"మా నాన్నగారు నా వాటా ఆస్థిలో కొంత ఇదివరకే ఇచ్చాడు.పత్రికకి మళ్ళీ ఇవ్వమంటే ఇవ్వరు. నువ్వే ఏదన్నా చూడచ్చుగా."
"నేనా?" దిగ్బాంతిగా చూసింది.
"ఏం? నీకు బోలెడు పరపతి వుందిగా.... ఇవన్న ఫండ్స్ ఇప్పించు."
"ఫండ్స్ ఎలా ఇస్తారు భరణీ? ఆశ్రమం వేరు. పదిమంది అనాధలకి కూడూ, గుడ్డా,నీడా... ఇచ్చే సంస్థ.... పత్రిక వేరు."
"ఏం? నేనూ ఇస్తున్నాను. పదిమందికీ కూడూ, గుడ్డా,నీడా...నా దగ్గర ఎంతమందిపనిచేస్తున్నారో తెలుసా?"
"నువ్విలా మాటాడితే నేనేం చెప్పను. కావాలంటే ఏదన్న బ్యాంకులో లోన్ తీసుకుందాం. నేను ష్యూరిటీ వుంటాను."
"అవసరంలేదు. లోన్ తీర్చద్డా? నాకసలే అప్పులంతే భయం."
"మరెలా?"
అతనేం మాట్లాడలేదు. భరణికి బాగా కోపం వచ్చింది. రెండు రోజులు మాటలు మానేశాడు. ఆశ్రమం కోసం మినిష్టరుగారిని కలసి ఫండ్స్ పొడిన అనూష తన భర్తకోసం ఏమీ చేయలేదా? చేయలేకకాదు. నిర్లక్షం.... అన్నం పెడుతున్నా కదా! ఇంకా వీడి ప్రెస్సు నడిస్తే ఏం?నడవకపోతే ఏం? అనే నిర్లక్ష్యం కాకపోతే ఎందుకిప్పించదు!
బ్యాంకులో లోను ఇప్పిస్తుందట. తను ష్యూరీటి ఇస్తుందట... లోను మళ్ళీ తీర్చద్డా? ఎక్కడినుంచి తీరుస్తాడు? పేపర్ నడపటం, నిలదొక్కుకోవడం అంత ఈజీనా? ఎంతో ప్రఖ్యాతగాంచిన పేపర్లు మూతపడ్డాయి. ఆప్ట్రాల్ తనదెంత? రెండు లక్షలు, ఐదు లక్షలు. ఎందుకు పనికొస్తాయి? హోండూ పేపర్ లా, ఈనాడు పేపర్ లా తన పేపర్ అత్యధిక సర్క్యులేషన్ సాధించాలంటే డబ్బు కావాలి... బాగా కావాలి. ఎలా? ఎలా?
అతని ప్రవర్లన ఆమెకి చిఇరాకు తెప్పించింది. అయిందానికీ, కానిదానికీ ఇలా వాదనేసుకోవడం, అలగడం,మాట్లాడకపోవడం ఇలాంటి చేష్టలు ఆమెకి చిరాకు. పెళ్ళిఅయిన దగ్గర్నుంచి ఇతని అలకలు తీర్చటం దినచర్యలో ఓ భాగం అవుతోంది. పరస్పరావగాఃహనతో, పరస్పర సహాకారంతో జీవితకాలం స్నేహితుల్లా వుండవలసిన తమ మధ్య ఈ మధ్య ఏదో ఒక లోటు ఏర్పడుతోంది. అది కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ వలన ఏర్పడేదే... దీనివలన స్పర్ధలు పెరుగుతాయేకానీ, తరగవు. ఈ వయసులో ఇలా దేబ్బలాడుకుంటూ బతకటం చాలా అసహ్యంగా వుంటుంది. అతను అవివేకంగా ప్రవర్తిస్తే తనన్నా వివేకంతో ప్రవర్తించాలి?
అనూష వీలైనంత మృదువుగా అన్నది. "కొన్నిరోజులు ఓపిక పట్టు భరణీ! ఆ స్థలంలో రెండు గదులు వేయిస్తాను."
భరణి వెంటనే కాకపోయినా, కొన్ని క్షణాల తరువాత అంగీకారం తెలిపాడు.
అతని టార్గెట్ స్వంత బిల్డింగ్... బిల్డింగ్ అయిపోతే, ప్రేస్సులోకి కావలసిన మెషినరీ సంపాదించాలి. ఇవి సంపాదించాక తన కోటిక తీరడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు... కానీ, ఆ కోరిక తీరేదెలా?
అనూష ఇచ్చిన ప్లాటుతో బిల్డింగ్ కట్టడానికి ఆర్కిటెక్ట్ ని కాంటాక్ట్ చేశాడు. ప్లాన్ తీసుకెళ్ళి అనూషకి చూపించాడు.
"ప్లాన్ చాలా బాగుంది. తప్పకుండా కొన్నిరోజులయాక కన్ స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం" అన్నది.
అయితే, అతను కొద్దిరోజులు ఆగడానికి సుముఖంగా లేడు. అతని మనస్తత్వం ప్రకారం అనుకున్నపని వెంటనే జరగాలి.
అనూషకి ఆసలు తన భర్తమీదకన్నా, ఆశ్రమం మీద అంతశ్రద్ద ఎందుకు? అనిపించింది అలా ఆలోచించినకొద్దీ ఆశ్రమవాసులమీద పీకలదాకా కోపం వస్తోంది. ఆ కోపం తీర్చుకోడానికి అతనికి ఒకటేమార్గం కనిపించింది. ఆశ్రమం విషయంలో తానెంతో శ్రద్ద వహిస్తున్నట్టుగా అనూష ముందు నాటకం అడి, అ డబ్బు తన కోరిక తీర్చుకోడానికి వుపయోగించుకోవాలి. అలా అనుకున్న వెంటనే అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవడంలో మునిగిపోయాడు.
* * * *
వీణ దగ్గర్నుంచీ ఉత్తరం వచ్చింది.
చాలా రోజుల తరువాత వీణ కబుర్లు తెలుస్తున్నాయన్న ఆరాటంతో అనూష పనులన్నీ మానేసి, ఉత్తరం చదవడం ప్రారబించింది.
"హాయ్ అనూ!
ఎలా వున్నావు? నీ స్నేహాన్ని, మనం కలసి గడిపిన అందమైన రోజుల్ని, పోందిన మధురాను భూతుల్ని మర్చిపోయి, సౌత్ ఇండియా టూర్ అంటూ వచ్చేశాక, నిన్ను చాలా మిస్ అవుతున్నాను. అయినా కొత్తగా పెళ్ళి చేసుకున్న నిన్ను నీ భర్తతో కొంతకాలం వంటరిగా వదలటం మంచి స్నేహితురాలిగా నా భాధ్యత కదా! అందుకే ఈ ట్రిప్పు. నేను ముందు విజయవాడ కనకడుర్గను, తిరుపతి వెంకటేశ్వరస్వామిని, కాణీపాకంలో వినాయకుడిని దర్శించుకుని బెంగుళూరు వెళ్ళాను. బృందావన్ గార్డెన్స్ చూశాను. కన్యకూమారి వెళ్ళాను.... రామేశ్వరం చూశాను. ప్రస్తుతం కోడైకెనాల్ లో వున్నాను.
ఈ హిల్స్ ప్రదేశం ఎంత బాగుందో తెలుసా! త్రీస్టార్ హొటల్ లో అందమైన నా గది కిటికీలోంచి చూస్తుంటే కొండలు తప్ప ఏం కనిపించటంలేదు. దూరంగా బొమ్మరీళ్ళులాంటి ఇళ్ళు... ఉదయం లేచేటప్పటకి మంచు దట్టంగా వ్యాపించి, పరిసరాలను కవర్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ మంచుని కరిగిస్తూ, సూర్యకిరణాలు వేచ్చాగా దూసుకొస్తాయి. మళ్ళీ అంతలోనే చల్లపడిపోతుంది. మంచు బిందువులు, బిందువులుగా జారిపడితుంటుంది. వర్షం ఏమో అనుకుంటాను. అప్ కోర్స్! అస్తమాను జల్లు పడుతూనేవుంటుంది. అబ్బ! ఎన్ని రకాల పూలో తెలుసా! ఎన్ని రంగులో.... ఇంకో విషయం తెలుసా.... ఎక్కడ చూసినా వ్వేటర్లు, శాల్స్, నేపాల్ వాళ్ళ వ్యాపారం మూడు పూలూ, ఆరు కాయలుగా సాగుతుంది. ఏం కొనాలన్న బోలెడు ఖరీదు. టూరిస్టు ప్లేసులో బాగా ఎక్స్ ప్లాయిటేషన్ వుంటుంది కదూ! ఇదంతా చూస్తోంటేఉద్యోగం, సద్యోగం అన్నీ మానేసి, ఇక్కడ స్వెటర్లు అమ్ముకుంటూ బతికేయచ్చు అనిపోస్తుంది.
సైట్ సీయింగ్ వెళ్ళాను. అబ్బ! ఏం వర్ణించగలను? ఎంత అందమో! ఎక్కడ చూసినా పచ్చదనం. సృష్టిలో అందమంతా కొడైకెనాల్ లోనే పోగుచేసి పెట్టినట్టుంది. జల్లులు పడుతుంటే వేడివేడి శనగపప్పు, భలే రుచిగా చేసి అమ్ముతుంటారు. అవి కొనుక్కుతింటూ, తిరగడం ఎంత బాగుందో ఈ అనుభూతి....
మా గైడ్ పెద్ద లోయ చూపించి సూయి సైడ్ పాయింట్ అన్నాడు. అక్కడనుంచి దూకితే మళ్ళీ కాగాడా వేసి చూసినా కనిపించటంలేదు.
