67 వ. సర్గ
మారుతి శ్రీరామునితో :-
1. "సీతా మాతకు - వందనములిడి
మరలి వచ్చుటకు - సెలవు గోరితి |
రాలు కరుగగా - సీత పలుకగా
నా గుండెల క్రో | ధాగ్ని రగులగా |
కొండంతగ నా - కాయము బెంచితి
అశోక వనము - ధ్వంసము చేసితి |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
2. "అసురులు నాపై - దాడి చేయగ
కింకరులను జం | బుమాలిని గూల్చితి |
మంత్రికుమారుల - సేనాపతుల
చతురంగ బలా | ల రూపుమాపితి |
రాజకుమారుడు - అక్షుని జంపితి
ఇంద్రజిత్తుతో - పోరు సల్పితి |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
3. "ఇంద్రజిత్తు రణ | మందున విసిగెను
బ్రహ్మాస్త్రము ప్ర | యోగము జేసెను |
బ్రహ్మవరమున బ్ర | హ్మాస్త్రము నన్ను
క్షణకాలము బం | ధించి యుంచెను |
అది తెలియని ని | శాచరులు నన్ను
నారచీరల బం | ధించి మురిసిరి |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
4. "రావణుతొడ సం | వాదమునెంచి
బంధములకు నే | లొంగి యుంటిని |
అనుకొనినటులే - అసురులు నన్ను
రావణుకడకు - తిన్నగ జేర్చిరి |
నా పలుకులు విని - రావణుడలిగి
ఆజ్ఞాపించెను - నను వధింపుడని "
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
5. "రావణు తమ్ముడు - విభీషణుడు
అన్నను జేరి ప్ర | సన్నుని జేసెను |
దూతను జంపుట - ధర్మము కాదని
దండింపగ తగు - విధములు దెల్పెను |
వాలముగాల్చి - నన్ను వదలుడని
దశకంఠుడు గ | ర్జించి పలికెను |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
6. "ఏ మంటల నా - వాలము గాల్చిరో
ఆ మంటల నే - లంక గాల్చితి |
ఎల్ల రాక్షసుల - గృహముల గాల్చితి
విభీషణుని - గృహము వదలితి |
లంకాపురము - మంటలపాలై
నేల గూలెను - బూడిదపాలై
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
7. "లాంగూంజ్వాల - చల్లార్చుకొని
అశోక వనము - వేగ జేరితి |
సీతక్షేమముగ - ఉండుట గాంచి
నా భాగ్యమని - ఆనందించితి |
సీతామాత | వాత్సల్యపూరిత
ఆశీస్సుల నే - పొందగలిగితి |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
8. "నిరతము నిన్నే - తలచుచున్నది
క్షణ మొక యుగముగ - గడుపుచున్నది |
రెండు నెలల గడు | వు తీరక మునుపే
వేగమెవచ్చి కా | పాడు మన్నది |
రామలక్ష్మణ సు | గ్రీవాదులకు
సీత క్షేమమని - తెలుప మన్నది !"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
__: 67 వ. స. సంపూర్ణము :__
68 వ సర్గ
1. "వానరరాజు సు | గ్రీవుని సేనలో
నన్ను మించిన - శూరులు గలరని |
వాయువేగ మ | నో వేగముగల
జాంబవదంగద - యోధులు గలరని
తృటిలో లంకను - కూల్చివేతురని
సీతామాతకు - ధైర్యము గోలిపితి |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
2. "రామ లక్ష్మణుల - భుజముల నిడుకొని
వేగమె లంకకు - గొనివత్తునని |
రామలక్ష్మణుల | అగ్ని శరములకు |
రావణాదులు - కూలుట నిజమని |
ఎన్నోరీతుల - సీతామాతకు
ధైర్యము గొలిపే నే - మరలి వచ్చితిని"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
