మీరెందుకు శ్రమ తీసుకున్నారు భరణిగారూ!" అన్న శ్యామలతో అన్నాడు.
"ఇంతకాలం మగవాళ్ళ అమ్డలేక అన్నిపనులూ మీరే చేసుకున్నారు.... ఇప్పుడు నేను వున్నానుకదా! ఏం కావాలన్నా నన్ను అడగండి... అనూష ఎంతో నేనూ అంతేగా."
శ్యామల సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఆలస్యంగా పెళ్ళి చేసుకున్నా, భరణిలాంటి అమృతహ్రుదయుడిని చేసుకున్నందుకు మనసారా సంతోషించింది.
నీరజ కొడుకుని స్కూల్లో వేయడానికి అతని సహాయం కోరింది. అతను నీరజనీ, బాబునీ తీసికెళ్ళి అక్కడికి దగ్గరగా వున్న కాన్వెంటులో చేర్పించాడు.
తను అనూషకి చేరువకావాడానికి కారకురాలు అయిన నీరజమీద అతనికి కొంచెం అభిమానం కలిగింది.
అందంగా, సన్నజాజిమొగ్గలా వున్న నీరజని చూశాక భరణికి అనిపించింది. ఈ అమ్మాయికి అనూష పెళ్ళిచేయకుండా ఆశ్రమంలో ఎందుకు వుంచింది? అని అదే అన్నాడు నీరజతో.
"నువ్వు పెళ్ళిచేసుకోవచ్చుగా నీరజా!"
నీరజ ఉలిక్కిపడింది, పెళ్ళా.... తనకి పెళ్ళా..." ఒక్కసారి గతం గుర్తోచ్చివణికిపోయింది. తను ఏ విధంగా అర్హురాలు? ఈ శరీరాన్ని ఏమ్తమంది వాడుకున్నారు? ఎంత చరిద్రంగా డుకున్నారు? పెళ్ళి, కాపురం, శ్రుగారం అంటే వేగాటపుట్టేలా, రాత కలిగిగెలా... అమ్మో... పెళ్ళిచేసుకోవడం భర్త అనే మగవాడి స్పర్స భరించడం....
ఏం మాట్లాడకుండా మౌనంగా వుండిపోయింది. ఆమె మోఎనం సహించడంతో అతనేం మాట్లాడలేదు. పిల్లవాడిని స్కూల్లో చేర్పించాడు. తండ్రి పేరుదగ్గర నిర్బయంగా ఫాదర్ అని కొట్టేసి, మధర్ అని రాసి, తన పేరు రాసింది నీరజ. ఆమె దైర్యానికి ఆశ్చర్యపోయాడు.
"నీకింత దైర్యం ఎలా వచ్చింది?" అడిగాడు.
"మేడం దగ్గర నేర్చుకున్నాను. ఇది దైర్యంకాదు.... ఆత్మవిశ్వాసం ."
నివ్వెరపోయాడు.... మంచి ట్రైనింగ్ ఇస్తోంది అనూష.
ఆమెని ఆశ్రమం ఖర్చులకోసం అనూష ఇచ్చిన డబ్బులో మిగుల్చుకున్న రెండున్నర లక్షలు తీసుకుని ఆఫీసుకి వెళ్ళిపోయాడు.
అనూషమీద వున్న కోపం... తన పత్రిక డైలీ పేపర్ కావాలన్న ఆశా, తను పైకి రావాలన్న స్వార్దం కలసి, సత్కార్యంకోసం తనని నమ్మి ఇచ్చిన డబ్బుని నిర్మోహమాటంగా స్వకార్యంకోసం ఖర్చుపెట్టుకోడానికి నిర్ణయించుకున్నాడు.
అయితే ఆ డబ్బు మంత్లీ పత్రిక నిరాటకంగా సాగడంకోసం... కానీ డైలీ పేపర్ చేయాలన్న ఆస నెరవేరాలంటే ముందు స్వటంగా ప్రెస్ పెట్టుకోవాలి. డానికి ఎక్విప్ మెంటు కొనాలి. అందుకు చాలా డబ్బుకావాలి.
* * * *
భరణి పత్రిక మానసపత్రికగా మారింది.
అనూష మరో ఐదులక్షల తన స్వంత డబ్బు పత్రికకి పెట్టుబడిపెట్టింది. భరణి స్వంత ప్రెస్సు పెట్టుకోవాలన్న కోరిక రోజురోజులకీ పెరగసాగింది. అనూషని ఎలాగయినా ఒప్పించి ఈ ఇంట్లో ఓ భాగంలో ప్రేన్సు పెట్టుకోవాలి. ఎందుకు ఒప్పుకోదు? తన భర్త పైకి రావాలనుకుంటే ఒప్పుకుతీరాలి. నిజంగా డిలే పేపరు తీసుకురాగాలికితే, అనూష క్కూడా ఎంత పబ్లిసిటీ! రోజూ ఆమె గురించి వార్తలు వేయచ్చు.... ఆ మాటే అన్నాడో రోజు.
"అనూషా! ఇంతవరకు సాయంచేశావు. బాగానే వుంది. స్వంత ప్రెస్సు పెట్టుకోడానిక్కూడా సాయం చేయచ్చుగా!"
"చెప్పనిగా భరణీ! చస్తాను.... వీలయినంతమటుకు చేస్తాను.... నెమ్మదినెమ్మదిగా అభివృద్ధి సాధించాలి.ఒక్కసారే పైకెళితే డాం అనిపడిపోతాం."
"నేను పడిపోకుండా నువ్వు పట్టుకోగలవు. నువ్వంట సమర్డురాలివి కాబట్టే నిన్ను నమ్ముకున్నాను. ఏమవుతుంది ఈ ఇంట్లో సగం ప్రెస్సు పెట్టుకుంటే."
"ఆ మాట మాట్లాదవద్దన్నానా?"
"నేను అమ్మమనడంలేదు. కొంచెం భాగం నాకివ్వమంటున్నాను."
"రెడిదేన్సియాల్ కాలనీలో ప్రెస్సు పెడితే ఎంత డిస్టర్బెన్స్ గా వుమ్తుమ్దావు తెలుసా?"
"నీకేం ఇబ్బంది కలక్కుండా చూసుకుంటాగా."
"భరణీ! ఎత్తి పరిస్థితుల్లోనూ ఈ ప్రపోజల్ అంగీకరించను. ఇంకోసారి ఈ విషయం మాతాడదు. ప్లీజ్" నిర్మొహమాటంగా చెప్పింది.
'అవునులే నువ్వు నాకెందుకు సాయంచేస్తావు? ఆ దిక్కు మాలిన వాళ్లకు చేస్తావు'అనుకున్నాడు మనసులో.
భరణికి చాలా అనీజీగా అనిపించింది. అనూష ఇల్లెందుకు అమ్మకూడదు? వెధవ సెంటిమెంట్... ఆ ఇల్లు అమ్మితే యాబై లక్షలు పైన వస్తుంది... పదిలక్షల్లో డబల్ బెడ్ రూమ్ ప్లాట్ కొనుక్కుని మిగత డబ్బు బ్యాంకులో వేసుకుని, కొంత డబ్బు పేపర్ కి పెట్టుకోవచ్చు.
అతనలా అలగతం, మూభావంగా వుండటం అనూషకి బాధనిపించింది. 'ప్రతిదీ అలిగి సాధిస్తాడు ఈ మనిషి. ఏంటి ఈ మనస్తత్వం' అనికుమ్ది. మావగారు చెప్పిన మాటలు గుర్తొచ్చి అతడిని అర్ధం చేసుకోడానికి ప్రయత్నంచింది. ఆ రాత్రి కొన్ని డాక్యూమెంట్లు అతని చేతికి అందిస్తూ అన్నది.
"ఇవి నా స్థలం తాలుకూ డాక్యూమెంట్లు.... బంజారాహిల్స్ లో రెండు వందల గజాల స్థలం వుంది.నీకు అవకాశం వుంటే ఈ స్థలంలో నలుగ్గడులు వేసుకో... ఆ గదుల్లో ప్రెస్సు పెట్టుకో."
భరణి మోహం వికసించింది. బంజారాహిల్స్ లో రెండోందల గజాల స్థలం అంటే మాటలా? కానీ నాలుగ్గదులు వేసుకోడానికి డబ్బో! అదే అన్నాడు.
"మీ నాన్నగార్ని అడగవచ్చుగా."
