Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 11

 

    "మాటి మాటికి అనుమానించి నన్ను చిన్న బుచ్చ వద్దు. నా మంచితనం నీకే ముందు ముందు అర్ధం కాగలదు...." అన్నాడు బలరాం. నిజం చెప్పాలంటే ఆమె కళ్ళు తుడవాలని అతనికి అనిపించింది.
    ఎవరి కంచాలు వాళ్ళు కడుక్కున్నారు. ఒకరికొకరు సాయపడగా గిన్నెలు కడుక్కున్నారు. ఉమా ప్రోత్సాహము లభించక పోవడం వల్ల బలరాం అట్టే ఎక్కువగా మాట్లాడలేదు. నిద్ర సమయంలో మాత్రం ఇద్దరూ మాటాడుకో వలసి వచ్చింది.
    ఉన్నదొకటే పరుపు, ఒక్కటే దుప్పటి . గదిలో కాస్త చలిగానే వుంటోంది.
    "నేను క్రింద పడుకుంటాను. చిన్నప్పట్నించి అలవాటే!" అంది ఉమ.
    "నాకూ క్రిందనే అలవాటు. ఆడవాళ్ళ శరీరాలు కోమలంగా ఉంటాయి. నువ్వు పరుపు మీద పడుకో" అన్నాడు బలరాం.
    'అనుమానించ వద్దంటూనే నీ బుద్దిఅనుక్షణం బైట పెట్టు కుంటున్నావు. పడుకునే టప్పుడు ఆడవాళ్ళ శరీరాల గురించి ఆలోచించవలసిన అవసరమేముంది?" అంది ఉమ.
    బలరాం ఆమెతో మాట్లాడదల్చుకోలేదు. ఆమెకి చిన్న తనం కావచ్చు. అతను కూడా వయసులో ఆమె కంటే ఎంతో పెద్ద కాదు. అతను చలి అనిపిస్తున్నా పరుపు పక్క క్రిందనే పడుకున్నాడు. ఉమ పరుపుకి అవతల పక్క క్రిందగా పడుకుంది. ఇద్దరూ పరుపు ను వదిలి పెట్టి క్రిందనే పడుకున్నారు.
    ఉమకు త్వరగానే నిద్ర పట్టినట్లుంది కాని బలరాం కి ఓ పట్టాన నిద్ర రావడం లేదు. అతని మనసు పరిపరి విధాల పోతోంది.
    ఈ పరిస్థితుల్లో ఉమ తనకు సహకరించి తనతో స్నేహంగా వున్నట్లయితే ఈ గదిలో రోజులు క్షణాల్లా గడిచిపోయుండేవి.కానీ తనకా అదృష్టం లేదు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. అదుపు తప్పుతున్న మనసు, నేలమీద చలి....
    బలరాం చాలాసేపటికి తెగించి ఉమ వైపు చూశాడు. ఆమె ముఖం అటు వైపు తిప్పి పడుకుని వుంది. కదలిక లేదు కాబట్టి నిద్ర పోతోందని అనుకోవాలి. పరుపుమాత్రం ఖాళీగావుంది.
    బలరాం తనపడక పరుపు మీదకు మార్చాడు. నేమ్మదిగా దోర్లుకుంటూ వెళ్ళి ఉమ మీద చేయి వేశాడు. ఆమె కదలలేదు. నెమ్మదిగా చేతిని ఆమె బుగ్గల మీదకు పోనిచ్చాడు. మృదువుగా వున్న ఆమె చెక్కిళ్ళు తగులుతుంటే అతనికి ఏదోలా అనిపించింది.
    అంతలోనే ఉమా చటుక్కున లేచి కూర్చుని "నేననుకుంటూనే వున్నాను, నీ బుద్ది తిన్నగా వుండదని...." అంది. బలరాం వులిక్కిపడి ఏదో అనేలోగానే ఉమ బ్యారుమని ఎడ్చేసింది.
    ఆమె అలా ఏడుస్తుంటే బలరాం కు భయం కూడా వేసింది. "నన్ను మన్నించు ఉమ!" అన్నాడు.
    "నీతో ఈ గదిలో ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రుళ్ళు గడపాలో -- ఇంకోసారి నన్నలా ముట్టూ కున్నావంటే నేను చచ్చిపోతాను " అంది ఉమ.
    బలరాం మాట్లాడకుండా నిద్రకు ఉపక్రమించాడు. మొత్తం మీద తెల్లావారు ఝామున అతనికి నిద్ర పట్టింది. లేచేసరికి బాగా ఆలస్యమైంది.
    "కాఫీ సిద్దంగా వుంది. మొహం కడుక్కో !" అంది ఉమ. ఆమె మాట కాస్త ప్రసన్నంగా ఉండడం చూసి బలరాం కాస్త తృప్తి పడ్డాడు.
    సమస్య మళ్ళీ స్నానం చేయడం దగ్గర వచ్చింది.గదిలో మరుగు లేదు.
    "నేను స్నానం చేయను" అంది ఉమ.
    "నా గురించి నువ్వు ఎన్నని మానేయగలవు? నేను కళ్ళు మూసుకుంటాను లే ...." అన్నాడు బలరాం.
    ఉమ ఓ రెండు క్షణాలు అలోచించి-- "అలా కుర్చీలో కూర్చో !" అంది.
    బలరాం కూర్చోగానే ఉమ అతన్ని కుర్చీకి గట్టిగా కట్టేసి కుర్చీని మరో వైపుగా తిప్పింది. ఎందుకయినా మంచిదని అతని కళ్ళకు గంటలుకూడా కట్టి "అమ్మయ్య!" అని నిట్టూర్చింది.
    అతన్నా స్థితిలో వుంచి నాకనె స్నానానికి కృత్యాలన్నీ ఆమె నిశ్చింతగా ముగించగలిగింది. బట్టలు మార్చుకుని వచ్చేక "నీకు తృప్తిగా వుందా?" అన్నాడు బలరాం.
    "నీకు గంతలు సరిగా కట్టలేదనీ, పక్క చూపులు చూస్తున్నావనీ నాకు అనుమానంగా వుంది. సరిగా స్నానం చేయలేక పోయాను" అంది ఉమ.
    "నీ కర్మ -- నువ్వో నిత్య శంకితురాలివి" అని అతనంటూ వుండగా ఆమె అతని కట్లు విప్పింది.
    "నన్ను నమ్మడానికి రెండు కారణాలు చాలు...." అన్నాడు బలరాం.
    "ఏమిటవి?" అంది ఉమ.
    "నువ్వు నన్నుకట్లు కడుతువుంటే వూరుకున్నాను. మళ్ళీ నా కట్లువిప్పుతావని గ్యారంటీ యేమిటి? ఐనా నీ బాధ తెలిసినవాడ్ని కాబట్టి అంగీకరించాను. రెండో కారణం ఏమిటంటే ...." అని క్షణం తటపటాయించాడు బలరాం.
    'ఆదీ చెప్పు" అంది ఉమ.
    "నిన్నీ పళంగా ఇలా బలంగా కౌగలించు కుంటే నన్నడ్దేదేవరు?" అంటూ చటుక్కున ఆమెను కౌగలించుకున్నాడు బలరాం. తెల్లబోయిన ఉమ కౌగిలి నుంచి విడిపించుకునే ప్రయత్నం చేయడానికి కొద్ది క్షణాలు పట్టింది. ఆ ఆలశ్యం లోనే తన శరీరం తనకు ఎదురు తిరుగుతోందని ఆమె పసి గట్టింది. ఆమె బలంగా బలరాం ని తోసివేసింది.
    బలరాం వెనక్కు పడిపో బోయి నిలదొక్కు కుని "ఉమా! ఇక్కడ మనం ఇలా ఎన్నాళ్ళు ఉండాలో తెలియదు. నేను నిన్ను తప్పక పెళ్ళిచేసుకుంటాను. ఈ ఖైదు జీవితం లో నువ్వున్నావన్న వూహ ఒకటే నా కానందాన్నిస్తోంది. ఆ ఆనందాన్నించి నన్ను దూరం చేయకు, నన్ను కరుణించు" అన్నాడు.
    "నిన్ను పెళ్ళి చేసుకుంటానో లేదో నాకు తెలియదుకానీ పెళ్ళి కాకుండా మాత్రం నేను మగవాడికి లొంగను. ఇంకోసారి ఇలాంటి పని జరిగితే గ్యాస్ స్టవ్వుఉంది కదా -చీరకు నిప్పంటించుకుని చచ్చిపోతాను" అంది ఉమ.
    ఆమె సామాన్యురాలు కాదని బలరాం కి అర్ధమైంది. ఆమెను ఎలా లొంగదీసుకోవాలా అని అతను ఆలోచిస్తున్నాడు.
    అయితే ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బీరువా తలుపులు వచ్చేక ఉమ పరుగున వెళ్ళి బలరాం ను కౌగలించు కొంది. ఊహించని ఈ పరిణామానికి బలరాం ఆనందబడుతూ ఆమెను బలంగా  హత్తుకున్నాడు. నెమ్మదిగా ఉమ అతని చేతికో చీటీ అందించింది.
    "ఈరోజు నుంచి లెక్క పెట్టుకుంటే మీ ఇద్దరి జీవితకాలం సరిగ్గా పది రోజులు."
    ఆ కాగితంలో వ్రాసి వున్న వాక్యమిది. ఆ క్షణం లో బలరాంకు ఆ వాక్యమంత భయంకరంగా తోచలేదు. "ఉమా! నువ్విలా నా చేతుల్లో వుంటే నేనీ క్షణంలో చనిపోవడానిక యినా సిద్దమే" అంటూ అదురుతున్న ఆమె పెదాల పై ముద్దు పెట్టుకున్నాడు.

                                   7
    "బలరాం!" అంది ఉమ.
    "ఊ" అన్నాడు బలరాం.
    "హెచ్చరిక ప్రకారం పదోరోజు ఈ వేళ...."
    "అవును...." అన్నాడు నిర్లిప్తంగా బలరాం.
    'అలా నిర్లిప్తంగా వుంటావేం? నాకు చావాలని లేదు. మనమిద్దరం యిక్కడ్నించి బయటపడే ఏర్పాటు చూడు. తర్వాత ఇద్దరమూ పెళ్ళి చేసుకుని...."
    "పెళ్ళా? ఒకవేళ నేను నిన్ను మోసం చేస్తే ...." అన్నాడు బలరాం.
    "చెయ్యలేవు.చేస్తే నేను నిన్ను చంపేసి నన్ను నేను చంపుకుంటాను " అంది ఉమ.
    బలరాం నవ్వి "నేను నిన్నుమోసం చేస్తే ప్రతిఫలంగా ఇద్దరం చస్తాం. అంతేగదా -- నేను నిన్నుమోసం చేశానను కుని ఇద్దరి చావుకూ సిద్దపడు. ఇక్కడ మనలను రక్షించగలవారేవ్వరూ లేరు...." అన్నాడు.
    "నేను నిన్నే నమ్ముకున్నాను. నీకు సర్వస్వం అర్పించుకున్నాను. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను.నువ్వు నన్ను రక్షించాలి " అంది ఉమ. ఆమెకు ఏడుపు వస్తోంది.
    "కొద్ది రోజులు క్రితం నేను నిన్ను వేడుకున్నాను. నువ్వు నిర్లక్ష్యంగా వుండేదానివి. ఇప్పుడు నువ్వు నన్ను వేడుకున్తున్నావు. నేను నిర్లక్ష్యంగా వుంటున్నాను. ఆడదానికి మగవాడికి ఇక్కడే తేడా. ఒకసారి లొంగే వరకూ ఆడది ఎంత నిర్లక్ష్యంగానయినా వుండగల్గుతుంది. కానీ ఒకసారి లోంగిందో తర్వాత నిర్లక్ష్యమంతా మగాడిది. అయితే యిప్పుడు మనిద్దరి విషయంలో ఒక తేడా వుంది.నేను నిన్నుకోరినప్పుడు నా కోరిక నువ్వు తీర్చగలిగే స్థితిలో వున్నావు. ఇప్పుడు మాత్రం నేను నీ కోరిక తీర్చగల స్థితిలో లేను. నన్ను నేనురక్షించు కోగలిగినప్పుడు గదా నిన్ను రక్షించే ప్రసక్తి వస్తుంది...." అన్నాడు బలరాం.
    'అయితే మనకు చావు తప్పదంటావా?"
    "ఉమా-- ఈ గదిలో బంధించబడిన క్షణం నుంచీ ఒంటరితనం నుంచి తప్పించుకోవాలని ఎంతో కోరుకున్నాను. నీ సమక్షంలో నన్నా బాధ వదిలి పెట్టింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చివరి క్షణం వరకూ నిన్ను రక్షించడానికి నా చేతనయినది చేస్తాను. కానీ పిరికి వాళ్ళలా చావంటే భయపడుతుండడం నా కిష్టం లేదు. జరగనున్న దేలాగూ జరుగుతుంది . నాకు దగ్గరగా ఈ పరుపు మీద ఒకరి పక్క ఒకరు సర్వంమరిచిపోదాం. మన లోకం మనది. ఇతరులతో మనకు నిమిత్తం లేదు. మరో ఆలోచన మనకు వద్దు"అన్నాడు బలరాం.
    ఉమ అతనికి దగ్గరగా జరిగి "మననేవ్వరూ వేరు చేయలేదు. ఆఖరికి ఆ దేవుడు కూడా" అంది. బలరాం ఆమెను బలంగా హత్తుకున్నాడు.
    సాయంత్రం నాలుగు గంటలు దాటేక కాబోలు ఆ గదిలో కాలింగ్ బెల్ మ్రోగింది.
    
                                       8
    ఒక మనిషి సముద్రం వైపు వెడుతున్నాడు.
    జోగినాధం కొద్ది క్షణాలతన్ని పరిశీలించేక-- అతడు సముద్రంలోకి ఆగకుండా నడుస్తున్నాడని గ్రహించి ఒక్క వుదుటున లేచి పరుగెత్తాడు. ఆ మనిషిని అందుకుని రెక్క పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చి "ఏమిటి నువ్వు చేయబోయింది?" అన్నాడు.
    ఆ వ్యక్తీ జోగినాధం వంక చిరాగ్గా చూసి "ఎవరు మీరు?" ఈ నిర్జన ప్రాంతం లో క్కూడా వచ్చి నా ప్రాణాలు రక్షించారు ?" అన్నాడు.
    "నేను భగవంతుడి ప్రతీనీధిని. ఎలాంటి వారి కష్టాలనయినా తీర్చగలను. నువ్వెందుకు ఆత్మహత్యకు తలపడ్డావో చెప్పు ...." అన్నాడు జోగినాధం.
    "అయితే  నా ఉమను నాకు దక్కించగలరా చెప్పండి" అన్నాడా వ్యక్తీ.
    "ఉమ ఎవరు .... అసలు నీ కధంతా వివరంగా చెప్పు ....' అన్నాడు జోగినాధం.
    "నా పేరు బలరాం...." అంటూ అతను తన కధను ప్రారంభించాడు. ఉద్యోగాన్వేషణలో ఆరంభమై ఉమ సంయోగంతో  నడిచిన ఆ కధను జోగినాధం చాలా ఆసక్తిగా విన్నాడు.
    "పది రోజుల్లో మాకు మరణ ముందని అంటున్నప్పటికీ అలా జరుగలేదు. అయిదు నెలలకు పైగా మేము సుఖ జీవనం చేశాము. ఒకరి నొకరు అర్ధం చేసుకున్నాము. అయితే ఈరోజు హటాత్తుగా నేనీ వూళ్ళో ప్రత్యక్ష మయ్యాను. నా జేబులో వెయ్యి రూపాయలున్నాయి. నేనక్కడ్నించి మాయామై ఈ వూరి హోటల్ గదిలో కేలా వచ్చానో నాకు తెలియదు. ఎవరో చప్రాసీ లాంటి వాడు నన్నీ ఊరి హోటల్ గదిలో దిగబెట్టి నట్లు హోటల్ యజమాని అంటున్నాడు. నా ఉమను కలుసుకోగలనన్న ఆశ నాకు లేదు. ఈ బ్రతుకు వ్యర్ధమనిపిస్తోంది...." అన్నాడు బలరాం.
    "నీ జేబులో వున్న వెయ్యి రూపాయలూ నీ కేన్నాళ్ళు వస్తాయి ?"
    "కనీసం నాలుగైదు నెలలు....." అన్నాడు బలరాం.
    "ఐదు నెలల పాటు ఉమ కోసం ఎక్కడెక్కడైనా ప్రయత్నించు. జీవితం కొనసాగించు. సరిగ్గా ఐదు నెలలు అయ్యాక నేనిచ్చిన అడ్రసు కు రా. నీ ఉమ దొరుకుతుంది. ఈ లోపల నేనొక ముఠాను పట్టుకునే ప్రయత్నంలో వున్నాను." అన్నాడు జోగినాధం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS