"ఇల్లు నీదే కావచ్చు. కానీ ఇంట్లో నీది కానిది రెండు- ఓక దిండు, ఈ పాప -- అన్నాడు వెంకన్న.
"నీకు వాగుడేక్కువగా వుంది . మా నాగులు వస్తే నీకు దేహశుద్ది జరుగుతుంది ."
"వాగుడేవడు?" అన్నాడు వెంకన్న.
"ఒక్క పిడిగుద్దుతో ఈ ఇంటినే కూల్చి వేయగల శక్తి మంతుడు" అన్నాడు ఆ వ్యక్తీ.
"అయితే నేనూ , ఈ పాపా ఇంటి బయట నిలబడతాం " అన్నాడు వెంకన్న భయం నటిస్తూ.
"ముందా పాపనక్కడ దింపు" అన్నాడా వ్యక్తీ.
"అయాం వెరీ సారీ -- దిండులో దొరకని డబ్బును ఈ పాపతో సంపాదించుకుంటాను" అంటూ అక్కణ్ణించి కదిలాడు వెంకన్న.
ఆ వ్యక్తీ వెంకన్న ను ఆపాలని ప్రయత్నించి చావు దెబ్బలు తిని - "రత్నావతీ - నాగులు కింకా కబురందలేదా?' అన్నాడు.
"నాగులు గురించి నువ్వు బెంగెట్టుకోకు. మరోసారి వచ్చి వాణ్ని కూడా పలకరించి మరీవేడతాను. " అన్నాడు వెంకన్న త్వరత్వరగా అడుగులు వేస్తూ.
సరిగ్గా అప్పుడే వీధి తలుపులేవరో బాదిన చప్పుడయింది.
"నాగులు వచ్చాడు" అని రత్నావతి పరుగున వెళ్ళి తలుపులు తీసి, ఒక్కసారిగా షాక్ తిన్నది.
4
గుమ్మం దగ్గర నలుగురు పోలీసులున్నారు. వారి వెనుక నుంచి ఓ యువతి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి -- "సర్ - సమయానికే వచ్చాడా?" అంది వెంకన్నతో.
"థాంక్యూ వెరీ మచ్ రాజమ్మా!" అన్నాడు వెంకన్న. తన అసిస్టెంట్ తో. తర్వాత అక్కడున్న వ్యక్తివంక చూసి -- "మిస్టర్ - మీ నాగులింతవరకూ రాలేదు. నా అసిస్టెంట్ వాకీటాకీ లో కబురందుకుని క్షణాల మీద ఇక్కడకు చేరింది. వృత్తిలో పైకి రావాలంటే ఇలాంటి అసిస్టెంట్ వుండాలి" అన్నాడు.
పోలీసులా వ్యక్తినీ, రత్నావతినీ అరెస్టు చేశారు. వెంకన్న పాపను రాజమ్మ కిచ్చాడు. దిండును మాత్రం వదల్లేదతను. అంతా కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి. అక్కడికి కబురందగానే క్షణాల మీద వచ్చింది రామచంద్రరావు కుటుంబం.
ఇంటిల్లపాదీ పాప మీద పడిపోయి కన్నీళ్ళతో తడిపెశారు. ఆ పైన ముద్దుల వర్షం కురిపించేశారు. కాసేపు ఆ పాప ఊపిరాడలేదు.
ఆ పాపను తిరిగి ఇంటికి అప్పగించడానికి లక్షా యాభై వేలివ్వాలని ఈరోజు మధ్యాహ్నమే రామచంద్రరావు ఫోన్ వచ్చిందట. ఇంతవరకు పాప ఏమై పోయిందా అని బెంగ పడిపోతున్న ఆ కుటుంబం ఈ ఫోన్ కాల్ తో ధైర్యం చేజిక్కించుకుని ఆ డబ్బు సిద్దం చేయడానికే తయారైనదట. డబ్బెలా ఇవ్వాలో రాత్రి ఫోన్ చేస్తానన్నాడుట. ఫోన్ చేసిన వ్యక్తీ. ఈలోగా పాప దొరికేసింది.
రామచంద్రరావు డిటెక్టివ్ వెంకన్న కు పదివేలు మిగతా పోలీసు వారికి కూడా యేవో చిన్న బహుమానాలు ఇచ్చాడు.
రాత్రి పదయింది.
వెంకన్న దిండులో ఏడు వేలు పెట్టి, దిండును తీసుకుని పరంధామయ్య ఇంటికి వెళ్ళాడు.
వెంకన్న తలుపు తట్టగా తలుపు తీసిన రుక్మిణి ఆ అపరిచితుడిని అతడి చేతిలోని తలగడనీ చూసి యెవరో అర్ధం కాక- " ఎవరు కావాలండీ?" అనడిగింది.
"పరంధామయ్య గారు....' అన్నాడు వెంకన్న.
రుక్మిణీ తండ్రిని నిద్ర లేపి మరీ తీసుకు వచ్చింది.
"నేను మీ దిండు కోసం ఊరంతా పరుగెడుతుంటే మీరు హాయిగా ఇంట్లో యెలా నిద్ర పోగల్గుతున్నారు? ప్లాట్ ఫారం మీద మీ చాదస్తపు కబుర్ల వలనే మీ దిండు పోయింది. మీ దరిదాపుల్లో ఈ డిటెక్టివ్ వెంకన్న వుండడం మీ అదృష్టం?' అన్నాడు వెంకన్న కాస్త గర్వంగా.
డిటెక్టివ్ వెంకన్న అనగానే అంతా అతన్ని కురుహలంగా చూసి కాస్త ఇబ్బంది పెట్టారు.
పరంధామయ్య ఆప్యాయంగా దిండు నందుకుని "రైల్లో నా కొడుక్కు పయోగపడుతుందనుకుంటే మళ్ళీ నా దగ్గరకే వచ్చింది. దిండుకు కూడా ఎంత అనుబంధమో?' అన్నాడు.
"దిండు లోని డబ్బు జాగ్రత్తగా వుందేమో చూసుకోండి" అన్నాడు వెంకన్న కుతూహలంగా.
పరంధామయ్య నవ్వి -- 'అసలు దిండులో డబ్బంటూ వుంటే కదా! అది సాధారణంగా నేను చేసే ట్రిక్కు- దొంగాడి దృష్టిని ఈ దిండు మీదకు మళ్ళించడం నా అభిమతం. ప్రయాణంలో డబ్బు కూడా వున్నప్పుడు నేను నలుగురికీ తెలిసేలా ఓ వస్తువు నేన్నుకుని అందులో డబ్బున్నట్లు అందర్నీ భ్రమ పెడుతుంటాను. అందువల్ల లాభమేమిటంటే ఆ వస్తువోక్కటే పోతుంది?" అన్నాడు.
అంతే! అయన మాటలకు నవ్వాలో, ఏడ్వాలో డిటెక్టివ్ వెంకన్నకు తెలియలేదు.
***
