""విసుగోస్తుంది అనూ...! వాళ్ళ చూట్టూ తిరిగి"" అన్నాడు అనూషతో.
"దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వనట్టుగా వుంది. బాగా లంచాలు మరిగారు వెధవులు. మళ్ళీ ఓసారి ఒక్కపైసా కూడా ఇవ్వద్దు భరణీ! ఎలా రాదో చూస్తాను. మళ్ళీ ఓసారి మినిష్టర్ గారిని కలుస్తాను వీలు చూసుకుని" అంది అనూష.
"అయితే అప్పుడే నా పత్రిక గురించి కూడా మాట్లాడు" అన్నాడు.
"పత్రిక గురించా?" నవ్వింది. "అలాగేలే."
అలాగేలే అన్నతీరుకి భరణికి కోపం వచ్చింది. తన పత్రిక అంటే బాగా చులకనాయిపోయింది అనూషకి. ఏంటీ ఈవిడ ఉద్దేశం? తనే పనీ లేకుండా కూర్చుంటే పర్సనల్ అసిస్టెంట్ లా వాడుకోవాలనుకుంటోందా?
మర్నాడు ఉదయం ఐదున్నరకే ఆశ్రమంనుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ మోగగానే టక్కున లేస్తుంది అనూష ఎంత నిద్రలోవున్నా.... ఆమె రిసీవర్ తీసుకోగానే సుశీల స్వరం వినిపించింది. "మేడమ్! శ్యామలక్కకి గుండెల్లో నొప్పిగా వుందిట.... విలవిలలాడుతోంది" ఏడుస్తూ చెప్పింది.
అనూష చివుక్కున లేచి కూర్చుంది. మరోమాట మాట్లాడకుండా "నేను వస్తున్నాను" అంటూ ఫోన్ పెట్టేసింది.
భరణి లేపి, "త్వరగా రెడీ అవు భరణీ! ఆశ్రమానికి వెడదాం" అన్నది.
"ఎందుకు?" బద్దకంగా అడిగాడు.
అనూష స్నానానికి వెడుతూ అన్నది...." శ్యామలకి హార్టు ఎటాక్ వచ్చిందట.... సుశీల ఫోన్ చేసింది. మనం త్వరగా వెళ్ళాలి... లే..."
"శ్యామల ఎవరు!" అతనడిగిన ప్రశ్న వినిపించలేదు.... బాత్ రూమ్ తలుపు మూసుకుంది.
అనూష స్నానం చేసి వచ్చేతప్పతకి భరణి లేవలేదు... నిద్రపోతూనే వున్నాడు.
"భరణీ! తరువాత నిద్రపోవచ్చు....లే...ప్లీజ్..." మరోసారి లేపింది.
మంచి నిద్ర నుంచి లేపినందుకు చిరాగ్గా అన్నాడు..." "అబ్బ ఏంటి అనూ! ఎవరికో హర్ట్ ఎటాక్ వస్తే వెళ్ళడం ఏంటి? పైగా అంతదూరం.... దగ్గర్లో హాస్పిటల్స్ లేవా? తీసుకెళ్ళమని ఫోన్ చేయి...."
అనూషకి కోపం వచ్చింది. అతితే, అతనితో వాదనేసుకునే సమయం కాదది. అందుకే మారూమాట్లాడకుండా తను రెడీ అయి,కారు తీసుకుని వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళేటప్పటకి నీరజా, సుశీలా మిగతావాళ్ళు శ్యామల చుట్టూ కూర్చూని వున్నారు. శ్యామల బాధతో లుంగలు చుట్టుకుపోతుంది. అనూష ముందు అందర్నీ దూరం జరగమని ఫ్యాన్ స్పీడ్ పెంచింది. గాలి తగిలేలా కిటికీ తలుపులన్నీ తెరిచింది. శ్యామల నాలుకకింద సార్ బిత్రేట్ టాబ్లెట్ పెట్టి, ప్రాధమిక చికిత్స ప్రారంభించింది.
అరగంట తరువాత శ్యామల కొద్దిగా కోలుకుంది. సుశీల సాయంతో ఆమెని కారులో కూర్చోబెట్టికుని, హాస్పిటల్ వైపు పోనిచ్చింది.
అనూషకి మణి గుర్తోచ్చింది. ఎంతో అప్యాయంగా, తన భవిష్యత్ గురించి మాట్లడాటనికివచ్చిన మణి, తన చేతుల్లో గుండెనొప్పితో మరణించింది. ఆమె మరణం తనకి జీవనసారాన్ని, జీవనవేదనని తెలియచేసింది.ఆమె మరణం తనకి జీవితం పట్ల తెలియని మరెన్నో వాస్తవాలను తెలియచేసింది. ఎన్నో క్రిటికల్ కేసులు కూడా విజయవంతంగా సాధించిన తను మణిని బతికించలేకపోయింది. భగవంతుడా! శ్యామల విషయంలో నాకలాంటి ఓటమని చవిచూపించకు. మౌనంగా, స్పెడుగా కారు పోనిస్తున్న అనూషతో మాట్లాడే దైర్యంలేని నీరజా, సుశీలా శ్యామల మీద చేయివేసి కూర్చూన్నారు.
కారు హాస్పిటల్ సమీపించింది. మిగతా ఏర్పాట్లన్నీ చకచకా పూర్తయ్యాయి. ఆ హాస్పిటల్ అనూష సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో అడుగుపెట్టాక ఆమెకి ఎంతో శ్చింత కలుగుతుంది. అదే నిశ్చింతతో, శ్యామలకి ట్రీట్ మెంట్ స్టార్ట్ చేసింది. ఆ రోజంతా మరో విషయం ఆలోచించకుండా హాస్పిటల్లో, శ్యామల దగ్గరే గడిపింది.
ఉదయం వెళ్ళిన అనూష రాత్రి పన్నేండయినా ఇంటికి రాకపోవడంతో భరణి హాస్పిటల్ కి ఫోన్ చేశాడు. చాలాసేపు రింగైంది.కానీ ఎవరూ తీయలేదు. వీణ ఊళ్ళో లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? బహుఉసా ఆశ్రమంలోనే ఉన్నట్టుంది ఆశ్రమం నెంబరు కలిపాడు. అయిలయ్య మాట్లాడాడు.
భరణి స్వరం వినగానే, ఎంతో గౌరవం ఉట్టిపడే స్వరంతో.... "పెద్దమ్మగారికి గుండెనొప్పి వస్తే, ఆస్పత్రికి తీసికెళ్ళరయ్యా. ఇంకా రాలేదు" అన్నాడు.
భరణి చాలా కోపం వచ్చింది. ఇంటిదగ్గర మొగుడు అనేవాడు కాచ్చాదన్న సంగతి కూడా గుర్తురాలేదా అనూషకి... ఇలా ఎంతకాలం ప్రజాసేవ చేస్తుంది? ఎంతకాలం తనీ పద్దతి సహించాలి? అసలీ ఆశ్రమాన్ని మూసేస్తేగానీ, సుఖంలేదు. ఎక్కడినుంచి తెచ్చిపెట్టుకుందో ఈ జనాన్ని....
ఆశ్రమ నిర్వహణ చేయడం అనేది పెళ్ళికి ముందు ఎంతో వున్నతంగా అనిపించినా, ఆ ఎపెక్టు ప్రాక్టికల్ గా తన మీద పడడంతో భరణికి చిరాగ్గా ఉంది.
ఎవరికోసమో అనూష తనని నిర్లక్షం చేయటం తట్టుకోలేకపోతున్నాడు.
హాస్పిటల్ కి వెళ్ళాలన్న ఆలోచన విరమించుకుని ఎప్పుడువస్తోందో రానీ, చూద్దాం అనుకున్నాడు.
అనూష ఆత్మవిశ్వాసం శ్యామలని బతికించింది. ఆమెకి వచ్చింది చాలా మైల్డ్ ఎటాక్... మూడురోజుల తరువాత డిస్చార్జి చేసింది. ఆ మూడురోజుల మాత్రం ఓ తపస్వినిలా హాస్పిటల్ లో గడిపింది.
డిస్చార్జి అయ్యాక, ఆశ్రమం వైపు బయలుదేరిన శ్యామలతో అన్నది.... "ఓ వారం రోజుల నా దగ్గర వుండు శ్యామలా!" తరువాత వేడుడువుగాని."
శ్యామల మృదువుగా తిరస్కరించింది. " నీ పనులు నీకుగాక, నేనుభారం కనా? ఇప్పటకి చేసిందిచాలు.... అవతల భరణి ఎలా వున్నాడో.... నివ్విప్పుడు ఇదివరకులా వంటరిదానివి కావు అనూషా... భర్త ఉన్నాడు. అతని నుంచీ, చేద్దా చూడాల్సిన భాద్యత నీకుమ్ది. ఇవాళ నా మాట విని నువ్వు కూడా విశ్రాంతి తీసుకో."
