Previous Page Next Page 
ఆదివిష్ణు కథనికలు పేజి 51


                                         రేపటి మనిషి

    నాకు భగవతం చిన్నప్పట్నుంచీ తెలుసు. అతన్నాతో కొన్నేళ్ళు చదివాడు. మాయింటి దగ్గిరే అతనిల్లు. అతనుంటున్న ఇల్లు చాలా పాత భవనం మూలంగా శిధిలావస్థలో వున్నట్టనిపిస్తుంది. అయితే ఆ యిల్లు గట్టిది గనక యింకా అలా నిలబడివున్నది. భగవంతానికి ఆ యిల్లంటే చిరాకు. అందుచేత అతను ఎక్కువ కాలాన్ని రోడ్డుమీద స్నేహితులతోనే గడుపుతూండేవాడు. భగవంతానికున్న కొన్ని కోరికల్లో మొదటిది అందమైన యిల్లు!
    భగవంతం వాళ్ళనాన్న పెద్ద ఉద్యోగి కాడు. మా వూళ్ళోనే వున్న లాయరు వెంకటరత్నం చౌదరిగారి కాయన గుమాస్తా. వెంకటరత్నం చౌదరిగారికి మా వూళ్ళో పెద్ద పలుకుబడి వున్నది - గొప్ప ఆస్థిపరుడు.
    వెంకటరత్నం చౌదరిగారంటే భగవంతానికి మంట.
    అతన్నాతో అనేవాడు -
    "మా నాన్నకి నేను కొడుగ్గా పుట్టవలసినవాడిని కానే కాదు. నా దురదృష్టం కొద్దీ నేనిక్కడి యింట్లో పురుగునై పుట్టాను. అవునా సుబ్బారావూ - నేనే గనక వెంకటరత్నం గార్లాంటి జాతి మనుషులకి పుట్టినట్టయితే సాక్షాత్తు స్వర్గంలోని దేవతలు నాకు దాసోహమనేవారు. ఖర్మకాకపోతే ఏమిటిది? దేవుడు నన్ను దీనాతిదీనుడిని కమ్మని దీవించాడు. చూడబ్బాయ్ - ఇంత వయసొచ్చినా అనుభవించే రాత నోచుకోలేకపోయాను. నేనిప్పట్నుంచే కొన్ని ప్రయోగాలు ప్రారంభించాను. నా చుట్టూతా తిరిగే గొప్ప మిత్రులంతా ఒట్టి దద్దమ్మలు. ఆ ఫూల్స్ ద్వారానైనా నేను వెలుగులోకి రావాలేగాని, అప్పుడు నా నిజస్వరూపమేమిటో నువ్వు నిచ్చింతగా చూడగలవు.
    భగవంతానికి గొప్పవాళ్లమీద భయభక్తుల్లేకపోగా విపరీతమైన 'కసి' వున్నది. నేను గొప్పవాడిని కాదు గనక అతన్నాకీ విషయాన్ని నిర్భయంగా చెబుతూండేవాడు. అతనలా చెబుతున్నప్పుడు నాకు భయంగానూ వుండేది.
    భగవంతానికున్న చొరవగానీ, ధైర్యంగానీ నాకు లేవు. నేనంత గంగిరెద్దు మనిషినని మా వాళ్ళతోపాటు పరాయివాళ్ళు కూడా వొప్పేసుకున్నారు. అందుచేత నేను ప్రమాదమైన జంతువుని కాదు. చాలా మామూలు మనిషిని!
    ఇక్కడే నేనో ఉదంతం చెప్పదలిచాను.
    నాకిది బాగా గుర్తు. ఆ యేడాది మేమంతా డిగ్రీ క్లాసులో ఆఖరి సంవత్సరం చదువుకుంటున్నాం. పరీక్షలు దగ్గరవడం మూలంగా చాలా కష్టపడి చదువుకుంటున్నాము. ఆ రోజుల్లో ఓనాటి రాత్రి పదకొండుగంటల క్కాబోలు భగవంతం తమ్ముడు చిన్నా నా దగ్గరికొచ్చి అన్నాడు.
    "మీరు తొందరగా మా యింటికి రావాలి సుబ్బారావుగారూ!"
    కారణం అడక్కుండానే అతనే చెప్పుకొచ్చాడు.
    "అన్నయ్య ఏడుస్తున్నాడు. నాన్న కారణం అడిగితే చెప్పడం లేదు. మా ఇంట్లో ఎవరడిగినా ఏమీ చెప్పకుండా ఏడుస్తున్నాడు మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని నాన్న నన్ను పంపాడు. రండి తొందరగా.
    నేను ఆశ్చర్యపోయాను. సాధారణంగా భగవంతం ఏడవడు. చిన్న చిన్న విషయాలనతను పట్టించుకోడసలు. ఏదో పెద్ద ఉపద్రవం కలిగిందేమోనని నేను భయపడ్డాను.
    భగవంతం వాళ్ళ నాన్న నన్ను చూస్తూనే కళ్ళు తుడుచుకుని అన్నాడు -
    "రా, బాబూ! రా, నీకోసమే చూస్తున్నాను. అదిగో, ఆ దక్షిణం గదిలో వాడున్నాడు. వెధవ, పసిపిల్లాడిలా ఏడ్చేడ్చీ యిప్పుడే కొంచెం కుదుటపడ్డాడు. వెళ్ళు. వెళ్ళి వాడినోదార్చి కారణం కనుక్కో ఫర్వాలేదు. వాడికేం కావలసినా నేనున్నాను. కొండమీద కోతినైనా సరే తీసుకొస్తాను. వాడికేం కావాలో కనుక్కో వాడేం కోరినా పర్వాలేదు. నేనున్నాను. అంతేగాని, నేను బ్రతికుండగా వాడు ఏడ్చేందుకు వీల్లేదని చెప్పు. నేనది సహించలేను. వాడు ఏడవకూడదు సుబ్బారావ్. వాడి కోసం నేనేమైనా చేస్తాను. అలా అని వాడికి గ్యారంటీ ఇవ్వు. తొందరగా వెళ్ళు నాయనా...."
    ఆయనీరకంగా చాలాసేపు మాటాడినప్పుడు నా మనసు చివుక్కుమంది. ఆయనకీ భగవంతం మీద గల వాత్సల్యాన్ని నేనెంతో శ్లాఘించాను. కానీ, ఆ వాత్సల్యానికి గూడా ఒక హద్దుండాలి. ఒక రాజకుమారుడు బంగారు ఏనుగు కావాలని గారాం చేసినప్పుడు, రాజమాత యెంతో ముచ్చటపడి, ఆ ఏనుగుని రప్పించినంత 'స్థితి' లో ఆయనకున్న ఆవేశాన్ని ప్రదర్శించాడే తప్ప - భగవంతాన్ని మెప్పించేందుకు ఆయన 'హోదా' చాలదని నేనప్పుడే కాదు. ఎప్పుడై అనుకుంటూ వుంటాను.
    "అయ్యా ఫ్లీడరు గుమాస్తాగారూ! ఏమిటి సార్ మీరు మాట్లాడేది. భగవంతం మీకు కొడుకయితే కావచ్చు కానీండి. అతని హోదాగల కోరికలు మీరు విన్లేదు. అతన్ని భరించడం మీలాంటి అర్భకులకి చాతొచ్చేది కాదులెండి. 'భగవంతానికి తృప్తి విలువ తెలీదు సార్! అందుచేత భగవంతం ఈ జన్మకి సుఖపడడని చెప్పి నేను రాసిస్తాను. హైకోర్టులోనే కాదు, సుప్రీంకోర్టుకు వెళ్ళినా దానికి తిరుగులేదంతే. మీరేం బుర్ర పాడుచేసుకోవద్దుగానీ, వదిలేయండి. ఎవడికెంత రాసిపెట్టి వుందో అంతే జరుగుతుంది.
    నేను భగవంతం గదిలోకి వెళ్ళాను. భగవంతం ఓ కిటికీ దగ్గర కూర్చుని మొహాన్ని కిందికి వంచి నేలని చూస్తున్నాడప్పుడు. మనుషుల్ని కృంగదీసే చింతనంతా అతనొక్కడే కలిగినట్టున్నాడు. శోకమయమైన నగరాన్ని కళ్ళారా చూచి వొచ్చి మనసుని పాడుచేసుకున్న సిద్ధార్థుడు వెంటనే గుర్తుకొచ్చాడు నాకు. అయితే ఒక్క మాట మాత్రం నిజం. ఆరు నూరయ్యేది నూరు ఆరయ్యేదీ భగవంతం సస్యసించడు. అందుచేత నేనింకా ధైర్యంగా వున్నాను.
    అతను తలెత్తి చూశాడు. మళ్ళా వెంటనే తల దించేశాడు. తలుపు దగ్గిరగా వేసి అతని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. నేనతన్ని ఓదార్చలేదు. నాకో అనుమానం కలిగింది. అందుచేత అడిగాను.
    "అబాగా చదివావా భగవంతం?"
    అతను తల వూపాడు.
    "మరెందుకీ దిగులు?"
    అప్పుడు భగవంతం నావేపు సూటిగా చూసి అన్నాడు.
    "నేను పరీక్షలు గురించి, దిగులు పెట్టుకున్నానని నువ్వెందుకనుకున్నావసలు?"
    "నా మనసు కదొక్కటే తోచిందిప్పుడు"
    "అందుక్కాదు సుబ్బారావ్! పరీక్షలు గురించి నేనెప్పుడూ దిగులు పెట్టుకోను. నా జీవితం గురించి నాకు దిగులెక్కువ. నిజం చెప్పరా. నేను భవిష్యత్తులో బాగుపడి వెలిగిపోగలనా? నాకంత అదృష్టం వుందా? చెప్పు సుబ్బారావ్!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS