Previous Page Next Page 
మహావృక్షం పేజి 56

"మైగాడ్! ఐదులక్షలా?" నిర్ఘాంతపోయాడు. ఒక ఆశ్రమంకోసం ఉన్నపళంగా మినిష్టరుని కలసి ఐదులక్షల సంపాదించిన అనూష తన పత్రికకి ఎందుకు సాయం చేయకూడదు అనిపించింది.
"నీకు మినిష్టర్స్ దగ్గర ఇంత పలుకుపడి వుందని నాకు తెలియదు" అన్నాడు.
"నాకు మాత్రం ఏం తెలుసు? ఇదే మొదటిసారి నేనాయనని కలపడం? చాలా గౌరవం ఇచ్చారు. నాకే ఆశ్చర్యం వేసింది."
"అదేంటి? ఇంతకుముందు పరిచయంలేదా?"
"ఎందుకుంటుంది?" ఆశ్చర్యంగా చూసింది.
"మరెలా వెళ్ళావు?"
"ఏం వుంది భరణి! నేనొక పనిమీద మినిష్టరుని కలిశాను. డాక్టర్ అనూషగా వెళ్ళలేదు. ఆశ్రమం నిర్వాకకురాలిగా వెళ్ళాను. మేము చేస్తున్నది సత్కార్యం కాబట్టి సంతోషించారు. అడిగిన ఫండ్స్ మంజూరు చేశారు."
"మైగాడ్! నీకు చాలా దైర్యం. ఈ దైర్యంతోటే మా పత్రిక క్కూడా ఏదన్నా సాయం చేయచ్చుగా."
"చేశాగా నాకు చేతనైంది."
"అదెంత? లక్సరూపాయలు.... సరిపోవు. చాలా డబ్బు కావాలి అనూ! ముందు రెగ్యులర్ గా పత్రిక వస్తే, తరువాత డైలీ చేస్తాను. ఎప్పటికయినా డైలీపేపర్ చేయాలని నా కోరిక. ఎంత డబ్బు కావాలో తెలుసా?"
"నువ్వే వెళ్ళి కలవచ్చుగా మినిష్టరుని."
"నీ అంత దైర్యం తెగింపు నాకు లేవు. అందుకే ఇలా వెనకబడి వున్నాను. అదిసరే ఈ డబ్బు ఏం చేస్తావు?" అడిగాడు ఆరాగా.
"ఏం చేయడం ఏంటి? బోలెడు చేయాలి. కొత్తరకం సూయింగ్ మిషన్స్ వచ్చాయిట. అవి నాలుగు కొనాలి. వాళ్ళ బోజనాలక్కావాలి. ఇంకా చాలా చేయాలి."
"అన్నట్టు వీణగారు ఫోన్ చేశారు. రేపు ఉదయం రైలుకి ముందు డిల్లీ వెళుతున్నారట. నిన్ను ఫోన్ చేయమన్నారు."
"అలాగా! అయ్యో.... ముందు చెబితే, ఆ పనిచేశాకే నీ తో మాట్లాడేదాన్ని "ఖంగారుగా అన్నది. "వీణ టూరు ప్రోగ్రాం రేపట్నించీ మొదలన్నమాట. ఫోన్ చేయాలి. "లేవా బోతుంటే అడిగాడు. "వీణగారు కూడా వుండటం లేదుకదా! ఒక్కదానివీ ఎంతని చేస్తావు? నీ కేదన్నా  సాయం కావాలంటే చెప్పు."
అనూష కృతజ్ఞతగా చూసింది. పాపం మంచివాడే! తనే అపార్దం చేసుకుంటోంది. అందర్నీ అవమానించటం అలవాటయింది. "థాంక్స్ భరణీ! రేపోసారి సేక్రటేరియట్ కి వెళ్ళి చెక్కుకోసం ఫాలో అప్ చేయాలి" అన్నది.
"ష్యూర్... తప్పకుండా... ఇంకా?"
"చెక్ వచ్చాక కొన్ని మిషన్స్ ఆర్డర్ ఇవ్వాలి."
"అలాగే... ఇంకా...."
"ప్రస్తుతం ఇవి చాలు. తరువాత మళ్ళీ చెప్తా" అంటూ ఫోన్ దగ్గరకి నడిచి, వీణ నెంబరు తిప్పింది.
"హాలో వీణా! ఏంటి రేపేనా నీ ప్రయాణం?" అడిగింది.
అవతలనుంచి వీణ స్వరం వినిపించింది. "అవునురా... ఎక్కడి కెళ్ళావు? హాస్పిటల్ కి వెళ్ళలేదుటగా."
"అవును" జరిగిన సంగతి వివరించింది అనూష.
"గుడ్... గుడ్ లక్... మరి నేను వెళుతున్నా.... సారీ... కలవలేక పోతున్నా."
అనూషకి ఎలాగో అనిపించింది. "హాపీ జర్నీ వీణా" అన్నది బరువుగా.
"అబ్బ అంత బ్దగా చెప్పకు. కొంచెం ఉత్సాహంగా చెప్పు" వీణ నవ్వుతూ అన్నది.
 "ఎంటో.... నాకు చాలా దిగులుగా వుంది. ఏంటసలు? ఈ టూర్ ఫోగ్రాం ఏంటి? ముసలాళ్ళలాగా."
"ముసలాళ్ళం అతుటే ఆశలు కదల్లెం... ఏం ఫర్వాలేదు... లెటర్స్ రాస్తుంటాను... వీయాయితే మెయిల్ ఇవ్వు. ఎక్కడో అక్కడ చూసుకుంటాను."
"అలాగే!"
"బై అనూ!"
"బై..." భారమైన మనసుతో వీడ్కోలు చెప్పింది. ఆ వేళ అనూషకి అన్నం సహించలేదు. వీణ గురించి ఆలోచిస్తూ హాల్లోనే ఒంటరిగా పడుకుని వుండిపోయింది. భరణి కాస్సేపు చూసి ఆమె రాకపోవడంతో డిస్టర్బ్ చేయకుండా నిద్రపోయాడు.

                         *    *    *    *
ఆ రోజు భరణి ప్రెస్సుకి వెళ్ళలేదు. చాలా రోజులనించీ సారిగా వెళ్ళడంలేదు. పెళ్ళి అయ్యాక ఒకే ఒక ఇష్యూ వచ్చింది పత్రిక అయితే ఎప్పటికన్నా ఎక్కువ కాఫీలు అమ్ముడుపోయింది కానీ, బొత్తిగా అడ్వర్  టైజ్మెంట్లు రాలేదు. వీణ ఇచ్చిన విజిటింగ్ కార్డ్స్ పట్టుకుని, ఇద్దరు కాంట్రాక్టర్లను కలిసాడు. వాళ్ళకి సంబంధించిన ఏ అడ్వర్ టైజ్ మెంట్ అయినా తప్పకుండా ఇస్తామని ప్రామిస్ చేశారు....మళ్ళీ వెళ్ళలేదు. కలవలేదు.
ఈసారి బై మంత్లీ అయినా వస్తుందో, లేదో అని దిగులుగా వుంది. సర్కులేషన్ ఈమధ్య కొంచెం పెరిగింది. కానీ, పత్రిక నిలబడాలంటే కేవలం సర్కులేషన్ సరిపోదు. అడ్వర్ టైజ్ మెంట్లు కావాలి. భారానికి అంతగా పలుకుబడిలేదు.
కొందరు పెద్దవాళ్ళు తెలిసినా, వాళ్ళ సర్వీసు ఉపయోగించుకోవడం తెలియదు అతనికి. మొహమాటం, బిడియం వున్నా  కొంచెం అహం కూడా వుంది. నేను వెళ్ళి వాళ్ళని అడగడం ఏంటి నాన్సెన్స్ అనికుంటాడు. పైగా కొందరు ఉద్యోగస్తులు వేరే మంచి ఉద్యోగాలు చూసుకుని వెళ్ళి పోయారు ఇద్దరో, ముగ్గురో మిగిలారు. మాన్ పవర్ లేకుండా ఏం చేయగలరు? మంచి జీతాలిస్తే వుంటారు. లేకపోతే వెళ్ళిపోతారు. తనిచ్చే వేయి, రెండు వేళకి ఎవరు మాత్రం ఏంట కాలం చేస్తారు? జీతాలు పెంచాలి, అడ్డే కట్టారు పేపర్ ధర పెరిగిపోయింది. ఎలా? ఈ పరిస్తితి ఎదుర్కోవడం?
అనూషతో పత్రిక గురించి డిస్కస్ చేయాలి అనుకున్నాడు. ముందు దీన్ని రెగ్యులర్ గా మంత్లీ చేయాలి. ఆ తర్వాతా వీక్లీ అంచెలంచెలుగా ఎదగాలి. తన ఎదుగుదలకి అనూష సహాయసహకారాలు అవసరం. ఇవాళ రాత్రికి ఎలాగయినా అనూషతో మాట్లాడాలి అనుకున్నాడు.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS