ఈసారి జాగ్రత్తగా నటించాలనుకుందామె. అయితే అనుకోకుండా ప్రేమ్ కుమార్ తన పెదాల కిందముద్దు పెట్టుకోబోయి, ఆ కదలికలో తన పెదాలమీదే అతని పెదాలు వుంచాడు.
దాంతో మళ్ళీ "కట్" అని అరవక తప్పింది కాదు డైరక్టర్ కి.
"సారీ! మీకు చెప్పి నేనుదెబ్బ తినేశాను. ఇది మొదటిసారి లవ్ సీన్లో నేను టేక్ తీసుకోవడం!" అన్నాడు ప్రేమ్ కుమార్.
ఆ తరువాతి టేక్ ఓ.కే. అయింది. పాటంతా ముగిసేసరికి సాయంత్రం అయిపోయింది. అందరూ మళ్ళీ వ్యానులో టి.బి కి చేరుకున్నారు. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. మొట్టమొదటిసారిగా మనసులో ఏదో అలజడిచెలరేగింది. క్షణక్షణానికి సాయంత్రం వరకూ ప్రేమ్ కుమార్ తో నటించిన ప్రేమ సన్నివేశాలే గుర్తుకొచ్చి ఓ విధమైన ఉద్రేకం కలుగుతోంది.
నిజానికి భార్యాభర్తలుకూడా అంత సన్నిహితమైన ప్రేమకలాపాలు సాగించరేమో అనిపిస్తోంది.
ఆ పాట చిత్రీకరణపూర్తయ్యే వరకూ తనను తను అదుపులో పెట్టుకోవడం అసాధ్యమైపోయింది. తనలాగానే మిగతా హీరోయిన్లు కూడా ఉద్రిక్తులయ్యేవారా? ఏమో!
అయితే అతను మాత్రం అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండానే నటించగలిగాడు. ఆ మర్నాడు ఇంకొక పాట చిత్రీకరించాలి డ్రీమ్ సీకెన్స్ అది.
అది మరింత సెక్సీగా వుంటుందని అన్నాడు డైరెక్టరు. మరి ఆ సీన్ ఎలా నటించాలా అని భయంగా వుంది.
ఎప్పుడో తెల్లవారుతూండగా నిద్రపట్టింది. ఎవరో తలుపు తట్టడం విని తిరిగి మెలకువ వచ్చిందామెకి.
కళ్ళు తెరచి చూసేసరికి అప్పటికే బాగా పొద్దెక్కిపోయింది. టైంతొమ్మిది దాటింది. అసిస్టెంటు డైరెక్టర్ నిలబడి వున్నాడు నవ్వుతూ. "గుడ్ మాణింగ్ మేడమ్! మీకోసం ఎదురు చూస్తున్నారు అందరూ!"
"అరె! మరి నన్ను ఉదయమే ఎందుకు లేపలేదు?"
"ఉదయం బాయ్ కాఫీ తెచ్చి నపుడు తలుపు కొడితే మీరు జవాబివ్వలేదట! సరే నిన్న బాగా అలసిపోయి వుంటారని డైరెక్టరుగా తొమ్మిదింటి వరకూ డిస్టర్బ్ చేయవద్దన్నారు."
"సరే! గంటలో రెడీ అవుతాను" అందామె.
అనుకున్నట్లే పదిన్నరకల్లా మళ్ళీ లొకేషన్ కి చేరుకున్నారు. తన డ్రస్ చూస్తూ నే నవ్వు వచ్చిందామెకి.
బొడ్డుకింద చీర- అదీ మోకాళ్ళవరకే- పైన బ్రాసియర్స్ లాంటిగుడ్డ అడవి మనిషిలా మేకప్ చేశారు.
ప్రేమ్ కుమార్ కీ అంతే! నడుముకి టవల్ లా ఓ గుడ్డ చుట్టారు. ధానికి బెల్టు వుంది. మిగతా శరీరమంతా నగ్నమే.
తన గుండెలు వేగంగా కొట్టుకున్నాయి, మళ్ళీ అంత సన్నిహితంగా నటించాల్సివస్తే తనను తాను అదుపులోపెట్టుకోవడం సాధ్యమౌతుందా?
రికార్డ్ మోగడం ప్రారంభమైంది. డాన్సు డైరెక్టరు చేస్తోన్న అభినయం చూస్తూంటే చంద్రికకుమరింత భయం కలిగింది. ఇవాళ తనను భగవంతుడే రక్షించాలి. షూటింగు ప్రారంభమైంది.
దూరం నుంచి పరుగుతోవచ్చి యిద్దరూ గాఢంగా కౌగిలించుకున్నారు. చాలావరకూ నగ్నంగా తాకుతోన్న అతని శరీరం తనకు పిచ్చి ఎక్కిస్తోంది.
అదృష్టవశాత్తు అది మొదటి టేక్ లోనే ఓ.కే అయిపోయింది.
రెండో చరణం దగ్గర అభినయం తనను మరింత పరీక్షించేదిగా వుంది. కొలనులో గుండెల లోతుకు దిగి ప్రేమకలాపాలాడటం.
ఇద్దరూ నీళ్ళల్లో దిగారు. పూర్తిగా తడిసిపోయిన ఉడుపుల్తో కౌగలించుకునేసరికి తనకు నిగ్రహం పూర్తిగా పోయింది. అతని కౌగిలినుంచి దూరంగా జరగడం సాధ్యంకాలేదు. అతని పరిస్థితీ అలాగే వున్నట్లు అనుమానం కలిగింది తనకి. అతని చేయి తనను గాఢంగా అతనికేసి నొక్కుతోంది.
"సారీ! నన్ను నేను మర్చిపోతున్నాను" నవ్వుతూ అన్నాడతను.
చంద్రిక ఏమీ మాట్లాడటంలేదు. అక్కడితో ప్రేమ దృశ్యాల చిత్రీకరణపూర్తయిపోయింది.
ఆ తరువాత ఇంకొన్ని సీనులు షూటింగ్ జరిగింది.
ఆ రాత్రి భోజనంచేస్తూంటే ప్రేమ్ కుమార్ ఆమె గదిలో కొచ్చాడు.
"భోజనం ఇంత ఆలస్యంగా చేస్తున్నారేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడతను.
"ఏమో! అసలివాళ భోజనం చేయబుద్దికాలేదు" నవ్వుతూ అంది చంద్రిక.
"అరె! ఎందుకు?"
"జలుబు చేసిందిబాగా! ఆ నీళ్ళల్లో నానాల్సివచ్చిందికదా గంటసేపు!"
"మీరు నమ్ముతారో నమ్మరోగాని ఇవాల్టి ప్రేమసీనులు భలే కవ్వింపుగా వున్నాయి నాకు! అసలు మిమ్మల్ని కౌగిట్లోంచి వదలాలనిపించలేదు" నవ్వుతూ అన్నాడతను.
చంద్రిక చేయి కడుక్కుని లేచింది.
"కూర్చోండి!" అందతనితో.
అతను కుర్చీలో కూర్చున్నాడు.
"అసలివన్నీ ఇంత శ్రమపడితీయడమేకాని సెన్సార్ లోకల్ అయిపోవూ?" అడిగిందామె.
"నాకూ అదే అనుమానంగా వుంది. ఐతే ఇక్కడింకో చిన్న తమాషావుంది.
మామూలు ప్రేమ దృశ్యాలు అలావున్నాయంటే అంత కంటే ఘోరమైన దృశ్యాలమీద మాత్రమే పడుతుంది. అంటే చిన్న గీత పెద్దగీత కధన్నమాట!"
చంద్రిక నవ్వి వూరుకుంది.
"మీకు నిద్ర వస్తున్నట్లుంది! వెళతాను" వెళ్ళిపోయాడతను.
చాలాసేపు కళ్ళుతెరుచుకునే పడుకుందామె.
గడియారంలో ముళ్ళు వేగంగా తిరుగుతున్నట్లనిపించిందామెకి. ఆమె అలా చూస్తుండగానే టైము పన్నెండైపోయింది. మంచంమీద నుండిలేచి కిటికీదగ్గరకు నడిచికిటికీ తలుపులు తెరిచిందామె. లోయఅంతా వెన్నెలతో నిండితెల్లగా కనబడుతోంది. ఆ కాస్తా తప్పితే మిగతాప్రాంతమంతా చీకటే!
ఉండుండి ఆమె కొలనులో తనను ప్రేమ్ కుమార్ కోరికతో అదుముకుంటూ కౌగిలించుకోవడం గుర్తుకొచ్చి ఉద్రేకం చెలరేగుతోంది.
ఇంతవరకూ తనకేనాడూ ఇలా అవలేదు. సినిమా ఫీల్డులో చాలామంది సెక్స్ విషయంలో స్వేచ్చగా మసలడానికి కారణం ఇలాంటి ఉద్రేకపరిచే పరిస్థితులే కారణమని తెలుస్తోంది ఇప్పుడు.
ఎప్పుడు సిద్దార్ధతో అనుభవించిన శారీరక సుఖం - తిరిగి శరీరం ఇప్పుడు మేలుకుంది!!
అసలు సెక్స్ గురించి ఇన్నిరోజులూ ఆలోచించేఅవసరమేరాలేదు. తను ఉత్తమనటిగా పేరు తెచ్చుకోవాలనీ, అగ్రస్థానానికి చేరుకోవాలనీ కోరికలు మాత్రమే మనసులో ఎప్పుడూ మెదులుతూండేవి.
సినిమాల్లో మంచిపాత్రకోసం ప్రయత్నాలు చేసి చేసి విసుగు వచ్చినపుడు అనుకోకుండా డైరెక్టరు శంతన్రావ్ తనకు కబురు చేయడం తనకు స్క్రీన్ టెస్ట్ ఇవ్వడం, ఓకే చేయడం అన్నీ ఒక్క రోజులో జరిగిపోయాయి.
తీరా పిక్చరు ప్రారంభించేముందు హోటల్ గదిలో అతని మనసులోని కోరిక తెలుసుకున్నప్పుడు తను ఎక్కువసేపు ఆలోచించలేదు. అలాంటి సంఘటనలగురించి చాలా విన్నది తను. తను అలాంటి పరిస్థితుల్లోకి జారకుండానే తనకు చిత్రాల్లోమంచి అవకాశం రావడం తన అదృష్టం అనుకుంది. అవకాశాలు రావడం ఎంతఆలస్యమైనా సరే అలాంటి నీతిలేని నడవడికి తలవంచకూడదని నిశ్చయించుకున్న తననిర్ణయం ఆ క్షణంలో ఎటు పోయిందో తెలీదు. అతనికి తన శరీరాన్ని అప్పగించింది. అతనివంక చూడలేదు.
అతను పొందుతున్న ఆనందం తనేకోశానా పొందలేదు. అసలిదిఇద్దరి మధ్య జరిగే కార్యక్రమంలా అనిపించనేలేదు. అందులో తనకేమీ భాగం లేనట్లే, తనకేమీసంబంధం లేనట్లే గడచిపోయింది.
