10
'చాలా థాంక్స్ మిస్టర్ వీర్రాజు! అన్న ప్రకారం నాకారును నా కప్పగించావు." అన్నాడు జగన్మిహన్.
రవి నవ్వి "అంటే మీలో నామీద అనుమానమున్న దన్నమాట" అన్నాడు.
"ఇట్స్ నేచురల్" అన్నాడు జగన్మోహన్.
"అనుమానమున్న చోట మోసముంటుంది. నేను మోసాన్ని సహించను. నేగేటివ్స్ ట్వంటీ టూ మీ దగ్గర దూప్లికేట్స్ ఉన్నాయా?"
"నా కారు నాకు చాలా విలువైనది. ఎలాంటి రిస్కూ తీసుకోనునేను. నాకూ నేగేటివ్స్ ట్వంటీ టూ కూ ఋణం చెల్లిపోయింది. ఇది నిజం" అన్నాడు జగన్మోహన్.
"అయితే సరే-- కానీ మీరు నన్ను కూడా ఇకమీదట మరిచిపోవాలి. నన్ను ఫాలో చేయడానికి గానీ నా ఉనికి ని తెలుసుకుందుకు గానీ ఏవిధమైన ప్రయత్నాలు చేయకూడదు. అలాంటి ప్రయత్నాలు చేసినట్లు నాకు ఏ మాత్రం అనుమానం కలిగినా ఫస్టు ఎటాక్ ఎర్ర కారు మీదే అని గుర్తుంచుకోండి." అన్నాడు రవి.
"నా సంగతి సరే, నువ్వు నా జోలికి రాకూడదు."
"భలేవారే. మీకూ నాకూ ఏ సంబంధమూ లేదు. నేను మిమ్మల్ని మరిచిపోవడం అప్పుడే ప్రారంభమయింది. వస్తాను మరి" అన్నాడు రవి.
జగన్మోహన్ ఆశ్చర్యంగా చూస్తుండగా అతన్నక్కడి నుంచి బయటపడ్డాడు. తర్వాత అతను ఊరంతా గజిబిజిగా తిరిగాడు. అలా తిరిగి ఒక సందులోని గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో అతని వేషం మళ్ళీ మారింది. కాసేపు అద్దం ముందు నిలబడి కొత్త వేషానికి అనుగుణంగా కొంత నటన ప్రాక్టీసు చేశాడతను. అలా ఓ పావుగంట అక్కడ గడిపేక -- గది కున్న ఇంకో తలుపు తీసుకుని బయటపడ్డాడు.
మళ్ళీ కాసేపు సందులు తిరిగి రోడ్డుమీదకు వచ్చాడు. కనబడ్డ అటో ఎక్కి తనక్కావలసిన అడ్రస్ చెప్పాడు. సుమారు పది నిముషాల్లో అటో అతన్నా ఇంటికి తీసుకు వెళ్ళింది.
రవి అటో దిగి మీటరు ప్రకారం డబ్బిచ్చి నాలుగడుగులు వేసి ఆ ఇంటి తలుపు తట్టాడు.
సుమారు రెండు నిముషాల అనంతరం ఆ ఇంటి తలుపులు తెరచుకున్నాయి. ఒక అందమైన అమ్మాయి సుమారు ఇరవై ఏళ్లది -- గుమ్మంలో నిలబడి ఉంది.
"మిస్ స్నేహ -- నేను లోపలకు రావచ్చునా?' అన్నాడు రవి.
ఆమె ఆశ్చర్యంగా అతని వంక చూసి "మీరెవరో నాకు తెలియదు" అంది.
"నా ప్రశ్నకు జవాబు అది కాదు. లోపలకు రావచ్చా అని అడిగాన్నేను" అన్నాడు రవి.
'అందుకే మీరెవరో నాకు తెలియదన్నాను" అంది స్నేహ విసుగ్గా.
'అయితే ఈ ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ మీకు తెలిసినవాళ్ళేనా?' అన్నాడు రవి.
స్నేహ తడబడి "లోపలకు రండి!" అంది. అతను లోపలకు రాగానే తలుపులు వేసి "ఎవరు మీరు ఎందుకు వచ్చారు?' అనడిగింది.
"నేను మీకు శత్రువును కాను. మీకేమీ అపకారం తలపెట్టను. మీతో చిన్న పనుండి వచ్చాను. పని చిన్నదైనా ప్రతిఫలం పెద్దదిగా ఉంటుంది."అన్నాడు రవి.
"మీ పేరు ?"
"పేరు కావాలనుకుంటే అశోక్ అని పిలవచ్చు" అన్నాడు రవి.
"మిస్టర్ అశోక్ -- మీకు నాతొ ఏం పని?" అంది స్నేహ.
"తెలుసుకోబోయే ముందీ ఫోటో చూడండి" అంటూ జేబులోంచి ఒక ఫోటో తీసిస్నేహకు అందించాడు రవి. స్నేహకు అందించాడు రవి. స్నేహ ఆ ఫోటో అందుకుని చూసి త్రుళ్ళి పడింది. అందులో కండలు తిరిగిన వస్తాదోకడున్నాడు. వాడి ముఖం చాలా భయంకరంగా వుంది.
"నయాన నా మాట వినని వాళ్ళ కోసం ఇతన్ని వాడుతుంటాను. ఆడవాళ్ళను హింసించడంలో తన గుండె ఎందుకు జలదరిస్తుందో ఆమెకు తెలియడం లేదు.
"మీ దగ్గరకు వచ్చే అతి కొద్ది మందిలో శ్యాం సుందర్ కూడా ఉన్నాడు. అతన్నీ రోజు పిలవండి. బాగా రెచ్చగోట్టండి. ఇద్దరూ అనుభవాలు పంచుకోండి. నేను కాసిని ఫోటోలు తీసుకొంటాను."
స్నేహ భయంగా చూసింది. 'ఆయన్ను బ్లాక్ మెయిల్ చేయడానికా? అలాగైతే నా ప్రాణాలు పోతాయి" అంది.
"నేను బ్లాక్ మెయిలర్ని కాను. ఆఫోటోలు బ్లాక్ మెయిలింగ్ కోసం కాదు. నా పని ఏమిటో మీకనవసరం. కానీ అందువల్ల మీకే ఇబ్బంది రాదనీ హామీ ఇస్తున్నాను. నేను చెప్పినదానికి అంగీకరించక పొతే మాత్రం....." అని ఆగి 'అన్నట్లు ఆ ఫోటో ఇలా ఇచ్చేయండి. మీకు దాని అవసరం లేదనుకుంటాను" అని ఆమె దగ్గర్నుంచి ఫోటో అందుకున్నాడు రవి. "నాకు భయంగా ఉంది" అంది స్నేహ.
"భయం అనవసరం. మీకు శ్యామసుందర్ కీ ఉన్న సంబంధం ఈ ఊళ్ళో చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసును. అంత గొప్ప రహస్యం నాక్కూడా తెలుసును. శ్యామసుందర్ మీరంటే పడి చస్తాడని - అడిగినప్పుడల్లా అతనికి లొంగక పోవడమే అందు క్కారణమని కూడా నాకు తెలుసును. మీరు పిలిస్తే ఎన్ని పనులున్నా మానుకుని క్షణాల మీద పరుగెత్తుకుని వస్తాడని కూడా తెలుసు.
ఇవన్నీ నాకెలా తెలిశాయని నన్నాడగోద్దు. తెలుసుకునేందుకు ప్రయత్నించవద్దు. నా గొప్పతనాన్నర్ధం చేసుకోవడానికి మాత్రమే ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ఆతర్వాత -- నేను అన్న మాట మీద నిలబదేవాడిని. ఈరోజు తీయబోయే ఫొటోలతో నాకొక చిన్న పనుంది. ఆ పని ముగియగానే ఈ ఫోటోలు నాశనం చేయబడతాయి. ఎటొచ్చీ నన్ను మోసగించడానికి ప్రయత్నిస్తే మాత్రం -- నేనిందాక చూపించన ఫోటో ఉంది కదా అది గుర్తించుకోవాలి " అన్నాడు రవి.
"ఏమైంది మేడమ్?"
"టైర్లో గాలి లేదు" అందామె నిరుత్సాహంగా.
"మీ డ్రైవర్ లేడా?"
"లేడు. కారు నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుని వచ్చాను."
"నేను మీకేవిధంగా సహాయపడగలనో చెప్పండి."
"థాంక్స్. నాకే సాయం అవసరం లేదు. రిక్షాలోనో, టాక్సీ లోనో ఇంటికి వెళ్ళిపోతాను. " అని "నాకో టాక్సీ పిలవగలరా?' అందామె.
"మరి మీ కారు?"
"ఇంట్లో ఎవరూ లేరు. అయన ఊళ్ళో లేరు. ఈ హాలు ప్రోపయిటర్ని రిక్వెస్టు చేస్తాను" అందామె.
అతనక్కడ్నించి కదలగానే ఆమె హాలు ప్రోప్రయిటర్ని కలుసుకుని పరిస్థితి వివరించింది. అతనామెను కలవరపడవద్దనీ కారు విషయం తను చూస్తాననీ వాగ్దానం చేసి, "ఇంటికెలా వెడతారు?' మా కార్లో డ్రాప్ చేయ మంటారా?' అన్నాడు.
"అవసరం లేదండి. చాలా థాంక్స్" అని ఆమె అక్కణ్ణించి బయటపడింది. బయట ఆమెకు ఇందాకా పలకరించిన యువకుడు కనపడలేదు. అదృష్టవశాత్తు అటో దొరికింది. అమెఇల్లు చేరింది.
ఆమెను చూస్తూనే వాచ్ మాన్ సలాం కొట్టి 'ఆటోలో వచ్చారేమమ్మా, కారేమయింది?' అనడిగాడు. క్లుప్తంగా అతనికి పరిస్థితిని వివరించి ఇంట్లో అడుగు పెట్టింది. ఆమె వెళ్లేసరి,కి హల్లో ఆయా ఆమె కోసం ఎదురు చూస్తోంది.
"బాబు నిద్ర పోయడమ్మా . మరి నేను వెడతాను అంది ఆయా.
ఆయా వెళ్ళిపోయాక తలుపులు వేసుకుందామె. అంత ఇంట్లోనూ ఇప్పుడు తనోక్కర్తే ఉంది. అయితే ఇదామెకు కొత్త కాదు. పడకగది లోకి వెళ్ళి నిద్రపోతున్న కొడుకుని చూసి ఒకసారి ప్రేమగా బుగ్గలు నిమిరింది.
ఆమెకు ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. అది ఎయిర్ కండిషన్డ్ దియేటర్ కాకపోవడంతో బాగా ఉక్కపోసిన బయట కూడా వాతావరణం ఉక్కగానే వుంది.
ఆమె టవల్ తీసుకుని బాత్ రూమ్ కు బయల్దేరింది. ఓరగా వాకిలిగా ఉన్న బాత్ రూమ్ తలుపులు తెరిచిన ఆమె తెల్లబోయింది. ఆ గదిలో ఒక యువకుడు నిలబడి నవ్వుతున్నాడు. కొద్ది సేపటి క్రితం తనకు హాలు వద్ద కనవడిన యువకుడతడే!
"ఇందాకా నా పేరు చెప్పడం ,మరిచాను . ఆయామ్ మిస్టర్ అశోక్!" అన్నాడతను నవ్వుతూ.
అతన్నీ అతని నవ్వునూ చూస్తుంటే ఆమెకు భయం వేసింది. "ఎవర్నువ్వు?' అంది కంగారుగా.
"కంగారు పడవద్దు. నావల్ల నీకే ప్రమాదమూ వాటిల్లదు. నేనిక్కడికి రావడంలో ఏ విధమైన దురుద్దేశ్యం లేదు....' అన్నాడు రవి.
'అయితే ఎందుకొచ్చావ్?" అందామె కంగారుగా.
"నువ్వు స్నానం చేసే ఉద్దేశ్యంతో లోపలికి వచ్చినట్లున్నావ్. నేను బయటకు పోతాను. నువ్వు స్నానం ముగించుకురా. తీరుబడిగా మాట్లాడుకుందాం" అన్నాడు రవి.
