Previous Page Next Page 
మహావృక్షం పేజి 61

"ఒక్కదాన్ని ఎందుకున్నాను? వాచా మెన్ వున్నాడు. రాజు వున్నాడు. అయినా, నేను ఇమ్త్లఒ౦ వుండేది రాత్రిళ్ళేగా.... భయం దేనికి?"
"భయంకాదు. అసలోమ్త ఇల్లు అవసరం వుందా అని...."
"మా నాన్నగారు కట్టించారు. అవసరం ఉంటుందని కట్టించి వుంటారు. ఇప్పుడు ఇద్దరం ఉన్నాంగా.    "
"అయినా, ఇంత పెద్ద ఇల్లు వేస్తూ అనిపిస్తుంది."
"వేస్తూ అయినా తప్పదు. లెటజ్ ఎంజాయ్..."
"నాకో చిన్న ఐడియా వచ్చింది చెప్పనా?"
"ఏంటి? చెప్పు."
"ఏంలేదు. నేను ప్రింటింగ్ ప్రెస్సు కూడా పేట్టాలనుకుంటున్నాను. చూస్తున్నావుగా. నా పత్రిక వేరే ప్రెస్సులో ప్రింటింగ్ కి ఇవ్వాల్సి వస్తంది బొత్తిగా అడ్వర్ టైజ్ మెంటులులేవు. ఎప్పడన్నా ఒకసారి ఐదు వేళ కాఫీలు అమ్ముడవుతుంది. దానికి సర్కులేషన్ పెరిగిందని సంతోషపడతాను. ఈ సారి ఇష్యూ రాలేదు. కొందరు ఎంప్లాయిస్ వేరే చూసుకుని వెళ్ళిపోయారు. బొత్తిగా నష్టాల్లో పడింది నాపేరు."
"పోనీలే.... ఏం పోయిందిప్పుడు... వేరే మంచి పేపర్ లో ఉద్యోగం చూసుకోవచ్చుగా. నడవని పత్రికతో కుస్తీ ఎందుకు?"
"నో! నేను ఇంకో దగ్గర పనిచేయడం ఏంటి? నా స్వంతంగా నాకు ప్రెస్ కావాలి."
"ఇంకేం. దాందెం వుంది భరణీ! ప్రెస్సు పెట్టుకో."
"ఆ... అదే... దానికి కావాల్సిన రెండు మిశాన్సు కొనాలి. దానికి కొంత ఖర్చువుతుంది. ఆ డబ్బు నువ్వు పెట్టుబడి పెడితే, నా పేపరు కుంటి  నడక మానేసి, చక్కగా హంస నడకలు నడుస్తుంది. మంత్లీ పేపరు చేయాలన్న నా కోరికా తీరుతుంది."
నీ కోరికా, ఆశా నేరవేరాలని నేను ఆకాంక్షిస్తాను.... తప్పకుండా నీకు పెట్టుపడి పెడతాను. అయితే కొంతకాలం ఆగాలి. ప్రస్తుతం నాదగ్గర అంత డబ్బులేదు."
"అందుకే చిన్న ఐడియా వేశాను."
"ఏంటది?"
"మనిద్దరికైనా ఇంత పెద్ద ఇల్లు అవసరంలేదు. అందుకని.... ఈ ఇల్లు అమ్మేసి."
"భరణీ!" గట్టిగా అరిచింది.
ఉల్లిక్కిపడ్డాడు.
అనూఒష సర్దుకుని అన్నది__
"సారీ! ఈ ఇల్లు అమ్మాలన్న అల్ప్చన రావడమే మహాపాపంగా భావిస్తాను నేను... ఇది మా నాన్నాగారు కట్టిచ్చిన ఇల్లు. అమ్మా, నాన్నా తిరిగిన ఇల్లు.... నేను పుట్టి పెరిగిన ఇల్లు.... అడిపాడిన ఇల్లు... వాళ్ళిద్దరూ భౌతికంగా లేకపోయినా, ఈ ఇంట్లో వాళ్ళ పధద్వనులు నాకు వినిపిస్తూనే వుంటాయి....
ఎక్కడ అడుగు పెట్టినా, ఏం చేసినా కోటిస్వరాలతో నన్ను దీవుస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. అమ్మా స్వరం, ఆవిడా పాదాల మంజీర నాదాలు, మట్టెల శబ్దం, నాన్నగారి గంభీరస్వరం నాకు అనుక్షణం వినిపిస్తూ వుంటాయి.
నేనూ పూజించే దేవుళ్ళు మా అమ్మా నాన్న__ ఊ ఇల్లు వారిద్దరి విగ్రహాలున్న దేవాలయం. నేను వేరే దేవాలయానికి ఎక్కువగా వెళ్ళను.... ఎప్పుడో తప్ప... ఇదే దేవాలయం. ఇంకెప్పుడూ ఇలాంటి ఆలోచన రానివ్వకు."
భరణి ఆమె మాటల్లో వినిపించిన ఉద్రేకానికి కొంచెం జమ్కాడు. ప్రస్తుతానికి ఆ సబ్జెక్ట్ మాట్లాడకపోవడమే మంచింది అనిపించింది. నెమ్మదిగా అన్నాడు. "సారీ!"
అనూష ఆవేశం తగ్గించుకుని నవ్వింది. "ఇట్సాల్ రైట్ ! పద కిందికి వెడదాం. అన్నట్టు చెక్ సంగతేమైంది? నేను పట్టించుకోలేదు."
"ఇంత త్వరగా అవుతాయా గవర్నమెంటు ఆఫీసుల్లో పనులు నువ్వు మళ్ళీ ఒకసారి మినిష్టర్ గార్ని కలిస్తేగానీరాదు" అన్నాడు.
"ఓ.కే! రేపే వెళతాను."
                                         *    *    *    *
అన్నట్టుగానే, అనూష మర్నాడు మళ్ళీ మినిష్టర్ గారి దగ్గరకి వెళ్ళింది.
"దాదాపు నెల అవుతోంది నేను శాంక్షన్ చేసి, ఇంకా రిలీజ్ అవలేదా?" అంటూ అయన పి.ఎని పిలిచి, వెంటనే చెక్ రిలీజ్ అవడానికి ఏర్పాట్లు చేయమన్నాడు.
"....మీరు రానవసరంలేదు. చెక్కు మీకు పంపిస్తాను" అన్నాడు పి.ఏ...
అనూష థాంక్స్ చెప్పి పచ్చేసింది.
మర్నాడు మద్యానానికి హాస్పిటల్ కి వచ్చి ఇచ్చాడు పి.ఏ.... అతనకి ఏదో ప్రాబ్లం ఉంటే చెక్ చేసి, మందులు రాసిచ్చి పంపించింది.
ఆ చెక్కు భరణికి ఇచ్చి డిపాజిట్ చేయమంది. క్యాష తీసు కున్నాక ఏమోం చేయాలో చెప్పింది.
"నీ కెందుకు? నువ్వు ఆశ్రమం సంగతి మర్చిపో.... నేను చూసుకుంటాను" అన్నాడు.
"అంతకన్నానా? థాంక్యూ" అన్నది ఆనందంగా. అనూష, భరణిని మనసారా నమ్మి, ఆశ్రమం బాధ్యతలు అతనికి అప్పగించింది.
భరణి చెక్కు తీసికెళ్ళి. డిస్కౌంట్ చేసి, క్యాష్ తీసుకున్నాడు. అనూష చెప్పిన పనులు చేయడానికి హూషారుగా బయలుదేరాడు. అతనలా హూషారుగా అ భాద్యతలు తీసుకోడానికి కారణం డబ్బు తన చేతి మీదగా ఖర్చుచేస్తాడు కాబట్టి ఎంతో కొంత మిగుల్చుకోవచ్చునే ఆస.... స్వార్దం.
ఎవరో దిక్కులేని వాళ్ళకోసం అనూష అంతగా శ్రమపడడం, అంత డబ్బు ఖర్చుచేయడం భరణికి నచ్చలేదు. చూస్తూ చూస్తూ అన్ని లక్షలు ఆశ్రమానికి ఇవ్వడం ఎంతమాత్రం నచ్చలేదతనికి. అందుకే నిర్మొహమాటంగా, కొంచెం దైర్యంగా ఆ డబ్భులో కొంత దాచుకోవాలని నిర్ణయించుకున్నాడు.
పైగా అనూష ఆశ్రమంకోసం పడే శ్రమలో తన పత్రికకోసం పడకపోవడం అతడి కడుపుమంటకి కారణం అయింది. అదేం బయటపడకుండా మామూలుగా ఎంతో నమ్మకంగా ఆ భాద్యతలు స్వీకరించాడు. సక్రమంగా చేస్తున్నట్టుగా అనూష దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు.
అనూష చెప్పిన సంఖ్యలో సగం తగ్గించి మిషన్లు కొన్నాడు. అతను కొన్ని మిషన్లు మంచి కంపెనీ కావు. చౌకలో వస్తున్నాయని లికల్ కంపెనీవి కొన్నాడు. అలాగే సరుకులు, ఇతర వస్తువులు తనే తెసు కొచ్చి ఇచ్చాడు శ్యామలకి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS