Previous Page Next Page 
గురవాయణం పేజి 9


                                                    చలికాలం
    
    ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, చివరగాపోయేకాలం. వీటన్నింటిలో నాకు చలికాలం ఇష్టం. గుంటూరు ఎండలు అనుభవించి, అమరజీవిగా మిగలకుండా ఇంకా నూకలు లెక్కేస్తున్నాను కాబట్టి, ఎండాకాలం ఇష్టం ఉండే ప్రసక్తేలేదు. చిన్నప్పుడు ఎండాకాలం సెలవులు మటుకు వేరు.
    ఆ ఆనందం చమటాతీతం. వర్షాకాలం అంతా రొచ్చు, చచ్చుజ్ఞాపకాలే, కాలేజీరోజుల్లో వర్షం గుర్తులు బురదా- వరదా మాత్రమే.
    పైగా మనం తడిసి ముద్దవుతుంటే, వాడేమో ముద్దుగా కారులో వెళుతున్నాడని అసూయ, కోపం, కసి. బయట raining, లోపలనోట్లో వేడివేడి మిరపకాయ బజ్జీలు burning, చేతిలో James Hadley Chase నవల thrillin, పక్క నుంచి tapeలో Rafi singing వర్షాకాలమంటే బురద మాత్రమే కాదు- సరదా కూడా అనే romantic feeling వచ్చేసరికి నాకు పోయే కాలం వచ్చేసింది.
    కానీ చలికాలం అలాకాదు. చిన్నప్పుడు ఇప్పుడు అన్ని వయస్సులలో, అన్ని వేళల్లో వెచ్చవెచ్చ గానే ఉండిపోయింది. చిన్నప్పుడు, అమ్మ స్వహస్తాలతో కుట్టినబొంతలో దూరగానే-అమ్మ ప్రేమ, చల్లదనం, బొంతవెచ్చదనం ఒక్కసారిగా నిద్రలోకి ముంచేసేవి. బొంత అంటే ఏమిటో ఆనాటి మధ్యతరగతి పిల్లలందరికీ తెలుసనే అనుకుంటాను.
    అలానే అమ్మ అల్లిన half sweaterలోని దారాలు ఊడిపోయేదాకా బొడ్డు కనపడేదాకా, ఓ పది (చలి)కాలాలు ఉద్ధరించినట్లు గుర్తు.
    అమ్మమ్మ ఊళ్ళో-సంక్రాంతి రోజుల్లో ఉదయం జీతకాళ్ళు వేసిన చలిమంటల్లో చలి కాచుకోవడం మరో అందమైన అనుభవం. కానీ, MBBS అయి నాకు, Delhi AIIMSలో Sndhakar గాడి roomని కబ్జా చేసిన రోజుల్లో అర్ధమయింది.
    మన ఆంధ్రదేశం చలి పిల్లి అని- Delhi చలి పులి అని. ఒక్కరోజులో మన వేషమే మారిపోయింది.T-Shirt, దానిమీద చొక్కా, దాని మీద Sweater, Monkey cap, mufler, అచ్చం పాత సిన్మాల్లో దొంగోడిలా ఉండేది Getup.
    ఆ తర్వాత Englandకి వెళ్ళిన తర్వాత తెలిసింది- పిల్లికాదు, పులికాదు- బాహుబలి చలి అంటే ఏమిటో, బయట మంచు, రోజూ ఉదయమే drive way స్వ హస్తాలతో ఊడ్చుకుని, ఏడ్చుకుని- Hospitalకి చేరుకునేవాడిని.
    కానీ చలి ఎంత ఎక్కువ ఉన్నా లోపల heater, duvete (english బొంత)- మంచి TV Comedy Serials హాయిహాయిగా ఉండే జీవితం. తెల్లోడు చలికాలంలో night-cap అనే ఒక peg brandy సేవించి, తరించి, నరాల్లో వెచ్చదనాన్ని నింపుకునే వాడట. దురదృష్టం-నాకు ఆ అలవాటు లేక-నా నరాల్ని గోరువెచ్చ గానే ఉంచాల్సి వచ్చింది.
    చలికాలం గురించి మంచి కవిత చెప్పండి అని తనికెళ్ళ భరణిగారిని అడిగితే ఆయన బులుసువెంకటేశ్వర్లుగారి కవిత ఒకటి చెప్పారు.
    "చలికి ఒణుకుతుండే సర్వ ప్రపంచంబు.....తల్లి కడుపులోని పిల్ల తప్ప..."
    నిజమే కదా అమ్మ కడుపు నెంబర్వన్ ఎయిర్ కండిషన్. మంచుపొరల ఉదయంలో అందాలు చూడాలన్నా-చెలి కౌగిలిని, చలికౌగిలిని ఒకేసారి అనుభవించి, ఆనందించాలన్నా మంచురత్నం సారీ మణిరత్నం సిన్మాలో చూడాల్సిందే.
    మంచు అనగానే మణిరత్నంతోపాటు వెంటనే గుర్తొచ్చేది, బాలగంగాధర్ తిలక్ 8 పేజీల కవిత 'మంచు'- (అమృతం కురిసిన రాత్రి కవి తల సంకలనంలో).    
    కాకపోతే తిలక్ మనలాంటి అల్పజీవి కాదు కదా, అందుకనే ఆయన, మంచులోని అందాన్ని వదిలేసి- మంచును, విలువలని నిజాలని, కప్పేసే ఓ కవితా వస్తువుగా తీసుకుని సమాజంలో ఉన్న చీకటి మనుషుల్నందర్నీ మంచు పర్వతాల్లో పాతిపెట్టాడు.
    ఉదాహరణకు కొన్ని...
    "మాయ మంచు, అనుమానం మంచు, అవిధేయత మంచు, మూగ బాధవంటి మంచు, నీకూనాకూ మధ్య నిజాన్ని దాచిన మంచు, మనిషికీమనిషికీ మధ్య మమతను కప్పిన మంచు, నిరాశ మంచు, నిస్పృహ మంచు" అయ్య బాబోయ్- తిలక్ మంచువద్దు లేండి మనకు. మనం మణిరత్నంతో సెటిల్ అయిపోదాం. ఇక నాకు పోయే కాలం వచ్చింది-సెలవ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS