Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 20


    అతను ఆమె ముఖం మీదికి వంగి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు.
    
    "ఫరవాలేదే ముద్దు పెట్టుకోవడం నేర్చుకున్నారే" అంది మెరుస్తున్న కళ్ళతో.
    
    అతను నవ్వుతూ పేదలని కిందికి దించాడు.
    
    ఆమెకి చక్కిలిగింత లాంటిది కలిగి, ఆపై సుఖంలో అది మరుగున పడిపోయింది.
    
    అతను పెదవులతో కంఠాన్ని తడిమి, ఆపై స్కిప్ అయిపోయి నడుం మీద నోటిని వుంచాడు.
    
    అలా స్కిప్ చేయకూడదని చెప్పాలనిపించింది ఆమెకి. కానీ ఆడపిల్ల అంత డైరెక్టుగా ఎలా చెప్పగలదు? 'మీరు స్కిప్పింగ్ చేసే వారా వ్యాయామం కోసం?' అనడిగింది.
    
    అప్పుడు అలాంటి ప్రశ్న ఎందుకేసిందో తెలియని అతను "లేదే" అన్నాడు.
    
    "మరి కంఠం నుంచి నడుం దగ్గరికి వెళ్ళిపోయారే. స్కిప్పింగ్ అంటే బొత్తిగా ఇష్టంలేదు నాకు"
    
    అతనికి కొంత అర్ధమైంది.
    
    తన తప్పును సరిదిద్దుకోటానికి పెదాల్ని పైకెత్తాడు.
    
    "కళ్ళ మీద ఏ ఆచ్చాదనా లేదు. వాటిమీద డైరెక్ట్ గా ముద్దు పెట్టారు కదా అలానే అక్కడ కూడా..." అని ఆపింది.
    
    జాకెట్ హుక్ లు కూడా ఎక్కడుంటాయో అతనికి తెలియదు. అందుకే ఆమెను అటూ ఇటూ తిప్పాడు. అతని అదృష్టం కొద్దీ అవి ముందున్నాయి.
    
    "హుక్ లు విప్పడం కూడా ఒక కళే మరి ట్రై చేయండి" అంది శ్రీనిజ.
    
    అతను మరో పదినిముషాలకి విజయం సాధించాడు. 'సగం సాధించాను' అనుకుంది.
    
    అతను తమకంతో అమృతాన్ని జుర్రుకుంటున్నాడు. ఆమె అరమోడ్పు కన్నుల మధ్య సుఖాన్ని ఫీలవుతోంది. పూర్తి అనుభవం కోసం తహ తహలాడుతోంది. అయితే అతను మాత్రం అంతకు మించి ఏమీ చేయలేకపోతున్నాడు. మిగిలిన వివరాలు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది.
    
    "మనం ఒక ఆట ఆడదామా?" అతని మాటలకి ఆమె కళ్ళు తెరిచి ఏమిటన్నట్లు చూసింది.
    
    "నేను కళ్ళు మూసుకుని ముద్దులు పెట్టుకుంటాను ఉదాహరణకి మొదట కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటాను. కళ్ళ మీదే కరెక్టుగా ముద్దుప్వ్ట్టుకుంటే నువ్వు 'ఒప్పు' అనాలి. కళ్ళ మీద కాకుండా పక్కన పెట్టుకుంటే 'తప్పు' అనాలి. యిది ఆఫ్ యియర్లీ ఎగ్జామ్ అన్న మాట నాకు"
    
    "లెక్చరర్ బుద్ది పోనిచ్చుకున్నారు కాదు"
    
    "ఆఁ మరి మొదలుపెట్టనా"
    
    "ఓకే"
    
    అతను పాపిట మీద ముద్దు పెట్టుకోటానికి వంగాడు. కానీ కొంత ఎడమవేపు జరిగాడు.
    
    "తప్పు" అంది.
    
    ఈసారి నుదుటిమీద కరెక్ట్ గానే పెదవులను అద్దాడు.
    
    "ఒప్పు"
    
    అతను విజయగర్వంతో నవ్వాడు.
    
    ఈసారి కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. చివరి కొచ్చేసరికి ఐదు తప్పులు, నాలుగు ఒప్పులూ తేలాయి.
    
    'బొటాబొటిగా పాసయ్యానన్నమాట' అని కాసేపాగి ఏదో చిలిపి ఆలోచన వచ్చినట్లు చిన్నగా నవ్వి 'మరి నువ్వు లెక్చరర్ అయివుంటే ఏం అడిగేదానివి?' అని ప్రశ్నించాడు.
    
    ఆమె ఓ క్షణంపాటు కళ్ళు టపటపలాడించి 'నేనయితే ఒకే ప్రశ్న అడుగుతాను. అదేమిటంటే దిగువ ఇచ్చిన ఖాళీని పూరించుము అంటాను' అంది.
    
    అతనికి ఏదో అర్ధమయింది.
    
    పూర్తి అనుభవాన్ని ఆమె చవిచూసింది.
    
                                                            *    *    *    *    *
    
    కైవల్య చెప్పడం ఆపిందిగానీ సుజన మాత్రం నవ్వాపలేదు.
    
    "శ్రీనిజ తెలివిగా తనకు కావల్సింది సాధించుకుంది. మొత్తానికి చెడ్డ ఇబ్బందే వచ్చిపడింది ఆమెకి. కానీ ఈ కాలంలో అలాంటి కుర్రాళ్ళు తక్కువే అనుకుంటాను" అంది ఆమె నవ్వును బలవంతంగా ఆపుకుంటూ.
    
    "నిజమే టి.వి.లు, సినిమాలు, పుస్తకాలు ఇవి ఎంతో కొంత నాలెడ్జిని ఇస్తున్నాయి. అతను చిన్నప్పట్నుంచీ స్త్రీలకు దూరంగా పెరగడం వల్ల పూర్తిగా చీకటిలో వుండిపోయాడనుకుంటాను ఇప్పుడిద్దరూ చక్కగా కాపురం చేసుకుంటున్నారు"
    
    "తొలిరేయి అనుభావానికి ఇద్దరూ కొత్తయి ఉంటే ఆ దాపత్యం చాలా రోజుల వరకు సజావుగా సాగుతుందని ఎక్కడో చదివాను"
    
    "చాలా జంటల్లో కాపురం సజావుగా జరగకపోయినా, భార్యా - భర్తలిద్దరూ రాజీ పడిపోతారు. పెళ్ళయిన కొత్తలో దంపతులు ఎక్కువగానే పోట్లాడుకుంటూ వుంటారు. కాలం గడిచేకొద్దీ ఇద్దరూ రాజీపడి పోవడానికి అలవాటు పడిపోతారు.
    
    రాజీ పడిపోవడానికి ఒకసారి అలవాటైతె ఎంత హీనస్థితి కైనా మనిషి దిగజారిపోతాడు. ఇందుకు నా ఫస్ట్ నైట్ మంచి ఉదాహరణ"
    
    "ఏం జరిగింది ఫస్ట్ నైట్ రోజున?" ఎగ్జయిట్ మెంట్ తో అడిగింది సుజన.
    
    మరొకరి ఫస్ట్ నైట్ గురించి తెలుసుకోవాలని మనకెంత ఉత్సాహము వుంటుందో, అదంతా చెప్పాలని ఎదుటి వ్యక్తికి వుంటుంది.
    
    అందుకే కైవల్య కూడా తన శోభనం గురించి చెప్పాలని నిర్ణయించుకుంది.
    
    కుర్చీలో సర్దుకుని కూర్చుంది.
    
    చివరి సూర్యకిరణాలు ఆమెమీద పడుతుండంవల్ల కైవల్య అందం మరింత మెరిసిపోతోంది.
    
    ఆమె మీదకు ఒంగిన ఓ సూర్యకిరణం తల మధ్యలో పాపటి బిళ్ళలా సాగి, ముక్కు మీద ముక్కెరలా తళుక్కున మెరిసి, పెదవులకు ఎరుపురంగు పూసి, కంఠం మీద నెక్లెస్ లా పరావర్తనం చెంది, ఇక అక్కడనుంచి సరళరేఖలా పూసి, కంఠం మీద నెక్లెస్ లా పరావర్తనం చెంది, ఇక అక్కడనుంచి సరళరేఖలా కిందకు దిగి, బొడ్డును బంగారపు గనిలా ప్రకాశింపజేసి, ఆ మీదట చీరకుచ్చిళ్ళలో దూరి, సిగ్గుబిళ్ళలా అమరి, ఆపై సిగ్గుతో అంతర్ధానమవుతోంది.        
    
    "మనకు ఏదయినా సమస్య ఎదురయినప్పుడు మనమంతా కామన్ గా చేసేది - దానితో రాజీపడిపోవడం ఈ రాజీపడిపోవడమనేది ఎంత భయంకరంగా వుంటుందో విను" కైవల్య ఆగింది.
    
    ఇదంతా అసలు సంగతికి ఉపోద్ఘాతమని తెలియడం వల్ల ఏమీ కామెంట్ చేయకుండా మౌనంగా ఉండిపోయింది సుజన.
    
    కైవల్య తిరిగి ప్రారంభించింది.
    
    "మా ఊరు నగరి దగ్గరగా వున్న పల్లెటూరు. ఆ వూర్లో మాకు చిల్లర దుకాణం వుండేది. ఆ ఊరికంతా మాదే అంగడి కావడం వలన బాగానే జరిగేది. కానీ నాన్నకు పేకాట పిచ్చి ఊరిలో ఏ పనీ - పాటాలేని వాళ్ళు సరదాగా ప్రారంభించిన ఆట చివరికి వ్యసనంగా పరిణమించింది.
    
    మా నాన్నకూ ఆ వ్యసనం పట్టుకుంది. పల్లెటూరు కాబట్టి డబ్బు లెక్కువగా పెట్టి ఆడేవాళ్ళు కాదు కానీ మా నాన్నలాంటి వాళ్ళకు అది ఎక్కువే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS