62 వ. సర్గ
దధిముఖుడు సుగ్రీవునితో ;-
1. దధిముఖుండు పరి | వారము దోడ్కొని
పరుగున బోయి కి | ష్కింధ జేరుకొని |
జాంబవ దంగద - హనుమదాదులు
మధువనమున బడి - మధువు గ్రోలి రని
అడ్డగించిన - తమపై తలపడి
ఉన్మాదమున హిం | సించినారని |
మధువనమునంత - బీడు చేసిరని
విన్నవించుకొనే - సుగ్రీవుని గని .... ||శ్రీ||
__: 62 వ. స. సంపూర్ణము :_
సుగ్రీవుడు :-
1. జయహనుమంతుడు - సీత జాడ గని
జయోత్సాహము | న మరలి యుండునని |
ఆనందముతో - అంగదాదులు
మధువనమునబడి - త్రాగి యుందురని |
అడ్డగించిన - దధిముభాదులను
మత్తిల్లివారు - కొట్టి యుందురని |
సుగ్రీవుడు కడు - సంతోషముతో
విన్నవించెను - రాజసుతులతో .... ||శ్రీ||
శ్రీరాముడు :-
2. సీత జాడగని - ఉత్సాహమున
మరలి వచ్చెడు - వానర వీరుల |
జాంబవ దంగద - హనుమ దాదుల
వేగమె రమ్మని - కబురంపమని |
సీత క్షేమమును - తెలుపు సువార్తను
మారుతి పలుక తా - వినవలయునని |
రామచంద్రుడు - సుగ్రీవునితో
దివ్యస్వరమున - పలికె ప్రీతితో .... ||శ్రీ||
సుగ్రీవుడు ;-
3. సీతజాడగని - వచ్చుచుండిన
కపివరులందరు - క్షమార్హులని |
వారితోడ ఇక - కలహము వలదని
జరిగిన దానిని - మరచి పొమ్మని |
తడవు చేయక - మరలి పొమ్మని
వారందరిని - వేగపంపుమని |
దధిముఖునితో సు | గ్రీవుడు బలికె
ఆదరించి మరి - ప్రీతిగ నంపే .... ||శ్రీ||
__: 63 వ. స. సంపూర్ణము :__
64 వ. సర్గ
1. కపి రాజంపిన - కబురందగ
కపి వీరులు కి | ష్కంధకు వెడలగ
జయహనుమంతుడు - ముందు నడువగ
జయజయ ధ్వనులతో - ముందుకు సాగగ
రాను రాను ఆ - కోలాహలము
చేరుకొనెను కి | ష్కింధాపురము |
రామలక్ష్మణ - సుగ్రీవాదులు
ప్రస్రవణగిరి | పైన వేచిరి .... ||శ్రీ||
2. జాంబవ దంగద - హనుమదాదులు
ప్రస్రవణగిరి - చేరినారు |
రామలక్ష్మణ సు | గ్రీవాదులకు
వినయముతో వం | దన మిడినారు |
అంజనేయుడు - శ్రీరామునితో
"చూచితి సీత" న | ని శుభ వార్త దెల్పె |
ఆనందాశ్రులు - రాలగ రాముడు
మారుతి నెంతో - అభినందించె .... ||శ్రీ|
__: 64 వ. స. సంపూర్ణము :__
65 వ. సర్గ
1. నలువంకల ఉ | త్సాహము పొంగగ
ప్రతి మోమున ఆ | నందము చిందగ |
రామలక్ష్మణ సు | గ్రీవాదులను
వానరులందరూ - పరివేష్టింపగ |
"హనుమా ! సీతను - ఎట్లు గాంచితివి
ఎట్లున్నది సీ | త - ఏమి తెల్పినది ?"
అని పలికిన శ్రీ | రామచంద్రునకు
మారుతి తెల్పే త | న లంకాయానము .... ||శ్రీ||
మారుతి శ్రీరామునితో :-
2. "దక్షిణ దిశగా - వారిధి నడుమ
సుందరమైన - లంక యుత్నది |
శతయోజనముల - వారిధి దాటి
ఒంటిగ నేను - లంక జేరితి |
అడుగడుగున నే - లంక వెదకితి
ఆగి ఆగి నే - కలయ జూచితి |"
అని మారుతి తన | లంకాయానమును
రామచంద్రునకు - విన్నవించెను .... ||శ్రీ||
