Previous Page Next Page 
మహావృక్షం పేజి 70

ఆ తరువాత ఆవిడ మాటలు వినిపించుకోలేదు.
భరణి అడిగితె తెల్లిగా తీసుకుంది. అత్తగారి కోరిక కూడా అదే! బహూశా పెళ్ళి అవగానే పిల్లల్ని కనడం అనేది రివాజేమో ఎలా? తనకి పిల్లలు పుడతారా? అనుమానమే. పీరియడ్స్ చాలా ఇర్రెగ్యూలర్ అయాయి. ఎప్పుడో రెండు నెల్లకో అవుతోంది.
తనకింకా ఫర్టిలిటీ కెపాసిటీ వుందా? ఒకవేళ లేకపోతే...
అనూషకి గాభారాగా అనిపించింది.
కొన్ని రోజుల తరువాత అనూష తనకి బాగా తెలిసిన గైనకాల జిస్టు డాక్టర్ ప్రమీల దగ్గరకి వెళ్ళింది. ఆమెని చూడగానే ప్రమీల సాదరంగా ఆహ్వానించింది.
"రారా, అనూషా! ఇంత కాలానికి నా అవసరం వచ్చిందా? ఎన్నోనెల?" అడిగింది.
"అదేంలేదు.... చెకప్ కోసం వచ్చాను."
"ఐసీ... రా పరిక్షచేస్తాను.... స్కీన్ వెనక్కి వెళ్ళాక పరీక్షచేస్తూ అడిగింది-పీరియడ్స్ రెగ్యూలర్ గా వున్నాయా?"
"లేదు... చాలా గ్యాప్ వస్తోంది."
అరగంటసేపు పరీక్ష చేశాక చెప్పింది ప్రమీల. "సారీ అనూ! యూ ఆర్ రీచింగ్ టు మెనోపాజ్... నీకా అవకాశంలేదు." అనూష మొహం పాలీపోయింది. అనికున్నంతా అయింది. తనకే అనుమానం వచ్చింది. ఒక్కసారి గిన కాలజిస్టు తో కంఫర్మ్ చేసుకోడానికి వచ్చింది.
"పిల్లలు కావాలని వుందా అనూ?" అడిగింది జాలిగా.
"అబ్బలేదు.... అదేం లేదు..." ఖంగారుగా అంది.
కాస్సేపు ఆవిడతో మాట్లాడి నేరుగా ఇంటికొచ్చి పడుకుండిపోయింది.
తను చాలా పెద్ద పోరపాటు చేసింది. ఇన్నేళ్ళూ ఎంతో బలంగా నిలుపుకుంటూ వచ్చిన సిద్దాంతాలను ఒక బలహీనక్షణంలో సడలించుకుని పెళ్ళికి ఒప్పుకుంది. అదీ తనకన్నా చిన్నవాడయిన భరణితో.
అతనది వ్యామోహమో! ఆరాధనో! పిచ్చో.... తన వెంట పడ్డాడు. పెళ్ళిచేసుకుంటానన్నాడు. రాయబారాలు పంపాడు. ఎందుకు ఆకర్షంపబడ్డాడో, తననించి ఏం ఆశించాడో తెలియకుండా ఒప్పుకుంది. ఒప్పుకునే ముందు తనకి పిల్లల్ని కనడం ఇష్టంలేదన్న సంగతి చెప్పాల్సింది. చెప్పలేదు... ఆ ఆలోచన రాలేదు... పిల్లలు ఇష్టమైన కనే స్థితిలేదు. కానీ అతనికా అవకాశం వుంది.
ఇప్పుడీ సంగతి తెలిస్తే ఇద్దరిమధ్యా బాగా గ్యాప్ వచ్చింది. లండన్ ప్రయాణం క్యాన్సిల్ అవడంతో భరణిపట్ల తనకి ఒక విధమైన విరక్తి కలిగింది.ఇదివరకులా అతనితో ప్రేమగా మాట్లాడటంలేదు. పక్కన పడుకోడంలేదు. అతను కూడా ఒకటి, రెండుసార్లు బతిమాలి, ఊరుకున్నాడు. నిర్లక్ష్యమో.... కోపమో మాట్లడడంలేదు.
భరణి బాగా పొద్దుపోయి వచ్చాడు. అన్నం తినకుండా వెళ్ళిపడుకున్నాడు. అతనలా నిర్లక్ష్యంగా వుండటం అనూషకి బాధ కలిగించింది. ఏదన్నా సమస్య వస్తే ఇద్దారూ చర్చించుకుని, సానుకూలంగా పరిష్కరించుకోవాలి. సారీ చెప్పాలి. ఎంతకాలం ఇలా? తన స్వభావానికి విరుద్దమైన పనిచేస్తోంది.
కేవలం ఈ సంసారం నిలుపుకోడానికే. ఈ బంధం కాపాడుకోవడానికే. ఎలాగా కెరియర్ పాడయింది. కనీసం సంసారం అన్న నిలుపుకోవాలి. నలుగురిలో  అపహాస్యం పాలవకూడదు. పంతంకన్నా,కోపంకన్నా ఆమె సంస్కారం గెలిచింది.
నెమ్మదిగా వెళ్ళి భరణి పక్కున పడుకుని అతనిమీద చేయివేసింది. "భరణీ!" మృదువుగా పిలిచింది.
 అతను మాట్లాడలేదు. బిగుదీసుకున్నాడు.
"భరణీ! ఇటు చూడు..... నువ్విలా ప్రతి నిమిషం చిన్నపిల్లాడిలా అలిగితే ఎలా చెప్పు? సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతుక్కోవాలి."
నేనేం వద్దనలేదే.... నువ్వే నాతో సారిగా వుండడంలేదు."
"సారీ... ఏమిటో మనసు పాడయింది. పోనీలే... మర్చిపోదాం.... జీవితం ముఖ్యం కదా!"
"పోనీ ఆ సంగతి ఇప్పుడన్నా తెలిసింది" చటుక్కున దగ్గరకి లాక్కున్నాడు.
అతని స్పర్శలో ఇదివరకటి అనుభూతి కలగలేదు. నిర్వికారంగా శరీరం అప్పచెప్పింది.
అరగంట తరవాత ఆమె గుండెలమీద తలపెట్టుకుని పడుకుని "మనిద్దరిమద్యా ఈ గొడవలు పోవాలంటే చిట్టిగాడు రావాలి.ఎప్పుడొస్తాడో.... ఏంటి నాకు తెలియకుండా ఏమన్నా ప్యామలీ ప్లానింగ్ పిల్స్ తీసుకుంటున్నవా? డాక్టర్ వికదా ?" అడిగాడు.
అమెగుండెల్లో రాయి పడ్డట్టయింది.
"మాట్లాడు... ఏం చేస్తున్నావు?"
"నీకు పిల్లలంటే  అంత ఇష్టమా?"
"నా పిల్లలంటే నాకు ఇష్టం... ఇష్టం సంగతి అలా వుంచు.పెళ్ళి అయి ఏడాది దాటుతోంది. పిల్లలు లేకపోతే జనానికి నా మగతనం మీద ప్రేమ ఎక్కువన్నమాట.
"అలా ఎందుకనుకోడం? చక్కగా అనాధ పిలల్ని ఎవరినయినా పెంచుకుందాం. వాళ్ళకి బతుకు ఇచ్చినట్టు వుంటుంది. మనకి పుణ్యమూవస్తుంది,"
"నాకేం పుణ్యం అవసరంలేదు. పిల్లలు కావాలి. ఏంటి ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నావు."      

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS