Previous Page Next Page 
మహావృక్షం పేజి 53

కానీ, అనందానుభూతి అనిర్వచనీయమై గుండె కదిలి, వీరైకంట్లో చెమర్చిన ఇలాంటి మధురక్షణాలు కొన్నే... అవి కేవలం అనూష సాంగత్యంలోనే అనిభావానికి వచ్చాయి.
ఆ ఇద్దరు స్నేహితురాళ్ళు ఆ గాఢ  పరిష్వంగంలో కాలం స్నేహాన్ని కొత్తగా నిర్వచించడానికి వేగంగా కదుల్తున్నట్టు చీకటి కమ్ముకుంది.
భరణి బైక్ శబ్దం వినిపించడంతో ఇద్దరూ ఉలిక్కిపడి సర్దుకున్నారు. అనూష లైటు వేసింది.
భరణి లోపలకి వస్తూనే  వీణని చిరునవ్వుతో పలకరించాడు.... "బాగున్నారా?"
"నువ్వెలా వున్నావు భరణీ!" అడిగింది.
"మీ దయవలన చాలా సంతోషంగా వున్నాను."
"పత్రిక ఎక్కడిదాకా వచ్చింది?"
"వస్తుంది. స్పెషల్ ఇష్యూ వేస్తున్నాను. మాకేమన్నా యాడ్స్ ఇప్పించకూడదూ!"
"యాడ్సా? దాందేముంది? తప్పకుండా ఇప్పిస్తాను" వీణ బ్యాగ్ లోంచి రెండు విజిటింగ్ కార్డ్స్ తీసిచ్చి "రేపు వీళ్ళిద్దరినీ కలుపు. నేను ఫోన్ చేసి చెప్తాను" అన్నది.
"థాంక్యూ! థాంక్యూ మేడమ్!" వికసించిన మోహంతో అన్నాడు.
అనూష వైపు తిరిగి "నీ వంతుకూడా ఏదన్న కాంట్రిబ్యూషన్ వుందా?" అడిగాడు.
"ఎ రకంగా?" అడిగింది.
పని కుర్రవాడు ముగ్గురికీ మంచినీళ్ళు, బిస్కట్లు, టీ తీసుకొచ్చాడు.
"ఈ రకంగా...." విజిటింగ్ కార్డు చూపిస్తూ అన్నాడు.
"దేనికని?" అడిగింది.
"ఎందుకేమిటి? మా పత్రిక బొత్తిగా లాన్ తో నడుస్తుంది. ఏదో నీ పేరు చెప్పుకుని, రెండుసార్లుగా సర్కులేషన్ పెంచుకున్నాకానీ, అడ్వర్ టైజ్ మెంట్లు లేవు. అవి లేకపోతే డబ్బుండదు. డబ్బు లేకపోతే పత్రికరాదు. పత్రిక రాకపోతే నేను అన్ ఎంప్లాయిస్ అవుతాను."
"ఎంత డబ్బు కావాలి?"
"ఎందుకంత?" ఆశ్చర్యంగా చూసింది.
"డబ్బు లేకుండా ఎలా? పత్రిక నడపటం అంతే తమాషా కాదు.నీలాగా ఫర్ న  కోసి, సర్ న డబ్బులు తీసుకోవడం కాదు. ఎంత కష్టపడాలో తెలుసా! పైనాన్షియల్ గా చాలా ఇబ్బందిగా వుంది."
అనూష చివ్వున  సోఫాలోంచి లేచి లోపలకికెళ్ళింది. ఆమె ఎందుకలా  వెళ్లిందో అర్ధంకాని వీణ, భరణి ఒకరి మోహలోకరు చూసుకున్నారు. రెండు క్షణాల్లో అనూష చెక్కుతో వచ్చింది. "ప్రస్తుతానికి నా తరుపున కాంట్రిబ్యూషన్ ఇది. అడ్వర్ టైజ్ మెంట్లు ఇప్పించే శక్తి నాకు లేదు" అన్నది చెక్కు భరణి చేతికిస్తూ.
భరణి మొహంలో ఆ క్షణంలో కనిపించిన అనందం, వెలుగు చూసిన వీణ మనసెందుకో చివుక్కుమంది. భరణి మంచివాడేనా? ఒక ప్రశ్న బాణంలా గుండెని తాకింది. తనకు తానే సర్దుకుని సోఫాలోంచి లేచింది.
"ఓ.కే.అనూ! నే వస్తాను. గుడ్ నైట్... గుడ్ నైట్ భరణీ!"
"బోంచేసివెళ్ళకూడదూ!" అనూష అంది.
"వద్దు. ఇవాళ పార్టీ వుంది. ఒక సీనియర్ లాయర్ కి జడ్జిగా ప్రమోషన్ వచ్చింది. అయన పార్టీ ఇస్తున్నారు."
"అలాగా!" అనూష కూడా లేచింది.
వీణ గుమ్మందాకా నడిచి, ఒక్కసారి వెనక్కి తిరిగింది. హాల్లో పైన గోడకి తగిలించిన నిలువెత్తు వెంకటేశ్వరస్వామి పాఠం చూసింది. ఆ పటానికి అటూ,ఇటూ వున్న అనూష తల్లితండ్రుల ఫోటోలు చూసి, బైటికి నడిచింది.
"భక్తి  ఎక్కువైనట్టుంది" వెనకే వచ్చిన అనూష అంది.
వీణ ఏం మాట్లాడకుండా, అనూష లోపలకి నడిచింది.
ఆ రాత్రి అన్యమనస్కంగా వున్న అనూషని దగ్గరకి తీసుకుంటూ, "ఏంటి డల్  గా వున్నావు?" అడిగాడు భరణి.
అనూష సన్నగా నిటూర్చి అన్నది. "ఏం లేదు. వీణ క్కూడా ఎవరన్నా తోడు దొరికితే, పెళ్ళిచేయాలని వుంది."
"ఆవిడ్ని ఎవరు చేసుకుంటారు?"
చివ్వున దూరం జరిగింది. "ఎందుకలా అన్నావు?"
ఆమె ప్రశ్నలోని తీవ్రతకి కొంచెం జంకి, తమాయించుకుని అన్నాడు. "ఆవిడా క్యారెక్టర్ మంచిది కాదంటారు. చాలామందితో సంభందాలున్నాయట."
"భరణీ!" తీవ్రంగా పిలిచింది. "ఇంకెప్పుడూ వీణ గురించి ఇలా మాట్లాడకు. మొదటిసారి కాబట్టి క్షమిస్తున్నాను. జర్నలిస్టువి, చదువుతున్న వాడివి.... నువ్వు కూడా ఇలా మాట్లాడగలవా?"
"వీణాగారూ నాకూ ప్రేండేగా. నువ్వు పెళ్ళిమాట ఎత్తావు కాబట్టి, నలుగురూ అనుకునే మాట నేను అన్నాను. ఆవిడ జీవితం సెటిల్ అయితే నాకు మాత్రం అనందం కాదా!" నెమ్మదిగా అన్నాడు.
అతడి మొహంలో, కళ్ళలో, స్వరంలో కదిలిన పశ్చాత్తాపం గమనించిన అనూష అతడి దగ్గరగా జరిగి నెమ్మదిగా అన్నది. "ఎవరి జీవితం వాళ్ళది. ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు బతికే అధికారం, హక్కు వున్నాయి. ఇంకెప్పుడూ ఇతరుల జెవిట విధానాన్ని విమర్సించవద్దు."
"అలాగే..." మరి మాట్లాడలేదు భరణి.

                                                          *    *    *    *
భరణి పేపర్ స్పెషల్ ఇష్యూ వచ్చింది. పెళ్ళిఫోటోలు, వార్తతో ఓ పేజీ మొత్తం స్పెషల్ గా కేటాయించాడు. అనూష కొద్దిగా అసంతృప్తి ప్రదర్శించింది.
"ఎందుకీ పబ్లీసీటి?" అన్నది
"నీ అంత గొప్ప స్త్రీకి భర్తనైనానన్నవిషయం ప్రపంచానికి చాటాలనిపించింది" అన్నాడు ఆమె ఒళ్ళో తల పట్టుకుని పడుకుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS