Previous Page Next Page 
మహావృక్షం పేజి 69

ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో తను కాన్పురెన్స్ కి వెళ్ళడం అసాద్యం. ఎలా? ఎలా చెప్పాలి హరిశ్చంద్రగారికి....
అనూష కాన్పెరెన్స్ కి ప్రిపేర్ అవలేకపోయింది. భరణి ప్లాను సకేస్స్ అయింది...
ప్రయాణం తేదీ దగ్గరపడింది...
ఆరోజు హరిశ్చంద్రగారు కబురుచేశారు.... గుండె గుభిల్లుమంది.తను ప్రిపేర్ అవలేదని, వీసా క్యాన్సిల్ చేయించమని చెప్పటానికి దైర్యం సరిపోలేదు. కారణం ఏం చెప్పాలి? అవును--కారణం ఏం చెప్పాలి? భరణి చదువుకోనివ్వలేదని చెప్పాలా? తను ఇప్పుడు మానసికంగా బలహినురాలైమది చెప్పాలా?తనిప్పుడు  పరాదీన అని, స్వతంగా తీసుకునే నిర్ణయాలు సక్సెస్స్ అవమని చెప్పాలా? ఏం చెప్పాలి? భయం భయంగా వెళ్ళింది.
"ఏమ్మా ఎలా సాగుతోంది వర్కు?" అడిగాడాయన.
అనూష దైర్యం కూడాదీసుకుంది. "సర! నేను...నేను..."
అయన అనుమానంగా చూశాడు...." "చెప్పు..."
"నేను... నేను... ఈ సారికి వెళ్ళలేదు.... నా ఆరోగ్యం బాగాలేదు."
"ఐసీ! యూ మీన్..."
"అయామ్  ఇన్ ప్యామీలీ వే..."
"మైగాడ్! ఇది కూడా గుడ్ న్యూస్...కానీ, యూ ఆర్ మిస్సింగ్ ఏ వెరీగుడ్ అపర్చునిటీ... ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తగా వెళ్ళిరామ్మా..."
"లేదుసార్! వెళ్ళలేదు, అసలు బాగాలేదు. మార్నింగ్ సిక్ నేస్ ఎక్కువుగా వుంది. గిడ్డీనేస్... పేపర్ ప్రెజంట్ చేయాలంటే కుదరక పోవచ్చు. సారీ..."
"ఎనీవే.... కంగ్రాట్స్! నేను మాట్లాడతాలే. వీసా క్యాన్సిల్ చేయిస్తాను."
గుండె పగిలినట్టుయింది. సువర్ణావకాశం.... చేతులారా వదులుకుంటోంది.ఎందుకిలా జరిగింది? అనేందుకు భరణి ని ప్రతిఘటించలేకపోయింది.... అతనిమీద ప్రేమా? లేక తాను కూడా మానసికంగా బలహినురాలై, ఇంతకాలంగా కోల్పోయిన జీవన మాధుర్యాన్ని వదులుకోలేక పోయిందా? తనలో భర్త మాట కాదనలేని బానిసత్వం వుందా? అది ఇంతకాలం నిగూఢంగా వుండి, ఇప్పుడు అతడి సమక్షంలో బైటపడుతొందా? భరణి నిజంగా ప్రేమతో తనని గెల్చుకుంటున్నాడా? తన ఉన్నతి భరించలేక, ప్రేమ నటించి, భర్తగా సాధిస్తున్నాడా? తను ఒడిపోతోందా? నో! నో! అలా జరక్కూడదు....
ఆ రాత్రి చాలాసేపు ఏడుస్తూ వుండిపోయింది. ఆమె ప్రయాణం క్యాన్సిలు అయినందుకు హాయిగా నిట్టూర్చాడు భరణి.
అతడితో మాట్లాడలనిపించలేదు.... కావాలని తను లండన్ వెళ్ళడం ఇష్టంలేక అతడు కావాలని తనతో గొడవ పెట్టుకుంటున్నడనిపించింది....
నాలుగైదు రోజుల తరువాత, ఆరోజు మాట్లాడింది అనూష.... "భరణి! నిజం చెప్పు. నువ్వు కావాలని నా ప్రయాణం క్యాన్సిల్ అవాలని అలా ప్రవర్తించేలా చేసింది. కానీ, నీ అభివృద్ధి నా అభివృద్ధి కాదా? నువ్వు లండన్ వెళ్ళడం నాకు సంతోషం కాదా? గర్వం కాదా?"
అతని కళ్ళల్లో కనిపిస్తున్న పశ్చాతాపం, బాధ ఆస్పష్టంగా కనిపించినా, నమ్మలేకపోయింది. అలాగని గట్టిగా ఏమీ అనలేకపోయింది.
ఒక అబద్దం చెప్పినప్పుడు అది కప్పిపుచ్చుకోడానికి మరో అబద్దం చెప్పాలి. హరిశ్చంద్రగారితో చెప్పిన అబద్దం కప్పిపుచ్చుడానికి మరో నెల తరువాత మరో అబద్దం చెప్పి, తనకి అబార్షన్ అయిందని చెప్పి, లీవు  పెట్టింది. ఎందుకో అనూషకి జీవితంలో మొదటిసారిగా తను బాగా దిగజారిపోయాననిపించింది. దీనికి కారణం అయిన భరణి మీద ఒ విధమైన జుగుప్పకలగసాగింది. అనుకోకుండానే  అతడికి దూరంగా వుండటం ప్రారంభించింది.... అది గమనించిన న్భారని ఆమెని ప్రసన్నురాలిని చేసుకోడానికి చాలా  కష్టపడాల్సివస్తోంది.
ఆ రోజు మార్కండేయులు దగ్గరనుంచి పోన్ వచ్చింది. అనూష రిసీవ్ చేసుకుంది.
ఏమ్మా ఎలా ఉన్నావు? మావాడేమన్నా బాధ పెడుతున్నాడా?" అడిగాడాయన. అనూష విరక్తిగా నవ్వుకుంది..." లేదండీ! మీరెలా వున్నారు?" అడిగింది.
"మాకేం... నిక్షేపంగా వున్నాం. నువ్వేంటి? ఆ అస్తమానం హాస్పిటల్ అంటూ ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తున్నావట.... డాక్టర్ వి. నీకు నేను చెప్పడం బాగుండదు. కానీ, ఆరోగ్యం తరవాతే అన్నీ.... జాగ్రత్తగా వుండాలి. వేళకి బోంచెయ్."
"అలాగేనండి... చేస్తున్నాను."
"మీ అత్తయ్య మాట్లాడుతుందిట..." అంటూ ఫోన్ ఆవిడకి ఇచ్చాడు.
ఆవిడా లైన్లోకి వచ్చింది.
"ఏమ్మా అనూషా! ఎలా వున్నావు?"
"బాగానే వున్నాను. మీరెలా వున్నారు?"
"మాకేం కానీ, మాకు మనవాడినిచ్చేదుందా ?"
అనూష చేతిలో రిసీవర్ కంపించింది. గట్టిగా పట్టుకుని, పేలవంగా నవ్వింది.
"మా ఇంట్లో పాపాయి తిరగాలని వుందమ్మా. నీకు టైం వుండదని కనడం మానెసేవ్. నేను పెంచుకుంటాను. మాకు మనవడు కావాలి. నెల తప్పితే కబురుచేయి వస్తాను.... సరేనా?"          


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS