Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 18

 

    రాజకుమార్ అసలు పేరది కాదు. అతడి కన్ని భాషల్లోనూ అన్ని మతాల్లోనూ పేర్లున్నాయి. అతడి బ్రీఫ్ కేసులో లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలున్నాయి. పోలీసులతడ్ని సరైన సమయంలో పట్టుకోబోగా అతడు పారిపోయాడు. అతణ్ణి పోలీసులు తరుముతున్నారు. అన్ని పోలీసు స్తేషన్లకూ రాత్రికి రాత్రి వార్త వెళ్ళింది.
    'చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకొన్నాడతడు.
    "మాదక ద్రవ్యాలంటే ?" అంది గులాబి.
    "యువకుల్ని లొంగదీసుకుని నిర్వీర్యులను చేసే మత్తు పదార్దాలమ్మా అవి!" అంటూ పోలీసినస్పెక్టరామెను వాటి గురించిన వివరాలు చెప్పాడు.
    'అమ్మయ్యో!' అంది గులాబి.
    ఆమె కళ్ళు ముందు అందమైన రాజకుమార్ ముఖం చిరునవ్వులు చిందిస్తూ వెలుగుతోంది.
    అందం వెనుక ఎంత మోసం?
    "గురవయ్య గారూ -- మీ కృషికి మిమ్మల్నభినందిస్తూన్నాను. కానీ మా అదృష్టం బాగోలేదు. అయితే మా మనుషులు ఊరంతా గాలిస్తున్నారు. అతడు గుండెల తీసిన బంటు . అతడు కనుక పట్టుబడితే గుర్తించడానికి మీరు మాకు సహకరించాలి -" అని వెళ్ళిపోయాడు పోలీసినస్పెక్టరు.
    పోలీసులు వెళ్ళిపోయాక గురవయ్య కూతుర్ని బాగా మందలించాడు.
    గులాబి ఏడుస్తూ -- "నేనతడి మాటలు నమ్మాను నాన్నా! నీకు ప్రమాదమని భయపడ్డాను --" అంది.
    గురవయ్యకు కూరురి మనసు తెలుసు. ఆమె అమాయకత్వమూ తెలుసు.
    "తప్పు నధమ్మా! నాతొ వస్తానన్న నిన్ను కాదని ఇంట్లో వదిలి వెళ్ళాను. ఆ దుర్మార్గుడే అఘాయిత్యమూ చేయకుండా నిన్ను వదిలి పెట్టాడు. అదే గొప్ప అదృష్టం మనకు...."అన్నాడు గురవయ్య.
    'చేతికి చిక్కిన దుర్మార్గుడ్ని చేజేతులా వదిలీపెట్టెను. వాడి మూలంగా మన యువతరమంతా నాశనమవుతొందంటే నా గుండె మండిపోతోంది --" అంది గులాబి.
    "వాడు నా కత్తుల బోన్నించీ తప్పించుకున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది....బాధగానూ ఉంది --" అన్నాడు గురువయ్య.
    ఆ తండ్రీ కూతుళ్ళు కాసేపు బాధపడి నిద్రపోదామను కునేటంతలో యింటి ముందు పోలీసు జేపాగింది.
    ఇనస్పెక్టర్ హడావుడిగా వాళ్ళను కలుసుకుని -- "మీ రిప్పుడే నాతొ రావాలి ....' అన్నాడు.
    "ఏమయింది సార్ ?" అన్నాడు గురవయ్య.
    "ఒక రాత్రి వేళ మీ యింటి నుంచి బైటపడ్డ బ్రీప్ కేసు యువకుణ్ణి మా పోలీసు మనిషోకడు. చూసి అనుమానించి వెంటాడాడు. వాడు అరుణా హోటల్లో ఇరవై రెండో నంబర్లో దూరాడు. వాడు బైటకు పారిపోకుండా కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసి - మా మనిషి నాకు కబురందించాడు. వాడే నేరస్తుడని నా కర్ధమై పోయింది. అయితే అతణ్ణి గుర్తించడానికి మీరు రావాలి...."
    "మీ పోలీసు రికార్డు ల్లో వాడి ఫోటో లేదా?" అన్నాడు గురావయ్య.
    "లేదు అయినా నిముషానికో వేషం వేసేవాడి వివరాలు పట్టుకోవడం చాలా కష్టం. ఇన్నాళ్ళకు మాకా అవకాశం వచ్చింది ...." అన్నాడినస్పెక్టర్.
    ఆ నేరస్తుణ్ణి గుర్తు పట్టడానికి గులాబి కూడా అత్ర పడింది.
    ముగ్గురూ జీపులో అరుణా హోటలు కు వెళ్ళారు.
    'ఆ మనిషి గదిలోంచి బైట కు రాలేదు సార్!" అన్నాడు హోటల్ దగ్గర కాపలా వున్న మనిషి.
    "గుడ్ వర్క్! " అని ఇన స్పెక్టర్ తడిని మెచ్చు కున్నాడు.
    రిసెప్షన్లో అతడి గురించి వివరాలు సేకరించాడినస్పెక్టర్.
    అక్కడ అతడి పేరు రాజకుమార్ అని నమోదయింది. వచ్చి నాలుగు రోజులయింది. రోజూ అతణ్ణి కలుసు కొనేందుకెందరో వచ్చి వెడుతున్నారు. అతడు గది తాళం రిసెప్షన్ కౌంటర్లో యివ్వడు. ఎప్పుడో బైటకు వెళ్ళి ఎప్పుడో లోపలకు వెడుతూంటాడు. కాసేపటికి కితం అతడు చాలా హడావుడిగా తన గదికి వెళ్ళిపోయాడు. పోలీసు మనిషతన్ననుసరించి రావడం వల్లనే రిసేప్షనిస్టూ కతడి రాక గురించిన స్పృహ కలిగింది.
    "ఒక్క రూం సంబారిరవై రెండు తప్ప తక్కిన తాళాలన్నీ మా దగ్గిరేనా ఉన్నాయి - లేదా కస్టమర్స్ బైటకు వెళ్ళలేదు. దాన్ని బట్టి నేనతడి ముఖం కూడా చూడలేదు --" అన్నాడు రిసెప్షనిస్టు.
    అతడు జాగ్రత్త పడుతున్నాడని ఇనస్పెక్టరు కర్ధమయింది.
    అది సహజం కూడా! పోలీసులే ఈ నేరస్తుడి ధాటికీ తట్టుకోలేనప్పుడు సామాన్యుడు తట్టుకోగలడా?
    "సరే!" నని అతడు ముందుకు వెళ్ళాడు. గురవయ్య గులాబీ అతడి ననుసరించి వెళ్ళాడు.
    ఇన స్పెక్టరు తటపటాయించకుండా ఇరవై రెండో నంబరు గది తలుపు తట్టాడు.
    తలుపు తెరుచుకుందుకు కెంతో సేపు పట్టలేదు.
    విసుగ్గా తలుపు తీశాడో వ్యక్తీ.
    అతణ్ణి చూస్తూనే గులాబి తెల్లబోయింది.
    ఆమె కతడు బాగా గుర్తున్నాడు. కానీ యితడు అకారంతా అదే కానీ -- మనిషి ముఖం వేరుగా ఉంది.
    "ఎవరు కావాలి ?" అన్నాడతడు.
    "మీరేనా రాజ కుమార్ ?" అన్నాడినస్పెక్టర్.
    "ఊ" అన్నాడతడు.
    "ఇన స్పెక్టర్ -- నాకు తెలిసిన రాజకుమార్ ఇతడు కాడు ...." అంది గులాబి.
    ఆమె అతణ్ణి రక్షించడానికి ప్రయత్నిస్తోందేమోనని ఇన స్పెక్టరు కనుమానం వచ్చి గురవయ్య వంక ప్రశ్నార్ధకంగా చూశాడు. అతడు కూడా గులాబి తో ఏకీభవించాడు.
    "ఏం జరిగింది ?' అన్నాడా బొంగురు గొంతు వ్యక్తీ.
    ఇన స్పెక్టర్ జరిగింది చెప్పాడు.
    "ఏమో -- మీరంటుంటే నా కనుమానంగా ఉంది. రూమ్ నంబరు ఇరవై నాలుగులోని వ్యక్తీ తానోచ్చేదాకా తన గదిలో ఉండమని నన్ను రిక్వస్ట్ చేస్తే ఒప్పుకున్నాను. కాసేపటి క్రితం అతడు హడావుడిగా వచ్చాడు. నేను నా గదికి వచ్చేశాను ...." అన్నాడు రాజకుమార్.
    అందు కవకాశమున్నదని రిసెప్షనిస్టు పోలీసు మనిషి కూడా అంగీకరించాడు. పోలీసు మనిషి రిసెప్షనిస్టు తో మాట్లాడి అక్కడకు రావడానికి కాస్త వ్యవధి వుంది.
    "నేరస్థుడు చాలా తెలివిగా వ్యవహరించాడు. తనే గదిలో దూరుతున్నదీ మనకు తెలీకుండా చేశాడు..." అన్నాడినస్పెక్టరు.
    "కానీ ఇరవై నాలుగో నెంబరు గది నుంచి కూడా ఎవ్వరూ బైటకు రాలేదు సర్-- నేరస్థుడింకా ఆ గదిలోనే ఉండొచ్చు --" అన్నాడు పోలీసు మనిషి.
    ఇన స్పెక్టర్ పోలీసు మనిషిని రాజకుమార్ దగ్గిరుండమని తను వెళ్ళి ఇరవై నాలుగో నంబరు గది తలుపు తట్టాడు. గులాబి గురవయ్య అతడి వెనుకనే ఉన్నారు.
    తలుపు తెరుచుకుందుకు క్కాసేప్పట్టింది.
    ఓ వ్యక్తీ ఆవులిస్తూ - "ఇంత రాత్రివేళ -- ఎవరు మీరు?" అన్నాడు.
    అతడి మాట, ముఖం - గులాబి గుర్తు పట్టింది.
    'అతడే - రాజకుమార్ - " అందామె. ఆ వేణు వెంటనే ....' కానీ...." అని ఆగిపోయిందామె.
    గురవయ్య కూడా ఆ యువకుడి వంకే ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
    అతడి ముఖం రాజ కుమార్ దే అనడంలో సందేహం లేదు. కానీ ఇతడు బాగా సన్నగా - మరింత పొడవుగా వున్నాడు.
    "ముఖం సరిపోయింది కదా - మిగత విషయంలో పొరపడి ఉంటారు" అంటూ ఇన్ స్పెక్టరతడి గదంతా శోధించాడు. అనుమానించతగ్గదేమీ దొరకలేదు.
    ఇన్ స్పెక్టరతడిని పోలీసు మనిషికి చూపించాడు.
    "వెనుక నుంచి చూస్తుంటే ఇరవై రెండో నంబరు గదిలోని వ్యక్తినే నేననుసరించినట్లు తెలుస్తుంది. ఇరవై నాలుగో నంబరు గది వ్యక్తీ ఆకారం నేను చూడలేదు."
    "ఎలా చూస్తావు?" నేను ఎనిమిదింటి నుంచి వళ్ళేరక్కుండా నిద్రపోతుంటే ?" అన్నాడా వ్యక్తీ కోపంగా. అతడు రాజకుమార్ చెప్పినదంతా అబద్దమన్నాడు.
    రాజకుమార్ గది శోధించాడినస్పెక్టర్.
    అక్కడా అనుమానించ తగ్గ వేమీ దొరకలేదు.
    "నేరస్థుడు వీళ్ళిద్దరిలోనే ఉన్నాడు. రాజకుమార్ ఇరవై నాలుగో నంబరు గదిలోని వ్యక్తీ మేకప్ లో మీ  యింటికి వచ్చి ఉండవచ్చు. కానీ ఋజువు చేయడమెలా?" అన్నాడినస్పెక్టర్ దిగులుగా.
    జరిగింది గులాబీ కర్ధమయింది. రాజకుమార్ మారువేషంలో తమ యింటి కొచ్చి -- తిరిగి తన హోటలు గది చేరుకొని వేషం మార్చుకున్నాడు. రూపంతో తామందర్నీ కంగారు పెడుతున్నాడు.
    గురవయ్య చటుక్కున ఇన స్పెక్టర్ చెవిలో - 'అయ్యా! నా యింట్లో రాజకుమార్ ని కత్తుల బోనులో పెట్టానుగా. గోడలో ఆ కత్తులు వేసిన గుర్తులన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి. ఇతడా గుర్తుల్లో ఇమిడి పొతే ఇతడే రాజకుమార్. నా కత్తుల బోను ...వేలిముద్రల కంటే నిఖార్సైనదని ఏ కోర్టు లో నైనా ఋజువు చేయగలను....." అన్నాడు.
    ఆధారం కోసం వెతుకుతున్న ఇన్ స్పెక్టర్ కి మాట లపరిమితానందం కలిగించాయి. తాత్కాలికంగా రాజకుమార్ నరేస్టు చేయడానికి ఆధారం చాలు.
    గురవయ్య కత్తుల బోను -- ఇరవై రెండో నెంబరు గది వ్యక్తినే రాజకుమార్ గా నిరూపించింది. ఆ తర్వాత అతడే నేరస్థుడని పోలీసులు నిరూపించగలిగారు.
    "నా కత్తులబోనే నేరస్తుణ్ణి పట్టిచ్చింది " అని గురవయ్య ఎంతో సంతోషించాడు.

                                       ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS