Previous Page Next Page 
మహావృక్షం పేజి 72

మరునాడు తెల్లవారకుండానే లేచి, కారు తీసుకుని ఆశ్రమానికి వెళ్ళింది. కారు ఆశ్రమం సమీపించింది.
ఆవరణంలో అడుగు పెడుతూనే ఏదో మార్పు కనిపించింది. పచ్చటి మొక్కలన్నీ ఎండిపోయాయి. ఉదయాన్నే పెరట్లో మొక్కలకి నీళ్ళు పెడుతూ, పూలుకోస్తూ కనిపించే శారద, శ్యామల కనిపించలేదు. ఈ మధ్య తనొచ్చి చాలా రోజులైంది. శ్యామలని డిస్చార్జి చేసి పంపించాక రానేలేదు. భరణి ఆశ్రమ వ్యవాహారాలు చూసుకుంటుండడంతో ఇదివరకటిలా పట్టించుకోలేదు. ఇవాళా ఈ వాతావరణంలో ఏదో అపశృతి కనిపిస్తోంది.
అనూష హాల్లోకి వచ్చి, శ్యామా!" అని పిలిచింది.
లోపలనుంచి శారద వచ్చింది. బాగా చిక్కిపోయింది. కళ్ళు లోతుకుపోయాయి.
"సారదా!"ఆమెని చూస్తూనే విచలితంగా పిలిచింది.
శారద ఒక్క పరుగున వచ్చి అనూషని కౌగలించుకుని బావురుమంది. "ఏమైందమ్మా?" ఏమైంది?" ఆత్రంగా అడిగింది అనూష.
సుశీల కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె వెనకాలే సుశీల కొడుకు.... మిగతావాళ్ళు అందరూ ఏడుస్తూ వచ్చారు.
వెక్కుతూ చెప్పింది శారద... "శ్యామల.... శ్యామల ఆస్పత్రిలో వుంది."
"ఏ ఆస్పత్రి?" నివ్వెరపోతూ అడిగింది అనూష.
"ఇక్కడే... ప్రేవేటు ఆస్పత్రి... సదన్ గా మొన్నరాత్రి మళ్ళీ ఎటాక్ వచ్చింది. పక్షవాతం కూడావచ్చింది. కాళ్ళూ, చేతులు పడిపోయాయి."
"మరి... మరి నాకెందుకు  ఫోన్ చేయలేదు?"
చేశాను. భరణిగారు మాట్లాడారు. మీకు మెసేజ్ ఇవ్వమని చెప్పాను. చెప్పలేదా?"
అనూష పెదాలు లేదే.... అనబోయి ఆగిపోయాయి. సారీ.... చెప్పాడు.కానీ నేనే సారిగా వినలేదు. మామూలుగా చూసివేడదామని వచ్చాను. పద హాస్పిటల్ కి వెడదాం..." గిరుక్కున తిరిగి కారు దగ్గరకి నడిచింది శారద అనుసరించింది.
వీళ్ళు వెళ్ళేటప్పటికి నీరజ బాగా ఏడుస్తోంది. అనూషని చాడగానే గట్టిగా కౌగలించుకుని వెక్కిళ్ళు పెట్టసాగింది.
"ఎలా వుంది ?" ఏడుపు నిగ్రహించుకుంటూ అడిగింది అనూష.
"కోమాలోకి వెళ్ళిపోయింది. కార్డియాక్ అరెస్టు అయింది."
"నో...!" అనూష వెర్రిగా అరిచింది. అప్పటికప్పుడు డాక్టర్ తో మాట్లాడి, పీజు చెల్లించి, అంబులెన్స్ లో శ్యామలని పంపించమని చెప్పింది. అప్పటికప్పుడే అంబులెన్స్ రెడీ అయింది.
అనూష గురించి వినివుండడంతో డాక్టర్లు ఎదురు చెప్పలేదు. ఆమె కోరిన సౌఖర్యాలు సమకూర్చారు. అంబులెన్స్ ఉస్మానీయవైపు బయలుదేరింది. కారులో అనూష అనిసరించింది.
ఆమె కళ్ళముందు శ్యామల, తన కర్తవ్యం తప్ప మరేం కనిపించలేదు. వేగంగా కారు నడిపిస్తోంటే నెరజా, సుశీలా భయంగా కూర్చుండి పోయారు.
భరణి తనకి ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చిందని కూడా చెప్పలేదంటే ఎంత మొండివాడై వుంటాడు? తన ప్రాణానికి ప్రాణం అయిన శ్యామలకి ఇంత సీరియస్ అయిందని ఒక్క ముక్క చెప్పాకూడదా? ఆ రోజు శ్యామల బతకటానికి కోపరేట్ చేశాడని ఎంతో సంతోషించింది. కానీ ఇవాళ... కారు హాస్పిటల్ చేరింది. అంబులెన్స లోంచి శ్యామలని స్టేచర్ మీద ఐ.సి.సి. యుకి తీసికెళ్ళింది.
సుశీలా, నీరజా కారిడార్ లో ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. అనూష శ్యామలకి బతికించటానికి తపస్సు చేస్తోన్న రుషిలా మౌనంగా, గంబీరంగా వుంది. చాలామంది డాక్టర్స్ వస్తున్నారు. డాక్టర్ హరిశ్చంద్ర కూడా వచ్చారు.
ఇరవై నాలుగు గంటలు గడపాలి. అందరూ జీవకళ కోల్పోయిన మొహాలతో శిల్లలా కూర్చూన్నారు.అనూష శ్యామల మంచం దగ్గరనుంచి కదల్లేదు. సరిగ్గా తెల్లవారు జామున నాల్గంటలప్పుడుశ్యామల శాశ్వతంగా కోమాలోకి వెళ్లిపోయింది.గొల్లుమన్న నీరజనీ, సారదనీ వదిలేసి అనూష కుప్ప కూలిపోయింది.
ప్రాణ స్నేహితురాలి ఒడిలో సేదతీరి, తన మనోవేదన చల్లార్చుకోడానికి వస్తే, ఆమె తనని వదిలేసి, శాశ్వతంగా వెళ్ళిపోయింది. అవమానంతో, వేదనతో అల్లడుతొన్న ఆ గుండెల్లో బడబాగ్నిలాంటివిషాదం నింపి, ఆమె ఖర్మానికి ఆమెని వదిలేసి వెళ్ళిపోయింది.
ఇంకేవరున్నారు తనకి? ఏందుకోసం పెళ్ళి చేసుకుందో,అదే విషయం ఈరోజు ఒ ప్రశ్నార్థకంగా ఆమె ముందు వికృతంగా నవ్వుతూ నిలబడింది. శ్యామల డెడ్ బాడీ ఆశ్రమానికి చేరింది. దహనసంస్కారాలు పూర్తయ్యాయి. సుశీల కొడుకు తలకొరివి పెట్టాడు.
అనూష జీవిత సారం అప్పుడే బోధపడినట్లుగా అనిపించాసాగింది. భర్త, పిల్లలు లేకుండా, ఎవరినో తనవారిగా భావించుకుని బతికినా శ్యామల చివరిరోజుల్లో నన్నెవరుచూస్తారు అనుకుందా...? అనుకుని వుంటే ఏం చేసేది? ఇప్పుడు ఎవరు చూశారు? ఎవరో రక్తసంబంధం లేనివాళ్ళు చూశారు. ఏం బంధం వుందని వీడు ఆమెకి తలకొరివి పెట్టాడు? భగవంతుడా! మేధవిగా పేరుపొందిన అనూష.... జీవితంలో ఎందుకు ఒడిపోయింది?
శ్యామల మరణానికి కారకుడు భరణి.
అనూష రక్తం సలసల మరిగింది. శారద దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరింది.
హఠాత్తుగాఅనూష కనిపించకపోవడంతో భరణికి కొంచెం కలవరంగా అన్పించింది. ఎక్కడికెళ్ళింది? చెప్పకుండా వెళ్ళడం అలవాటేగా.... కనీసం ఫోన్ చేయచ్చుగా... ఎందుకు చేస్తుంది? తను మాట్లాడడంలేదుగా.... పైగా విడాకులిస్తానని బెదిరించాడు కూడా.... ఇంకెందుకు తనని లక్షపెడుతుంది.
భరణి ఆమెని విడాకులిస్తానని బెదిరించాడు కానీ, అతనంకి భయంగానే వుంది. విడాకులు తీసుకుంటే తనకే నష్టం. పైగా ఇప్పుడిప్పుడే తన కలలు నెరవేరబోతున్నాయి. ఈ సమయంలో ఆమెతో గొడవ పెట్టుకుంటే బాగా నష్టపోతాడు. ఇన్నిరోజులనుంఛీ ఆమె బతిమాలుతుందిలే అనిబికంగా వున్నాడు. కానీ ఈ సారి అనూష బతిమాలలేదు సరికదా! మూడు రోజులనుంచి కనిపించటంలేదు. కొంపదిసి విరక్తి పుట్టి ఆశ్రమానికి వెళ్లిందంటే కొంపలంటుకుంటాయి. తానసలు అక్కడి విషయాలు పట్టించుకోడంలేదు. ఆ మధ్య అక్కడి నుంచి ఫోన్ వచ్చినా చెప్పలేదు. అనూష ఆశ్రమం గురించి మర్చిపోవాలని కోరుకున్నాడు. నిజంగా ఆమె అక్కడికే వెళితే తన గొయ్యి తను తవ్వుకున్నట్టే.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS