Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 16

 

                                కత్తుల బోను
            
                                                                 వసుంధర
    
    గురవయ్య తన ముందున్న పళ్ళెం వంక చూసుకుని నవ్వుకున్నాడు. ఆ పళ్ళెం నిండా తళతళ మెరుస్తున్న కత్తులు. కత్తులు వాడిగా వున్నాయి. చేత్తో తాకితే క్షణాల మీద రక్తం చిమ్మేటంట వాడి ఉన్నదా కత్తుల్లో.
    సూటిగా గుండెలకు తాకితే బాధ తెలిసేలోగా ప్రాణం తీయగల కత్తులవి.
    గురవయ్య ఆ కత్తులతో పదేళ్ళుగా సాధన చేస్తున్నాడు.
    ఒక్కసారి కూడా అతడి గురి తప్పలేదు.
    ఒక్కసారి కూడా అతడి కత్తి విసురుకు మనిషి రక్తం చిందలేదు.
    గురవయ్య ప్రదర్శన అపూర్వం. అద్బుతం - అవి పేరు పడింది.
    అతడి ప్రదర్శన చిన్న చిన్న పాఠశాలల నుంచి-- జాతీయ సభా వేదికల వరకూ పేరు కాంచింది.
    అంతర్జాతీయంగా అతడి కావ్వానాలు రప్పించడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
    గురవయ్యకు రాజకీయంగా పలుకుబడి లేదు. అందుకే అతడికి రావలసినంతగా ప్రచారం లభించలేదు.
    అందుకు గురవయ్య బాధపడలేదు. అతడికి విద్యాప్రదర్శనలో ఉన్న అనందం - ప్రచారంలో లేదు.
    డబ్బెలాగూ అతడు దండిగా సంపాదిస్తూనే ఉన్నాడు.
    గురవయ్య ప్రదరశానల్లో చాలా విశేషాలున్నాయి.
    గోడ కానుకుని నిలబడ్డ మనిషినతడు కత్తులు విసిరి బందీని చేయగలడు. తిరిగి అతడు విడిపించేవరకూ ఆ మనిషి కదలలేడు. కదలనంత కాలం ఆ మనిషికి బాధ లేదు. కదిలితే రక్తం చింధక తప్పదు.
    వేదిక పై పారిపోతున్న మనిషిని కత్తులు విసిరి ఆపగలడతడు. ముందడుగు వేస్తె పాదం ముందు కత్తి.
    ఆ దృశ్యం చూసి అనందించవలసిందే!
    ప్రస్తుతం గురవయ్య ముందు పళ్ళెంలో కత్తులున్నాయి. ఇంకాస్త దూరంలో అతడి కూతురు "గులాబి" ఉంది.
    గులాబి గులాబి పూవుకన్న మృదువుగా ఉంటుంది. అందంలో ఆమె కామే సాటి. అందాన్ని మించిన ధైర్యమామెకుంది.
    వేదిక పై ఆమె అందం, ధైర్యం -- గురవయ్యకు అస్సేట్.
    గురవయ్య తదేక దీక్షతో కూతురి వంకే చూస్తూ నెమ్మదిగా కత్తులు విసరసాగాడు.
    గులాబి రెండు చేతులూ అడ్డంగా చాచింది. కాళ్ళు ఎడంగా పెట్టింది.
    ఆమె అప్పుడూ జీన్సులో ఉంది.
    గురవయ్య విసిరిన కత్తులామే శరీరాన్ని రాసుకుంటూ వెడుతున్నాయి.
    ఆమె అంగుళం మేర కూడా కదలలేదు.
    కత్తులామేను రాసుకుంటూ వెళ్ళి -- ఆమె వెనుక సుమారు మూడు గజాల దూరంలో ఉన్న గోడకు గుచ్చుకుంటున్నాయి. కొన్ని ఆమె చేతుల్ని, కొన్ని ఆమె కాళ్ళను, కొన్ని ఆమె మెడను దూసుకుంటూ వెళ్ళి గోడలో గుచ్చుకుంటున్నాయి.
    గురవయ్య పళ్ళెంలోని కత్తులై పోయాయి.
    "శెభాష్ నాన్నా!" అంది గులాబీ.
    "నువ్వు నన్ను మెచ్చు కోకూడదు --" అన్నాడు గురవయ్య.
    "మెచ్చుకోకుండా ఎలా నాన్నా? నీకులా కత్తులు విసరగలిగేవాడి భూమ్మీదుంటాడని అనుకోను -- " అంది గులాబి.
    "ముందు నువ్వు గోడ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాక అప్పుడు మాట్లాడు --" అన్నాడు గురవయ్య గంభీరంగా.
    గులాబి గోడ దగ్గరకు వెళ్ళింది.
    గోడ నిండా వరుసగా కత్తులు.
    ఆమె నెమ్మదిగా ఆ కత్తుల మధ్యకు వెళ్ళి యిరుక్కుంది.
    ఇప్పుడామేను చూస్తుంటే గురవయ్య ఆమెను గోడ కానించి నిలబెట్టి అప్పుడు కత్తులు విసిరాడా అనిపిస్తుంది.
    గురువయ్య తృప్తిగా తలాడించి - " "బయటకు రా -" అన్నాడు.
    గులాబి జాగ్రత్తగా కత్తుల మధ్య నుంచి బయటకు వచ్చింది.
    "ఇలాంటి విద్య నింతవరకూ ఎవ్వరూ ప్రదర్చించలేదు. మనిషికీ గోడకూ మధ్య దూరముంచి కూడా -- తిన్నగా మనిషి ఆకారంలో కత్తులు విసరడం -- నేనే కనిపెట్టాను -- సాధించాను. ఇది నేను ఎల్లుండి స్టేజి మీద ప్రదర్శిస్తాను. నువ్వు మాత్రం ఇదే ధైర్యన్నప్పుడూ ప్రదర్శించాలి...." అన్నాడు గురవయ్య.
    "ధైర్యం గురించి నువ్వు నాకు చెప్పాలా నాన్నా!" అంది గులాబి.
    "సరే - ఈ రోజుకు ప్రాక్టీసై పోయింది ..." అన్నాడు గురవయ్య.

                                    2
    రాత్రి పదకొండు గంటలవుతుంది.
    గురవయ్య తన గదిలో మంచం మీద నిద్రపోతున్నాడు.
    ఆ సమయంలో గురవయ్య యింటి ముందో వ్యక్తీ ఆగాడు. అతడి చేతిలో ఓ బ్రీఫ్ కేసుంది.
    అతడు నెమ్మదిగా తలుపు తట్టాడు.
    అ తలుపు చప్పుడు గులాబి వింది.
    అది గులాబి కలల సమయం.
    జీవితం మీద, భవిష్యత్తు మీద -- ఆమె కెన్నో ఆశలున్నాయి.
    ఆమె మనసు నిండా వయసుకు తగ్గ కోర్కెలున్నాయి.
    తండ్రి నిద్రకు పడ్డాక ఆమె తీరుబడిగా పడుకుని కలలు కంటుంది. ఆ కలల నిండా బంగళాలు, కార్లు. రాజకుమారులు.
    గులాబి పెద్దగా చదువుకోలేదు. కానీ -- తెలుగోక్కటే కాక ఆమెకు మొత్తం దక్షిణాది భాషలన్నీ వచ్చు.
    ఆపైన హిందీ, ఇంగ్లీషు చక్కటి ఉచ్చారణతో మాట్లాడుతుంది.
    చక్కటి పొడవు, అంగసౌష్టవం కారణంగా -- ఆధునిక దుస్తులూ, సంప్రదాయపరమైన దుస్తూలు -- అన్ని రకాల అలంకారాలూ ఆమెకు నప్పుతాయి.    
    తండ్రి ప్రదర్శనల కారణంగా ఆమె ఎన్నో సార్లు వేదిక నేక్కింది.
    అందువల్ల ఆమె చాలామంది దృష్టికి వచ్చింది.
    ఎందరో ఆమె అంటే యిష్టపడ్డారు.    వారిలో భాగ్యవంతులున్నారు. రాజకీయ నాయకులున్నారు. విద్యాదికులున్నారు.
    వారందరూ ఆమెకు నచ్చారు. కానీ గురవయ్యకు నచ్చలేదు.
    "నువ్వంటే యింకా గొప్పవాళ్ళు కూడా యిష్టపడతారు. నీక్కావలసిన దిష్టం కాదు - ప్రేమ!" అన్నాడు గురవయ్య.
    ప్రేమకూ యిష్టానికి తేడా ఏమిటో గులాబికి తెలియలేదు.
    గురవయ్య మాత్రం ఆమెకు పరోక్షంగా చెప్పాడు.
    "నా దగ్గర బాగా డబ్బు చేరుతోంది. ఒకరోజున నేను నిన్ను చాలా గొప్పవాడికిచ్చి పెళ్ళి చేస్తారు. నువ్వు పెళ్ళి చేసుకుని స్థిరంగా కాపురం చేసుకోవాలి" అని గురవయ్య ఆమెకు చెప్పాడు.
    గులాబి అంటే యిష్టపడ్డ వాళ్ళు గురవయ్యకు తెలియకుండా ఆమెను కలుసుకుని మాట్లాడ్డానికి ప్రయత్నించారు. గులాబి వాళ్ళను మాట్లాడనిచ్చింది  కానీ ముందడుగు వెయ్యినివ్వలేదు.
    "మీ నాన్న నీకు పెళ్ళి చేయడు. నిన్నడ్డుగా  పెట్టుకుని డబ్బు సంపాదిస్తున్నాడు" అన్నారు కొందరు.
    "అసలు మీ నాన్న గురవయ్య కాడు. వాడు నిన్నెక్కడి నుంచో ఎత్తుకొచ్చి తన ప్రదర్శనల కుపయోగించు కొంటున్నాడు" అన్నారు కొందరు.
    గులాబి వారి మాటలకు చలించలేదు.
    ప్రేమ విలువ అది పొందేవారికే తెలుస్తుంది.
    గురవయ్య ఆమెకు తండ్రి అవునా, కాదా అన్నదామెకీ తెలియదు. కానీ ఆమె అతడిలో తండ్రిని చూస్తోంది.
    గురవయ్య ఆమెకు అసలు సిసలు తండ్రి ప్రేమను చూపిస్తున్నాడు.
    అతడి ననుమానించడం ఆమె మనసుకు నచ్చదు.
    అందుకే ఆమె తండ్రి తనకు మోసగిస్తాడని కాక - మంచి యువకుణ్ణి తెచ్చి పెళ్ళి చేస్తాడని నమ్ముతోంది. ఆ నమ్మకమే ఆమెను రాత్రి పూట కలలు కనేలా చేస్తుంది.
    కలలు కన్నాకనే ఆమె నిద్రపోతుంది.
    క్రమశిక్షణ, వ్యాయామం కారణంగా ఆమె శరీరారోగ్యం గొప్పది. అందువల్ల నిద్రలో ఆమెకు కలలు రావు.
    గులాబి నిద్రపోకుండా కలలు కంటున్న సమయంలో తలుపు తట్టిన శబ్దం వినబడి -- స్వప్న ప్రపంచం లోంచి బైటకు వచ్చింది.
    నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసింది.
    ఎదురుగా అతడు ....అతడి చేతిలో బ్రీఫ్ కేసు....
    తాను తిరిగి స్వప్న ప్రపంచంలోకి వెళ్ళిపోయినా అనుకుందామె.
    అతడు చాలా అందంగా యువతుల స్వప్న సుందరుడిలా ఉన్నాడు.
    అతడి మనోహర మందహాసం -- ఏ యువతి గుండెలో నైనా వెన్నెలలు కాయించగలడు.
    "లోపలకు రావచ్చా!" అన్నాడతడు.
    అతడి పలుకుల కామె మనసులో వేయి వీణలు మ్రోగాయి.
    అప్రయత్నంగా పక్కకు తప్పుకుందామే.
    అతడు లోనికి వచ్చి తనే తలుపు వేసి "మంచి నీళ్ళు కావాలి" అన్నాడు.
    ఆమె మంత్ర ముగ్దురాలిలా వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి చ్చింది.
    అప్పటికతడు బ్రేఫ్ కేసు కింద పెట్టేడు. ఆమె ఇచ్చిన మంచి నీళ్ళు తాగి -- "మీరిచ్చిన మూలాన కాబోలు -- తీయగా ఉన్నాయి " అన్నాడు.
    గులాబి మొహమాటంగా నవ్వి -- "ఎవరు మీరు?" అంది.
    "కొందరు దుర్మార్గులు నన్ను వెన్నంటి వస్తున్నారు. ఈ బ్రీప్ కేసు మీ యింట్లో దాచాలి. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన విలువైన కాగితాలున్నాయి " అన్నాడతడు.
    "ఉండండి - మా నాన్నను నిద్రలేపి వస్తాను" అంది గులాబి.
    "వద్దు -- నేను వెళ్ళిపోవాలి "- అన్నాడతడు కంగారుగా.
    అతణ్ణి కాసేపాపాలని ఆమె కనిపించింది -- "మా నాన్నకు తెలియకుండా ఈ బ్రీఫ్ కేసు మా యింట ఉంచలేను. ఆయన్ను లేపాలి" అందామె.
    "వద్దు" అన్నాడతను.
    "అయితే బ్రీఫ్ కేసు తీసుకుని వెళ్ళిపొండి" అంది గులాబి.
    "నేను నిజంగా తొందరలో ఉన్నాను. లేకుంటే నీ వంటి అందాల రాశితో కాసేపైనా మాటాడకుండా వెళ్ళి పోగలవా?" అన్నాడతను.
    తన నతడందాలరాశి అనడం ఆమె కెంతో సంతోషాన్ని కలిగించింది.
    "నాన్నా!' అందామె అప్రయత్నంగా.
    గురవయ్య కా పిలుపు చాలు.
    అతడు చటుక్కున లేచి అక్కడికి వచ్చాడు.
    ఆ యువకుడు తెల్లబోయాడు.
    "ఎవరు నువ్వు?" అన్నాడు గురవయ్య.
    ఆ యువకుడు మాట్లాడకుండా గురవయ్య వంకే చూస్తున్నాడు.
    గులాబి తండ్రికా యువకుడి గురించి చెప్పింది.
    తండ్రి అతడి గురించి తెలుసుకుంటే - అతడంటే యిష్టపడతాడేమోనని ఆమె ఆశ!
    'అంటే ఈ బ్రీఫ్ కేసు నేను దాచాలంటావు" అన్నాడు గురవయ్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS