Previous Page Next Page 
మహావృక్షం పేజి 75

అవమానంతో, ఆవేశంతో ఆమె మనసు భగభగ మండసాగింది.
ఇమ్తకిమ్తా ప్రతీకారం తీర్చుకోవాలి. అనూష అంటే ఏమిటో తెలియచేయాలి. వాడికి అనూషగురించి తెలియదు. తెలియచేస్తాను.
ఆమె ఆలోచనలతో అలా పడుకుని వుండిపోయింది. హఠాత్తుగా తను అగాధంలోకి జారిపోతున్నట్టు అనిపించింది. తను జారిపోకుండా ఎవరన్నా పట్టుకుంటారా? లేదు....
ఎవరి ఊతం కోరుకోవద్దు.... అనూష బెలకాడు....కాదు....ఉన్నట్టుండి దుఃఖం తన్నుకు వచ్చింది. వంటరితనం తిరిగి భూతలం భయపెట్టసాగింది. ఆభూతం శ్యామల రూపంలో, మణి రూపంలో కనిపిస్తోంది.
వీణకూడా దగ్గర లేక పోవడంతో ఆమెని ఓ దార్చేవాళ్ళు లేక, ఆ ప్రశాంత్.... వీణ, శ్యామల అందరూ గుర్తొస్తున్నారు. ఏమిటీ జీవితం? ఎందుకిలా అయింది?
తిండీ, నీళ్ళూ సయించడంలేదు. ఆ ధ్యాసే లేకుండా అలా మంచం మీద పడుకుని వుండిపోయింది.

