Previous Page Next Page 
మహావృక్షం పేజి 64

అనూ! పుట్టాం... పెరిగాం. బతికాం... కాణీ, మానవజన్మ ఎత్తినందుకు పశుపక్షదులకు లేని సౌలభ్యాలు, సోవ్ఖర్యాలు, అనుభావాలూ, అనుభూతులూ మమ్న్కి కల్పించాడా భగవంతుడు. అవన్నీ అనుభవించకుండా పోవడం అంటే జీవితాన్ని పూర్తిగా అనుభవించటంలేదేమో అనిపిస్తుంది నాకు. మన భారతదేశంలోని సౌదర్యాన్నంతా చూస్తే, మిగతా ప్రపంచం సంగతి తరువాత ఆలోచించవచ్చు. అందుకే చెబుతున్నాను. కొన్ని రోజులపాటు హాస్పిటల్ నీ, సమాజసేవనీ మర్చిపోయి, నువ్వూ, భరణీ ఒ ట్రిప్పు వేయండి. ఇంకా వయసు ముదిరితే కదల్లేము, కూర్చోలేము...ఏమీ చూడలేము. అందుకే నా మాటవిని వెంటనే బయలు దేరంది. భరణిని అడిగానని చెప్పు. ఉండనా మరి...
వీణ.                                                                                                                                   
"వీణ ఉత్తరం చదివాక అనూష మనసంతా తేలిగ్గా, ఉల్లాసంగా మారింది. 'నిజమే! ఓసారి ఏటన్నా తిరిగిరావాలి. బొత్తిగా జీవితం మొనాటనస్ అయిపోయింది. పాపం! భరణి అంటూనే వున్నాడు ఏటన్నా వెళ్ళాలి అని. అప్పుడు వెళ్లాలనుకుంటే శ్యామలకి అనారోగ్యం రావడంతో కుదరలేదు, ఈసారి ప్లాన్ చేయాలి' అనుకుంది. అప్పటికప్పుడే డైరీ తీసి, తన అపాయింట్ మెంట్స్ చూసుకుంది. దగ్గర్లో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏమీలేవు. డేట్ ఫిక్స్ చేసి,  ఆ రాత్రి భరణికి చెప్పింది.
"ఐదో తారీకు మనం మెడ్రాస్ వెళదాం. ఇవాళ టికెట్స్ తెప్పించు భరణీ!"
"ఏంటి దేవిగారు అడక్కోమ్డా వరాలిస్తున్నారు?" సంతోషంగా అడిగాడు.
"అంతే. దేవతలు అలాగే చేస్తారు" అని నవ్వింది.
అయితే, ఈసారికూడా అనుకున్నట్టుగా బయల్దేరలేకపోయింది.
మర్నాడు హాస్పిటల్ కి వెళ్ళాగానే, సిస్టర్ చెప్పింది. "డాక్టర్! మిమ్మల్ని చీప్ గారు రమ్మన్నారట... చాలాసార్లు మీ గురించి అడిగారుట..."
అనూష ఆశ్చర్యంగా చూసింది. "ఎందుకు?"
తెలియదు. వెళ్ళిరండి."
"సరే.... ముందు రౌండ్స్ పూర్తీచేసి వెడతాను. బెడ్ నెంబరు10 పేషెంట్ కండిషన్ ఎలావుంది?"
"చాలా బాగా కోలుకున్నాడు డాక్టర్! చక్కగా మాట్లాడుతున్నాడు."
"వెరీగుడ్! డాక్టర్ ప్రవీణ్ వచ్చారా?"
"వచ్చారు."
"రౌండ్స్ కి వెళదాం రమ్మని చెప్పండి."
"ఒ.కే.డాక్టర్!" సిస్టర్ వెళ్ళిపోయింది.
అనూష రౌండ్స్ పూర్తీచేసి, డాక్టర్ హరిశ్చంద్రగారిని కలుసుకోడానికి వెళ్ళింది.
చాలా రోజులైంది చీప్ కలసి. ఈ మధ్య లీపులు బాగా తీసుకుంది. ఎందుకు పిలిపించి వుంటారు? పెళ్ళిచేసుకోమన్నది, వృత్తిని నిర్లక్ష్యం చేయడానిక్కాదు అని చివాట్లు వేయడానికా? అలా చేయరు. మరి ఎందుకో! ఏదన్నా కొత్త మెటీరియల్ వచ్చిందా? అలా  కొత్త మెటీరియల్ వచ్చినప్పుడల్లా దని గురించి అనూషతో తప్పకుండా డిస్కస్ చేస్తాడాయన. ఆమె ఆలోచనల్లో వుండగానే చీప్ ఛాంబర్ సమీపించింది.
అయన ఒక్కడే కూర్చుని వున్నాడు. చాలా ఖాళీగా ఏదో మెడికల్ జర్నల్ తిరగేస్తున్నాడు. అనూషకి కొంచెం భయంవేసింది. ఇంత ఖాళీగా కూర్చుని తనని పిలిచాడంటే చాలా ముఖ్యమైన వ్యక్తిగత విషయం మాట్లాడడానికే అయి వుంటుంది. నిజానికి ఆమెనెవరూ విమర్శించక పోయినా,పెళ్ళిచేసుకున్నాక కొన్ని రోజులు లీవుపెట్టి, దాంపత్య జీవితం గడపడమనేది ఆమెకి ఆమె బాద్యతరహితంగా ప్రవర్తించానేమో అనుకుంటోంది. అందుకే అయన ఆ విషయం మాట్లాడాడానికే పిలిచాడేమో అన్పించింది.
"మే ఐ  కమిన్ డాక్టర్" అనూష స్వరం విన్పించగానే అయన తలెత్తి చూశాడు.
 అయన మొహంలో వెలుగు కన్పించింది. రీలీప్ గా నిట్టూర్చింది అనూష.
"కబురు చేశారట."
"కూర్చోమ్మా."
అనూష కూర్చుంది.
ఎలా వుంది కొత్త జీవితం? భరణి బాగా చూసుకుంటున్నాడా?"నవ్వొచ్చింది ఇదేమాట వెన అడిగియే వేరే సమాధానం వుంటుంది. కానీ ఈయనకి చెప్పలేదుగా అలా నవ్వుతూ అంది.
"బాగానే చూసుకుంటున్నాడు డాక్టర్."
"అప్ కోర్స్ నిన్ను ఒకళ్ళు చూసుకునేదేంటిలే! ఇంకా ఏంటి విశేషాలు? ఈమధ్య అడ్వెంచర్స్ ఏంలేవుకదా!"
నవ్వి ఊరుకుంది.
"నీతో ఒ ఇంపార్టెన్స్ విషయం మాట్లాడటానికి పిలిచాను అనూషా!"
"చెప్పండి" కుతూహలంగా చూసింది.
"ఏంలేదు. ఆగస్టులో లండన్ లో ఇంటర్నేషనల్ మెడికల్ కాన్పు రెన్స్ జరగబోతుంది. ఇండియా నుంచి, ఒక్కో స్టేట్ నుంచి ఒక్కొక్కరిని నామినేట్ చేస్తున్నారు. బొంబాయి నుంచి డాక్టర్ జోషి, డిల్లీ నుంచి డాక్టర్ మెహతా, కలకత్తానుంచి డాక్టర్ చటర్జీ, మెడ్రాస్ నుంచి డాక్టర్ రాజన్ వెళుతున్నారు. ఆంద్రప్రదేశ్ నుంచి డాక్టర్  అనూషని నామినేట్ చేయాలనుకుంటున్నాను."
"సర్ !" విస్మయంగా పిలిచింది.
"అవునమ్మా! నువ్వే... నిన్నే పంపించాలనుకుంటున్నాను. ఇవిగో ఇవన్నీ వేగంగా అభివృద్ధి చెందుతోన్న సైన్సు తాలూకు జర్నల్స్.... ప్రపంచవ్యాప్తంగా అద్బుతమైన ప్రయోగాలు చేస్తున్నారు కార్దియలజిలో అవన్నీ నేర్చుకుని ఇండియాలోనే పెద్ద సర్జన్ గా పేరు ప్రతిష్టలను సంపాదించాలి. అదిచూసి న్ శిష్యూరాలు సాధించిన ప్రగతికి గర్వంతో పొంగిపోవాలి నేను."
అనూష అప్రయత్నంగా లేచి అయన కాళ్ళకు నమస్కరించింది.
"నో!నో! అనూష ఎవరికీ ఎప్పుడూ, తలవంచకూడదు.కమాన్. మైడియర్ చైల్డ్.... గెట్ రెడీ. పేపర్ ప్రెజంట్ చేయడానికి కావలసిన మెటీరియల్. ఇదంతా తీసికెళ్ళి, కష్టపడి మంచి పేపర్ తయారుచేయి.... ఎప్పుడు, ఏ సమయంలో నా గైడెన్స్ కావాలన్నా ఫోన్ చేయి... ఒ.కే."

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS