Previous Page Next Page 
మహావృక్షం పేజి 57

అయితే అతనాశించినట్టు అరోజేకాదు, వారం రోజులదాకా అనూషతో  మాట్లాడలేదు కుదరలేదు. ఆమె చాలా బీజీగా వుంటోంది.... రాత్రి పదకొండు దాటుతోంది ఇంటికి వచ్చేటప్పటికి. పేపర్ వర్క్ లేకపోవడంతో భరణి ఇంట్లోనే వుంటున్నాడు. అనూష అలా పొద్దుపోయాక రావడం అతనికంతగా రుచించలేదు.
అతని పత్రికలో మహిళలకోసం ప్రత్యేకించిన, ఓ పేజీలో రాసే ఆడవాళ్ళంతా స్రీకి స్వేచ్ఛా, స్వాతంత్యాలులేవని, పురుషిడితో స్రీకి సమానహక్కులు కావాలని, మగవాళ్ళు అనేక రకాల బంధాలతో స్రీ చైతన్యాన్ని అణిచేస్తున్నారని, పగలే ఆడపిల్లలు బయట ఒంటరిగా తిరగలేని ష్టితిలో వున్నారని రాయడం తెలుసు అతనకి. కానీ ఇదేంటి? అనూష జీవితం అందుకు నిరుడ్డంగా వుంది. రాత్రి పదకొండుదాటాక వంటరిగా వస్తోంది ఈమే. ఇదెలా సాద్యం? మిగతా వారికి లేని స్వేచ్చా, స్వాతంత్ర్యాలు ఈవిడకి ఎక్కడినుంచి వచ్చాయి అన్పిస్తోంది.
భరణి జర్నలిజంమీద ఆసక్తితో ఆ కోర్సు చదువుకుని, ఓ చిన్న పత్రిక నడిపిస్తున్నాడు కానీ, నిజానికి అతని పరిధి చాలా చిన్నది. పుస్తకపరిజ్ఞానంతప్ప, లోకజ్ఞానం తక్కువే. ముఖ్యంగా ఆడవారి గురించి చాలా తక్కువ విషయాలుతెలిసు తనకి.
అతని జీవితంలో అతనకి సన్నిహితంగా వచ్చిన స్రీలు చాలా తక్కువ కాలేజీ రోజుల్లో ప్రేమాయణం తరువాత దాదాపు, అమ్మాయిలతో స్నేహాలు మానేశాడు. అమ్మాయిలతో స్నేహం చేయాలని, కలసి తిరగాలని కూడా ఎప్పుడూ అన్పించలేదు.
అతని ఆశయం, లక్ష్యం ఒక్కటే! తన చేతులమీదుగా ఓ డైలీ పేపరు తీసుకురావాలి. మంచి జర్నలిస్టు అన్పించుకోవాలి. అందుకోసం అతను కృషి చేస్తున్నాడు. అయితే జర్నలిస్టుగా తన పరధి పెంచుకోవాలన్న ధ్యాసలేదు. అందుకే అనూష అలా రాత్రిళ్ళు పొద్దుపోయాక రావడం జీర్ణించుకోలేకపోయాడు. కొన్ని రోజులు భరించగలిగినా, అతనిలో రాను, రాను సహనం పెరిగిపోయింది. పైగా ఆమెతో కలసి ఏటన్నా వెళ్ళాలని, సరదాగా గడపాలనే కోరిక తీరడంలేదు. ఆమె అనుక్షణం బిజీ.బిజీ. ఆ బిజీని తట్టుకోలేకపోతున్నాడు భరణి.
ఆ రోజూలాగానే పదకొండున్నర అయింది. అనూష కారు బయట ఆగింది.
భరణి అప్పటకి బోజనం చేసి, సోఫాలో పడుకుని టి.వి చూస్తున్నాడు.
అనూష లోపలకి వస్తూనే "హయ్ భరణీ! బోం చేశావా?" అడిగింది.
"చేశాను" మూభావంగా సమాధానం చెప్పాడు టి.వి మీద నుంచి చూపు మరల్చకుండా.
అనూషా అతని మూడ్  పట్టించుకోలేదు. లిపలకి వెళ్ళిపోయింది.
ఆమె స్నానం చేసి నైటీవేసుకుని, ప్లేటులో చపాతీ, కూరా పెట్టుకుని భరణి దగ్గరకి వచ్చింది. భరణి డిస్కవరి ఛానల్ చూస్తున్నాడు.
"నీకి ఛానల్ అంటే చాలా ఇష్టంలా వుందే" అతని పక్కన కూర్చుని చపాతీముక్క తెంచుకుని, కూర నంచుకుని తింటూ  అడిగింది.
టైమెంత తెలుసా?"అడిగాడు.
"పన్నెండు అవుతుందేమో!"
"ఏంటి అనూషా! ఇంత రాత్రివేళ ఒక్కదానివీ ఇలా రావడం ఏంటి? ఏదన్నా జరిగితే" అన్నాడు.
"ఏం జరుగుతుంది? నాకేం జరగదు చిన్నపిల్లనా? అయినా, నాకిది అలవాటే."
"ఏంటి అలవాటు? ఇంత రాత్రివేళ వస్తోంటే ఏం బాగుంటుంది?"
"ఎవరికీ?" చిత్రంగా చూసింది.
తడబాటుగా అన్నాడు.
"అవరికయినా వేరేవాళ్ళ సంగతలా వుంచి, నీకు మాత్రం భద్రత ఏది?"
నవ్వింది.
"నాకు భద్రత ఏంటి? నేనే పదిమందికి రక్షణ ఇస్తున్నాను."
భరణికి ఆ మాటతో ఏం మాట్లాడాలో తోచలేదు. కొన్ని క్షణాలాగి అన్నాడు.
"అయినా ఆశలు డాక్టరువైతే అయూవు. ఏ గైనికో చదివితే సరిపోయేది. మగవాళ్ళు చదవాల్సిన కార్డియాక్ నువ్వు చదివావెంటి?"
అనూష వుస్మయమ్గా చూసింది. ఫకాల్న నేవ్వేసి అంది. "ఈ జబ్బు నీక్కూడా వుందా?"
"జబ్బా? జబ్బెంటి?"
"అదే.... ఆడవాళ్ళు అనగానే కొన్ని వృత్తులు, కొన్ని చదువులు కేటాయించేవాళ్ళు. ఆడవాళ్ళు చదువులకోసం గడపదాటినా కొత్తల్లో టీచర్లుగా, సర్సులుగా, టెలిఫోన్ ఆపరేటర్లుగా, టైపిస్టులు, స్టెనోలుఇలాంటి వృత్తులు, చదువులయితే డొమెస్టిక్ సైన్సు, బ్యాచిలర్ అప్ ఆర్ట్స్ ఇలా కొన్ని చదువులు. ఏమ్డుకకే కార్డియాలజిస్టులు ఆడవారిలో తక్కువుగా వున్నారు, ఏం? ఎందుకు? మగవాళ్ళల్లో గైనకాలజిస్టులులేరా? ఆడవాళ్ళు కార్డియాలజిస్టులు ఎందుకు కాకూడదు?"
"కాకూడదని నేను అనడంలేదు. కానీ, గైనిక్ అయితే ఇమ్తరాత్రి దాకా వుండనవసరంలేదుకదా!"     "ఎవరన్నారలా ? ఇంకా ఎక్కువ టైం స్పేర్ చేయాల్సి వుంటుంది. బాధ్యత కూడా ఎక్కువే. ఏ అర్దరాత్రో తొమ్మిదోనెల నిండిన అమ్మాయికి పెయిన్స్ స్టార్టు అయితే తలుపులు కొడతారు. పిచ్చి భరణీ! పిచ్చి అలోచనలు మానీ. నీకేం కావాలో చెప్పు."
"నీతో కలసి కొన్ని రోజులు ఏటన్నా తిరిగిరావాలని వుంది."
"అంతేకదా! వెళదాం.... ఎప్పుడు వెళదామా చెప్పు లీపు పెడతాను. సరేనా? ఈలోగా సెక్రటరియట్  లో చెక్ కలెక్టు చేసుకుని, మిషన్స్ కొని ఆశ్రమానికి పంపించాలి."
"ఓ.కే! నేనాపని చూస్తాను.... నువ్వు వచ్చేవారం నుంచీ పదిరోజులు లీపు పెట్టు."
"సరే! ఓంక ఆ టి.వి కట్టేస్తే బావుంటుందనుకుంటా" చేతులు కడుక్కోడానికి లోపలకేళుతూ అంది.
"నువ్వు ఎదురుగా వుంటే టి.వి ఎందుకు?" భరణి కూడా లేచి టి.వి అప్ చేసి, ఆమె వెనకే వెళ్ళాడు.

                                                          *    *    *    *
భరణి రోజూ చెక్కుకోసం ఏదో ఒక టైంలో వెళుతూనే వున్నాడు. రోజూ తిప్పిస్తున్నారు రేపురా, మాపురా అంటూ. అతితే... అలా తిరగడంలో పూర్తిగా అనూషకి సాయం చేయలనికాదు, ఆశ్రమం మీద మమత తో కాదు, అతని స్వార్దం కూడా కొంత వుంది. అందుకే ఓపిగ్గా తిరుగుతున్నాడు.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS