ఆశ్రమంలో స్త్రీలంతా కలిపి తెల్లటి బడ్ షిట్ మీద ఎంబ్రాయిడరీ చేసి అనూషకి బహూకరించారు.
అయిలయ్య తను దాచుకున్న డబ్బులో యాబై రూపాయలు ఇచ్చి, "ఈ నాన్న ఇస్తున్నాడు అనుకుని తీసుకోవమ్మా.... జాకెట్టుగుడ్డ కొనుక్కో" అన్నాడు.
వాళ్ళందరి ఆప్యాయత, అభిమానం చూస్తోంటే అనూష కళ్ళు చెమర్చాయి.
చూస్తుండగానే ఆరు దాటింది. సంధ్య చీకట్లు ముసురుకున్నాయి. శారద ఒకటి, రెంటి పాటలు పాడి వినిపించింది.
ఆ రాత్రికే భరణి, తల్లీ, తండ్రుల ప్రయాణం..." అనూషా! మేమొ మీ ఇంటికి వచ్చినా రాకపోయినా, ఏడాదికి కనీసం ఒక్క సారన్నా ఈ ఆశ్రమానికి వచ్చి, ఓ పదిరోజులు ఉంది వెళతాం." అన్నాడాయన.
"అంతకంటేనా? మీరు వస్తే మా అందరకీ కొండంత అండగా వుంటారు. ఈ ఆశ్రమం మీ రాకకోసం ఎదురుచూస్తుంటుంది" అన్నది.శ్యామల.
నీరజ కొడుక్కి ఐదేసి వందల చొప్పున ఇచ్చాడు మార్కండేయులు.
భరణి తల్లి, తండ్రులకి ఖరీదైన బట్టలు పెట్టింది అనూష. లక్ష్మి కోడలకి రాళ్ళ నెక్లెస్ ఇచ్చింది. పాతకాలంనాటి నెక్లెస్ అయినా అనూష సంతోషంగా తీసుకుంది.
ఆరున్నరకి అనూషా, భరణీ బయలుదేరారు. శ్యామల అనూష చెవిలో రహస్యంగా అన్నది. "అంతా బాగుంది కానీ, ఆ కాస్త కార్యాక్రమం కూడా ఇక్కడే జరిపిస్తే బాగుండేది."
"ఏకాస్త?" చిత్రంగా చూసింది అనూష.
"చిన్న పిల్లలా మాట్లాడకు" చిరు కోపంగా మందలించింది.
అర్ధమైనా అనూష చెంపలు కందిపోయాయి. మధురమైన అనుభూతి ఒకటి పిల్లతెమ్మెరలా వీచి, అణువణువుకీ పాకింది. పెళ్ళంటేతోడు అనుకుంది కానీ, అనురాగంతో పెన వేసుకున్న మనసుల తాలూకు రెండు శరీరాలు ప్రేమైకమోహంతో పెనవేసుకుపోతాయన్న నిజం ఒకటి అప్పుడే గుర్తొచ్చినట్టు అనిపించింది. సిగ్గుపడి నవ్వి ఊరుకుంది.
అనూషా, భరణీ ఎక్కినా కారు బయలుదేరింది.
"మీరూ రావచ్చుగామ్మా.... నాలుగురోజులనుండి వెళ్ళచ్చుగా" అడిగాడు భరణి.
"మాకెలా కుదురుతుందిరా.... మేమిక్కడ వుంటే అక్కడ, పొలం, పుత్రా, గొడ్డూగోదా ఏంకావాలి? మీరే కాస్త వీలు చూసుకుని మన ఊరు రండి... ఏమ్మా అనూషా! నీకు వీలవుతుందా? దీపావళికి అక్కడికి మన ఊరికి వచ్చేయండి."
"అలాగే మావయ్య..." అప్రయత్నంగా అన్నది అన్నది అనూష.... అన్న తరువాత ఆమెకే చిత్రంగా అనిపించింది. ఏంటది? ఇదేనా వివాహా బంధం అంటే, అనుకోకుండా వరస కలిపేసిందేటి?
ఆ పిలిపుకి అయన మొహంలో కనిపించిన వెలుగు చూశాక అనిపించింది... పాపం ఎంతకాలంగా ఈ పిలుపుకోసం ఎదురుచూస్తున్నాడో ఈయన.
"గీడ్ బ్లెస్ యూ మైడియర్ చైల్డ్" మనస్పుఉరేటిగా దీవించాడు.
"జాగ్రత్తమ్మా.... నీ కేదన్నా ఇబ్బంది ఉంటే మాకు ఫోన్ చేయి" చెప్పిందావిడ
"అలాగే..."
"ఒరేయ్ జాగ్రత్త... ఆ అమ్మాయిని నీ తెలివితక్కువతో విసిగించకు" భరణితో అన్నరిద్దారూ.
భరణి అదోలా మోహం పెట్టాడు. అతని మోహం చూసి నవ్వింది అనూష.
అందరి దగ్గరా సెలవు తేసుకుని ఇద్దారూ సితెకి ప్రయాణం అయ్యాడు.
* * * *
మొట్టమొదటిసారిగా, అనూష పక్కన కూర్చున్న భరణికి కొంచెం బిడియంగా అనిపించింది. అమ్మో! తానసలు అర్హుడేనా ఇలా కూర్చోవడానికి? అనిపించింది. అనూష ఎంత గొప్ప స్రీ!... ఎంత సంఘసేవకురాలు! ఎంత గొప్ప డాక్టరు? పెద్ద,పెద్ద వాళ్ళంతా ఆమె తో మాట్లాడటానికి జంకుతారు. ఆమె కనిపిస్తే లేచి నిలబడి గౌరవిస్తారు. అలాంటిది ఈమే తన భార్య... గర్వంతో అతని ఛాతీ కొన్ని అంగుళాలు పెరిగినట్టు అయింది. ఆమెతో ఏదన్నా మాట్లడలనిపించింది. ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు.
అనూషది కూడా కొంచెం తీదాగా అదే పరిస్తితి.... ఇద్దరి మద్యా చిత్రమైన నిశబ్దం అవరిచిమ్ది. దాన్ని చేదించటానికి ఇద్దారూ ప్రయత్నంచలేదు. ఎవరికీ వారికే ఏదో ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఒకరు ఇన్ ఫీయరుగా ఫీలవుతున్నారు, ఒకరు జంకుగా ఫీలవుతున్నారు, ఎవరికీవారే, ఎదుటివారు పలకరిస్తే బావుండునని ఆశిస్తుండగానే ఇల్లు చేరింది కారు.
కారు దిగి, గుమ్మంలోకి అడుగుపెట్టబోతూ, ఎదురుగా హారతి పళ్ళెంలో వచ్చిన వీణను చూసి ఆశ్చర్యంపోయింది అనూష.
"అర్జంటు పనిని చెప్పి, ఇందుకా నువ్వు ఆదరా, బడురా వచ్చింది?" అంది.
వీణ నవ్వి, హరతిచ్చింది. "ఇప్పుడు రండి లోపలకి" అన్నది అడ్డు తోలగుతూ.
లిపలకి అడుగుపెట్టగానే, సన్నటి, మధురమైన పరిమళం తీయగా పలకరించింది. వీణ ఇల్లంతా శుభ్రం చేసి, కడిగించి, ముగ్గులుపెట్టి, రూం స్ప్రే చేసింది ఆహ్లాదంగా వుంది వాతావరణం.
"లోపలకి వెళ్ళి స్నానం చేసిరా" వీణ అన్నది.
బెడ్ రూమ్ వైపు వెళ్ళబోతున్న అనూషను వారించింది. "ఏయ్! అటు వెళ్ళకు.... ఇటు, ఇటు...."
ఏం?" ఆశ్చర్యంగా చూసింది అనూష.
"చెప్తాలే... వెళ్ళి అవతల బాత్ రూమ్ లో చేసిరా."
అనూష ఏం మాట్లాడలేదు. వేరే బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. వేడినీళ్ళు సిద్దంగా వున్నాయి. మగ్ తో నీళ్ళు తీసుకుని ఒంటిమీద పోసుకోగానే, ఓ మధురమైన పరిమళం శరీరం నిండా వ్యాపించింది. ఉడుకులోన్ కలిపినట్టుంది నీళ్ళలో వీణ.
