Previous Page Next Page 
మహావృక్షం పేజి 73

అప్పటికే ఆమెకోసం భరణి హాస్పిటల్ కీ, ఆశ్రమానికి ఫోన్ లు చేశాడు. విషయం కూడా తెలియకుండా, అలా రోజుల తరబడి అనూష ఇంటికి రాకపోవడం, తన గురించి పట్టించుకోకపోవడంతో భరణి నిలువెల్లా దహించుకుపోసాగాడు.
కానీ తననితాను కంట్రోల్ చేసుకుని ఆమెతో మంచిగా వుండాలని నిశ్చయించుకున్నాడు. ఆమెని కన్సోల్ చేసి, ఇజ్మ్తికి తీసుకురావడానికి బయలుదేరుతుండంగా అనూష కారు వచ్చి ఆగింది.
అనూష కారు ఆగగానే, ఎదురొచ్చిన భరణి ఆమె వాలకం చూసి, అవాక్కయ్యాడు. దాదాపు స్పృహ తప్పుతొన్న ఆమెని పట్టుకుని లోపలకి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబేట్టాడు.
ఆశ్రమానికి ఫోన్ చేశాడు.... బిల్లు కట్ట లేదని డిస్కనెక్ట్ చేసినట్టు రికార్డేడ్ వాయిస్ వినిపించింది.
ఏం చేయాలో తోచలేదు. ఇప్పుడు ఇఇమేకి ఏదన్నా అయితే తనకే నష్టం డాక్టర్ కి ఫోన్ చేయబోతుండగా శారదే ఫోన్ చేసింది.
గబ గబా అన్నాడు.
"మీరు వెంటనే రండి.... అనూష కండిషన్ బాగాలేదు. నాకు భయంగా వుంది.
సరిగ్గా గంట తర్వాతా అప్పగించి నిశ్చంతగా నిట్టూర్చాడు.
మూడోనాడు కళ్ళు తెరిచింది. అనూష చారన్నం తినిపించింది శారద. గుండె పగిలేలా ఏడ్చింది అనూష. శారద ఆమెని ఓదార్చింది.
"మీరే ఇలా అయిపోతే మాకుమాత్రం ఇంకెవరున్నారు? ప్లేజ్ ఏడవకండి" అంటూ తనూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
అనూష ఆమెని దగ్గరకి పొదువుకుని కుమిలి, కుమిలి ఏడ్చింది.
ఆరోజు సాయంత్రానికి శారద వెళ్ళిపోయింది.
భరణి అనూష పక్కన కూర్చిని అప్యాయంగా పిలిచాడు....
"అనూ!"
ఎర్రబడ్డ కళ్ళతో తీవ్రంగా చూసింది.
"అనూ! జాతస్య మరణం దృవం అన్నారుకదా! అన్నీ తెలిసిన నివ్వె ఇలా అయిపోతే ఎట్లా? ఎంతో దైర్యస్తురాలని ఇంత బెంబేలుపడితే మిగతావాళ్ల సంగతెంటి?"
"స్యమలకి సుస్తీ అని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నామని నాకు చెప్పమని ఆశ్రమం నుండి ఫోనొచ్చిందా?" సూటిగా అడిగింది.
భరణి కలవరపడ్డాడు. "లే... లేదే... ఏమో గుర్తులేదు."
"నిజంచెప్పు... గుర్తులేదూ!"
అతనేం మాట్లాడలేదు.
"చెప్పు... మాట్లాడవేం?" పులిలా గర్జించింది.
అతని పురుషాహంకారం దెబ్బతిన్నది.
"ఏంటి! నిలేస్తున్నావు? వచ్చింది. అడ్డమైన వాళ్ల సేవలుచేస్తూ నివ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నానని చెప్పలేదు. ఏం తప్పా ?" గట్టిగా అన్నాడు.
"భరణీ! నీలో, నీమాటే నెగ్గాలన్న పంతం ఎంతగా వుందో నేను బాగా అబ్జర్వ్ చేశాను. అందుకే చిన్న చిన్న విషయాలక్కూడా అలుగుతావు. నేను మాట్లాడించిందాకా మాట్లాడవు. నేను నాచా చెప్పి, బుజ్జగించి, నువ్వు అదే నాటకం అనీ తెలుసుకోలేకపోయాను. ఆ పంతంతోటి శ్యామాలని హాస్పిటల్ చేర్చామని ఫన్ చేస్తే నాకు చెప్పలేదు. ఆ మాట చెబితే నువ్వు ఒడిపోతానానుకున్నావు అవునా?
ఛీ! నీలో ఇంతకస్చితం వుందని గ్రహించలేకపోయాను. ఎంత మొండితనం, మూర్ఖత్వం నీలో వున్నాయి. నీవలన....నీవలన నాప్రాణ స్నేహితురాలు. నేనే సర్వస్వం అనుకుంటూ బతికినా నా స్యమాలని చివరిక్షణాల్లో ఆదుకోలేకపోయాను. స్యామాలని నేనే చంపాను.... నేనే చంపాను" అనూష తల కొట్టుకుంటూ గట్టిగా ఏడవసాగింది.
"ఏమిటా ఏడుపు? అసలా శ్యామల ఎవరు? ఎవరో ఆనాద... ఆశ్రమం యిచ్చావు. ఇంతకాలం చూశావు... ఏం కావాలన్న చేశావు.... వయసు అతి పోయింది. చచ్చింది. దాని కోసం నేను చచ్చినట్టు ఏడుస్తావెంటి?" కోపంగా అరిచాడు.
అనూష ఠకీమని ఏడుపాపింది.
"ఏమన్నావు? శ్యామల అనాధా? మరి నువ్వు.... నువ్వెవరివి? నువ్వు అనాధవి కాబట్టి నా ఇంట్లో వుంటున్నావు, నా తిండి తింటున్నావు, నా డబ్బుతో బతుకుతున్నావు. నీ సంపాదన అంటూ ఒక్కరూపాయి నాకుచూపించావా? తీసుకోవడమేకానీ, వందరూపాయలు  నాకిచ్చావా? మగాడివి కాబట్టి నీ చూడూ.... నీదీ, నాదీ ఏడాది బంధమే. అది కూడా గిల్లికజ్జా కూడా రాలేదు. మా అనుబంధం గురించి నీకేం తెలుసు?"
భరణి మండుతున్న అగ్నిగోళంలా చూశాడు.
"నన్ను పట్టుకున్న ఇన్ని మాటలని ఇన్సల్టు చేస్తావా? సరే చూస్తాను. నిన్ను ఇన్సల్ట్  చేయడం నాకు చేతకాదా? వయసుదిగినదానివనీ సంసారానికి  పనికిరావాణీ, విడాకులకి దావా వేస్తాను. అది చాలదూ నీకు అవమానింపబడడానికి?"
అనూష నిస్చేష్టురాలైంది.
భరణి విసురుగా వెళ్ళిపోయాడు.
                                                       *    *    *    *
అనూష హాస్పిటల్ కి వెళ్ళి వారం రోజులైంది. హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే ఊరువెళ్ళామని చెప్పమంది పనికుర్రాడితో.
భరణి రెండురోజులుగా ఇంటికి రావడంలేదు. ఎక్కడో యిల్లుకట్టిస్తున్నాడని తెలిసింది.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS