"నేను ఆ బొమ్మ నైనా అయ్యాను కాదు - "అన్నాను గట్టిగా ఆమె ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. అప్పుడే నేను ఆమె కళ్ళలోంచి బయటకు వస్తున్న కన్నీటి ధారలను కూడా గమనించాను. ఆమె ముఖం చేతుల్లో కప్పుకునీ వెక్కివెక్కి ఏడవసాగింది.
నాకడుపులో దేవినట్లయింది. ఒకరకమైన ఆవేశంనన్నావహించింది. నేను ఆమె చుబుకాన్ని పైకి ఎత్తి శాంతా! అన్నాను.
"మీరు ....మీరు.... నావెంట పడి ఎందు కొచ్చారు?" అందామె.
నేను అనునయంగా ఆమె వంక చూసి -- "మీసమస్య పరిష్కరించవలసిన బాధ్యత నాకుంది. కానీ మీ సమస్యఏమిటో నాకు తెలియకుండా ఉంది. మీరు కోవెలకు వెళ్ళేదెందుకు? మాలను కట్టేడెందుకు? ఆతర్వాత కావించే విచిత్ర చర్యల వెనుక ఉన్న కధ ఏమిటి - వగైరా ప్రశ్నలకు సమాధానం తెలుసుకోకుండా మీ సమస్య నేలా పరిష్కరించేది -" అన్నాను.
ఆమె అప్పటికి కాస్త తమాయించుకుంది. నావంక దీనంగా చూసి "నా చర్యకు వెనుక రహస్యమేమీ లేదు. అవి నాజీవితంలోని దౌర్భాగ్యత్వానికి సూచనలు. ఆంజనేయస్వామి నా ఆరాధ్యదైవం ఆయనకు అందం లేదు. పైగా బ్రహ్మచారి. పూవులు నాకు మనోల్లాసాన్ని కలిగిస్తాయి. కానీ నేను కట్టే మాల చిన్నపిల్లలా పాలవుతుంది. వయసులోని అందమైన ఆడపిల్ల ఇచ్చే మాటలను ఎలా ఉపయోగించాలో చిన్నపిల్లలకు తెలియదు కదా ! అటువంటి వారికెనా మాల లభ్యమవుతుంది. పార్కులో నాకు లభించేది కేవలం ఒంటరితనమే ఆ గుర్తింపే నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ నాకన్నిటిని తుడిచే దెవరు న రుమాలు తప్ప నన్నానందపరచ గల ఊహ సుందరుని కోసం నేను పంపే సందేశాన్ని ఈ హంస ద్వారా అందుకోగలిగినదేవరు ? నాకు తెలుసు నాముద్దులు ఈ హంస కే పరిమితమని -" అని ఆగింది.
నేనాలోచనలో పడ్డాను. ఈమె జీవితం పై అంతులేని అసంతృప్తితో బాధపడుతోంది. శోభనాద్రితో సంసార జీవితమే అందుకు కారణమని స్పష్ట మవుతోంది. సమాజం విధించిన కట్టుబాట్ల పట్ల ఆమెకు భయమూ, గౌరవమూ కూడా ఉన్నాయి. శోభనాద్రి కి బదులుగా భర్త స్థానంలో మరొక అందాల యువకుడు ఉండాలని ఆమెకు బాగా కోరికగా ఉంది. తన కోరిక నెరవేరు తుందన్న నమ్మకమూ , నెరవేర్చుకోగలడానికి కావలసిన ధైర్యం కూడా ఆమెకు లేవు. ఫలితంగా కొన్ని సంవత్సరాల అసంతృప్తి ఆమెలో పేరుకుని ఇప్పటి ఈ విచిత్ర ప్రవర్తనకు దారి తీసి ఉండవచ్చునని నాకు తోచింది. విపరీతామైన అసంతృప్తితో బాధపడే వ్యక్తుల ప్రవర్తనలో కొంచెం పిచ్చి లాంటిది కనపడడం నా అనుభవానికి సంబంధించినంతవరకూ అసహజం కాదు.
నేనిప్పుడు శాంత పక్కన కూర్చున్నాను. "మీరు నా జీవితంలో ప్రవేశించి ఇంకా నెలరోజులు గడిచాయామో కాని మన పరిచయం ఎన్నో జన్మలదనిపించేటంతగా దగ్గరయ్యారు మీరు నాకు...."
నేనింకా ఏదో అనబోతుండగా ఆమె అందుకుంది - "అది నిజం కాదు. మన పరిచయం ఇంకా ఒకరి నొకరు మన్నించుకునే అంత దూరంలోనే ఉంది -" అని పైట చెంగుతో కనులు ఒత్తుకుంది.
ఆమాటలు నాకు ఏదో ధైర్యాన్ని ప్రసాదించగా ఆమెను మొట్ట మొదటి సారిగా దగ్గరగా తీసుకుని కనులలోకి వస్తూ "శాంతా ఆన్నాను. ఆమె అప్రయత్నంగా తన లేత పెదవులతో నా బుగ్గను స్పృశించింది.
"ఈ రోజు మనం మన దూత దగ్గరకు షికారు వెడదాం -" అంది శాంత" దూత ఎవరు? " అన్నాను ఆశ్చర్య పడుతూ.
"ఏదీ మీకు ఒక పట్టాన అర్ధం కాదు బాబూ' - అంది శాంత చిరుకోపంతో.
"నిజంగానే నాకు నీ మాటలు అర్ధం కావు అన్నాను."
శాంత స్వరం తగ్గించి నెమ్మదిగా -- "మనం ప్రేమికులం కాదు, కాబోయే భార్యాభర్తలం అందుకే మీకు నేను నువ్వు నాకు మీరు అది మన సంప్రదాయం."
కట్టుకున్న భర్తను వదిలి పెట్టి మరొక యువకుడిని పెళ్ళి చేసుకోవాలను కుంటున్న ఆమె సంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే నాకు తమాషాగా అనిపించినా పైకి ఏమీ అనలేదు. ఎందుకంటె నామటుక్కు నాకు ఆమెను వివాహం చేసుకోవాలనే ఉంది. అది నాలోని ఉదార స్వభావమో లేక ఆమె అందం నాకు కలిగించిన మైకమో చెప్పలేదు.
ఇంతకీ దూత కంటే శివాలయ,మున్న కొండ దగ్గర మెట్ల మధ్య నుంచి పక్క దారిలో ఉన్న చెట్టు మీద కొయ్య పలక పై హంస బొమ్మ అని నాకు మరో అయిదు నిముషాల తర్వాత ఆమెని వరించి చెప్పేవరకూ తెలియలేదు.
కొండ దగ్గరకు బస్సు లో కాక టాక్సీలో వెళ్ళాం.
ఇద్దరం జంటగా చేతులు పట్టుకుని కొండ ఎక్కుతున్నాం. ఒక పాతిక మెట్లు ఎక్కాక ఆమె విసుగ్గా ముఖం పెట్టి - "ఆడవాళ్ళను గజగమనలనీ, హంస గమనలనీ కవిత్వాలతో రాస్తారు కానీ మీరు పడకాలలో ఆడవాళ్ళ కంటే అన్యాయం బాబు" - అంది.
నాకు పౌరుషం వచ్చింది - "సరే! ఎవరు వేగంగా నడుస్తారో చూడండి అన్నాను.
ఆమె - "పందేమెందుకు ? నేను ముందుగా నడిచి పది మెట్లు వెడతాను. అప్పుడు మీరు నన్ను అందుకోగలరేమో చూస్తాను అంది.
నాకిది థ్రిల్లింగ్ గా అనిపించింది. శాంత వంటి ఆడదాన్ని పరుగెత్తుకు వెళ్ళి పట్టుకోవడమనే ఊహే నాకు గిలిగింతలు పెట్టింది సరే వెళ్ళు !" అన్నాను."
నేను ఆగాను. ఆమె ముందుకు వెళ్ళింది. నేను అమెపది అని అన్నప్పటికీ పట్టుదలకు మరో అయిదారు మెట్లు ఎక్కేవరకు ఆగాను.
శాంత పరుగెత్తడం మొదలెట్టింది.
