Previous Page Next Page 
మహావృక్షం పేజి 55

అనూషకి చాలా బాధనిపించింది. తను కొత్త కాపురం మోజులో వీళ్ళ సంగతి పట్టించుకోలేదు. తన ఆనందాన్ని భంగం చేయడం ఇష్టంలేక, వీళ్ళు కూడా డిస్టర్బ్  చేయలేదు.
పాపం! ఎన్ని ఇబ్బందులు పడ్డారో? పైగా ఎప్పుదనగా వాళ్ళకి మిషన్ల గురించి ప్రామిస్ చేసింది? వెంటనే ఈ పనులు చూడాలి. దృడంగా నిశ్చయించుకుంది.
"సారీ శ్యామా! మిమ్మల్నందరినీ చాలా నిర్లక్షం చేశాను. న సంతోషం కోసం... రేపే వెళ్ళి మినిష్టర్ గారిని కలుస్తాను. వెంటనే పోలీస్ ప్రొటక్షన్ గురించి కూడా మాట్లాడతాను."
"నువ్వు మాకు సారీ చెప్పడం ఏంటీ? ఇంతకాలం నుంచీ, మా సంతోషంకోసం, మా సుఖంకోసం, నీ జీవితంలో ఎంతో త్యాగం చేశావు. అదంతా మర్చిపోతావా? నిన్ను డిస్టర్బ్ చేయద్దమనుకున్నాగానీ, మినిష్టర్ ల దగ్గర కి నేను వెళ్ళలేనుగా. నన్నెవరు రానిస్తారు?"
"శ్యామా!" వుచాలిటంగా పిలిచింది.
ఇద్దరిమద్యా కాసేపు మాటలు కరువయ్యాయి. పరస్పరావగాహానతో కలసిన రెండు మనసుల మధ్య నండం హద్దులు దాటితే, ఆ అనుభూతి వ్యక్తం చేయడానికి భాష కరువవుతుంది. భాష్పలె, అక్షరాలై ఒకరినొకరు పలకరించుకుంటారు. ప్రస్తుతం వాళ్ళిద్దరి విషయంలో అదే జరిగింది.
వాళ్ళందరికీ వస్తానని చెప్పి, సెలవు తీసుకుని బయలుదేరింది.
ఆమె ఇల్లు చేరేటప్పటికి పదకొండు దాటింది. భరణి హల్లో సోఫాలో కూర్చుని వున్నాడు. ఆమె కారు పార్కుచేసి రాగానే అడిగాడు. "ఎక్కడికి కెళ్ళావు అనూషా? ఇంత లేటైందెం?"
అనూష అతడివైపు చూసింది. ఆ మొహంలో అందోళనకన్నా ఒక విధమైన సీరియస్ నేస్ కనిపిస్తోంది.
"ఆశ్రమానికి వెళ్ళాను. లేటైంది బోంచేశావా?"
"లేదింకా... ఎందు కేళ్ళావు ఆశ్రమానికి?"
జీవితంలో మొదటిసారిగా తను చేసిన పనిని ఎందుకు చేశావు? అని ఒకరు ప్రశ్నించడం ఆమెకు చాలా అవమానంగా అనిపించింది. తను సర్వ స్వతంత్రురాలు....
తనేం చేసినా, ఎవరూ కూడా ఇలా ఎందుకు చేశావు? అని ఇంత వరకూ ప్రశ్నించలేదు.
ఇవాళ భరణి అలా అడగడంతో కొంచెం చిరాకొచ్చింది. ఎవరిచ్చారితనకి ఈ అధికారం? అనిపించింది. తనని తను కంట్రోల్ చేసుకుంటూ అన్నది. నేను పెళ్ళి అయినదగ్గర్నించి వెళ్ళడంలేదు. ఉదయం శ్యామల ఫోన్ చేసింది. ఒక్కసారి వచ్చి వెళ్ళమంది. హాస్పిటల్ నుంచి అట్నించటే వెళ్ళాను.
"శ్యామల ఎక్కడికి ఫోన్ చేసింది?"
"ఇంటికే."
"మరి నాకు చెప్పలేదేం?"
"ఏమని?"
శ్యామల ఫోన్ చేసింది. ఆశ్రమానికి రమ్మంది అని చేపచ్చుగా. కనీసం వెళతాను అనయినా చెప్పలేదు. నేను చాలా ఖంగారుపడ్డాను."
అనూష అతడికి మొహంలోకి విశితంగా చూసింది. చెప్పకుండా వెళ్ళి, టెన్షన్ పెట్టాననా? లేక తనకివ్వాల్సిన మర్యాద ఇవ్వలేదని కోపమా? భావాలకోసం వెదుకుతూ నెమ్మదిగా అన్నది. "సారీ. నేనెప్పుడూ ఏదీ ఎవరకీ చెప్పలేదు. చెప్పాల్సిన అవసరమూ రాలేదు. ఈ సారి చెప్పివేళతనూ."
అయిన ఎందుకు అస్తమానం ఆ ఆశ్రమానికి నువ్వు వెళ్ళడం.... ఇంతకాలమంటే నీకు వేరే పర్సనల్ లైప్ లేదు కాబట్టి వెళ్ళా... ఇంకా ఎందుకు?"
అనూష సీరియస్ గా చూసింది. "ఆశ్రమం నాది... నేను పౌండేషన్ సెక్రటిరీని. నేనెళ్ళి మంచీ, చెడ్డ చూడక పోతే ఎవరు చూస్తారు? ఇటీజ్ ఎ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ.... నేను స్నానం చేసి వస్తాను. బోచేద్దాం" మరో మాటకి అవకాశం ఇవ్వకుండా లోపలకెళ్ళిపోయింది.
భరణి అహం దెబ్బతిన్నది.... ఇంతకాలంనుంచీ తను సర్వస్వతంత్రురాలు కాబట్టి ఎ సమయంలో, ఎక్కడికెళ్ళినా చెల్లేది... ఇప్పుడు భర్త అనేవాడు ఒకడున్నాడని ఈమేకి ధ్యాస లేనట్లుందే.... భర్తకి చెప్పడం... అనుభూతి కోరడం.... నా  మోషిగా భావిస్తోందా? అలా అయితే, ఈ మే అహాన్ని తనెలా భరించగలదు? ఆలోచనల్లో మునిగి పావుయినభారని అనూష పిలుపుతో లోపలికెళ్ళాడు.
మర్నాడు అనూష ప్రెండ్స్ కోసం లెటర్ రాసుకుని, తీసుకుని, మినిష్టర్ గారిని కలవడానికి వెళ్ళింది. ఆమె కలెక్టర్ ని కలవదల్చుకోలేదు. అంతగా అతడిని కలవాల్సిన అవసరం వస్తే  ఇంకెవరికైనా పంపించవచ్చు. అనుకుని డైరెక్టర్ గా మినిష్టర్ గారి దగ్గరకే బయలుదేరింది.
అదృష్టవశాత్తూ మినిష్టర్ గారు మంచి మూడ్ లో వున్నారేమో, లేక అనూష పేరు అడపా దడపా పేపర్ల ద్వారా తెలుసుకుని వుండడం చేతనో మొత్తానికి కారణం ఏదైనా, వెంటనే ఆమెకి అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఆశ్రమం గురించి అంతా వివరించి లెటర్ ఇచ్చింది. అయన ఎక్కువ తాత్సారం చేయకుండా ఆమె కోరిన మొత్తం మంజూరుచేశాడు. అంతేకాక, తన ఆరోగ్య సమస్యలు ఆమెతో చర్చించాడు. అనూష అప్పటికప్పుడే పరీక్ష చేసి, ప్రిస్కిషన్ రాసిచ్చింది. ఓసారి తప్పనిసరిగా కొన్ని మెడికల్ చేకప్స్ అవసరం అనీ, హాస్పిటల్ కి వస్తే, ఏర్పాటుచేస్తాననీ చెప్పింది. అయన చాలా అప్యాయంగా మాట్లాడాడు. సూపర్ స్పెషలిటీ  హాస్పిటల్  గురించి మాటాడి, మీలాంటి గొప్ప డాక్టర్లు ఉస్మానీయ లో వున్నప్పేడు ఇంకా సూపర్ స్పెషలిటీ ఎందుకమ్మా అన్నాడు.
చిరునవ్వుతో సెలవు తీసుకుని వచ్చేసింది.
కలెక్టర్ ని కలవాల్సిన అవసరం కలగనందుకు సంతోషపడుతూ బయటకి వచ్చింది.... మిగతా ఫార్మాలిటీస్ పూర్తీచేసి, ఇంటికి బయలుదేరింది.
రోజుకన్నా హూషారుగా వచ్చిన ఆమెని చూసి అడిగాడు భరణి.
"ఏంటి చాలా సంతోషంగా వున్నావు?"
అనూష తను సాధించిన వుజయం గురించి చెప్పింది.
 "ఎంత శాంక్షన్ చేశారు?" అడిగాడు ఆశ్చర్యంగా.
"ఐదు లక్షలు."

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS