Previous Page Next Page 
మహావృక్షం పేజి 51

స్నానం పూర్తీచేసి, నైటితో వచ్చిన  అనూషకి తెల్ల చీర, జాకెట్, మల్లెపూలు ఇచ్చింది వీణ.
"ఏవిటోయ్ ఇది?"
"ఫస్ట్ నైట్ హడావుడిలే.... మీ ఇద్దరికీ బోజనం సిద్దం చేశాను.... రండి వడ్డిస్తాను" కిచెన్ వైపు నడిచింది.
భరణి స్నానం చేయాలి కదా!"
"అయిపోయింది.... రండి బోంచేద్దాం" అన్నాడు వెనకనుంచి వచ్చిన భరణి. అనూష తలతిప్పి చూసింది. తెల్లనిపైజమా, లాల్చీ వేసుకుని నీటుగా తయారై వున్నాడు.
వీణ గట్టిగా నవ్వింది.
ఇద్దరూ అయోమయంగా చూశారామేవైపు. "ఏం జరిగింది?" అడిగింది అనూష.
"మనదేశంలో ఆడవాళ్ళకి ఇంత గౌరవం ఇచ్చే మొగుళ్ళున్నారా అని ఆశ్చర్యంగా అన్పించింది. బాగా నవ్వొచ్చింది. ఏం భరణీ! అనూష ఇంకా డాక్టర్ గానే కన్పిస్తోందా?"
భరణి మొహమాటంగా  నవ్వాడు.
"ఆవిడా ఎమన్నా అనుకుంటారేమోనని" అన్నాడు నసుగుతూ.
అనూష నవ్వి ఊరుకుంది. ఏం మాట్లాడలేదు.
ముగ్గురూ బోజనం పూర్తీచేశాక భరణి బెడ్ రూములోకి వెళ్ళిపోయాడు. వీణ అనూష దగ్గర సెలవు తీసుకుంది.
"నేను వెళతాను అనూ! ఇవాళ ఇక్కడ వాచ్ మాన్ దగ్గర్నుంచి అందరికి సెలవిచ్చాను. నేనూ వెళుతున్నాను. ఎంజాయ్ ఎలాట్. బిది బై రేపు ఉదయం లేవగానే కొత్త కొత్త అనుభూతల రుచి నాకు తెలియచేయి. వస్తాను గుడ్ నైట్ అనే పదం కొంచెం గాభారా కలగా చేస్తుంది. అదే అంది వీణతో--
"ఎందుకిలా హడావిడి చేశావు? ఏదో క్యాజువల్ గా జరిగిపోతే బాగుండేది. ఇలా హడావిడి చేసేటప్పటికి నాకేంటో యిబ్బందిగా ఉంది."
"ఇబ్బందిగా వుండడం ఏంటీ? టీనేజీ అమ్మాయిలా. డోంట్ బి సిల్లీ వెళ్ళు అతను ఎదురుచూస్తుంటాడు. గుడ్ నైట్."
కారులో కూర్చున్న వీణ చేయి ప్రేమగా నొక్కింది. ఎ జన్మ బంధమో మనది అనుకుంది. వీణ కారు కదిలింది. చీకట్లో కనుమరుగయిదాంకా చూసి, లోపలకి రాబోతూ గేటు తలుపులు తనే వేసుకోవాలన్న సంగతి గుర్తొచ్చి, తిరిగి వెనక్కి వెళ్ళి తలుపులేసి గదిలోకి నడిచింది. భరణి, సోఫాలో కూర్చుని టీ .వీ చూస్తున్నాడు. అనూషను చూడగానే లేచి నిలబడ్డాడు. అనూషకి ఎలాగో అనిపించింది. ఇంటర్య్వూ కోసం వచ్చిన జర్నలిస్టులా లేచి నిలబడటం ఏంటి? ఇప్పుడు తను భర్త అన్న సంగతి మర్చిపోతున్నట్టున్నాడు అనుకుంది.
అతను చూస్తున్న ఛానల్ చూసింది. డిస్కవరీ ఛానల్ చూస్తున్నాడు.
తలతిప్పి ఒక్కసారి మంచం వైపుచూసి ఉలిక్కిపడింది. రోజూ తను పడుకునే మంచం ఇవాళ కొత్తగా, అందంగా వుంది. మల్లెపూల తోరణాలు వెళ్ళాడుతున్నాయి నాలుగువైపులా. పరుపుమీద తల్లటి దుప్పటి. దుప్పటి మీద మద్యలో పూలతో డికోరేట్ చేసిన వెలకంట్ ఫస్టు నైట్ అనే అక్షరాలు మంచానికి కొంచెం ఎడంగా చిన్న స్టూలుమీద స్వీట్స్, పండ్లు, అగరొత్తులు. ఆ అలంకరణ చూడగానే సిగ్గుతో అణువణువూ కుంచించుకుపోయినట్టు అనిపించి. భరణి వైపు సూటిగా చూడగానే సిగ్గేసింది.
"వీణకసలు బుద్దిలేదు" అంది ఎవరితోటో అన్నట్టుగా.
భరణి భిత్తరపోయి చూశాడు.
అనూష అతని వైపు చూడకుండా సోపాలో కూర్చుని.
"కూర్చో భరణీ!" అంది.
భరణి ఆమె పక్కనే కూర్చుని- "థాంక్యూ" అన్నాడు.
అతని బిడియం, మొహమాటం చూస్తుంటే అనూషకి కొంచెం జాలేసింది. పంతంపట్టి, కోరి పెళ్ళయితే చేసుకున్నాడుకానీ, ఓ భార్తలా చనువుగా మసులుకోడానికి బిదియపడుతున్నాడు. తనకింకా డాక్టర్ అనూషగానే చూస్తున్నాడు కానీ, భార్యగా చూడడంలేదు. తనంతట తానుగా అతడితో చనువుగా ఎలా ప్రవర్తించడం? అయినా అనూష కొంచెం స్నేహంగా మాట్లాడి, అతని బిడియం పొగొట్టడానికి నిర్ణయించుకుంది.
"నీకు ఎక్కువగా ఎ చానల్ ఇష్టం భరణీ" అడిగింది.
"డిస్కవరీ, సోనీ, స్టార్ట్ ప్లస్"
"తెలుగు"
"నో! పొరపాటున కూడా చూడను"
"ఎందుకని?"
"ఎందుకేంటి? విసుగూ, విరామం లేకుండా సీరియల్సు, ఫోనులో ప్రేక్షకులతో మాట్లాడడాలు... అబ్బ ఏమిటో... నాకసలు యిష్టం వుండదు."
"హల్ మార్క్ అని ఇంకో ఛానల్ వుంది. చాలా బాగుంటుంది చూడు" అంటూ ఛానల్ మార్చింది.
ఏదో ఇంగ్లీషు నాటకం వస్తోంది. కాసేపు హాలీవుడ్ స్టార్స్ గురించి మాట్లాడకుంటూ, అర్దరాత్రిదాకా ఆ ఛానల్ చూస్తూ కూర్చూన్నారు. అలాగే ఎప్పుడో నిద్రపోయింది అనూష.
తెల్లవారి లేచేటప్పటికి భరణి మంచంమీద గాడంగా నిద్రపోతున్నాడు. స్టూలుమీద వున్న పండ్లు, స్వీట్స్ ఫక్కున నవ్వినట్టు అనిపించింది.
నిద్రపోతున్న భరణిని చూసి అయ్యో! ఎంత డిసపాయింట్ అయినాడో అనిపించింది.
సావుపలోంచి లేచింది.
ఫోన్ మోగింది.
బద్దకంగా ఆవలిస్తూ వెళ్ళి రిసీవర్ తీసుకుంది. అవతల నుంచి వీణ స్వరం వినిపించింది.
"హాయ్ అనూ! హౌ ఈజ్ న్యూ లైప్?" హుఉశారుగా అడిగింది.
అనూష మధురంగా నవ్వి అంది " సో ప్రెండ్లీ."
"వాట్? ప్రెండ్లీ గా వుండటానికి పెళ్ళి అని, మంగళసూత్రం అనీ ఈ హడావిడి దేనికి?"
పెళ్ళికి మాత్రం దేనికి?" అని నవ్వి "వీణా! నీకు చెప్పానుకదూ! స్నేహంగా కలసి తిరుగుతూ, కలసి గడుపుతూ ఓ మహా త్తరమైన క్షణంలో ఒకనొకరు తాకాలన్న తపనతో తనువులు కలసి, ఏకమైన క్షణం కావాలి. ఆ క్షణం పగలయినా రావచ్చు, రాత్రియిన రావచ్చు. ఎక్కడయినా రావచ్చు. దానికోసం ఇంత హంగామా, హాడావిడి దేనికి? ఒకరికొకరు అర్ధమై, ఏకమయ్ మధురక్షణం వచ్చాక అనుభూతులను, అనుభవాలను మాలగా గుచ్చి అందిస్తాను. అందాకా ఓపికపట్టు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS