కాయ చెక్కుతీసి చూసి పూర్తిగా రేగికాయలే అని నిర్ధారణ చేసుకున్న తర్వాత గోమతి తెచ్చిన దోసెడు కాయల్లో కొద్దిగా కీర్తి తిండి, మిగిలినవి గోమతి తీనేసింది. కాయలు తిన్న తర్వాత దాహం పూర్తిగా కాకపోయినా కాస్త పోయి అనిపించింది.
మిగతా రెండు వేపులా చూసి వచ్చిం తరువాత మళ్ళీ రేగికాయలు కోసుకొచ్చుకుని అంత క్రితం కీర్తి మొదటిసారిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాలని అనుకున్నారు.
గోమతి వెళ్ళింది మరో దిక్కుగా.
ఎండ తీవ్రత తెలుస్తున్నది. సూర్యభగవానుడు పైకి వస్తున్నాడు.
కీర్తికి బాగా జ్వరం వచ్చేసింది. కాలి సలుపరింత ఎక్కువయింది.
గోమతి అన్ని చోట్ల తిరిగి గంటన్నరకి వచ్చింది.
గోమతి చెప్పిన ప్రకారం మూడువైపులా మార్గం సరిగలేదు ఓ వైపు మాత్రం వుంది అటు బైలుదేరి వెళితే ఏం జరుగుతుందో తెలియదు. దరిదాపుల్లో నీళ్ళు లేవని మాత్రం తెలిసింది.
కీర్తి చెప్పిన దాని ప్రకారం కీర్తి, గోమతి మొదటి ప్రదేశానికి బైలుదేరారు.
కీర్తి నడవలేక రెండుసార్లు తూలి పడబోయింది. గోమతి చటుక్కున పట్టుకుంది.
గోమతి భుజం మీద చేయి వేసి కీర్తి పడవగలిగింది. కొద్దిసేపటిలోనే ఇద్దరూ మొదటి ప్రదేశానికి వచ్చారు.
"అదిగో అక్కడే నేను పడింది" అంటూ కీర్తి వేలు జూపి చటుక్కున చెయ్యి క్రిందకు వాల్చింది.
గోమతి నిర్ఘాంతపోయి నిలిచింది.
6
ఆటవికులు ఓ పది మంది దాకా వున్నారు. పీచుతో తయారయిన బట్టలు ధరించారు. కొందరి చేతులలో విల్లంబులు బాణా కర్ర వుంటే మరికొందరి చేతుల్లో పొడుగాటి బరిసెలున్నాయి. వాళ్ళంతా నల్లగా పొట్టిగా వున్నారు, శరీరాలు మటుకు కండలు తిరిగి మంచి దృఢంగా వున్నారు. రాగిజుట్టు ఎర్రటి కళ్ళు పొట్టముక్కు ఆ చివరి నుండి ఈ చివర దాకా వున్న పెద్దనోరు చూడంగానే విచిత్రంగా, భయంకరంగానూ వున్నారు.
కీర్తి చెట్ల పొదల్లో దాచిన సూట్ కేసులు బ్యాగ్ చెట్టు మీద వున్న కీర్తి బ్యాగ్ మరికొన్ని దొరికిన సామానులుగుట్టగా పెట్టారు. విమాన ప్రమాదంలో మిగిలిన మొండి కళేబరాలను మరో ప్రక్క గుట్టకా పెట్టారు.
అడవిలో వున్న ఆ అటవికులు సుండా జాతివాళ్ళు వాళ్ళు వేటకు బైలుదేరుతూ అటువచ్చారు. కనబడ్డ వాటిని ఓచోట చేర్చి ఇవెక్కడివా అని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో కీర్తి గోమతి అక్కడికొచ్చారు.
వాళ్ళు వీళ్ళనీ వీళ్ళు వాళ్ళని ఒకేసారి చూశారు.
సుండాజాతివారి ఆయుధాలు అవసరమయితే ప్రయోగించటానికి సిద్దంగా పట్టుకున్నారు. వాళ్ళెవరూ మాట్లాడుకోటం లేదు. కళ్ళార్పకుండా కాలు కదల్చకుండ నుంచున్నారు.
భయంతో గోమతి శరీరమంతా గజగజ వణికి పోతున్నది.
కీర్తి వంటి కాలిమీద బరువంతా మోపి గోమతి భుజం మీద చేయి ఆధారంగా వేసి నుంచోని వుంది. ఆ క్షణంలో ఏం చెయ్యాలో కీర్తికి తోచలేదు. ప్రమాదంలో అవసరమయితే వుపయోగించటానికి మినీ బాంబులు దగ్గరే వున్నాయి. షర్టు కున్న గుండీలు నిజం గుండీలు కావు గుండీ ఆకారంతో చేసిన బాంబులు. గుండీని లాగినొక్కి గాలిలో విసిరేస్తే పేలుతుంది మత్తుతో కూడిన విషపు గాలి దానినుంచి బైలుదేరుతుంది. కన్ను మూసి తెరిచేంతలో మనుషులు పీనుగు లవుతారు. అయినా గుండీ బాంబు తీయలేదు కీర్తి. ఈ పది మందినీచంపటం వల్ల ప్రమాదం తప్పుతుందనేముంది! చూద్దాంఅనుకుంది.
సుండా జాతి వాళ్ళు కలు కదల్చకుండ కన్నార్పకుండా అలా నుంచొనే వున్నారు.
"క్విక్! గోమతీ! చేతులు కట్టుకుని తలవంచుకుని నుంచోవీళ్ళుమన్ని బంధించి తీసుకెళితే నీరు ఆహారందొరుకుతుందేమో తర్వాత తప్పించుకుందాము. మనం ఇద్దరం వాళ్ళుపదిమంది. ఇంకా ఎందరున్నారో తెలియదు లొంగిపోవటమే మంచిది." అంది కీర్తి చేతులు కట్టుకుని తలా పూర్తిగా వంచి.
గోమతి వెంటనే చేతులు కట్టుకుని తలవంచేసుకుంది.
ఈ కొత్తరకం మనుషులు ఎదురు తిరిగే రకంకాదని తొందరగానే అర్ధం చేసుకున్నారు సుండా జాతివారు. ఒక్కో డుగు నెమ్మదిగా వేస్తూ వీళ్ళ దగ్గరకు వచ్చి పారిపోవటానికి వీలులేకుండా చుట్టూ నుంచున్నారు. వాళ్ళల్లో ఒకడు వాళ్ళ భాషలో ఏదో అడిగాడు.
కీర్తికర్ధం కాలేదు. తలెత్తి చూసి మీ మాటలుఅర్ధం కావటంలేదని సౌంజ్ఞ చేసింది పై నుంచికింద పడినట్లుచెప్పింది అదికూడా సౌంజ్ఞ ద్వారానే చెప్పి దాహం అవుతున్నట్లు నాలుక జాపి చూపించింది.
కీర్తి చెప్పింది వాళ్ళ కర్ధం కాలేదు. కాని వీళ్ళు అపకారం చేసే మనుషులు కారని మాత్రం అర్ధం చేసుకున్నారు. వాళ్ళలో వాళ్ళే ఏదో మాట్లాడుకుని బ్యాగ్ లు సూట్ కేసులు ఎత్తుకున్నారు. మాతో రండి అన్నట్లు సౌంజ్ఞ చేశారు.
కీర్తి వాళ్ళ సౌంజ్ఞ గ్రహించింది. గోమతితో చెప్పి ముందుకు తరలింది. కీర్తి కుంటుతూ నడవటం వాళ్ళు గ్రహించారు. కీర్తి తన కాలు చూపించటంతో వాళ్ళు అర్ధం చేసుకున్నారు. వాళ్ళల్లో ఒకడు అమాంతం కీర్తిని భుజమ్మీద కెత్తుకున్నాడు.
