"అబ్బే ఏంలేదు... ఊరికినే."
అతనికి ఆమె దోరణి అనిమానం కలిగించింది. ఏదో వుంది. ఈమేకి పిల్లలు పుట్టరా? ఆ సంగతి ఇలా ఇన్ డైరెక్టర్ గా చెబుతోందా? ఏమైనా సరే ఈ సంగతి ఇవాళ తేలిపోవాలి.
"నాకు పిల్లలు కావాలి అనూషా! అంతే!" దృడంగా అన్నాడు.
అతని వీపుమీద వున్న ఆమె చేయి జారిపోయింది. ఆ ప్రయత్నంగా దూరం జరిగి పడుతుంది.
"నీకు నీ కెరియర్ మీదున్న శ్రద్ద సంసారంమీద లేదు.ఇంకా ఎంతకాలం కెరియర్ అంటూ కూర్చుంటావు? ఇంకా ఏం సాధించాలి? సాధించింది చాలాదా? పిల్లా, పాపా లేకుండా జీవితం కూడా ఓ జివితమేనా? నిజం చెప్పు... ఎందుకు వద్దంటున్నావు? నీకు వయసు దాటిపోయిందా?" నూటిగా అడిగాడు భరణి కూర్చుని.
అనూష మాట్లాడలేదు.
"చెప్పు... మాట్లాడవేం?"
"అదే నిజమైతే ఏం చేస్తావు?" నింపాదిగా అడిగింది.
భరణి కొన్ని క్షణాలు నిశ్శబ్దం తరువాత అన్నాడు. "మళ్ళీ పెళ్ళి చేసుకుంటాను,"
"షటప్" గట్టిగా అరిచి లేచి కూర్చుంది.
"బుద్ది వుండి మాట్లాడుతున్నావా? నేను పిఉల్లల్ని కనివ్వగాలవా? లేదా?అని ముందు ఆలోచించుకోలేదా? కంటికి నచ్చగానే వెంటబడి వేధించావే... చెప్పావా నాకు ఆ రోజు నాకు పిల్లలు కావాలి... కనిస్తావా? అని అడిగావా?"
"నువ్వు విషయం ఆలోచించలేదు కాబట్టి చర్చించలేదు. కావాలనుకున్న నువ్వు అడగాలి."
"నాకేం తెలుసు... నీకింత వయసు దాటిందని."
"నాన్సెన్స్.... నీ కిప్పుడే చెప్పాను నావయసు."
"నలబై ఏళ్లకే అన్నీ అయి పోతాయనుకోలేదు. చూడాటానికి చిన్న పిల్లలా వున్నావు కదా అని మనసుపడ్డాను."
"హూ... అందం, చదువు, హొదా, అంతస్తు చూసావు. కావాలను కున్నావు. పెళ్ళయ్యాక పిల్లల్ని కనక ఏం చేస్తుందిలే అనుకున్నావు. భార్యంటే పిల్లల్ని కనే యంత్రం అనుకున్నావు.... అవునా?"
"అవన్నీ నీ ఆలోచనలు... నాకలాంటి ఆలోచనలు రావు."
"హూ" నిరసనగా అనూష అక్కడినుంచి లేచి వెళ్లిపోయింది.
ఎంత దగా! ఎంత మోసం ! భరణి... పెద్ద జర్నలిస్ట్.... స్రీ సమస్యలు చర్చించుకోడానికి తన పత్రికలో నాలుగు పేజీలు కేటాయించి స్రీవాదిగా కబుర్లుచెప్పే హిపోకైట్.... మగాడా! నీ విశ్వరూపం ఇదా? ప్రేమంటూ, ఆరాధన అంటూ వెంటబడి, వేధించి పెళ్ళిచేసుకునేది, నచ్చిన అదాదాన్ని నీ కట్టుబానిసగా మార్చుకోడానికా? అనూషకి గుండెని ఎగ దోసుకుంటూ దుఃఖం వచ్చింది.
మర్నాడు భరణి తల్లితండ్రులకి లెటర్ రాశాడు.... అది ప్రత్యేకంగా అనూషకి చూపించాడు.
"నీ నుంచి విడాకులు తీసుకోడానికి ఇది మొదటి మెట్టు.... మ నాన్న, అమ్మ నన్ను తప్పకుండా వాళ్ళకి విషయం తెలియచేస్తున్నాను..."
అనూష మ్రాన్పడిపోయింది. మండిపడుతూ అన్నది....
"నీ ఇష్టం వచ్చినట్టు వుదాకులు తీసుకోడానికి ఇదెం బొమ్మలపెళ్ళి కాదు."
"ఏ పాలలో త్వరలోనే తేలుస్తాను..." విసురుగా వెళ్లిపోయాడు.
అన్యమనస్కంగా హాస్పిటల్కి వెళ్ళింది. కానీ,ఏం చేయలేక పోయింది. వీణ దోషి కాదని చెప్పేవాళ్ళేవారున్నారు? బోరున ఏడవాలనిపించింది అనూషకి.
ఎంతో సహనంతో, సంస్కారంతో ఎక్కడికక్కడ సర్దుకుంటూ, గాజు బొమ్మలా కాపాడుకుంటూ వస్తోంది. ఈ కాపురాన్ని. ఎవరికోసం? పరువుకోసం. పదిమందిలో నవ్వులపాలు కాకుండా వుండడంకోసం తామిద్దరూ విడిపోతే వీణ, శ్యామల, అత్తగారు, మావగారు బాధపడతారని, డాక్టర్ అనూష నలబై ఏళ్లు దాటాక పెళ్ళి చేసుకుని, ఏడాది కూడా కాకుండా విడిపోయి, విడాకులు తీసుకుందని నలుగురూ అనుకుంటారన. హరిశ్చంద్రగారికి ఏమని చెప్పాలి? తండ్రిలా నచ్చచెప్పి, తనని పెళ్ళికి ఒప్పించిన వాళ్ళలో అయన కూడా ఒకరు. ఇవాళ విడాకులు తీసుకుంటోంఅని తెలిస్తే ఏమంటారు?
ఇలాంటి ఆలోచనలతో సగటు స్రీ లంతా తాగుబోతులను, తిరుగుబోతులను, దుర్మార్గులను, ఇంపోటెంట్స్ ని భర్తలుగా భరిస్తూ,వాళ్ళు పెట్టె చిత్ర వదలు మౌనంగా అనుభవిస్తుంటారు. కానీ, తను సగటు స్రీ కాదే!మరి ఎందుకు ఇంతదూరం పెరిగినా ఈ కాపురం కావాలను కుంటోంది?
భరణి లేక పోతే తననేవరు చూస్తారు అనా? లేక తాతను పోషించకపోతే తిండి గడవదనా? అలంటి ఖర్మ తనకు లేదే.... తనే అతడిని పోషిస్తోంది. ఏదన్నా నష్టం అంటూ జరిగితే అతనికేగానీ, తనక్కాదు. మరెందుకు ఈ బంధం కాపాడుకోడానికిప్రయత్నం చేస్తోంది?
ఎన్నోసార్లు అతను తన మాటలతో, ప్రవర్తనతో బాధపెట్టాడు. అయినా క్షమించింది. క్షమిస్తూనే వుంటుంది. ఇది అనూషగా తన గొప్పతనం కాదు. కేవలం స్రీ... ఒక స్రీగా మగవాడిని క్షమించడం, రక్తంలో జీర్ణంచుకు పోయిన సనాతన భావాల శేషం ఇంకా తనలో మిగిలివుంది. ఇది సనాతన భావాల తప్పా? సంస్కారమా?
తన చేతకానితనానికి సంస్కారం అని పేరు పేట్టుకుంటోందా?
అనూషకి ఆలోచనలతో పిచ్చెక్కినట్టుగా అయింది.
భరణి వస్తునాడు. తనే భోజనం పెట్టుకుని తింటున్నాడు. పడుకుంటున్నాడు. ఆమెతో మాట్లాడటంలేదు. విడాకులకి అప్లై చేశాడా? హూ- చేస్తే తనకే నష్టం.... ఆ విషయం ఈ స్రీ వాదికి తెలియకనా? తెలుసు.... అంతా బిల్డప్.... తనని బెదిరించాలని చూస్తున్నాడు.
అనూషకి అనవసరంగా తనకి తను ఒ విషవలయంలో చిక్కిపోయాననిపించసాగింది. బాగా ఏడుపోచ్చింది.
ఆ రాత్రంతా ఏడుస్తూ పడుకుంది. వేంటనే వెళ్లి శ్యామల ఒడిలో సేదతీరాలనిపించింది.
