Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 11


    చచ్చినవాడి కళ్ళు చారడేసి అన్నట్లు అక్కడచేరి ఎలాగూచచ్చాడు కాబట్టి సానుభూతి మాటలు ఎవరికితోచిందివారు మాట్లాడటం మొదలు పెట్టారు.
    ఊరు నిద్రలేచింది.
    కిందకి పైకి తిరిగేవాడు కురై తికి వార్త అందించాడు. మనం యింకా యిక్కడ ఉండటం మంచిదికాదని.
    అక్కడికి ధైర్యం చేసి మరొక్క పావుగంట పనికానిచ్చి ఉట్టిచేతులతో కురైవతి తనవాళ్ళని తీసుకుని నిరాశతో కొండిదిగిపోయాడు.
    చచ్చినవాడు చచ్చాడు.
    కురైవతి తనవాళ్ళతో వెళ్ళిపోయాడు.
    తెల్లవారుజామునుంచీ వక్కోబిచ్చగాడూ లేవటం మొదలుపెట్టాడు.
    పెద్దపూజారి చిన్నపూజారి గుడికి బైలుదేరారు.
    మరోగంట తర్వాత
    ఊరువాడ కోడైకూసింది.
    ఈతఫా గుడిని మొత్తం తవ్వేశారు దొంగలు గుడిమొత్తాన్ని పెగలించుకుపోయారు అని.....
    ఇదిగోతోక అదిగోపులి అందరికీ తెలిసినకధే అయినా ప్రజలధి ఆ కథ మర్చిపోయి తోక-పులి కథలు ప్రచారం చేస్తూనే వుంటారు.
    గుడి ఏమీ చెక్కుచెదరలేదు.
    గుడిచుట్టూ తానే దొంగలు రాళ్ళు పైకిలేపి తవ్విపోశారు కాని కధకిమాత్రం చిలవలు పలవలు చేర్చడం జరిగింది. గుడిని తవ్వనూలేదు ఎవరూ ఎత్తుకెళ్ళనూలేదు.
    ఏదో చెడువాసన వస్తే తనుగట్టిగాపీల్చి ఆతర్వాత సృహతప్పానని శివుడు క్రితంసారి కట్టుకధ చెప్పాడు. ఈతఫా ఏవాసన పీల్చకుండానే ఏం జరుగుతుందో తలకి ఎక్కకముందే తనుకుప్పకూలిపోవడం జరిగిందని చెప్పాడు.
    శివుడికికాని, పుట్టన్నకికాని మర్నాడు మధ్యాన్నందాకా తెలివిరాక పోవడంవల్ల బతికిపోయారు లేకపోతే పోలీసులు ముందుగా వాళ్ళభరతం పట్టేవాళ్ళు.
    మెట్లమీద వున్న బిచ్చగాళ్ళందరినీ అరెస్ట్ చేశాడు ఇన్ స్పెక్టర్వర్ధనరావు.
    ఈతఫా పక్కవూళ్ళో వారుకూడా కదిలి వచ్చారు ఈవింత చూడటానికి.
    పోలీసు కుక్కలు వచ్చాయి.
    పైఅధికార్లు వచ్చారు.
    అందరూ కలసి రంగంలోకి దిగారు.


                       7
    
    ఈ తఫా
    అన్ని దినపత్రికలూ కూడబలుక్కున్నట్టు ప్రముఖంగా ఫ్రంట్ పేజీలో ఈ వార్తని ప్రచురించాయి.
    దాంతో
    చలనం సంచలనం కలిగింది, అక్కడ ఉన్నవాళ్ళు చెప్పుకోటం గాక ఎక్కడెక్కడి వాళ్ళో ఏవేవో పుట్టించి చెప్పుకోటానికి  కుదిరింది. కొందరు భక్తులు కూడా బయలుదేరి అక్కడికి వచ్చి చేరారు.
    వివిధ దినపత్రికలు ఇలా రాశాయి.
    యిలా ఎక్కడయినా జరుగుతుందా!
    కనీవినీ ఎరుగని వాస్తవ వింత.
    గుడినిమింగే ప్రయత్నం.
    చెక్కు చెదరని గుడి ముక్కచక్కలయిన ముచ్చట.
    ఈ పని చేసింది దొంగలా దొరలా!
    పరమేశ్వరీ ఆలయం ఫోటో ఆ పక్కనే తవ్విపోసిన రాళ్ళు రప్పలు. మరో ఫోటో బ్రతికి బయటపడ్డ వాచ్ మాన్ లు అవి శివుడు పుట్టన్న ఫోటోలు.
    అట్టహాసంగా పత్రికలు ఫోటోలతో సహా ప్రచురించాయి.
    బయట విశేషాలు అలావుంటే.
    అసిరిపల్లె వచ్చేపోయే భక్తులతో వ్యాపారులతో కార్లు, బస్సులు, కొత్త షాపులు..... మొత్తానికి ఊరు గుడి ఏకమై ఈ దొంగల కధతో నెల తిరక్కుండానే పెరిగిపోయింది ఏదైనా వింత జరిగితే అక్కడికి తీర్ధ ప్రజలా జనం వస్తారని వ్యాపారులకి తెలుసు. పిల్లామేక తరలివచ్చిన చోటికి తామూ వెళితే బిజినెస్ బాగా జరుగుతుందని వ్యాపారస్తులకి తెలుసు, దాంతో వాళ్ళు వచ్చి కొత్తషాపులు తెరిచారు. మేమేమన్నా తక్కువ తిన్నామా అని బిచ్చగాళ్ళు సన్యాసులు బయలుదేరి వచ్చారు.
    "నేను చెపుతూనే ఉన్నాను. గోడకి ఆనుకుని చెట్టు ఉండరాదని......నా మాట ఎవరయినా విన్నారా! పచ్చని చెట్టుని కొట్టకూడదన్నారు. సరే చెట్టుకాదు మరో పుట్ట. అనుమానమంటూ వచ్చింతరువాత దానిని తొలగించాలి. నే చెప్పింది కాదన్నారు. ఇప్పుడు నా మొగుళ్ళు (పై అధికారులు) వచ్చారు కదా! వాళ్ళేం అఘోరిస్తారో చూస్తాను" అని పోలీసు స్టేషనులో తనకింద వాళ్ళముందు చిందులు తొక్కాడు ఇన్ స్పెక్టర్ వర్దనరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS