వసుధ మాట్లాడలేకపోయింది. నోటికి చెంగు అడ్డం పెట్టుకుని అక్కడనుంచి పారిపోయింది.
కానీ అనూష కోరినట్టు ఆమెనలా వదిలేయలేకపోయింది. ఎలాగయినా ఈ విషయం కనీసం హరిశ్చంద్రగారికన్నా తెలియచేయాలి. ఏ అఘాయిత్యం జరక్కముందే ఆయనకి తెలిస్తే, మేడమ్ ని కాపాడతారు.
అనుకుంది.మరునాడు హరిశ్చంద్రగారితో మాట్లాడాలని నిశ్చయించుకున్నా, తెల్లవారడంకోసం ఆదుర్దాగా ఎదురుచూసింది.
* * * *
ఆ రోజు ఉదయాన్నే ఫోన్ మోగింది. పనికుర్రాడు ఫోన్ తీశాడు.వీణ స్వరం వినిపించింది. "డాక్టరమ్మగారున్నారా? నేను లాయరమ్మని మాట్లాడుతున్నాను" అన్నది.
"అమ్మా..." రాజు బావురుమన్నాడు.
"ఏమైందిరా? అమ్మలేదా?" గారభంగా అడిగింది.
వాడు జరిగిందంతా క్లుప్తంగా ఏడుస్తూ చెప్పాడు. "మీరు వెంటనేరండమ్మా" అన్నాడు.
సాయంత్రం నాలుగు గ్మతలకి వీణ వచ్చింది. బాంబే నుంచి ప్లయిట్ లో వచ్చింది. ఎయిర్ పోర్టునుంచి నేరుగా అనూష ఇంటికి ప్లయిట్ లో వచ్చింది. అనూషని చూసి స్థాణువైంది.
"అనూ....!" ఆప్యాయత నిండిన ఆ పిలుపుకి అనూష కళ్ళు తెరిచింది.
"అనూ!" వీణ చేయులు చాచింది.
అనూష చివ్వున లేచి గట్టిగా కౌగిలించుకుంది. ఇద్దరూ వెక్కి వెక్కి ఎదవసాగారు.
"ఏమైంది అనూ! ఏమైంది? నువ్వేంటి ఇలా అయ్యావు? ఎంతో సుఖంగావుంటావనుకుని, కొంతకాలం మిమ్మల్ని ఒంటరిగా వడి లేయాలని అక్కడక్కడా తిరుగుతూ గడిపాను. అనూ! ఏమైందమ్మా?"
అనూష వెక్కుతూ జరిగిందంతా చెప్పింది. అంతా విన్న వీణ ఆవేశంతో వూగిపోయింది.
"ఇడియట్! ఇంతగా హేరాజ్ చేస్తున్నాడా నిన్ను! సింహంలాంటిఅనూష, అప్త్రాల్ మొగుడనే ఓ దగుల్బాజీ వంచనతో ఈ స్టితికి దిగజారిందా? నో... నేను తట్టుకోలేను. వాణ్ని కోర్టుకీడ్చి, ముప్పతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్ళు తాగించకపోతే నా పేరు వీణకాదు...."
అనూష విరక్తిగా నవ్వింది.
"అందువలన నాకేం జరుగుతుంది? అతని కోరికా సమంజసమేగా? హినీడ్స్ చిల్డ్రన్...నాలాగా అందరూ సమాజసేవ చేయలేరు. ప్రతివాళ్ళూ నావాళ్ళూ అనుకునే అవసరం అతనికేం వుంది?"
"అవసరం కాదె... విశాలహృదయం, అలా అనుకోడానికి సంస్కారం కావాలి.ఉన్నతమైన భావాలున్న స్రీని ఓ సామాన్యుడి భార్యగా బతకని వేధించాను. పెళ్ళే జీవితానికి పరమావధి అనీ, ఆనందానికి పరాకాష్ట దాంపత్య జీవితం అనీ నూరిపోశాను.
ఓ తుచ్చామైనా, అనందంకోసం వివాహం అనే ఉచ్చు నీ మెడకి బిగించాను. అనూ! నువ్వొక మహావృక్షానివి! ఎందరికో నీడనిస్తూ, ఫలాలనిస్తూ, ఆశ్రయం కల్పిస్తూ, కీర్తిప్రతిష్టలనే కోమ్మలతో శాఖోఫాసాకలుగావిస్తరించిన ఈ మహావృక్షాన్ని... సంసారం అనే కుండీలో పాతి, బొన్నయ్ గా పెరగమని ఆదేశించాను. బోన్సాయ్ అందానికి అలమ్కారానికేగానీ,పదిమందికీ ఉపయోగపడలేదు.
అనూ! లే... ఈ బంధాన్నించి బైతికిరా... ఇదిగో..." వీణ తన పొట్ట చూపించింది.
"ఇలాంటి అనాధలకు మరికొందరకి నువ్వు తల్లివి కావాలి. నీ ఒడిలో మరెందరో మేధావులు తయారుకావాలి. ఎందరికో నువ్వు నీడ నివ్వాలి. తోడుని కావాలి....ఈ మహవృక్షం, మంచి వాతావరణంలో ఏపుగా, ఆరోగ్యంగా, శాఖోపశాఖలుగా విస్తరించాలి. అవును.... ఈ ప్రపంచం మొత్తం విస్తరించాలి... లే అనూ!"
వీణ ఆవేశంగా అంటూ చేయి అందించింది.
ఆమె మాటలు ఇస్తోన్న కొత్త శక్తితో, అనూష నెమ్మదిగా లేచి, అడుగులో అడుగు వేసుకుంటూ బైటికి వచ్చింది.
అప్పుడే నిండు చందమామ ఆకాశంలో విహారానికి వచ్చి వెలుగు నవ్వులు పండిస్తున్నాడు....
ఆ వెలుగులో విశాల విశ్వం మరెంతో తేజోవంతంగా కనిపించింది ఆమె కళ్ళకి....
మెరుస్తున్న కళ్ళతో వీణవైపు చూసింది. నిండు గర్బంతో, విశ్వ గోళాన్ని మోస్తున్న భూమాతల కనిపించింది....
"అవును... నేను... గెలవాలి..." అన్నది. ఆత్మవిశ్వాసం నిండినస్వరంతో. ఫోన్ మోగింది.
వీణ ఫోన్ అందుకుంది. ఖంగారుగా... "ఆ... సార్... ఒక్క నిమిషం..." అంటూ రిసీవర్ కి చేయి అడ్డంపెట్టి "అనూ! హరిశ్చంద్ర గారు...."
అనూష రిసీవర్ తీసుకుంది.
"అనూ! అమ్మా అనూషా! నేను... హరిశ్చంద్రని. ఏమ్మా కూలాసానా? ఎలా వున్నావు?ఏం జరిగింది? నాకు వసుధ చెప్పింది. నో! నో! నువ్వు అలాఅవడం ఏంటి? ఏం జరిగిందో నేను ఉహించగలను. అప్త్రాల్ ఒక మగాడికి నువ్వు అక్కర్లేనంతా మాత్రాన-నువ్విలా అయిపోవడం నేను తట్టుకోలేను. రిజైన్ చేస్తన్నంన్నావట.... అలాంటి పిచ్చిపనులు చేయకు.... ఈ సమాజానికి నీఆవసరం చాలా వుంది."
అయన మాటలకి, ఆ మాటల్లోని అప్యాయతకీ అనూష హృదయ పులకించిపోయింది. ఆ ఆప్యాయత, ఆదరణ ఇస్తోన్న స్పూర్తీతో మెల్లిగా అన్నది.... "లేదు డాక్టర్! నేను రిజైన్ చేయడంలేదు. రేపట్నించీ హాస్పిటల్ కి వస్తున్నాను...."
"వెరీగుడ్... వెరీగుడ్..." అయన ఫోన్ పెట్టేశాడు.
వీణ అనూషకి చేయి అందించింది....
వాచ్ మాన్, పనికుర్రాడు, అప్పుడే వచ్చిన భారతమ్మ ఆనందంగా కళ్ళు తుడుచుకున్నారు.
___:సమాప్తం :____
