Previous Page Next Page 
డాళింగ్ పేజి 22

 

    ఆ యాడ్ ఫిల్మ్ మోడల్ మాధురి. మాధురి సినిమాల్లోకి రావటానికి ముందు , తమ ప్రొడక్ట్స్ కి మోడల్ గా ఎంపిక చేసుకుని ఆమె మోడల్ కావడానికి ఎంకరేజ్ చేసింది ఆ కంపెనీ ఎమ్ .డి. మాదురి తండ్రికి ఒకప్పుడు శిష్యుడు.
    ఆ మొహమాటం వల్ల సినిమాల్లో బిజిగా వున్నప్పటికీ ఆ యాడ్ ఫిల్మ్ లో 'యాక్టు' చెయ్యడానికి ఒప్పుకుంది మాధురి.
    కృత్రిమంగా ఏర్పాటు చేసిన జలపాతం దగ్గర ఓ బండరాయి మీద కూర్చుని ఆ సబ్బుతో సుతారంగా భుజాలు రుద్దుకునే దృశ్యం షూటింగ్ తీయాల్సిన దృశ్యం.
    తెల్లటి పాలవెన్నెలలాంటి చీరతో ఆ బండరాయి మీద కొచ్చి కూర్చుంది మాధురి.
    అప్పటికే ఆ దుస్తులు తడి తడిగా వున్నాయి. షవర్ ని తీసికొచ్చి మాధురి వంటిమీద ఒకసారి చిలకరించి బాయ్ వెళ్ళిపోయాడు.
    ఒకసారి 'జలపాతంలో ' తడిసి బండరాయి మీద కూర్చున్నట్లు యాడ్ ఫిల్మ్ చూసే ప్రేక్షకుడికి ఆ దృశ్యం తెరమీద కనిపిస్తుంది.
    "యాక్షన్....."
    కెమెరామెన్ అరిచాడు.
    మాధురి నెమ్మదిగా ఆ బండరాయికి ఇంకొక పక్క పొందికగా అందంగా వున్న వెండి సోప్ బాక్స్ లోంచి "సిల్వర్ ఫ్రెష్" సోప్ ని తీసుకుంది. భుజాల మీదకు ఆమె చేతులు వెళ్ళాయి.
    మాధురి భుజాల మీద, సబ్బుబిళ్ళ అటూ ఇటూ నెమ్మదిగా తిరుగుతోంది.
    అంతలోనే పక్కనుంచి నురుగు ఎఫెక్టు కోసం సిద్దంగా వున్న బాయ్ చేతిలోని 'డిటర్జంట్ "సోప్ , నురగని ఆమె భుజాల మీదకు విసిరాడు ఆ సమయంలో కెమెరా మాధురి కళ్ళల్లోని స్నానపు తన్మయత్వాన్ని జూమ్ లో చిత్రీకరిస్తోంది ........వెంటనే జూమ్ నురుగు మీద కొచ్చింది.
    మాధురి భూజాల నిండా నురుగు ......నురుగు.......
    అంతా ఆర్టిఫిటీక్ రిమాలీ.
    అవ్వే యాడ్ ఫిల్మ్స్.
    తను అనుకొన్న ఎఫెక్టు వచ్చినందుకు యాడ్ పోటోగ్రాఫర్ కళ్ళల్లో అనందం తొక్కిసలాడుతోంది.
    స్టూడియోలోని ఆ ఫ్లోరంతా చీకట్లో వుంది. ఒక్క కృత్రిమ జలపాతం ఏర్పాటు చేసిన ప్రదేశం తప్ప.
    ఆ ప్రదేశం వెయ్యి ఓల్టుల విధ్యుత్ కాంతులతో వెలిగిపోతోంది.
    ఆ విద్యుత్ కాంతులలో మాధురి విద్యుల్లతలా మెరిసిపోతోంది. కృత్రిమ నీటి ధారతో తడిసిన ఆమె తెల్లటి దేహం మీదే అందరి దొంగ చూపులు.
    సరిగ్గా -----
    అప్పుడు ఆ స్టూడియో మెయిన్ గేటు లోంచి లోపలికి ఓ కారు ప్రవేశించింది. ఆ కారులో విమల్ వున్నాడు.
    పార్కింగ్ ప్లేస్ లో కారాగింది. అందులోంచి విమల్ దిగాడు.
    నెమ్మదిగా నడుచుకుంటూ ఒక్కొక్క ఫ్లోర్ ని దాటి లోనికి వస్తున్నాడు.
    అక్కడొక వ్యక్తీ విమల్ ని "విష్" చేశాడు. ఆ వ్యక్తీ వేపు చూడలేదు విమల్.
    "యాడ్ ఫిల్మ్ షూటింగ్ ఏ ప్ల్రోర్  జరుగుతోంది?" విమల్ నోటి లోంచి ఆ ప్రశ్న రాగానే, అవతలి వ్యక్తీ టక్కున జవాబు చెప్పాడు.
    "నాలుగో ఫ్లోర్ సార్......."
    "థాంక్యూ " ముందుకు నడిచాడు విమల్.
    ఒకరిద్దరు విమల్ ను గుర్తు పట్టారు. విమల్ ఆ సమయంలో అక్కడకు రావడం పట్ల విచిత్రంగా చూస్తున్నాడు.
    విమల్ నాలుగో ఫ్లోర్లో అడుగుపెట్టాడు.
    ఆ సమయంలో మాధురి పూర్తిగా తడిసిన నీళ్ళలో , అర్ధనగ్నంగా కన్పిస్తోంది. విద్యుత్ దీపాల వెలుగులో ఆ దృశ్యం మరింత ద్విగుణీకృతంగా వుంది.
    విమల్ కళ్ళకు కనిపించిన దృశ్యం అదే!
    ఒక్క క్షణం!
    కృత్రిమ జలపాతపు బండరాయి మీద కూర్చున్న మాధురి వేపు సూటిగా చూసాడు విమల్.
    అతని కళ్ళ కొలకుల్లోకి కోసం ప్రవేశించింది.
    అతని రాకను అక్కడెవరూ గుర్తు పట్టలేరు.
    గబగబా ముందుకి నడిచాడు. అతని చూపులు అక్కడున్న కెమెరా వేపు చూసాయి.
    పెనువేగంతో అటువేపు నడిచాడు విమల్. ఎడంచేత్తో కెమెరా పక్కకు తోసేశాడు. కుడిచేత్తో కెమెరామాన్ ను పక్కకు నెట్టేసాడు విసురుకు కెమెరా మాన్ దూరంగా పడిపోయాడు.
    ముందుకెళ్ళి మాధురి కెదురుగా నిలబడ్డాడు.
    అప్పుడు చూసింది మాధురి విమల్ ని.
    ఆ సమయంలో అక్కడికలా విమల్ వస్తాడని ఊహించులేదు మాధురి.
    "విమల్"
    ఆశ్చర్యంగా ఆ ప్రయత్నంగా మాధురి నోటినుంచి వచ్చిందా.
    అతని కళ్ళల్లో నిప్పులు కక్కుతున్న కోపం.
    కుడిచేత్తో , మాధురి చేతిని పట్టుకుని, బండరాయి మీద నుంచి పైకి లేపి , ఎడం కాలితో , ఆ బండరాయిని తన్నాడు. ఆ బండరాయి చప్పుడు చేస్తూ పక్కకెళ్ళిపోయింది.
    అందంగా అమర్చిన కృత్రిమ జలపాతం, క్షణకాలంలో ద్వంసం అయిపొయింది. అక్కడేవరికి ఏం జరుగుతుందో, అర్ధం కావడానికి కొంతసమయం పట్టింది.
    "విమల్ గారూ" ఎవరో అడ్డుగా , ముందుకు రాబోయారు.
    వచ్చిన అతన్ని పక్కకు తోసేసారు.
    మాధురి చేతిని పట్టుకుని, గబగబా బయటకు నడుస్తున్నాడు విమల్ ఆ ఫ్లోర్లోంఛి బయటకొచ్చాడు. వరసగా ఫ్లోర్లన్నీ దాటుతున్నాడు.అకస్మాత్తుగా విమల్, తననెందుకు అక్కడనుంచి తీసుకొచ్చేస్తున్నాడో మాధురికి అర్ధం కావడం లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS