"నా పేరు రాజా. చాలామంది నన్ను డిటెక్టివ్ రాజా అని కూడా అంటారు. ఒక విచిత్రమైన పోలీసు కేసు విషయంలో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడగవలసి ఉంది. అందుకే నాతొ రమ్మంటున్నాను -" అన్నాను.
10
"అరె! శాంతమ్మగారు " అన్నాడు ప్రసాద్.
"వీడెవరో మీకు తెలుసా ?" అనడిగాను.
"బహుశా మీ ఇంట్లో పని కుర్రవాడనుకుంటాను -" అందామె.
నేను అసహనంగా పళ్ళు పిండుకున్నాను. ఆమె శాంతయే నని క్షణక్షణానికి నాకు రూడి అవుతోంది. అదే నిజమైతే ఏదో ఒక మిస్టరీ ఉంది. అది నేను సాధించాలంటే ఈమెను కూడా విచారించాలి - ఎలాగో అలా తానె శాంత అని ఆమె చేత చెప్పించాలి. ఆమెను పూర్వం శాంత ఉండే గదిలోనికి తీసుకు వెళ్ళాను. అక్కడ పెట్టెలో నుంచి శాంత ఒదిలి వెళ్ళిన జాకెట్ గొలుసు - "ఇది శాంత కోసమని నేను కొన్నది. మొదటిసారి ఈ గొలుసు నేను తెచ్చినపుడు ఆమె స్వయంగా నన్నే అలంకరించమంది --" అని నేనామెను సమీపించి ఆమె మెడలో ఆ గొలుసు అకంకరించాను. ఆమె వణుకుతోంది.
"మీ పేరు శాంత కాదు. అయినా కొంత కాలం పాటు మిమ్మలని "శాంతా' అనే పిలుస్తాను. శాంత నాతో ఏమందో తెలుసా - మనం కాబోయే భార్య భర్తలం . అందుకే మీకు నేను నువ్వు నాకు మీరు మీరు - ' అంది. అందుకే నేను మిమ్మల్ని నువ్వు అని పిలుస్తాను." అన్నాను. గద్గద మవుతున్న నా గొంతును సరి చేసుకునేందుకు ప్రయత్నిస్తూ - "శాంతా! నువ్వు నాతొ ఉంది కేవలం నెలరోజులు మాత్రమే అయినా నన్ను పూర్తిగా నీవాడిని చేసుకున్నావు. నేను నిన్ను గుర్తు పట్టాను. అందుకే పోలీసుల పేరుతొ భయపెట్టి నా దగ్గరకు తీసుకొచ్చాను. నా కళ్ళముందు జరిగిన నీ ఆత్మహత్య వెనుక ఏ రహస్యమైనా ఉండనీ అదేమిటని నేను నిన్నడగను. కానీ శాంతను కాదని మాత్రం అని నా గుండెలు బ్రద్దలు చేయకు -" అంటూ నేనామెను ఆవేశంగా దగ్గరగా తీసుకున్నాను.
"వదలండి ' అంటూ ఆమె నన్ను విదిలించుకుంది.
"నేను నిన్ను వదలను. నువ్వు నన్ను వదిలించుకుందుకు ప్రయత్నిస్తే పోలీసుల సహాయం నా కుండనే ఉంది - " అన్నాను. పెనుగులాడ బోయిన ఆమె ఆగిపోయింది. పోలీసులంటే ఆమె భయపడుతోందన్న విషయం నాకు ట్రయిన్ లోనే అర్ధమయింది. ఏ నేరమూ చేయకపోతే తనే ధైర్యంగా పోలీస్ స్టేషను కు రాగలిగి ఉండేది కదా!
11
శాంత పెట్టిలోంచి నేనామె కనికొన్న గులాబీ రంగు చీర తీశాను. చిన్న కాగితం సంచిలో దానిని పెట్టి "నాతొ పద" అన్నాడామెతో.
ఇద్దరం చేయీ చేయీ పట్టుకుని ఒక బట్టల షాపులోనికి వెళ్ళాం. నేను కావాలనే కొంచెం ఆమెను వెనుక బడ్డాను. ఆమె అప్రయత్నంగా షాపులో ఇదివరకు మేము వెళ్ళే చోటుకు దారితీసింది. షాపువాడామెను గుర్తుపట్టి "నమస్కారం అమ్మాగారూ!" అన్నాడు. నేను కాస్త ముందుకు వెళ్ళి కాగితం సంచి నుంచి చీర బయటకు తీశాను- " ఇలాంటివి మరో చీర కావాలి-" అన్నాను.
షాపువాడు చీర నందుకుని ' పరీక్షగా చూసి - "ఇది మీరు అమ్మగారి కానీ ముచ్చట పడి మా షాపులోనే కొన్నారు. మీ ఎన్నికను నేను మెచ్చుకున్నాను కూడా. ఇప్పుడు ఇంకా మంచి మోడల్స్ వచ్చాయి. ఒకలాంటివే రెండెందుకు ? మరొక కొత్త డిజైను చూపిస్తానుండండి-" అన్నాడు.
షాపు వాడి దగ్గర ఈ చీరలేదని నాకర్ధ మైంది -- "ఇది అమ్మగారికి కాదు. నా చెల్లెలి కోసం కొందామని వచ్చాను. మీ దగ్గర ఉంటె ఇలాంటివే మరో చీర కావాలి నాకు -" అన్నాను.
షాపువాడి దగ్గర ఆ చీరెలు మరిలేవని తెలిశాక నేనామెను తీసుకుని జోళ్ళ షాపుకు వెళ్ళాను'. అక్కడ ఇదివరకటి లాంటి జోళ్ళ జతను ఆమెకు ఎన్నిక చేశాను. జోళ్ళామె కాలికి ఎక్కలేదు. నేను పూర్వపు విధంగానే ప్రయత్నించి అమెకాలికి జోళ్ళు సరిపడేలా చేయగలిగాను. అంతసేపూ ఆమె ఇబ్బందిగానే ప్రయత్నించి అమెకాలికి జోళ్ళు సరిపడేలా చేయగలిగాను. అంతసేపూ ఆమె ఇబ్బందిగానే ఉంది.
నేనామెను ఆంజనేయస్వామి కోవెలకూ, పార్కుకూ , చరిత్ర ప్రసిద్ద కెక్కిన కొండ దగ్గరకూ తీసుకు వెళ్ళాను. అమెకా ప్రదేశాలన్నీ తెలిసినవేనని నేనూ హించగలిగాను. కానీ విచిత్ర మేమిటంటే పూర్వం ఉండే చోట హంస బొమ్మ ఉన్న ఆ కొయ్య పలక లేదు!
నేనామేతో అన్నాను -- "నిన్ను అందరూ శాంతగా గుర్తిస్తున్నారు. నువ్వు నిజంగా శాంతవే!"
ఆమె నవ్వి - "పోనీ నేను శాంతనే అనుకోండి. అందువల్ల నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ నేను శాంతను కాదని జ్యోతిననీ నేను మీకంటే బాగా రుజువు చేసి నిరూపించగలను. మీరు నాతొ మా ఊరికి వస్తారా?" అంది.
"నువ్వు చెప్పేది నీ ఊరు కావచ్చు. నువ్వంటూ'న్నదే నీ పేరు కావచ్చు. కానీ నీదంటున్న ఊరులో నీ వంటున్న పేరుతొ ఉండే!
ఒక అమ్మాయి నెల రోజుల పాటు అక్కడ లేదనీ ఇక్కడ నాతో వుందన్న నిజం బహుశా నేనూ రుజువు చేయగలననుకుంటాను" అన్నాను.
ఆమెకు భయం వేస్తున్నట్లు ముఖం పెట్టింది -" మీరెందుకు నన్ను వేదిస్తున్నారో నా కర్ధం కావడం లేదు. నా అందాన్ని చూసి భ్రమపడి నన్నిలా బెదిరించి లొంగదీసుకుందామని అనుకునే పక్షంలో నేను ఏ బెదిరింపు అవసరం లేకుండానే లొంగి పోయేటంత అందం మీకుంది. మిమ్మల్ని వివాహం చేసుకునేటందుకు నాకభ్యంతరం ఉంటుందని అనుకోవడం కేవలం మీ తెలివితక్కువే."
"కావచ్చు కానీ నాకు కావలసింది జ్యోతి కాదు. శాంత! నువ్వు శాంతవా? జ్యోతివా? లేక ఇద్దరూ ఒకటేనా? అన్నది నాకు తెలియాలి. అప్పుడే వివాహం గురించి నేనాలోచించగలుగుతాను -" అన్నాను.
ఆమె మాట్లాడలేదు . ఏమిటో ఆలోచిస్తోంది.
నెమ్మదిగా ఇంటికి బయలు దేరాం.
12
"ఈరోజు మనం మన దూత దగ్గరికి వెడదాం -" అన్నాను.
"సరే! మీరు ఎక్కడి కంటే అక్కడికే" అందామె.
నేనేమీ వివరించలేదు. ఇద్దరం మళ్ళీ ఆ కొండ దగ్గరకు బయల్దేరాం. ఆమె నన్ను ఏమీ ప్రశ్నించలేదు. నేను మాత్రం ఆప్రమత్తుడినై ఆమె ప్రతి కదలికనూ గమనిస్తూ వెడుతున్నాను. ఆమె వేగంగా మెట్లెక్కడానికి ప్రయత్నిస్తున్నట్లుగా నాకు తోచి నేనామె నడుం చుట్టూ చేతులు పోనిచ్చి గట్టిగా పట్టుకునే ఉన్నాను -" ఇలా పైకి వెడుతుంటే చాలా బాగుంటుంది కదూ !" అన్నాను.
ఆమెకు నచ్చలేదని నేనూగించగలను. నా బారి నుండి తప్పించుకోడానికి ఈ మెట్లేక్కడమే సదవకాశమని ఆమెకు తెలిసే ఉండాలి. అందుకే నేను పూర్తీ జాగ్రత్తలో ఉన్నాను. ఆమెకు నన్ను వదలించుకునే అవకాశం రావడం లేదు. ఇద్దరం మెట్లెక్కుతున్నాం. క్రమంగా నడుస్తూ మేము హంస బొమ్మ ఉండే పక్కదారిని పట్టించుకోకుండా పైకే వెడుతున్నాం. ఆమె ఆ ప్రాంతంలో ఒకసారి ఆగి ఏదో అడగబోయి మానేసింది. మొదటిసారిగా మేము అంతకు మించి కొండ పైకి వెళ్ళడం చేస్తున్నాం.
మేమిద్దరం మేట్లేక్కుతూనే ఉన్నాం. చాలావరకూ పైకి వచ్చాక ఒక చదునైన ప్రాంతంలో ఆమె - "ఇంకా నడవలేకుండా ఉన్నాను. ఒక్క క్షణం విశ్రాంతి కావాలి -" అని ఆగిపోయింది. అంతవరకూ నా చేయి ఆమె నడుం చుట్టూ ఉంది. అప్పుడే ఆమె రెండు చేతులూ నా నడుం చుట్టూ పెనవేసుకున్నాయి. రెప్ప పాటు క్షణంలో ఆమె నా పెదవుల మీద బలంగా ముద్దు పెట్టుకుంది.
ఆ అనుభవం మరువలేను. నాతనువల్లా పులకరింత కలిగింది. తియ్యటి ఆ ముద్దు మరోసారి కవలనిపించి నేను నా రెండు చేతులతో ఆమెను బలంగా కౌగలించుకుని విపరీతమైన అనేశపు బలంతో ముద్దు పెట్టుకున్నాను.
ఒక్క క్షణం నన్ను మత్తు ఆవహించింది. నా చేతి పట్టు సడలింది. అంతే! ఆమె నన్ను విదిలించుకుని మెట్ల పైకి పరుగెట్టింది. నేను త్వరగా అడుగులు వేసి చేయి జాపి ఆమె జడను అందుకుని లాగ గలిగాను. ఫలితంగా ఆమె నామీద పడింది. వెంటనే ఆమె చేయి గట్టిగా పట్టుకుని -" నా పేరు రాజా. అంతా నన్ను డిటెక్టివ్ రాజాంటారు. నన్ను మోసగించి పారిపోవడం నువ్వనుకున్నంత సులభం కాదు. ఇప్పుడు చెప్పు -- ఎవరు నువ్వు? నా జీవితంలో ఎందుకు ప్రవేశించావు? శోభనాద్రి కీ నీకూ సంబంధ మేమిటి?" అన్నాను.
"మీరడిగే ప్రశ్నలకు వేటికీ కూడా నా దగ్గర సమాధానం లేదు-" అందామె పెంకిగా.
నేను వికటంగా నవ్వాను -"నాకిప్పుడు జరిగినదంతా తెలిసిపోయింది. ఒక్కసారి నీ నోట విని ధ్రువ పరచుకోవాలని ఉంది. నువ్వు శోభనాద్రి భార్యవు కాదు ఆరోజు రాత్రి మనం శోభనాద్రి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు నేను నీకు చెబుతాను. నాతొ సహకరిస్తే నీకు శి తగ్గుతుంది. అబద్దమాడ్డానికి ప్రయత్నిస్తే నేను నిన్ను పోలీసుల పరం చేయావలసి ఉంటుంది. నిజం చెప్పించడానికి పోలీసుల వలంభించే పద్దతుల గురించి వినే ఉంటావు. నావంటి వాడి దగ్గర నిజం ఒప్పుకుంటే నాకా శ్రమ తప్పుతుంది."
ఆమెలో కలవరం కనబడింది. "నిజం చెబుతాను --" అందామె. "నన్ను శోభనాద్రి తన భార్యగా మీ దగ్గర నటించవలసిందిగా చెప్పాడు. అందుకు నాకు డబ్బు బాగా ముట్టింది -"
నేను మొదలెట్టాను. "ఆరోజు రాత్రి నువ్వు బాతురూం వంకతో మెట్లెక్కబోయావు. ఇలా - "అంటూ ఆమె చెయ్యి పట్టుకుని నేను మేట్లేక్కసాగాను. "అప్పుడు నేను నీవెంత బడ్డాను. అయితే నువ్వు పరుగెట్టావు - "అంటూ ఆమె చేయి వదిలాను. ఆమె పైకి పరుగెత్తింది. నేను వెనకాలే నెమ్మదిగా అనుసరించసాగాను. ఆమె కొండ పైకి చేరుకుంది. నేను ఒక నిముషం వ్యవధిలో ఆమెను చేరుకున్నాను. నన్ను తప్పించుకు పోవడానికి ఆమె ఇక ప్రయాత్నించదని నాకు రూడీ అయింది.
'చెప్పు , - అప్పుడేం జరిగింది ?" అన్నాను.
ఆమె తటపటాయిస్తోంది. నేనామెను మళ్ళీ చేయి పట్టుకుని ఆలయం ఆవరణ చుట్టూ ఉన్న పిట్ట గోడ దగ్గరకు ఆమెను నడిపించాను. రెండు చేతులతో ఆమెను నడుము వద్ద పట్టుకుని పైకెత్తి ఆ పిట్టగోడ పై నిలబెట్టాను. 'చెప్పు ఆ రోజు రాత్రి మెడ మీద ఏం జరిగింది ?"
ఆమె నిలువెల్లా వణికిపోతోంది - "నేను పైకి వెళ్ళేసరికి శోభనాద్రి మేడ టెర్రస్ మీద పిట్టగోడ పై తన భార్యను ఇదే విధంగా నిలబెట్టి సిద్దంగా ఉన్నాడు. మాట్లాడడానికి వీల్లెకుండా ఆమె నోరు నొక్కేశాడు. నన్ను చూడగానే అయన భార్యను క్రిందకు తోసేశాడు. ఇదీ జరిగింది. మీకు నేను అంతా నిజమే చెప్పాను. నన్ను మీరే రక్షించాలి. డబ్బుకు ఆశపడి ఒక వ్యక్తికీ ఒక నిండు ప్రాణాని హత్య చేయడానికి సహకరించాను...." అని ఆమె ఏడుస్తూ నా పాదాల మీద పడిపోయింది.
----అయిపొయింది ------
