Previous Page Next Page 
మహావృక్షం పేజి 60

భరణి ఆశ్చర్యంగా చూశాడు. "నీకీ అనుభూతులు కూడా వుంటాయా?"
అనూష నవ్వింది. "నాకివేళ చాలా సంతోషంగా వుంది భరణీ! నా ప్రాణస్నేహితురాలు శ్యామలని బతికించుకున్నాను. ఓ స్నేహితురాలిని పోగొట్టుకున్న ఆ దురదృష్టకరమైనా రోజు ఇంతవరకూ మర్చిపోలేకపోతున్నాను. థాంక్యూ  భరణీ! నువ్వూ కోపరేట్ చేశావు."
"నేనా?" ఆశ్చర్యంగా చూశాడు. నేనేం కోపరేట్ చేశాను?"
"మూడు రోజులు నిన్ను పట్టించుకోకపోయినా, నాతోదెబ్బలాడకుండా వుండటమే భర్తగా నువ్వు నా కిచ్చే సహకారం."
అప్పటిదాకా ఆమెతో తీవ్రంగా దెబ్బలాడాటానికి నిశ్చయించుకున్న భరణి, ఆ మాటలతో నేరు కారిపోయారు. అయాచితంగా అనూష అందించినమంచితనం అనే పురస్కారం అతని నోరు మూయించింది. అయితే అతని మనసులో ఎన్నో రోజుల నుంచీ మోదులుతొన్న అలిచన ఆమెతో చెప్పటానికి ఇదొక మంచి సమయంగా భావించాడు.
అనూష ఇల్లు చాలా పెద్దది. మూడు పడ్డ పెద్ద బెడ్ రూంలు, పెద్ద  డైనింగ్ హాలు, అంతకన్నా పెద్దహాలు, లివింగ్ రూమ్. చూట్టూ విశాలమైన ఖాళీస్థలం, డాబామీద వున్న అందమైన గది.... అక్కడికి వచ్చిన దగ్గరనుంచి అనూష ఇంత పెద్ద ఇంట్లో ఒక్కటీ ఇన్నేళ్ళనుంచీ ఎలావుందా? అని ఆశ్చర్యంగా వుంది. పైగా అంత పెద్ద ఇల్లు ఏం చేసుకుంటుంది అన్న ఆలోచన కూడా కలిగింది.
అందులో కొంత భాగం తనకిస్తే ఆఫీసు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఆఫీసు వున్న దగ్గర ప్రెస్సు పెట్టుకోవాలి. అందుకు తగిన మేశానరీ కొనడానికి అనూషని పెట్టుబడి పెట్టమనాలి అని చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడు. అయితే వివరంగా ఈ విషయాలు చర్చించటానికి తగిన సమయం ఆమె కేటాయించకపోవడం కూడా అతనిలో అసంతృప్తికి ఆమ్రో కారణం అయింది. ఇవాళ అనుకోకుండా అనూష మంచి మూడ్ లో వుండి, ఇద్దరిమద్యా ఏకాంతం కల్పించింది. ఈ అవకాశం వదులుకోకూడదు.... నిశ్చయించుకున్నాడు.
కంఠాన్ని వీలైనంత మృదువుగా మార్చి అన్నాడు. "నీలో ఏ అంకితభావం చూసి ప్రేమించానో ఆ అంకితభావానికి నా సహకారం లేకుండా ఎలా వుంటుంది అనూ! కాకపోతే, అస్తమానం హాస్పిటలు, రోగుల గురించి ఆలోచిస్తూ, నీ ఆరోగ్యం పడు చేసుకుంటున్నావని, నీ  జీవితంలో ఆనందించి, అనుభవించాల్సిన సమయం రోగులకి వెచ్చిస్తున్న పని నాకు భాదగా వుంటుంది. ఇతరులకి సేవ చేయాలంటే నీలో శక్తి కావాలి కదా! ఆ శక్తి పుంజుకోవలంటే వేళకి బోజనం, నిద్ర కావలి కదా!"
అతడివైపు మురిపెంగా చూసింది. "థాంక్స్ భరణీ! నువ్వన్నది నిజమే. ఇప్పటినుంచీ మన గురించి కూడా ఆలోచిస్తాను సరేనా? ఈ కబుర్లాపి ఏవన్నా  మంచి మాటలు చెప్పకూడదూ!"
భరణి నిశ్శబ్దంగా వుండిపోయాడు. చీకటి పడింది. ఆకాశం చుక్కలతో మెరుస్తుంది. నెలపొడుపు చంద్రుడు సన్నని గీతలా కనిపిస్తున్నాడు.
అనూష హఠాత్తుగా అన్నది. "ఆకాశం ఇలా తారా చంద్రులతో చూసినప్పుడు నాకు భయం వేస్తుంటుంది."
"ఎందుకు?"
"శాస్రజ్ఞలు మనిషి అంతరిక్షంలో నివసించటానికి అవకాశాలు ఎన్ని వున్నాయో పరిశోధనలు చేస్తున్నారు. అన్నివిధాలా అనికూల ఫలితాలు సాధిస్తున్నారు. నిజంగా అలా జరిగితే మనలాంటి ప్రమకులకి స్పూర్తినిచ్చే ఈ తారాచంద్రులు ఏమైపోతారు?"
భరణి ఆమెకి దగ్గరగా జరగి, హత్తుకు కూర్చున్నాడు. గాలికి ఆమె మోహం మీద పడుతున్న ముంగురుల్ని సవరించి, ముద్దుపెట్టుకుంటూ అన్నాడు. "నీలో ఇంత బావుకత వుందా?"
"ఏం? కత్తులతో, కటార్లతో గుండెకోసే అనూషకి గుండెని స్పదింపచేసే భావుకత వుందన్న నిజం జీర్ణించుకోలేకపోతున్నావా? పిచ్చి భరణీ! నేనూ మనిషినేగా. నాకూ కోరికలు, ఆశలు, ఆశయాలు అనీ వున్నాయి. అవకాశాన్ని బట్టి, పరిస్టితులను బట్టి అవి నిద్రలేస్తాయి.... అంతే!"
"ఏది ఏమైనా అనూష గ్రేట్.... నీలాంటి స్రీ నా భార్య అయిందంటే నాకు ఒక్కోసారి నమ్మబుద్దికాదు సుమా!"
వీణ కూడా నీలాగే అంటుంటుంది..."
అన్నట్టు వీనగారు ఫోన్ చేశారు. కన్యాకుమారిలో వున్నరుత. ఫోన్ చేయమన్నారు. మా ఆవిడా నాకే అపాయింట్ మెంట్  ఇవ్వడంలేదు. మీకేం ఇస్తుంది?" అన్నాను.
"అలాగా! అదేంటి శ్యామల వుశయం చెప్పలేదా?"
"చెప్పలేదు అనూ! ఆవిడా హాదావిడిగా మాట్లాడి ఫోన్ పెట్టేశారు. తరువాత మాట్లాడతనన్నారు."
"అదేంటి భరణీ! చెప్పాల్సిందికదా!"
"సారీ అనూ! ఆలోచన రాలేదు. ఏవిటో మూడ్ బాగాలేక..."
"ఓ,కే. నేను మాట్లాడతాలే. ఇప్పుడెందుకు మూడ్ పాడుచేసుకోవడం ఇంకేదన్నా చెప్పు" అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుంటూ అన్నది. అమెకివాళ ఎందుకో చాలా ఉల్లాసంగా వుంది మనసంతా. మంచి రోమాటింగ్ మూడ్ కూడా వుంది. అందుకే వేరే విషయాలుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలనిపించలేదు. భార్యభర్తల ఏకాంతంలో పరాయి వాళ్ళ గూర్చిన వాదోపావాదాలు జరగడం అంత ఆమోదయోగ్యం కాదు.... అనిపించింది.
"నీ మూడ్ బాగుచేయనా?" అతడి బుగ్గమీద ముద్దు పేట్టుకుంటూ అన్నది.
ఆమె చేష్టలకి పరవశించిపోయాడు భరణి ఓ పక్క పరవశిస్తూనే ఆమెతో తనకున్న కార్యం సఫలం చేయడానికి ఇదే సమయం అని ఆ వుశయం మాట్లాడటానికి తనని తను ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
"నీతో ఓ విషయం చెప్పాలి అనూ!" అన్నాడు.
"ఏంటది? చెప్పు."
భరణి గొంతు  సవరించుకుని మెల్లిగా ప్రారభించాడు. "అనూ! నాకు ఒక్క వుశయం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతకాలంనుంచీ ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివీ ఎలా వున్నావు?"

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS