డబ్బెక్కడ్నుంచి వచ్చింది ఇల్లు కట్టడానికి అర్దంకాలేదు అనూషకి. శారదా వాళ్ళెలా వున్నారోనని ఆశ్రమానికి ఫోన్ చేసింది.
"మేడమ్! మా దగ్గర డబ్బులు అయిపోయాయి. సుశీల డబ్బువాడుతున్నాం."
"డబ్బు అయిపోయిందా? అదేంటి భరణికి రెండు లక్షలిచ్చి, అక్కడ బ్యాంకులో అడిగినా...? బాలన్స్ ఎంతుందో."
"అడిగాను... ఏం లేదు."
"నిజంగానా? నీరజ ఏం చేస్తోంది?"
"నీరజ...నీరజ" నసిగింది.
"ఏమైంది?"
"నీరజ వెళ్ళిపోతుందిట."
అదిరిపడింది అనూష. "ఎక్కడికి?"
"తెలియదు. చాలా బాధపడుతోంది. తనుక్కడ వుంటే మీకు అన్యాయం జరుగుతుందిట."
"అంటే...శారదా... నీరజను మాట్లాడమను."
కొన్నిక్షణాల తరువాత "మేడమ్! మీతో మాట్లాడటానికి భయపడుతోంది... భరణిగారు...."
"ఆ... భరణి... ఏం అన్నాడు?"
"నీరజని చేతిలోరిసీవర్ పడిపోయింది. చేష్టలుడిగి నిలబడి పోయింది. భరణి నీరజని... మైగాడ్! ఆలస్యం చేయకుండా బ్యాంక్ కి వెళ్ళింది. ఆమె అకౌంట్ లో కేవలం యాబైవెలుంది. అంటే భరణి డబ్బు డ్రా చేశాడు. మరి ఏం చేశాడు? ఆమె కారు బంజారహిల్స్ వైపు సాగిపోయింది. తన స్థలం దగ్గరకి వచ్చి మ్రాన్పపడిపోయింది.
డబల్ స్టోరీడ్ బిల్డింగ్ దాదాపు గోడలు లేచాయి.
"ఎవరు కట్టిస్తున్నారు?" అడిగింది మేస్రీని.
"పేపరు నడిపేసారు పేరేందో తెల్వదు" అన్నాడు మేస్రీ.
అక్కడనుంచి భరణి ఆఫీసుకి వెళ్ళింది. భరణి లేడు.
రాగానే ఇంటికి రమ్మని చెప్పి, మసేజ్ ఇచ్చి, ఇంటివైపు పోనిచ్చింది కారుని. ఇంట్లో అడుగుపెట్టేసరికి భరణి ఇంట్లో వున్నాడు.
"భరణీ!" పులిలా గాండ్రించింది.
నివ్వెరపోయి చూశాడు
"డబ్బెం చేశావు?"
"ఏం డబ్బు?" నిర్లక్ష్యంగా అడిగాడు.
"అశ్రమానికివ్వమని నేనిచ్చిన చెక్కుతాలూకు డబ్బు డ్రా చేసి ఏం చేశావు?"
"లెక్కలు చెప్పాలా? నా యిష్టం వచ్చినట్టు చేస్తాను."
"షటప్... అది నా డబ్బు. నీ యిష్టం వచ్చినట్టు చేయడానికి నీకేం హక్కుంది? ఆశ్రమం వాళ్ళ కడుపుకొట్టి బిల్డింగ్ కట్టిస్తున్నావా? అదీ నా స్థలంలో నా పర్మిషన్ లేకుండా."
"హూ.... నీ స్థలం. ఏం నీ ఆస్తి, నీ డబ్బు అస్రామం పేరుతో అపాత్రదానం చేయడంలేదా? నీ మొగుడివి నాకు హక్కెందుకు లేదు?"
"ఛీ... సిగ్గులేదూ నీకు? నీ కసలు అత్మాభీమానం లేదా? ఏదో సాయం చేస్తున్నావని నమ్మి ఆశ్రమం బాధ్యత అప్పగిస్తే, దగాచేసి నన్ను పూల్ ని చేసి, వాళ్ల ముందు.... ఇంతకాలానికినన్ను దోషిగా నిలబడతావా? పైగా.... నీరజని... నీరజని... ఛీ... పెళ్ళిచేసుకోమని వేధిస్తావా?"
"ఓ! ఆ సంగతి కూడా తెలిసిందా? అయితే ఇంకేం? విను చెప్తా.నాకు పిల్లలు కావాలి. నువ్వు పిల్లల్ని కనలేవు.నాకు డబ్బు కావాలి. నువ్వు డబ్బు ఇస్తావు. అందుకే పిల్లల కోసం నీరజని పెళ్ళిచేసుకుంటాను. డబ్బుకోసం నిన్ను వుంచుకుంటాను." "భరణీ!" ఆవేశంగా అరిచింది. "ఛీ నీచుడా! నువ్విలాంటి వాడివా? ఇంత చండాలంగా అలోచిస్తావా? అనూషతో ఇలా మాట్లడాటానికి నీకెంత దైర్యం? నీకు పిల్లల్ని కనక పోవడం నా నేరమే అని భావించి నీ నుంచి విడిపోవడానికి నేనెప్పుడో సిద్దపడ్డాను. కానీ, ఈ మద్యలో జరిగిన దురద్రుష్టకర సంఘటనతో కొంతకాలం వాయిదా వేయాల్సి వచ్చింది.
కానీ, కానీ, నువ్వు నాకు చేసిన ద్రోహానికి, వంచనకీ, నిన్ను నేను ఎప్పటికీ క్షమించాను, నీకు విడాకులివ్వను, నీతో కలిసి బతకను. ఇక నుంచీ నీకూ, నాకూ సబంధంలేదు. తక్షణం ఇంట్లోంచి వెళ్ళు.... వెళ్ళిపో.... ప్లీజ్ గెట్ అవుత..... భరణీ! ఐబేగ్ యూ... నువ్వు వెంటనే నా ముందునుంచి వెళ్ళిపో."
అనూష వెర్రిగా అరిచి, వెక్కి, వెక్కి ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది.
భరణి ఆవేశంలో అన్నడేకానీ, అన్న వెంటనే అతని అంత రంగంలో భయం మొదలైంది. అనూష తో ఇలా మాట్లాడనేంటి? అనుకున్నాడు.
అపర కాలిలా ఉన్న ఆమె అవతారం, ఆ కళ్ళు చూస్తుంటే భయం వేసింది. కఒదీ క్షణాలు చేష్టలుడిగి నిలబడ్డాను. తరువాతా నెమ్మదిగా అక్కడి నుంచి నిష్కమించాడు.
* * * *
ఆ ఇంటిలో ఇంతకాలంగా ఎప్పుడూ చూడని స్మశాన నిశబ్దం డాక్టరమ్మగారి విషాదవదనం చూసిన పనివాళ్ళు ఆమె శితికి కదిలి పోయారు. కన్నతల్లికన్నా ఎక్కువుగా కష్టసుఖాలు విచారించే అమ్మగారిని ఈ శితికి తీసు కొచ్చిన భరణిమీద విపరీతమైన కోపంవచ్చింది.వాళ్ళందరికీ. ఏంచేయాలో, అమ్మగారినేలా ఓ దార్చలో తెలియక బిక్కు, బిక్కుమంటూ కూర్చుండిపోయారు.
తిండీ, నీళ్ళూ లేకుండా బెడ్ రూమ్ లో జేవిచ్చవంలా పడుకుని వున్న అనూషని పలకరించే సాహసం ఎవరకీలేదు. ఎన్నడూ చవిచూడని ఓటమితో కృంగిపోయిన అనూష కుప్పకూలిపోయింది.
భరణి ఎంత మాటన్నాడు? అనూషని వుంచుకుంటాడా? ఆమె అణువణువూ దహించుకుపోసాగింది. ఎంత దైర్యం! ఒక మగవాడి తోడుకోరుకుని, మూడుముళ్ళ కోసం తలవంచినందుకు తనింతచులకనైపోయిందా? జర్నలిస్టుగా తనతో మాట్లాడడానికి భయపడిన రాస్కెల్ మొగుడై, ఇలా అవమానిస్తాడా? తను మగవాడి పొందుకోసం మొహం వాచిపోయిందనుకున్నాడా? ఉంచుకుంటాడా?
