Previous Page Next Page 
మహావృక్షం పేజి 59

అప్పుడు గుర్తోచ్చింది  అనూషకి... మూడురోజులనుంచీ ఇంటికి వెడుతుంది.... వస్తోంది కానీ, భరణి ఎలా వున్నాడో, ఏం చేస్తున్నాడో,తెలియలేదు. అతను కనిపించినా మాట్లాడలేదు.... నిజమే... తనిప్పుడు వంటరిదికాదు.... తనని ప్రేమించి, తనతో జీవితం పంచుకోవాడానికి ఓ జీవి తనకోసం ఎదురు చూస్తూ వున్నాడు.... అతడకి నిర్లక్ష్యం చేయడం అన్యాయంకదా? పైగా ఊరు వెళదామంటూ ఆశపడ్డాడు. ఆ విషయం కూడా మర్చిపోయింది తను.
నీరజకి, సుశీలకి, మందుల వాడకం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం గురించిన నియమాలు అనీ చెప్పి, డైవర్ ని ఇచ్చి, వాళ్ళని కారులో పంపించింది. అనూష కారు తనే డ్రైవ్ చేసుకుంటుంది.... ఆశ్రమం వాచ్ మాన్ ఎప్పుడయినా డ్రైవరుగా కావాలంటే వస్తాడు.... అలాగే, ఆ రోజు అతడితో వాళ్ళని పంపించి, తిరిగి కారు ఇంటికి తీసుకురమ్మని చెప్పి తను ఆటో చేసుకుని ఇంటికి వెళ్ళింది.
ఆమె ఇంటికి వెళ్ళేటప్పటకి సాయత్రం అరైంది. భరణి ఇంట్లోలేడు. వంతావిడ భద్రమ్మ కిచన్ లో చపాతీలు చేస్తోంది. ఈ సమయంలో అనూష ఇంటికి రావడం చాలా తక్కువ.... వంతావుడా ఎప్పుడు వంట చేస్తుందో ఆమెకి తెలియదు. భద్రమ్మ ఆ ఏరియాలోనే ఉంటుంది. భర్తలేడు..... ఇద్దరు పిల్లలు... ఈ విడ వంటలు చేస్తూ, పిల్లల్ని చదివిస్తోంది. చాల నమ్మకస్తురాలు.... ఇల్లంతా ఆవిడమీద వదిలిపెట్టేస్తుంది అనూష__ ఆమె దగ్గరున్న పనికుర్రాడు దగ్గర్నుంచి అందరూ ఆమె ఎంతో సహయసహాకారాలు పొందినవారె.... అందుకే వాళ్ళంతా ఆమెకి ఎంతో నమ్మకంగా, నిజాయితీగా సేవలు చేస్తారు.
చాలా రోజుల తరువాత అనూషని చూడడంతో భారతమ్మ అప్యాయంగా పలకరించింది__ "ఏమ్మా.... ఇవాళ త్వరగా వచ్చేశారు?"
అవునండి... నా స్నేహితురాలు శ్యామలకి ఎటాక్ వచ్చింది... మూడురోజులనుంచి హాస్పిటల్లో వుంది. ఇవాళే డిశ్చార్జీ చేశాను__ తను వెళ్ళిపోయింది.... నేనిటు వచ్చాను. భరణి రాలేదా ఇంకా...."
"ఐదింటికి ఎవరో స్నేహితులతొ కలసి వచ్చి కాస్సేపు కూర్చుని ఇల్లు చూపించి వెళ్ళారు. శ్యామలంటే ఆశ్రమం అవిడేనా? ఎలా వుంది ఇప్పుడు?" అడిగిందావిడ.
"కులాసాగా ఉంది. మైల్డ్ ఎటాక్ లెండి.... భరణి ఏవన్నా చెప్పాడా?"
"లేదమ్మా..."
అనూష ఫోన్ దగ్గరకి నడిచి. భరణి ఆఫీసుకి ఫోన్ చేసింది. చాలా సార్లు రిగైంది.... ఎవరూ ఎత్తలేదు.
బెడ్ రూమ్ వైపు నడుస్తూ అన్నది__ "పిన్నిగారూ! చాలా రోజులైంది.... పకోడీలు తిని... ఉల్లిపాయ పకోడీ చేస్తారా?"
ఆవిడా ముసిముసిగా నవ్వి "ఓ! తప్పకుండా చేస్తానమ్మా.... మీరు అడగాలేకానీ, ఏం తినాలంటే అది చేసి పెడతాను. ఇంట్లో పాపాయి పాకుతుమ్తే చూడాలనివుంది" అన్నది.
మైగాడ్!... అనూశాకీ ఆవిడా భావం అర్ధం అయింది. కంగారుగా అన్నది. " అయ్యో! అలాంటిదేం లేదండి.... ఏదో సరదాగా తినాలి అనిపించింది..... అంటే...."
"ఎందుకమ్మా అంత ఖంగారు.... ఈ ఇంట్లో పాపాయి పాకాలి..... నేను చూడాలి" అంటూ ఆవిడా వచ్చేతప్పటకి పకోడీ రడీగా వుంది. అప్పుడే భరణి వచ్చినట్టు బైట బైక్ శబ్దం అయింది.
"వెరీగుడ్! సమయానికి వచ్చాడు. ఇంకో ప్లేటులో కూడా ఇవ్వండి అంటూ మరో ప్లేటులో పకోడే పెట్టుకుని, రెండు ప్లేట్లు పట్టుకుని, హల్లో వచ్చింది అనూష.
అంతా మర్చిపోయి ఇవాళా ఆనందంగా గడపాలి... అనుకుంది.
భరణిని చూసి నవ్వుతూ పలకరించింది. "హలో భరణీ! సమయానికి వచ్చావు.రా, అలా మేడమీదకేడదాం.... నీ కోసం మీ ఆఫీసుకి ఫోన్ చేశాను. ఎవరూ లేరెంటి? ఇలాగేనా పేపరాఫీసు నడిపేది...."
"ఆఫీసులకి టైంమింగ్స్ వుంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు పరిగేత్తడానికి, ఇల్లు, వాకిలీ వదిలి అంకితం అయిపోడానికి అది హాస్పిటల్ కాదు."
అతని స్వరంలో వినిపించిన విసురుకి ఆమె మనసు కొంచెం చివుక్కుమంది... కోపంగా వున్నాడు.
పకోడీ అతని నీటికి అందిస్తూ మృదువుగా అన్నది. "ఆఫీసుల వాళ్ళకి ప్రజల ప్రాణాలను రక్షించే బాధ్యత వుండదుకదా! అది డాక్టర్ల వంతు. జనం నిచ్చే దేవుడి గుడి తలుపులు కొంచెంసేపు మూసి వుంచినా నష్టంలేదు. కానీ, పునర్జన్మనిచ్చే దేవాలయాలు.... హాస్పిటల్స్ మూసేస్తే ఎలా?"
భరణి మాట్లాడలేదు. కోపంగా చూశాడు ఆమెవైపు. ఇవాళ ఎందుకో చాలా రోజుల తరువాత ప్రసన్నంగా వుంది. హమ్మయ్య! అనవసరంగా అలిగి, మూడ్ పాడుచేయడం ఎందుకు? అనుకున్నాడు.
ఇద్దరూ మెడ మీద వెళ్ళారు.
"నామీద కోపం పోయిందా?" అడిగాడు.
"నీ మీద నాకేం కోపం భరణీ! ఓ సువర్ణవకాశం పోగొట్టుకున్నానని భాధనిపించింది. పైగా కారణం చాలా సిల్లీ. పోనీలే! ఇంక ఆ విషయం మాట్లాడకు. చూడు ఎంత బాగుందో ప్రకృతి...."
అమీ అన్నట్టుగానే ఆ రోజు వాతావరణం చాలా హాయిగా వుంది. చల్లటి గాలి వీస్తోంది. అనూషకి చమేలీ పూలంటే చాలా ఇష్టం. డాబా పైకి పాకిన ఆ తీగకు గుత్తులు, గుత్తులుగా పూసాయి చమేలీలు. అవి విరజిమ్ముతున్న పరిమళాలు పరిసరాలుమీద స్ప్రే చేసినట్టు అనిపిస్తోంది, గాలికి గచ్చుమీద రాలి, పూల తివాచీ పరిచినట్టు వుంది. మరో వైపు పాకిన సన్నజాజి తీగ, చమేలీ పూలతో పోటీపడుతూ సువాసనలు వెదజల్లుతోంది.
అనూష ఆప్రయత్నంగా అతని చాయి అందుకుని ముద్దు  పెట్టుకుంది. ఆమె స్వరం తీయగా పాడింది... లోకానికి చల్లనిగాలి.... నాపాలిట వడగాలి....

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS