుని వుంది. ప్రతి పర్యాయమూ ఒక గండంలా ఉన్నదామేకు. ఇప్పటికీ మూడు గండాలు గడిచాయి. ఇంకా ఒకే ఒక్క గండముంది.
    "మీ ఆఖరు పనిచేప్పండి" అందామె.
    "లలిత తెలుసా మీకు?' అన్నాడు శంకరం తన మామూలు ధోరణిలో.
    "తెలియదు."
    "అవున్లెండి . ఎలా తెలుస్తుంది? ఆమె గురించి చాల మందికి తెలియదు" అన్నాడు శంకరం.
    "ఎవరామే?"
    "ఈ ఊళ్ళోనే ఉంటోంది. ఒక ప్రయివేట్ కంపెనీలో స్టెనో గా పనిచేస్తోంది. చాలా అందంగా వుంటుంది. అందానికి మించిన తెలివితేటలు."
    'అలాంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. ఆమె ప్రత్యేకత ఏమిటి?' అంది నీరజ.
    "మీకర్ధమయ్యేలా చెప్పాలంటే ఆమె అడ రవి!" అన్నాడు శంకరం.
    నీరజ కర్ధం కాలేదు. "అంటే?'అంది.
    "మగవాళ్ళ లో రవి కెన్ని క్వాలిటీస్ వున్నాయో, ఆడవాళ్ళ లో ఆమెకూ అన్ని క్వాలిటీస్ వున్నాయి. ఆమెకోసం నేను ఎన్నో రకాల ప్రయత్నించాను. అన్ని ప్రయత్నాలు ఫెయిలైపోయాయి. ఏమీ చేయలేక పోయాను. మామూలు ఎత్తులకు జిత్తులకు లొంగదామె. బల ప్రయోగాల కూడా పని చేయలేదు. కండలు తిరిగిన వస్తాదులనే మన్ను కరిపించిందామె. కరాటే లో శిక్షణ పొందిందామె."
    "ఇప్పుడు రవి ఏం చేయాలి?"
    "ఆమెను నా మనిషిని చేయాలి"    
    "అంటే?"
    "ఆమెను నా కప్పగించాలి. ఆమె నేను చెప్పే మాటలు వినేలా చేయాలి."
    "అదెలా సాధ్యం? ఏదైనా వస్తువును సాధించవచ్చు. గానీ మనిషి మనసును సాధించడమెలా?అది మీవల్లనే కావాలి" అంది నీరజ.
    "నావల్ల కాలేదు, కనుకనే మీ దగ్గరకు వచ్చాను. ఇది నేను మిమ్మల్ని కోరుతున్న ఆఖరు కోరిక. ఇది సాధ్యపడితే నేనింక  మీ జోలికి రాను. హాయిగా, సంతోషంగా సుఖజీవనం చేయవచ్చు మీరు" అన్నాడు రవి.
    "కానీ ఇది చాలా అన్యాయం. ఒక మనిషిని ఇష్ట ఇష్టాలతో నిమిత్తం లేకుండా ఇంకొకరి పాల్జేయడమేనా కిష్టం లేదు. ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో అది చేయవచ్చు. అయితే ఆ మనిషిని మానసికంగా మీ పరం చేయడం మీవల్ల కాదు."
    "వల్ల కాదంటే కుదరదు, శాయశక్తులా ప్రయత్నించాలి" అని శంకరం అక్కణ్ణించి లేచి వెళ్ళిపోయాడు.
    నీరజ నిరుత్సాహంగా అక్కడే కూర్చుండి పోయింది. ఈ పని సాధ్య పడుతుందని ఆమెకు అనిపించడం లేదు. శంకరం లలిత కోసం చాలా ప్రయత్నాలు చేసి ఉండాలి. ఆమె కోరకరాని కొయ్య అన్నది స్పష్టమైనాక నే- నిరాశ చేసుకుని ఉంటాడు.ఇప్పుడు రవికీ పని అంటగట్టాడు. ఇంతవరకూ భగవత్ కృప వల్ల అన్నీ సక్రమంగా అయిపోయాయి. చివరకు ఇబ్బంది తప్పేలా లేదు.
    "భగవాన్ - మా ప్రేమ ఫలిస్తుందా? మేము కూడా అందరిలాగే హాయిగా కాపురం చేసుకునే రోజు అసలు రానున్నదా?" అనుకుంది నీరజ.

                             13
    "ఇది మన ప్రేమకు ఆఖరి సవాలు" అంది నీరజ.
    "అని నువ్వనుకుంటూన్నావా?" ఏదో ఆలోచిస్తూ అన్నాడు రవి.
    "రవీ -- నిన్ను చూస్తె నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకోసారి మన ప్రేమ జీవితం ఎలాగుంటుందో నని కూడా భయంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ నీ ప్రవర్తన సూటిగా ఉంటుందో కానీ లోతుగా ఉండడం లేదు. నేను చెప్పిన పనులన్నీ సాధించుకు వస్తున్నావు తప్పితే కారణాల గురించి నన్నేక్కువగా వేధించడం లేదు నువ్వు. ఏ విషయాన్నయినా నీకు సంబంధించినంత వరకే తప్ప పట్టించుకోవడం లేదు."
    నీరజ మాటలకు రవి నవ్వాడు. "నువ్వలా ఎందుకనుకుంతున్నావో నేనర్ధం చేసుకోగలను. నేరాలతో నా హృదయం కరడు గట్టుకు పోయింది. నీ ప్రేమలో అది కరగడం ఆరంభమయింది. అయితే కొన్ని ప్రయోజనాలు కోరావు నువ్వు. అవి సాధించాలంటే ప్రేమ ప్రభావానికి దూరంగా ఉండాలి నేను. నా ప్రేమ రీతులు నీకు ముందు ముందేలాగూ తెలుస్తాయి.
    ఇంతవరకూ నీకోసం నేను సాధించిన విషయాల కెంత అవగాహన అవసరమో నీకు తెలుసా? ఈ నగరంలో ప్రఖులందరి రహస్యాలూ బలహీనతలూ నాకు తెలుసును. పది నిముషాలు మాట్లాడితే ఎదుటి వారి మనస్తత్వాన్నాకళింపు చేసుకోగలను నేను. అందుకే షాజహాన్ నన్ను వదులుకోవడానికి కిష్టపడలేదు. నేను సాధించిన పనుల వెనుక నున్న లోతైన మనస్తత్వ పరిశీలన నువ్వు గుర్తించి ఉంటె ఈ మాట అని ఉండేదానివి కాదు నువ్వు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS