వీణతో చెప్పినట్టుగానే అనూష జీవితంలో ఓ ముఖ్యమైన మలుపు మొదలైంది. చక్కటి స్నేహపూరిత వాతావరణంలో రెండు రోజులు గడిచాయి. ఆ రెండు రోజులా హాస్పిటల్ కి వెళ్ళలేదు. వెళ్ళినా తనని ఎవరూ రానివ్వరని తెలుసు అనూషకి.
వంటమనిషి కూడా లేక పోవడంతో తనే వంట చేయాల్సి వచ్చింది. ఆశలు సిసలైన గృహిణిలాగా తెల్లవారుజామునే లేచి, వాకింగ్ పూర్తీచేసివచ్చి, స్నానంచేసి, పూజ చేసుకుని, స్టవ్ దగ్గరకి వెళుతుంది. కాఫీ కాచి, భరణి లేవడం, ఇద్దరూ కలసి కాఫీ తాగడం, ఆమె వంట చేస్తుంటే భరణి కూరలు తరిగిస్తూ, వస్తువులు అందిస్తూ సాయం చేయడం, ఒకరి అనుభవాలు ఒకరు పంచుకుంటూ సరదాగా గడిపేశారు. ఎంత సరాదాగా వున్నా, అతనిలో బిడియం పోకపోవడంతో అనూష తనే చనువు చేయాల్సి వచ్చింది.
* * * *
భరణి రూమ్ ఖాళీచేసి, సామానుతో సహా అనూష ఇంటికి వచ్చాడు.
"పెళ్ళికాగానే ఆడపిల్లలు అత్తారింటికి వెళతాను నేనిక్కడ రివర్స్ నీ దగ్గరకు వచ్చాను" అన్నాడు నవ్వుతూ.
"తనకంటూ ఇల్లులేని ఆడపిల్ల తప్పనిసరిగా అత్తారింటికి వెళ్ళాలి. కానీ ఈ ఆడపిల్ల అన్నీ అమర్చుకున్నాకే పెళ్ళిచేసుకుంది.
"అవునులే. నువ్వు అందరిలాంటిదానినికావుగా" నవ్వేశాడు.
కోరుకున్నది సాధించాక భరణికి జీవితం రస వత్తరంగా, అద్బుతంగా అన్పించసాగింది. అనూషలో కూడా చాలా మార్పు వచ్చింది. గంభీరంగా వుండే ఆమెలో కొద్దిగా చిలిపితనం, సూటిగా చూస్తూ అనుక్షణం పరిశోధనాత్మకంగా చంచాలిమ్చే ఆ కళ్ళలో చిత్రమైన కంటి, చర్మంలో మెరుపు, చెక్కిళ్ళతో నునుపు, పెదవుల పైన అరనితడి, కొత్త అందంతో కళకళ్ళాడుతోన్న అనూషతో అంది వీణ ఓ రోజు.
"చూశావా! ఒకరోజున నీతో అన్నాను. దాంపత్య జీవితం గడిపే స్రీలలో వుండే కాంతి, తృప్తి ముందు ఎంత అందమయినా వెలవెల బోతుందని. ఆ కాంతి, తృప్తి ఇప్పుడు నీ మొహంలో కన్పిస్తుంది. అబ్బ! ఇంత అందం ఎక్కడ దాచావమ్మా ఇంతకాలం.
అనూష చిరుకోపంగా చూసింది.
"భరణి బాగా చూసుకుంటున్నాడా?" అడిగింది వీణ.
"భరణి నన్ను చూసుకోవడం ఏంటి? నేనే అతడ్ని చూసుకుంటున్నాను. అయిన అనూషకి కొత్తగా సేక్యూరీటిగార్ద్సు కావాలా? కేవలం ఓ తోడు కావాలని చేసుకున్నాను. అంతే."
"అనూ! ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం నీకు ఆభరణాలే. కానీ ఓ భార్యగా నువ్వు కొచెం నీ మాటల్లో తీవ్రత తగిఇమ్చాలి. భరణి నీ పేషెంటుకాదు."
ఒక్కక్షణం ఆ మాటలకి తెల్లబోయినా వెంటనే ఫక్కున నవ్వేసింది. "నిజమే! కొంచెం కమాండింగ్ తగ్గించాలి వాయిస్ లో."
వీణ కూడా నవ్వింది. "దొరగారి పత్రిక ఎలా నడుస్తోంది?"
"ఏమో! రెండుసార్ల నుంచీ రాలేదట. ఈసారి స్పెషల్ ఇష్యూ వేస్తాడుట."
"మీ పెళ్ళి సందర్బంగానా?"
"నోర్ముయ్! వార్షికోత్సవం!"
"ఓ!" నవ్వేసింది. బైదిబై అనూ! నేను కొంత కాలంపాటు ఇండియా తూర వెళ్ళాలనుకుంటున్నాను."
"ఇండియా తూరా? ఎందుకు? ఒక్క దానివా?"
"కాదులే! నా బాయ్ ప్రెండ్ వస్తున్నాడు."
"ఏయ్! నిజం చెప్పు. ఎందుకలా?"
"నిజంగా వెళుతున్నాను. ఒక్కదాన్నే వెళుతున్నా. ఇండియాలో వున్న అన్ని ప్రదేశాలూ చూసి రావాలని వుంది."
"మరి నీ ప్రాక్టీస్?"
"ఏమవుతుంది? బతికుంటే మళ్ళీ వచ్చాక చేసుకుంటాను."
"ఎంతా మాటలు?"
"సరదాకి అన్నలె. ఏవిటో లైప్ బొత్తిగా మోనాటనస్ గా అనిపిస్తుంది. ఏదన్న మార్పు కావాలనిపిస్తుంది."
"అందుకే పెళ్ళి...."
"అనూ!" మందలింపుగా పిలిచింది. "దయచేసి, ఇంకెప్పుడూ నాపెళ్ళిమటేత్తకు."
"ఏం?"
"అనూ...ప్లీజ్!"
అనూష మాట మార్చింది. "ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నావు?"
"ఇంకా తొం వుంది. మేలో మాకు హాలిడేస్ వుంటయిగా! అప్పుడు బయలుదేరతాను."
"అంటే ఇంకా నేలరోజులు టైం వుందన్నమాట. నువ్విలా వెళితే, నేనేం కాను?"
"ఇదివరకైతే ఈ మాట బాగుండేది. ఇప్పుడు చాలా అసహ్యంగా వుంటుంది భరణి ఏమనుకుంటాడు?"
అనూష కళ్ళలో గిర్రున నీళ్ళు తిరుగుతాయి. నాకు జీవన మాధుర్యం రుచి చూపించిన నెచ్చెలీ! నీ భవిష్యత్తేమిటి?" అనుకుంది బాధగా.
"అనూ! ఏమిటా కన్నీళ్లు ?"
"వీణా!" చప్పున వీణని కౌగలించుకుంది. వీణ కల్లుకూడా చెమటర్చాయి. ఎ మహత్తర క్షణంలో కలిశారో, స్నేహం పాదులా అల్లుకుపోయింది. కష్టాలు, కన్నీళ్ళు, చిరునవ్వులు ఎన్ని... ఎన్నెన్ని ఈ చిన్ని జీవితంలో...
మనిషికీ, మనిషికీ మధ్య వ్యాపార సంభందమైన లావాదేవీలేగాని ఇంతటి విడదీయరాదని అనిభంధం వుంటుందని అనూష పరిచయంతో తెలిసింది.
విషాదం గుండెల్లో నిండిపోయి, కన్నీరు దారా ప్రవాహంలా కారిన క్షణాలెన్నో....