                                                           *    *    *    *
డాక్టర్ వసుధ పెళ్ళి నిశ్చయం అయింది. వెడ్డింగ్ కార్డ్ తీసుకుని, అనూష వచ్చింది. ఆమె వారం నుంచీ హాస్పిటల్ కి రావడంలేదు ని డ్యూటీ డాక్టర్ చెప్పాడు.
"వారం నుంచీ రావడంలేదా? ఎందుకని? లీపు పెట్టారా?" కొంచెం గాభారగా డాక్టర్ చెప్పాడు.
"తెలియదు.... నేనూ ఇవాళే వచ్చాను... లీవులో వున్నాను" అన్నాడతను.
అనూష వారం నుంచీ హాస్పిటల్ కి రావడంలేదన్న వార్త వసుదకి వింతగా అనిపించింది. ఎప్పుడో తప్ప అనూష లీవు  పెట్టదు. అదీ,ఒక రోజు, లేదా రెండు రోజులు.... అలాంటిది వారం నుంచీ రావడంలేదా? ఆమెకి తోచలేదు
డ్యూటీ అన్యమనస్కంగా చేసింది. సాయంత్రం ఆరు కాగానే, వెహికల్ తీసుకుని అనూష బయలుదేరింది.
ఆమె వెళ్ళేటప్పటికి, పని కుర్రాడు, వాచ్ మాన్ బిక్క్, బిక్కు మంటూ వాకిట్లో కూర్చుని వున్నారు.
"డాక్టరమ్మగారు లేదా?" వెహికల్ పార్క్ చేసి, లోపలకి నడుస్తూ అడిగింది.
"ఉన్ననమ్మా.. అమ్మగారికి ఆరోగ్యం బాగాలేరా" బెంగగా చెప్పాడు.
"ఆరోగ్యం బాగలేదా?" వసుధ కంగారుగా లోపలకి నడిచింది.ఇల్లంతా నిశ్చబ్దంగా వుంది.
"అయ్యగారు లేరా?" తన వెనకే వస్తున్న వాచ్ మాన్ అడిగింది.
అతడు భయంగా చూశాడు. ఏం మాట్లాడలేదు. అతని వాలకం, ఆ ఇంటి వాతావరణంచూస్తుంటే గుండెల్లో కలుక్కుమంది వసుదకి. మేడమ్ కి ఏమై వుంటుంది? ఆమె సందేహంగా అనూష బెడ్ రూలోకి అడుగుపెట్టింది.
అస్తవ్యస్తంగా పడుకుని వుంది అనూష. జుట్టంతా చెదిరిపోయి వుంది. నుదుట బొట్టులేదు. చీర నలిగి వుంది. కళ్ళు మూసుకుని పడుకుంది. బాగా ఏడ్చి నట్టు బుగ్గల మీద కన్నీటి చారికలు ఎండిపోయి వున్నాయి. ఆమేనా స్థితిలో చూసిన వసుదకి దుఃఖం ఆగలేదు.
"మేడమ్!" కంపించేస్వరంతో పిలిచింది.
అనూష కళ్ళు తెరిచింది.
వసుదని చూడగానే అన గారిన దుఃఖం ఉదృతంగా పెల్లుబికింది. బోర్ల పడుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.
డాక్టర్ అనూష ఎప్పుడూ చిరునవ్వు చెదరని మోహంతో, దయగల చూపులతోఆరోగ్యంగా, అందంగా, చలాకీగా తిరిగే డాక్టరు అనూష శోక దేవతలా.... ఏమిటీ దుష్టితి? వసుధ గుండె కేలికినట్లయింది. కళ్ళు నీటితో నిండాయి. మంచం మీద కూర్చుని అనూష భుజంమీద చెయ్యేసింది.
"మేడమ్! ఏం జరిగింది?" అనూష ఏడుపు ఉదృతం అయింది.
"మేడమ్! పదిమంది దుఃఖాన్ని తీర్చే మీకు దుఃఖం కలగా చేసిన వాళ్లెవరోకానీ, వాళ్ళు క్షమార్హులు కారు... ఏం జరిగింది నాకు చెప్పారూ! ప్లీజ్!"
అనూష చాలాసేపు ఏడ్చి, నెమ్మదిగా లేచి, బాత్ రూమ్ లోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది.
"నేను నా పెళ్ళికి పిలవడానికి వచ్చాను. మీరింత దుఃఖంలో వుంటే నాకేం తోచటంలేదు. ఏం జరిగింది?"
"ఏం లేదు" బలవంతంగా నవ్వి "ఎప్పుడు పెళ్ళి?" అన్నది.
"25వ తారీకు... కానీ, మీరు..."
"వసుధా... నేను... నేను... ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను."
"వాట్? నో!" గట్టిగా అరిచింది. వసుధ
అనూష పెదవులు బిగించి దుఃఖం ఆపుకుంటూ అన్నది. "బాగా అలసిపోయాను.... కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలనికుంటున్నాను.... అందుకే..."
"కాదు... కాదు... మీ మనసేవరో గాయ చేశారు. మిమ్మల్ని... మిమ్మల్ని బాధపెట్టారు... అవమానించారు.... అందుకే మీరు ఏడుస్తున్నారు. అందుకే మీరు హాస్పిటల్ రావడంలేదు... నాకు తెలుసు.... చెప్పండి ఎవరు వాళ్ళు? చెప్పండి మేడమ్."
"నన్నెవరూ బాధపెట్టలేదు వసుధా! నన్ను నేనే బాధ పెట్టు కుంటున్నాను...నేనే తప్పుచేశాను.... అందుకు నాకు నేనే శిక్ష వేసుకుంటున్నాను."
"మేడమ్! దయచేసి అలా మాట్లాడకండి. నేను తట్టుకోలేను. నేను మీకే సాయం చేయలేనా?" జాలిగా అడిగింది.
చేద్దువుగాని... చెప్తాను... నాకే సాయం కావాలో రెండురోజుల్లో చెప్తాను. నీ పెళ్ళికి వీలయితే తప్పకుండా వస్తాను. రాకపోతే తప్పకుండా వస్తాను. రాక పోతే నువ్వు క్షమిస్తావుగా."
"మేడమ్!" వసుధ ఇంకా ఏడుపు ఆపుకోలేకపోయింది. గట్టిగా ఏడ్చేసింది.
"వసుధా! ఏడవద్దు....పెళ్ళికూతురివి కాబోతున్నావు. తప్పు....ఏడవకు...వెళ్ళు... నీ పనులు దూసుకో... నా మాట విను... వెళ్ళు... చూడూ! ఈ సంగతి హాస్పిటల్లో ఎవరికీ చెప్పకు."

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS