"కోరిక బాగుంది కానీ, చూసేవాళ్ళకి అసహ్యంగా వుండదూ!" అన్నది అతని క్రాప్ లోకి వెళ్ళు జొనిపి, సవరిస్తూ...
ఏం ఉండదు? అసలింకా ఆర్బాటంగా వేద్దామనుకున్నాను, కానీ, పెళ్ళి సింపుల్ గా జరగాలన్నావని వీణగారూ చెప్పాడంతో కాంప్రమైజ్ అయాను. కానీ నాకు మాత్రం పెళ్ళి గ్రాండ్ గా చేసుకోలేదన్న అసంతృప్తి అలాగే వుంది."
"ఈ వయసులో పెళ్ళి చేసుకోవడమే సిగ్గుగా అనిపించింది. పైగా ఆర్బాటం, హడావిడి దేనికని వద్దాన్నాను."
"నిజమే! కానీ, వయసు సంగతలా వుంచు. మొదటి పెళ్ళి కాదా మనిద్దరికీ.... పెళ్ళి అనేది మళ్ళీ, మళ్ళీ చేసుకొం... అదొక మధురానుభూతిగా జీవితాంతం మిగాలాలంటే కొంచెం ఆర్బాటం తప్పదు."
"మనం కలసి బతకడమే ఓ మధురానుభూతిగా మిగుల్చుకుందాం. సరేనా?"
"అప్ కోర్స్ ! నిజమే... నివ్వు దక్కావు చాలు నాకు. నా జీవితం ధన్యమైంది అనిపిస్తుంది."
"ఇంత హెవీ డైలాగ్స్ అవసరం. కానీ నాకురావు.... అనూ! ఐ లవ్ యూ.... నిజంగా నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావో తెలుసా! అదేమీటో అమ్మా, నాన్న కూడా ఇంత టార్చర్ అంగీకరిస్తారనుకోలేదు నేను...."
"కలిసోచ్చే కాలం వస్తే, నడిసోచ్చే పిల్లలు పుడతారట. బహూశా మనకి కాలం కలిసివచ్చి, అన్నివిధాల సహాయసహకారాలు అందాయనుకుంటా."
"అలాగా! అయితే ఇంకేం మనకి తప్పకుండా నడిచి వచ్చేపిల్లలు పుట్టేస్తారనమాట ఫోనీలే.... పుట్టగానే వాడిని షికారు తీసు కెళ్ళాచ్చు అన్నాడు మురిపంగా.
అనూష నేవ్వేసింది.
* * * *
అనూష కొత్తకాపురం రసవత్తరంగా సాగుతుంది. వీణ మధ్య మధ్య వచ్చి చూసి వెళుతుంది.
ఓ రోజు అన్నది.... "పెళ్ళి అయిన దగ్గర్నుంచీ ఆశ్రమానికి వెళ్ళడంలేదు. వాళ్ళంతా ఎలా వున్నారో! ఓ సారి వెళ్ళోద్దామా?"
వీణ గట్టిగా చెప్పింది. "కొంతకాలం ఆశ్రమం పనులు వదిలేయ్.... హాస్పిటల్ కి కేటాయించే సమయం తగ్గించి, భరణికి కేటాయించు.... ఇంతకాలం నుంచీ కోల్పోయిన జీవన మాధుర్యం పూర్తిగా, సంపూర్తిగా అనుభవించు..."
వీణ మాటలకి నవ్వింది అనూష...." గీతాబోధనలా వుంది."
"అలాగే అనుకో.... అనూ! దాంపత్యం జీవితం అమృతంలాంటిది.... సాగరమర్దనలా, జీవనసాగరమర్దనం జరిగిం తరువాత పొందే అనుభవం కాబట్టి జాగ్రాత్తగా, అపురూపంగా కాపాడుకో... నా అనుభవంతో చెబుతున్నాను. నిజం చెప్పు. ఇదివరకు కన్నా ఇప్పుడు నీ వృత్తిలో ఆసక్తి,ఉత్సాహం పెరగలేదూ!" సూటిగా అడిగింది.
అనూషక్కుడా అనిపించింది. నిజమే! ఎన్నాడూ లేని కొత్త ఉత్సాహం, చలాకీతనం పెరిగింది తనలో...కానీ, వీణ దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గు అడ్డం వచ్చింది. నవ్వి వురూకుంది. ఆ నవ్వు అర్ధమైన వీణ తృప్తిగా నిట్టూర్చింది.
అయితే, అనూష మనసులో మాట తెలుసుకున్నాట్టుగా ఓరోజు ఉదయాన్నే శ్యామల ఫోన్ చేసింది. అనూషని ఓసారి ఆశ్రమానికి రావలసిందిగా కోరింది.
శ్యామలచేత అడిగించుకోవాల్సి వచ్చినందుకు అనూషకి సిగ్గునిపించింది. ఛీ! నేనింత బాధ్యతా రహితంగా ప్రవర్తించానేంటి? అనుకుంది. తప్పకుండా వస్తానని చెప్పింది.
ఆరోజు హాస్పిటల్ నుంచి, పెందలాడే బయలుదేరి, నేరుగా ఆశ్రమానికి వెళ్ళింది. ఆమెని చూస్తూనే అందరూ ఎంతో సంతోషంగా ఆహ్వానించారు.
తనకి పరిచయం అయిన దగ్గర్నుంచీ కేవలం మేడలో సన్నటి గొలుసు, కుడిచేతికి ఒక వెడల్పాటి గాజు, ఎడం చేతికి వాచీ, కాటన్ చీరల్లో హుందాగా కనిపించిన అనూష ఇవాళ కొత్తగా వుంది. బంగారు గొలుసు వేలాడుతున్న మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు, గద్వాల్ చీర, అందంగా వుంది.
రహస్యంగా అడిగింది శ్యామల. "విశేషమా?"
"ఛీ..." ఎర్రగా కందిపోయిన చెంప చేతుల మధ్య దాచుకుని, "ఇది పిల్లల్ని కనే వయసా నాది?" అన్నది.
"ఏం ఫర్వాలేదు.... కనచ్చు. నీకంటూ పాఫో, బాబో వుండాలి." "వీడున్నాడుగా...." బాబునేత్తుకుని వచ్చిన నీరజ చేతుల్లో బాబు నెట్టుకుంటూ అన్నది.
సుశీల కొడుకు వచ్చి, అనూష కాళ్ళకి నమస్కరించాడు.
"ఏంట్రా ఏంటి సంగతి?" అడిగింది.
"నేను టెన్త్ పాసయవమ్మ! ఫస్టు క్లాస్ వచ్చింది"
అలాగా! శభాష్...." వాడిని దగ్గరకు తీసుకుంటుంది. "నీ కష్టాలపర్వం పోయింది సుశీలా! నీ కొడుకు చేతికందివస్తే అంతా సుఖమే...." అన్నది సుశీలాతో.
"అంతా మీ దయే మేడమ్!" వినయంగా అన్నది సుశీల.
శారద అందంగా అల్లిన జాజిపూల మాలను తెచ్చిచ్చింది. జడలో తురుముకుంటూ "ఇంకా ఏమిటి విశేషాలు?" అడిగింది అనూష.
ఏంలేదు. మనవాళ్ళు నిన్నిదివరకు ఏదో మిషన్ కావాలని అడిగారుకదా, అదోసారి గుర్తుచేద్దామని. తరువాత ఈ మధ్య ఎవరో నలుగురు ఆడవాళ్ళు ఆశ్రమంలో చేరుతామన్నారు. నీతో మాట్లాడమని అడ్రసుయిచ్చాను. వచ్చారా?"
"లేదే! ఎవరూ రాలేదు."
"రాలేదా?" శ్యామల సాలోచనగా అన్నది.
"నాకెందుకో వాళ్ళని చూస్తె అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది. మన ఆశ్రమానికి ఫోలీసు ప్రొటెక్షన్ కావాలని అడుగుదాం."
"ఏం? ఎమన్నా ప్రాబ్లమా?"
"ఈ మధ్య ఒకటీ, రెండు సార్లు ఎవరో కాంపౌండ్ వాల్ దూకి తలుపుకొట్టారు. చూసేలోపల పారిపోయారు. ఏదో ఇలా ఒకటీ, అరా చిన్న చిన్న సంఘటనలు పెద్దవి కాకముందే జాగ్రత్తపడితే నయం కదా!"
