Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 19


    పదిహేను నిముషాల సేపు చిత్రం నడిచింది. తర్వాత సినిమా అయిపొయింది. గదిలో లైటు వెలిగింది. తలుపులు కూడా తెరుచుకున్నాయి.
    "మీరిప్పుడు స్పెషల్ రూమ్ పన్నెండుకు వెళ్ళాలి -- ' అన్నాడు బయట ఉన్నతను.
    చూసిన చిత్రం నా శరీరంలో విపరీతమైన వేడిని పుట్టించింది. మనసుకు ఎనలేని ఉద్రేకాన్ని కలిగించింది. స్పెషల్ రూమ్ పన్నెండు చేరుకున్నాను.
    గది ముందు ఒకతను ఎదురుచూస్తున్నాడు.
    "మీరే కదూ మిస్టర్ భాస్కర్!" అన్నాడు నన్ను చూస్తూనే.
    'అవును -- " అంటుండగానే తలుపులు తీశాడు. నేను లోపలకు వెళ్లాను. అతనూ వచ్చాడు.
    "ఇది ఒక ప్రత్యెక యంత్రం. దీని సహాయంతో మీరు హోటల్ వెలుపల ఏం జరుగుతున్నదీ చూడగలరు -- " అతను ఆ యంత్రంలోకి చూసి -- ఏదో మీటను అడ్జస్ట్ చేశాడు. "----ఇప్పుడీందులోంచి చూడండి-- మీరు కోరిన అమ్మాయి రిసెప్షనిస్ట్ తో మాట్లాడుతుంటుంది-- ఆమె ఏం చేస్తుందో చూడండి--" అన్నాడు.
    నేనా యంత్రం లోకి చూశాను-- సినిమా తెర మీది చూసిన విధంగా శాంతి కనబడింది. నాకు గంగ వెర్రులెత్తి నట్లయింది. ఇప్పుడు నా మనసులో వేరే ఆలోచనలు లేవు. నా శరీరం శాంతిని కోరుతోంది. తీవ్రంగా కోరుతోంది. కొద్ది నిముషాల క్రితం చూసిన చిత్రం కళ్ళ ముందు మెదుల్తూనే ఉంది.
    శాంతి రిసెప్షనిస్ట్ తో మాట్లాడేక వెళ్ళి అక్కడున్న సోఫాలో కూర్చుంది. ఒక్క పిగురు అసహనంగా కనబడింది. చాలా చక్కని బట్టలు కట్టుకుంది శాంతి.
    ఇంతలో హుందాగా ఉన్న ఓక నడి వయస్కురాలు వచ్చి శాంతి పక్కన కూర్చుంది. ఇద్దరూ ఏమేమిటో కబుర్లు చెప్పుకుంటున్నారు. బహుశా అయిదు నిమిషాల సేపు వాళ్ళలా మాట్లాడుకున్నారనుకుంటాను. తర్వాత అ నడివయస్కురాలు లేచింది. యంత్రంలో అంధకారం అలముకుంది.
    జరిగింది చెప్పాను నేను అక్కడున్న అతనితో.
    "బయల్దేరండి మీరు. మీరు కోరిన అమ్మాయిప్పుడు వెయిటింగ్ రూమ్ నంబరు 24 కు వెళ్ళిందన్న మాట. అక్కడ ఆమె సైకలాజికల్ గా మీలాగా తయారవుతుంది. అక్కణ్ణించి బయల్దేరి అండర్ గ్రౌండ్ రూమ్ నంబర్ పదిహేడు కు వస్తుందామె. మీరు ఎదురుగా వున్న అద్దాల గదిలో నిలబడితే ఆమె గదిలోకి వెళ్ళడం కనబడుతుంది. ఆమె వెళ్ళేక రెండు మూడు నిముషాలాగి మీరూ వెళ్ళవచ్చు . తర్వాత -- "అంటూ -- ముసి ముసి నవ్వులూ నవ్వాడతను.
    "థాంక్యూ వస్తాను!' అంటూ బయల్దేరబోయాను.
    "ఒక్క ,మనవి -" అన్నాడతను. "ఇది సొసైటీ లో హైక్లాసు కు సంబంధించిన విషయం. మేమెంతో కష్టపడి ఒక అమ్మాయిని మీకోరికల కనుగుణంగా బ్రెయిన్ వాష్ చేశాము. అందువల్ల మీరేం మాట్లాడినా గదిలో ఆ అమ్మాయి చేత ఎక్కువగా మాట్లాడించడానికి ప్రయత్నించకండి. "అని అండర్ గౌండ్ గదికి వెళ్ళవలసిన దారి చెప్పాడు.
    అండర్ గ్రౌండ్ రూమ్ నంబర్ పదిహేడు కు ఎదురుగా ఉన్న టెలిఫోన్ బూత్ లాంటి అద్దాల గదిలోకి వెళ్ళాను. దూరంగా ఎవరో స్త్రీమూర్తి రావడం కనిపించింది. దగ్గరవుతోంది. ఆమె శాంతి! మసక చీకట్లో ఆమె మరింత అందంగా కనబడుతోంది. ఆమె సరాసరి గది దగ్గరకు వెళ్ళి తలుపులు తోసుకుని లోపలకు వెళ్ళింది. మళ్ళీ తలుపులు వేసుకున్నాయి.
    నా మనసు తొందర పడుతోంది. శరీరం ఉద్రేక పడుతోంది.
    ఇంతలో ఎవరో వచ్చారు . అతను -- "క్షమించాలి . ఒక పర్యాయం మిమ్మల్ని చెక్ చేయావలసి ఉంది"అన్నాడు.
    "ఎందుకు?" అన్నాను చిరాగ్గా.
    "మీ పాకెట్స్ లో బ్యాటరీ లైటు. మినీకేమేరా వగైరా వస్తువులేమైనా ఉంటే తీసుకునేందుకు" అన్నాడతను.
    "కనీసం సిగారట్ లైటర్ కూడా లేదు. చెక్ చేసుకో వచ్చు" అన్నాను.
    అతను చెక్ చేసుకుని "విష్ యూ బెస్టాఫ్ లక్ !" అని సంతృప్తిగా తలాడించి వెళ్ళిపోయాడు.
    నేను నెమ్మదిగా 17 వ నంబరు గదికి కదిలాను. ఎన్నడూ చేయని పని చేస్తున్నాను. ఇప్పుడు నా మనస్సులో శర్మ గురించిన సవాల్ బెంగ లేదు. శాంతి నాదికావాలి. అపర స్వర్గంలో నా తనువూ,మనసూ తేలిపోవాలి.
    తలుపులు తెరచుకుని లోపల అడుగు పెట్టాను.
    శర్మ నెగ్గాడు. నేనోడి పోయాను.
    అనుభవించిన అనుభవాల మత్తులో నేనుచిన్న కునుకు కూడా తీసినట్లున్నాను. మెలకువ వచ్చేసరికి టైము ఒంటిగంటం పావయింది. శాంతి వెళ్ళిపోయింది.
    గదిలోంచి బయటకు వచ్చాను. పరుచయమైన దారి గుండా రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాను.
    "కౌంటర్ నంబర్ 9 కి వెళ్ళండి!" అందామె.
    వెళ్ళాను "మూడు వందల డెబ్బై రెండు రూపాయలు" అన్నాడతను.
    నాలుగు వంద రూపాయల నోట్లిచ్చాను. అందుకుని ఒక గ్రీన్ కార్డు ఇచ్చాడు. "ఇది అయిడింటిఫికేషన్ కార్డ్!" అన్నాడతను. "మళ్ళీ వచ్చినప్పుడు ఈ కార్డే మిమ్మల్ని పరిచయం చేస్తుంది. మీ పేరు మా కస్టమర్స్ లో నమోదైంది. వుయారాల్వేస్ యట్ యువర్ సర్వీస్."
    "థాంక్యూ !" అన్నాను.
    "చిన్న రిక్వెస్ట్ మిస్టర్ భాస్కర్! మిస్ శాంతి ని మీరిక మరిచిపోవాలి. ఏ పరిస్థితుల్లో నూ ఆమెను మీరు మా హోటల్లో కలుసుకున్నట్లు ఆమె వద్ద అనరాదు. బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించరాదు. ఎన్నో గ్యారంటీల నిచ్చిన మీదటే ఆమెను మేమిందుకు ఒప్పించగలిగాం. మీకూ ఆమెకూ పరిచయ ముందన్న విషయం మరెవ్వరి వద్దా చెప్పకూడదు మీరు. ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం మరి." అన్నాడతను.
    'అలాగే" అని అక్కడ్నించి బయటపడ్డాడు. మధుర మైన తలపులతో.
    

                                     6
    దొంగను శిక్షిస్తే ఎవ్వరికీ పెద్ద బాధగా ఉండదు. కానీ నిర్దోషి ని దండిస్తే బాధగానే ఉంటుంది. సహజంగా తప్పు కలవాటు పడనీ నేను అమాయకురాలూ సహృదయురాలూ అయిన స్త్రీకి అన్యాయం చేశానని బాధపడసాగాను. ఇప్పుడు సీమా ప్రేమలో నాకు కొత్త అమాయకత్వం కనిపిస్తోంది. విశేషానురాగం కనిపిస్తోంది. ఇవి నన్ను బాధిస్తున్నాయి.
    ఇటువంటి మానసిక స్థితిలో ఉన్న నేను ఆలోచనల్లో మరో కొత్త పధం తోక్కుతానని ఎన్నడూ అనుకోలేదు.
    "సృష్టిలో వున్న ఏ ఆడదాన్నయినా నీకు స్వంతం చేయగలను. నువ్వు చేయవలసిందల్లా సరైన వివరాలివ్వడమే "అన్నాడు శర్మ. హోటల్ మేనక గురించి మాట్లాడుతూ , అది సవాల్ చేయడం కోసం నేను శాంతిని కోరాను. శర్మ నెగ్గాడు.
    ఎందుకో నాకు భయం వేసింది. సీమా అందంగా వుంటుంది. ఏ మగవాడి దృష్టయినా ఇలాగే మా ఆవిడ మీద పడి మేనకకు వెడితే?
    శాంతి ముఖం చూస్తుంటే ఆమె అటువంటిదనిపించదు. స్వానుభవం లేకపోతె ఆమె గురించి ఎవరైనా ఏమైనా కల్పించి చెప్పినా నేను నమ్మక పోదును. అందువల్ల ముఖం చూసి మోసపోరాదు. అయినా వాళ్ళు కోరుకున్న ఆడదాన్ని ఎలా యీ పనికి అంగీకరింప జేస్తున్నారో నా బుర్రకు అవగాహన కావటం లేదు.
    ఆలోచించిన కొద్దీ నా బుర్ర తిరుగాసాగింది.
    ఏం చేయాలో తెలియడం లేదు. ఏదో మార్గం చూడాలి దీనికి.
    మేనకా హోటల్లో శర్మ చెప్పిన వ్యవహారం జరగడం లేదని నమ్ముదామంటే శాంతి ప్లస్ నేను అందుకు సాక్ష్యంగా . ఇంక మరొక్క మార్గమే వుంది. అది సీమ పవిత్రమైనదని నమ్మడం. అది నమ్మాలంటే గట్టి పరీక్ష అవసరం. ఎలా పరీక్షించడం?
    ఎలా పరీక్షించడం? ? సీమ దగ్గర ఆ హోటల్ వాళ్ళ ఎత్తులు సాగవని ఎలా దృవపరచుకోవడం?
    హటాత్తుగా బుర్రలో  ఏదో మెరిసింది. అదే మార్గం. నా సమస్య లన్నింటికీ అదే పరిష్కార మార్గం. హోటల్ మేనకా పటిష్టమైన పధకాలతో నడపబడుతూండవచ్చు. కానీ సీమ వంటి ఆడవాళ్ళ దరిదాపులకు కూడా వాళ్ళు రాలేరని నేను రుజువు చేసుకోవాలి.
    లేచి నిలబడ్డాను.
    "ఈ ఫోటో మన బెడ్రూం లోకి మార్చేస్తున్నాను సేమా!" అన్నాను. డ్రాయింగ్ రూమ్ లో వున్న మా పెళ్ళి నాటి ఫోటో ను తీస్తూ.
    "ఎందుకండీ --"అంది సీమ.
    "డ్రాయింగు రూం లోకి కొత్త పోటో  తీయించుకున్నాక పెడదాం. అయినా డ్రాయింగు రూంలో మన ఫోటో లేకపోతేనేం లే" అన్నాను.
    "మీ ఇష్టమే నా ఇష్టం -- ' అంది సీమ.
    డ్రాయింగ్ రూం లో కొద్దిగా మార్పులు చేశాను. ఎక్కడా నా గురించిన ఆనవాలు లేకుండా చేశాను. నా పేరు, ఆఫీసు వివరాలు వగైరా లేవీ అక్కడ లభించకుండా చేశాను.
    "సీమా ఎవరైనా అపరిచయస్తులొచ్చి నిన్ను పలకరించారానుకో -- సాధ్యమైనంతవరకూ నా ప్రసక్తి రానీయకు. ఒకవేళ తప్పనిసరై పేరు చెప్పినా నా ఆఫీసు అడ్రసు మాత్రం ఇవ్వకు. నేనెక్కడ ఉద్యోగం చేస్తున్నానో తెలియదని చెప్పేయ్. ఏ పరిస్థితుల్లోనూ నా ఫోటో మాత్రం చూపించకు . ఈ విషయం మర్చిపోకు సుమా!" అన్నాను . సీమ తలూపింది. ఆశ్చర్యపోతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS