Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 60


    ఆ మాటకి ఎవరో నవ్వేరు. దాంతో వామనరావుకి కోపం వచ్చేసింది. అరిచేడు.

 

    "వాడ్డూ యూ మీన్? నేను మా అబ్బాయికి భయపడే మనిషనుకున్నావా?"

 

    "అనుకోవడం కాదురా! గట్టిగా నమ్ముతున్నాను. భూలోకంలో వున్న అన్ని వింతల్లోకి గొప్ప వింత-ఒక తండ్రి తన కొడుక్కి భయపడటంరా! (డ్రమెట్టిగా) వెళ్ళిపోరావెళ్ళిపో! ప్రాణ మిత్రులూ వాళ్ళ బర్త్ డేలూ ఎందుకురా నీకు? మీ అబ్బాయికి దాసానుదాసుడిగా, పరమ బానిసగా బతుకుపో!" అన్నాడు గోపాలరావు.

 

    గోపాలరావు కాలరు పుచ్చుకున్నాడు వామనరావు. కళ్ళల్లో నిప్పులు కురుస్తుండగా అన్నాడు.

 

    "అయ్ టెల్యూ బాస్టర్డ్! ఇంకో తడవ నన్ను రెచ్చగొట్టేవంటే అయ్ విల్ సి యువర్ ఎండ్!"

 

    "ఒక్క తడవ కాదురా! లక్షతడవలు రెచ్చగొడతాను.

 

    "నేనన్నది నిజం కాదా? నువ్వ మీ అబ్బాయికి మీ భయపడే ఫూల్ వి కావా? బానిసవుకావా! కావని నిరూపించుకోవాలంటే తాగు! నాతో నా ఫ్రండ్సుతో తాగుతావు. తాగాలి!"

 

    వామనరావు గోపాలరావు కాలరు వదిలేసేడు, చేతులు రెండూ కసిగానలి పేసుకుంటే అరిచేడు.

 

    "ఆల్ రైట్! తాగుతాన్రా మా అబ్బాయికి బానిసను కాను కానని చెప్పేందుకు తప్పకుండా తాగుతాను. (ఆగి) ఎవర్రా అక్కడ? మా అందరికీ సీసాలు కావాలి! అరేంజ్ దెమ్ ఇమ్మీడియట్లీ!"

 

    అతని స్టేట్ మెంటుకి క్లబ్బు మొత్తం ఆశ్చర్యపోతుండగా గోపాలరావు అన్నాడు.

 

    "హిపిప్!"

 

    హుర్రే!" అన్నారతని మిత్రులు.

 

    "ప్! హిపి!"

 

    "హుర్రే"


                                      8


    వామనరావు ఇంట్లో అది డైనింగుహాలు, డైనింగు టేబిల్ మీద అన్నీ ఏర్పాటు చేయబడి వున్నాయి. గోడ గడియారం ఎనిమిది గంటలు కూడా కొట్టింది.

 

    శేషు డైనింగు టేబిల్ దగ్గరకొచ్చి కూచున్నాడు.

 

    "నాన్న రాలేదు కదూ?" అన్నాడు.

 

    వంటమనిషి బదులు చెప్పలేదు.

 

    శేషు నిట్టూర్చేడు. కంచంలో చేయి కడుక్కున్నాడు. ఆ తర్వాత లేచి వెళ్ళిపోయేడు.

 

    వంటమనిషి కళ్ళప్పగిస్తూ చూస్తున్నాడు.


                                                                  9


    క్లబ్బులో పార్టీ హోరాహోరీగా జరుగుతోంది.

 

    అందరి సంగతి ఏమోగాని-వామనరావు చిత్తుగా తాగేస్తున్నాడు.

 

    ఇంతకుముందు పందెం కాసుకున్న ఫ్రండ్సు మధ్య పందెం తిరగబడింది. ఇప్పుడు రెండు వందల కాగితాలు పాత కాపు కొత్తవ్యక్తికి తిరిగిచ్చేసేడు.

 

    మందు కొడుతూనే అంటున్నాడు వామనరావు.

 

    "హు...కొడుక్కి భయపడతాన్రా నేను! నెవ్వర్! అయ్ టెల్యూ-కొడుక్కి భయపడే తండ్రిని కాను. (ఆగి అన్నాడు) పొయ్ గ్లాస్ నిండా...నిర్ధాక్షిణ్యంగా పోసెయ్...(పోసుకున్నాడు) నో వాటర్స్ వాటర్ గీటర్, సోడా గీడా పోస్తే కాకే టెయిలై పోతుంది. నీట్ నీట్ గా తాగేసే టైగర్ని నేను. తాగినా టైగర్నే తాక్కపోయినా టైగర్నే?"

 

    అంటూ అతను గడగడ తాగేస్తుంటే మిగతా జనం కళ్ళు నులుముకుంటో చూస్తున్నారు.


                                      10


    వామనరావు ఇంట్లో అది శేషు గది.

 

    గోడ గడియారం పన్నెండు కొట్టింది. శేషుపుస్తకం (ఉడ్ హౌస్ మనీ ఇన్ ది బేంక్) చదవడం ఆపి దాన్ని గుండెల మీద పెట్టుకుని పడుకున్నాడు.

    
                                      11


    క్లబ్బు బాగా పల్చబడింది.

 

    కేవలం గోపాలరావు అండ్ పార్టీ మాత్రమే మిగిలేరు. వామనరావు వీరతాగుడికి గోపాలరావు భయపడ్డాడు. వామనరావు తాగే గ్లాసుని లాక్కునే ప్రయత్నం చేస్తూ అన్నాడు.

 

    "ఒరే వామనరావ్-ఇంక తాగొద్దురా! ఆపెయ్!"

 

    వామనరావు గోపాలరావు మీద కలబడి గ్లాసు లాక్కుని గుటకవేసి అన్నాడు.

 

    "నో! నేనెందుకు ఆపాలి! తాగినా టైగర్నిరా నేను, కొడుక్కి భయపడతాన్రా నేను? పడనంతే!"

 

అంతలో ఆ పార్టీలో ఒక వ్యక్తి లేచి నించుని అన్నాడు.

 

    "గుడ్ నైట్...వెళ్ళొస్తా?"

 

    ఆ మాటతో వామనరావుకి బాగా కోపం వచ్చేసింది.

 

    "నో గుడ్ నైట్స్. గుడ్ నైట్స్. నిషేధించేసు. ఎవడన్నా గుడ్ నైట్ అంటే చెప్పుతో కొడతాను. అయ్ టెల్యూ అయ్ విల్ షూట్ దట్ బాస్టర్డ్! (ఆగి ఆ వ్యక్తితో అన్నాడు) ఒరే, నువ్వెవడివో నాకు తెలీదు. పార్టీ మధ్యలో గుడ్ నైటంటే కళ్ళు పేలిపోతాయ్. తాగేందుకు మందు కాదుగదా-పచ్చి మంచి నీళ్ళు కూడా దొరక్కూడదని మందు తల్లిశాపం పెట్టేస్తుంది. జాగ్రత్త! కూచో!" అన్నాడు.

 

    ఆ వ్యక్తి మొండిపట్టు పట్టేడు.

 

    "నో! అయ్ మస్ట్ గో! ప్లీజ్ లీవ్ మి."

 

    వామనరావు సీరియస్ గానే అడిగేడు.

 

    "వెళ్ళకపోతే ఏమవుతుంది? మీ అబ్బాయి నీకు ఉరిశిక్ష వేస్తాడా? (పకపకా నవ్వేడు. గోపాలరావుతో అన్నాడు) ఒరే గోపాలరావ్ పుత్రబాధితుడన్నావ్ గుర్తుందా? వాడేరా వీడు! వాళ్ళబ్బాయికి భయపడి ఛస్తున్నాడు. పాపం...వెళ్ళిపోనీ! (వ్యక్తితో) యూ బాస్టర్డ్! యూ కెన్ గో నువ్వింక వెళ్ళచ్చు!"

 

    ఆ వ్యక్తి వెళ్ళబోతూ కొన్ని వందల కాగితాలు గోపాలరావుకిస్తూ అన్నాడు.

 

    "పందెం ఓడిపోయేను. ఇదిగో వెయ్యి వస్తా." అనేసి అతను తూలుకుంటో వెళ్ళిపోతుంటే వామనరావు అడిగేడు.

 

    "పందెమంటాడేమిట్రా?"

 

    గోపాలరావు డబ్బు జేబులో వేసుకుంటో అన్నాడు.

 

    "మీ అబ్బాయికి భయపడి మందుపుచ్చు కోవటం మానేసేపి. ఆ మనిషి అభిప్రాయం. నీచేత చిత్తుగా తాగిస్తానని బెట్ చేసేను. మామూలుగా తాగారా ఫ్రండూ అంటే తాగవు గనక-నా పుట్టినరోజని కథ చెప్పి నిన్ను పడగొట్టేను. వెయ్యి రూపాయలు గెల్చుకున్నాను."

 

    గోపాలరావు స్టేట్ మెంట్ కి వామనరావు బాగా షాకు తిన్నాడు. 'గోపీ' అంటూ పెనుకేక పెట్టి లేచి నిలబడ్డాడు. ఒక్కో మాట తూచితూచి అంటున్నాడు.

 

    "ఒరే పాపీ డాస్టర్డ్? పందెం కాసి నాచేత తాగిస్తావురా? ఒరే తప్పు మీది కాదురా! మా అబ్బాయి, మా శేషుగాడు నన్ను వెధవని చేసేడు చూడూ-వాడిదీతప్పు! నా కడుపునపుట్టి నన్నో పందెంకోడిగా చేసేడు. నువ్వు టాస్ వేసే రూపాయిబిళ్ళగా నన్ను తయారుచేసేడు. బొమ్మపడ్డా గెలుపు మీదే! బొరుసుపడ్డా గెలిచేది మీరే! (అరిచేడు) శేషూ..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS