"మొత్తానికి ముదురు సరుకే మీరంతా. ఇంతకీ ఎప్పట్నుంచి ఇలా సెకండు షోలు చూస్తున్నారు?" డ్రయివర్ అడిగాడు.
"ఓ! చాలా రోజుల్నుంచీ; సంవత్సరం నుంచీ అనుకో" సువర్చల చెప్పింది.
"ఐతే బాగా సంపాదించి వుండాలే. ఏమైనా మిగలేశారా? ఖర్చు పెట్టేస్తున్నారా?"
"సంపాదించడమేమిటీ? సినిమాలకి వెళితే డబ్బు ఖర్చవుతుందిగానీ డబ్బులెందుకు వస్తాయి?" సువర్చల అతని మాటలు అర్ధం కాక అడిగింది.
"సినిమాల్లో రావు. ఇలా రోడ్డు పక్కన నిలబడి లారీలు ఆపి చేస్తున్న బిజినెస్ లో"
కొరడాతో చరిచినట్లయింది వాళ్ళకి. అప్పటికి బోధపడింది వాళ్ళకి డ్రయివర్ తమని ఎవరనుకుంటున్నాడో వెంటనే లారీలో నుంచి కిందకి దూకేయాలనిపించింది నలుగురికి.
సువర్చల మొదట తేరుకుంది. ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని ఆమె చక చకా ఆలోచించింది.
"ఆఁ ఇక్కడే ఆపేయ్" అంది డ్రయివర్ తో.
లారీ ఆగింది.
సువర్చల చివరన దిగుతూ.
"డ్రయివరూ! అదిగో ఆ అడ్డదారంట తూర్పుకి నడిచి వచ్చెయ్. అక్కడ ఓ పాడుబడిన ఇల్లుంది అందులో వుంటాం" అని ఒక్క గెంతులో దూకింది.
నలుగురూ ముళ్ళల్లో, తుప్పల్లో ముందుకెళ్ళి పడమరగా హాస్టల్ కి చేరుకోవడానికి పరుగెత్తారు.
మరో పదినిముషాలకి హాస్టల్ కి చేరుకున్నా అప్పటివరకు కలిగిన భయం మాత్రం తగ్గలేదు.
డ్రయివర్ తాము పరుగెత్తిన దిశను కనిపెట్టి హాస్టల్ కి వచ్చేసినట్లే అనిపించింది. అతను వార్డెన్ గది తలుపు తడతాడు. వార్డెన్ తలుపు తీస్తుంది. ఆమెను పైనుంచి కింద వరకు ఓసారి చూసి, "అరె! యెప్పుడు ఓపెన్ చేశావు ఇంత పెద్దకొంపని భలే భలే పిల్లలున్నారే! ఈ రూట్లో చాలాసార్లు వెళ్ళానుగానీ ఇంత మంచికొంప ఇక్కడున్నట్లు తెలీదే" అంటాడు.
ఖర్మ. వార్డెన్ అతి మేకప్ లో అచ్చు అలానే కనిపిస్తుంది. ఇలా ఊహిస్తుండడం వల్ల వాళ్ళ నలుగురికి తెల్లారేవరకు కునుకురాలేదు.
అదిగో ఆరోజునుంచి సెకండు షోలకి వెళ్ళడం బాగా తగ్గింది. అదంతా ఇప్పుడు గుర్తువచ్చి సూర్యాదేవి పెదవులు నవ్వుతో తెల్లకలువల్లా విచ్చుకున్నాయి.
ఏదో చేయాలన్న ఆవేశం ఆమెని అక్కడి నుంచి లేపింది. బాత్ రూమ్ కి వెళ్ళి స్నానం చేసింది. లైట్ గా సెంట్ స్ప్రే చేసుకుని లైట్ నైటీ వేసుకుంది.
జగదీష్ అప్పటికి లెక్కలు వేసుకుంటున్నాడు. అతని ముందు వెళ్ళి మోకాళ్ళమీద కూర్చుని, "ఇటు చూడండి" అంది.
బ్రాలేని ఆమె ఎద తెల్లగా మెరిసిపోతోంది కోరికను కూరడంవల్ల ఆ ప్రాంతమంతా మరింత ఎత్తుగా కనిపిస్తోంది. అతను తల పైకెత్తాడు.
"మీరు రాక తప్పదు. డాబామీదకు వెడదాం"
ఇక వెళ్ళిపోవడం కుదరదని తెలిసిపోయింది అతనికి. అన్నిటినీ పక్కకు సర్ది పైకి లేచాడు.
ఆమె అతనికి భుజానికి తల ఆనించింది. దాంతోపాటు చాలా అవయవాలు అతనికి ఒరుసుకుంటున్నాయి. ఆ ఒరిపిడిలోంచి కోరిక పైకెగుస్తున్నట్లు వెచ్చవెచ్చగా తగులుతోంది.
ఇద్దరూ డాబా మెట్లెక్కారు.
వెన్నెల కొలనులా వుంది డాబా.
"అదిగో ఆ మూల కూర్చుందాం" ఆమె చేయి పెట్టి చూపించింది.
ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు.
ఇక తామిద్దరి మధ్యా దూరాన్ని ఓపలేనట్లు ఆమె అతని తొడమీద తలపెట్టి పడుకుంది.
"ఇప్పుడు మీకేమనిపిస్తోంది చెప్పండి. అబద్దం చెప్పకూడదు" అని అడిగింది.
అతను ఓ క్షణం తటపటాయించి చివరికి నిజం చెప్పాలని నిర్ణయించుకుని "మరో పదినిముషాలు ఆగివుంటే ఎస్టిమేట్లు ప్రిపరేషన్ అయిపోయి వుండేదిగదా అనిపించింది" అన్నాడు.
"ఆ గొడవిక మరిచిపోండి. 'కారే రాజుల్ రాజ్యముల్ ఏళలరే...... వారేరీ సిరిమూట గట్టుకుని పోవన్ జలరు వుర్విపై' అని ఓ కవి అన్నాడు. ఇదిగో ఇలాంటి అనుభవాలే చనిపోయేటప్పుడు బుర్రలో మెరిసేవి. చలం పుస్తకాలు ఎప్పుడయినా చదివారా?"
"ఊహూఁ లేదు"
"ముందు అవి చదవండి.... ముందు అటు చూడండి చందమామ మనకోసమే అక్కడున్నట్లుంది. ఈ వెన్నెల మనసు మరో మనసుకు పెనవేసుకోవాలని తొందర పెడుతోంది" అంటూ ఆమె అతని తలని రెండు చేతులతోనూ వంచి, తన ఎదపై వుంచుకుంది.
"అబ్బ ఊపిరాడడం లేదు" అతను గింజుకోవడంతో ఆమె పట్టు సడలించింది.
"చీకతంతా చందమామను చూసి జడుసుకుని నా కనుపాపల్లో దాక్కున్నట్లు లేదూ" అంటూ సూర్యాదేవి జగదీష్ అరచేతిని తన కళ్ళమీద వుంచుకుంది.
"ఇక నా ముక్కులాంటి అందమైన ముక్కు మార్లిన్ మన్రోకు వుండుంటే మరింత ఫెంటాస్టిక్ గా కనిపించేది ఏమంటారు?" అని ఆమె అతని చేయిని మెల్లగా కిందకు జార్చుతోంది.
"నాకంఠం సొగసు చూశారా? మన్మధుడి అంబుల పొదలా వుంది"
అతని చేయి మరింత కిందకు పాకుతోంది. "నా ఎద సొంపుల్ని గమనించారా? పూలబరువుకి విప్పారిన మల్లెపొదలా వుంది. ఇంకాస్త కిందికి దిగితే మన్మథ సామ్రాజ్యానికి వేసిన పగడాలతో పొదిగిన దారిలా నా నడుం.
అంతవరకే నిలిచిపోదాం. మిగిలినదంతా నిషిద్ద ప్రదేశమని సూచిస్తూ వేలాడకట్టిన బోర్డులా ఈ బొడ్డు అడ్డు తగులుతోంది"
అతని చేతిని అక్కడే అదిమిపెట్టింది.
"ఆ తరువాత ఎక్కడో కనిపిస్తున్న నా పాదాల్ని ముద్దుపెట్టుకోరూ! వెండిగజ్జెల్ని అలంకరించుకున్నట్లుంది. మీ వేడిశ్వాస అక్కడ రగులుతుంటే" అంది సూర్యాదేవి.
అతను వెంటనే రియాక్టయిపోయాడు. "ఛీ ఛీ! అక్కడ ముద్దు పెట్టుకోమంటావా? స్త్రీల పాదాల్ని మగవాళ్ళు తాకితే ఆయుష్షు క్షీణిస్తుందట. నావల్లకాదు" అని ఉడుక్కున్నాడు.
"నడుంవంచి ముద్దుపెట్టుకోవడానికి బద్దకమేసినవాడు ఎవడో అలా చెప్పి వుంటాడు. పోనీలే ఇలా రారా" అని మరోమారు అతని తలను చేతుల్లోకి తీసుకుంది సూర్యాదేవి.
అతను ఉలిక్కిపడ్డాడు. "భర్తను అగౌరవంగా రారా పోరా అని పిలవకూడదు- దేవతలు శపిస్తారట" అన్నాడు బుజ్జగింపు ధోరణిలో.
"భర్తను రేయ్ అని పిలిచే సమయం, చనువూ రాకపోతే ఆ దంపతుల మధ్య ఏమీ అనురాగం లేనట్లు లెక్క ఎందుకనో ఈ క్షణంలో నిన్ను ముద్దుగా ఒరేయ్ అని పిలవాలనిపిస్తోంది" అంది.
అతను మౌనంగా వుండిపోయాడు.