నేను కదిలాను ముందు రెండడుగులు నెమ్మదిగా వేసి క్రమంగా వేగాన్ని పెంచుతూ పోవాలన్నది నాభిలష. అలాగే కదిలాని . పది హీను మెట్లు కూడా పైకి ఎక్కి ఉండను. అప్పటికే నాకదోలా అనిపించింది. మరో అయిదారు మెట్లు దాటేసరికి నేనేక్కడికో తేలిపోతూన్నట్లూ . ఏదో అయిపోతున్నట్లూ అనుభూతి చెందాను. అటుపైన ఇంకేం జరుగుతున్నది నాకు తెలియదు, మెట్ల పక్క గోడను ఊతగా తీసుకొని చతికిలపడిపోయాను.
ఎవరో నా తలపై నిమురుతున్నట్లనిపించి కళ్ళు తెరిచాను. నా తల శాంత ఒడిలో ఉంది. నేను కళ్ళు విప్పడం చూసి - ఆమె "ఏమయింది?" అనడిగింది కళ్ళలో అత్రుతను వ్యక్తం చేస్తూ.
"ఏమీ లేదు. కొద్దిగా కళ్ళు తిరిగాయంతే !" అన్నాను.
"ఇంతవరకూ బాగానే ఉన్నారు. హటాత్తుగా ఇలా ఎందుకు జరిగింది ?"
ఒక్క క్షణం తటపటాయించాను నేను - "బహుశా వేగంగా మెట్లు ఎక్కడం వల్ల ననుకుంటాను -" అన్నాను.
"చాలా ఆశ్చర్యంగా ఉంది. మెట్లెక్కితేనే స్పృహ తప్పిపోతుందా మీకు?" అన్నదామె ఆశ్చర్యంగా.
"స్పృహ తప్పడం కాదు, కళ్ళు విపరీతంగా తిరుగుతాయి. కాని తెరుచుకునేందుకు ఎంతో సేపు పట్టదు" అన్నాను.
7
మొదటి అట సినిమా చూసి ఇద్దరం ఇంటికి వచ్చాం. చూసింది తెలుగు సినిమా కావడం వల్ల కాస్త శృంగారం పాలు ఎక్కువగానే ఉంది. ఇంటికి వచ్చి భోజనాలు చేయడం అయ్యాక ఆమె నాతొ నెమ్మదిగా అంది "ఈరోజెందుకో నాకు భయంగా ఉంది. మీరు నాకు సాయంగా నా గదిలోనే పడుకోరాదూ?"
నేను తల అడ్డంగా ఊపాను -" వివాహం కాని యువతీ యువకులు ఒకే గదిలో పడుకోవడం మన సంప్రదాయం కాదు."
అమెముఖం అదోలా అయి పోయింది. నా వైపు అదోలా చూస్తూ - "నాకూ సంప్రదాయాల పట్టింపు ఉంది. నన్ను మీరు అపార్ధం చేసుకున్నారనుకుంటాను. ఈ రోజెందుకో నాకు భయంగా ఉంది -" అంది.
ఎటువంటి భయం?" అన్నాన్నేను.
ఎవరైనా నన్ను హత్య చేస్తారేమోనని!"
ఆశ్చర్యంగా ఆమె కళ్ళలోకి చూస్తూ "నిన్ను ఎవరు హత్య చేస్తారనుకుంతున్నావో చెప్పగలవా?"
చెప్పలేను, నిజం చెప్పాలంటే నా మనసు ఎప్పుడు ఏ లోకంలో ఎలా పరుగేడుతుందో తెలుసుకోలేకుండా ఉన్నాను. గాలి పటంలా ఉన్ననా జీవితానికి ఓక సరియైన ఆధారం నా జీవితం నేనే అంతం చేసుకుంటానెమోనన్న భయం కూడా ఉంది నాకు."
నేను ప్రేమగా శాంత కనులలోకి చూశాను - "నువ్వు చెప్పింది నిజమే. నీ విషయంలో ఇంకా జాప్యం చేయకూడదు. నీవు వివాహతవు. నిన్ను నేను వివాహం చేసుకోడానికి చట్టరిత్యీ అడ్డంకి ఉంది. మన మిద్దరం కలిసి నీ భర్త దగ్గరకు వెళ్ళి అతన్ని విడాకులకు ఒప్పింప చేసి అటుపైన మనం అనుకున్న ప్రకారం చెయ్యవచ్చు."
