3. "అందరు కలసి అ - యోధ్యకు చేరి
ఆనందముగా - సుఖించెదరని
సీతారామ ప | ట్టాభిషేకము
కనుల పండువుగ - జరిగి తీరునని |
ఎన్నోరీతుల - సీతామాతకు
ధైర్యము గొలిపి నే - మరలి వచ్చితిని |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
4. "ఆనందముతో - అశ్రులు జారగ
సీతామాత - నను దీవించగ |
పదముల వ్రాలి నే - పయనమైతిని
పదములు రాకనే - మరలి వచ్చితిని |
ఒప్పలేదు కాని - ఎపుడో తల్లిని
భుజముల నిడుకొని - కొని రాకుందునా?"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
శ్రీరాముడు :-
5. "సీత క్షేమమను - శుభవార్త నేడు
మారుతి నాకు - తెలుప కుండిన |
నేటి తోడ మా | రఘుకులమంతా
అంతరించి యుం | డేడిది కదా |
మమ్మీతీరుగ - ఉద్ధరించిన
మారుతి ఏ | మివ్వగల" నని
సర్వమిదేనని - కౌగిట జేర్చెను
హనుమంతుని ఆ | జానుబాహుడు .... ||శ్రీ||
__: 68 వ. స. సంపూర్ణము :__

సీత క్షేమ మను శుభవార్తవిని
మారుతికి ఏమివ్వగలనని |
సర్వమిదేనని - కౌగిట జేర్చెను
హనుమంతుని - ఆజానుబాహుడు
-:ఫలశ్రుతి:-
నలుగురు శ్రద్ధతో - ఆలకించగా
నలుగురు భక్తితో - ఆలపించగా |
సీతారామ హను - మానులు సాక్షిగ
సర్వజనులకు - శుభములు కలుగగ
కవికోకిల వా | ల్మీకి పలికిన
రామాయణమును - తేట తెలుగున |
శ్రీ గురు చరణ | సేవా భాగ్యమున
పలికెద సీతా - రామ కధా .... ||శ్రీ||
.jpg)
-: మంగళహారతి :-
మంగళహారతి - గొను హనుమంతా |
సీతారామ - లక్ష్మణ సమేతా |
నా అంతరాత్మ - నిలు ఓ అనంతా |
నీవే అంతా - శ్రీహనుమంతా |
ఓం శాంతిః శాంతిః శాంతిః
-: సుందరకాండము సంపూర్ణము :-
